పూర్వపు మనుషులండి ఎంతలేదన్నా నాలుగుతరాలు సూసీవోరండే..,

అడోల్లైతే ఇదాయకంగా సూసీవోరండి.,

పదేడేల్లకే పెళ్ళిసేస్సీవోరంటండి..

యేడాదికే సంతానవండి..,

మల్లీ పద్దేనిమేదేల్లకు పిల్లకి పెల్లండి..,

ఆపిల్లకి యేడాదికే సంతానవండి..,

మల్లీ ఆపిల్లకు పద్దెనిమిదేల్లకు పెల్లండి..,

ఆపిల్లకు యేడాదికే సంతానవండి..,

ఇలా మూడు పద్దెనిమిదులు యాభైనాలుగేల్లనుంచి అరవైఏల్లకు నాలుగుతరాలు ఒకే ఇంట్లో చూసిన మనుషులండి.,

 ఎవరి కట్టవేంటో.,

సుఖవేంటో తెలిసిన అమ్మలుండీవోరండి.,

జీవం వున్న 'అమ్మ'అనే ఓంకార శబ్దం ఇంట్లో ఇనబడతానే వుండీదండి..,

అప్పుడందరూ బతికీవోరండి.,

బతికించీవోరండి.,



ఇప్పుడేమో పేనంలేని 'మమ్మీ'లే కదండి.,

ఏదో బతికేత్తన్నారండి.,

బతుకుతుంటే సూడలేపోతవండి.,


ఆరోజుల్లో సేలా ఇల్లల్లో భర్తకాలం చేసి పిల్లలు లేకుండా వున్న అమ్మమ్మ నానమ్మ అక్కచెల్లెల్లో, రక్తసంబందీకులో ఎవరొకల్లుండీవోరండి.,

వాల్లకు వంట మనదేండి.,

ఆవిడకు చెందిన చేలో పంట మనదేండి.,

అలాంటి మామ్మలు కాలంచేసినప్పుడు ఆస్తులు కలిసీయండి.,

మా పెద్దమామ్మ పోతె మాకింత కలిసింది.,

అంతకలిసింది అని సెప్పుకునీవోరండే.,

ఇప్పుడు లేవండి.,

ఆరోజుల్లో డబ్బుల్లేక కాదండి అనాధశరణాలయాలు రాపోవటం..,

మనుషులంటే మమకారం వుండటం వల్లండి

మనదగ్గరోల్లెవరికైనా ఎవరూ లేకుండా అయిపోతె మనింటకాడుండమనండి.,

 ఎక్కడకెలతాడింక.,

ఏవుంది మనతోపాటే నాలుగు మెతుకులుతిని పడుంటాడనీవోరు.,


ఇప్పుడు డబ్బులెక్కువైకాదండి.,

ఇన్ని అనాదాశ్రమాలు.,
మనసుల మధ్య మమకారంతో పాటు కనీస సంస్కారం తక్కువయ్యేండి.,

చెప్పీవోల్లేరండి.,

అన్నీ గొద్ది పెత్తనాలేండి,

బయటతిరిగి ఇంట్లో కెల్లాక కాల్లు కడుక్కోకుండా లోపలికి రానిచ్చేవోరుగాదండి.,

కాల్లు కూడా పూర్తిగా తడవాలండి.,

సీలమండలకాడ., ఏల్లుమయంగా తడకపోతే తిట్టేసీవోరు.,

అప్పుడు ఇశాలమైన ఇల్లు...

మనుషులు... మనసులు.

అడుగెత్తువుండే గడపలండి...

వాటికి పసుపు పూతలండి...

ఇప్పుడు బయట నుంచి కాల్లుకడగాలంటే ఇంటిలోపలికెల్లి పోవాలండి...

 పండక్కి పసుపురాద్దావంటే గడపే వుండదండి....

ఇంక పెతీపండక్కి కడిగీ పనిలేకుండా అపార్టుమెంట్లండి....

ఇప్పుడు మనుషుల్లాగే ఆల్ల మనసుల్లాగే అయ్యీ ఇరుకేండి...

అనాధశరణాలయాలంటే 'ఫలానా అనాధశరణాలయం' అని బోర్డెట్టినియ్యేకాదండి...

 మీరు గమనించేరో లేదో మనింటి చుట్టుపక్కలకూడా వున్నాయండి...

ఇయ్యాల అలాంటి అనాధశరణాలయానికి ఎల్లేనండి...

సుమారు కోటి రూపాయలెట్టి కట్టిన బిల్డింగండి...

లోపల రెండు కార్లండి...

అరవై ఏల్లు పైబడ్డ ఓజంటండి...

ఆయన ఇంట్లోనే అక్కడక్కడ అలా తిరుగుతుంటారండి...

ఆవిడ బానేవుంటారు...

 కాకపోతే నిన్నటి నుంచి జ్వరం అంటండి...

కొడుకులిద్దరూ విదేశాల్లో బోల్డు సంపాదనండి...

వాల్లకి ఇల్లూ కార్లూ పొలాలు కంపెనీలో షేర్లు చేలావున్నాయండి...

వాల్లకి లేనిదల్లా కన్నోల్లంటే పేవండి...

పనిమనిషి తెచ్చిచ్చిన టాబ్లెట్టే దిక్కండావిడికి...

హాస్పటల్కి వెల్దావని కారుడ్రైవర్ని రమ్మంటే...

ఇయ్యాల కాలీలేదండి రేపెల్దాం అన్నాడట కారుడ్రైవరు...

ఆవిడ కోటీశ్వరరాలండి...

 పిల్లల ప్రేమవిషయంలొ బిచ్చగత్తేండి...

మనకున్నది చాలురా...

 వచ్చేయండిరా అంటే ఇంటంలేదురా...

మనవల తో ఆడుకోవల్సిన వయసులో..

ఆయనో పక్కన నేనో పక్కన అనాధల్లా బతుకుతున్నాం బాబూ... అని ఆవిడన్నమాటకు..

ఇవి కూడా అనాదాశ్రమాలేకదా అనిపించిందండి...

బతుకుతెరువుకోసం ఎల్లినోల్లమాటేమోగానీండి...

బలిసి ఉన్నావోల్లకి అనవసరవండి...

మీ తల్లితండ్రులకు నోట్లో ముద్దకలిపి పెట్టక్కర్లేదండి...

మీరిక్కడే వున్నారన్న ఆయువు పొయ్యండి చాలు...



మొన్నే సదివేనండి...

కలలుకన్నదేశం ఎల్లాక...

కన్నదేశం కలలోకే...అని



పోతున్నాయండి.... అన్ని అనుబంధాలు, ప్రేమలు ఇమానంలో అమెరికాలు....లండన్లు...



- స్వస్తీ...