👉🏼 గుండె అనుక్షణము సంకోచ, వ్యాకోచాలు చేస్తూ రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది.
👉 ఇలా సంకోచించినప్పుడు (కుంచించుకొన్నప్పుడు) రక్తం గుండె నుండి రక్త నాళాల లోనికి వేగంగా వత్తిడితో ప్రవహిస్తుంది.
👉🏼 ఈ వత్తిడిని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ (Systolic Blood pressure) అని అంటారు.
👉🏼 గుండె మరల వ్యాకోచించి సాధారణ స్ధితికి వచ్చినప్ఫుడు, రక్తనాళాలలో వున్న వత్తిడిని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటారు.
👉🏼 ఈ రక్త పోటును గాజు గొట్టములోని పాదరసపు మిల్లీ మీటర్లలో కొలుస్తారు.
👉🏼 సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు సిస్టోలిక్ ప్రెషర్ 90 నుండి 120 మి.మీ గాను, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 60 నుండి 80 మి.మీ గాను నమోదు కావచ్చు.
👉🏼 అయితే ఈ బి.పి మనిషి నుండి మనిషికి వయస్సు పెరుగుతున్నకొద్దీ మార్పు చెందుతుంటుంది.
👉🏼 అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది.
👉🏼 మానసిక వత్తిడులు కూడా బి.పి ని ప్రభావితం చేస్తాయి.
అధిక రక్తపోటు : (High Blood Pressure)
👉🏼 అసాధారణంగా రక్త పోటు 130/90 మి.మీ, అంతకన్నా అధికంగా వున్నప్ఫుడు ఎక్కువ రక్తపోటు (హైపర్ టెన్షన్) అని అంటారు.
👉🏼 120/80 నుండి 139/89 మి.మీ స్ధాయిని అధిక రక్తపోటు ముందు స్ధాయిగాను, 140/90 మి.మీ.స్ధాయిని అధిక రక్త పోటుగాను గుర్తించాలి.
అధిక రక్తపోటు - (High Blood Pressure) అనర్ధాలు :
👉🏼 అధిక శాతం గుండె జబ్బులకు - అధిక రక్తపోటు ప్రధాన కారణం.
👉🏼 మూత్రపిండాల వ్యాధులు.
👉🏼 కంటి జబ్బులు.
👉🏼 మెదడుకు సంబంధించిన రక్త నాళాల జబ్బులు.
👉🏼 పక్షవాతము.
👉🏼 *గుండె రక్తనాళాల జబ్బులు.*
👉🏼 *విపరీతమైన తలనొప్పులు.*
లక్షణాలు:
👉🏼 తలనొప్పి.
👉🏼 తల తిరుగుతున్నట్లు, తూలుతున్నట్లు అనిపించడం.
👉🏼 కూర్చున్న స్ధితి నుండి నిలుచోగానే కళ్ళు బైర్లు కమ్మడం.
👉🏼 సాధారణంగా శ్వాస తీసుకోలేకపోవడం
తీసుకోవలసిన జాగ్రత్తలు :
👉🏼 40 సంవత్సరాలు పైబడి వున్న వారు ప్రతి సంవత్సరం పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
👉🏼 కుటుంబంలో ఎవరికైనా అధిక రక్తపోటు వున్నా ఆరోగ్య పరీక్షలు కనీసం సంవత్సరానికి ఒక సారి చేయించుకోవాలి.
👉🏼 మధుమేహ వ్యాధి (Diabetes)తో బాధపడుతున్న వారు రక్తములో అధిక స్ధాయిలో కొవ్వు పదార్ధాలు (Cholesterol) వున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
👉🏼 అమితంగా అలసిపోయే విధమైన, అధికంగా వత్తిడి కలిగే కార్యక్రమాలు తక్కువగా చేయాలి.
👉🏼 తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
"లో - బిపి : Low Blood Pressure (Hypo Tension)"
👉🏼 సాధారణంగా ఉండవలసిన రక్త పోటు (బి.పి) కన్నా తక్కువ స్ధాయిలో బి.పి ఉండటాన్ని లోబిపి అంటారు.
👉🏼 వైద్య పరిభాషలో దీనినే హైపోటెన్షన్ అని అంటారు.
👉🏼 దీని వలన ప్రధాన అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలకు,ప్రాణ వాయువు (ఆక్సిజన్), ఆహార సరఫరా తగు పాళ్ళలో జరగదు.
👉🏼 సాధారణంగా కొందరిలో 90/60 మి.మీ. ఉన్నప్పటికి ఆరోగ్యంగానే వుంటారు.
👉🏼 కాని బి.పి.సుమారు 160/90 ఉండి, 110/70 కి తగ్గితే అది లోబిపి గా పరిగణించాలి.
బిపి రీడింగ్ లో తేడా 40 మి.మీ. కు మించింది అంటే అది లోబిపి గా పరిగణించాలి.
లోబిపి లక్షణాలు :
👉 నీరసం,అలసట.
👉🏼 మానసికంగా కృంగిపోవుట.
👉🏼 సరిగ్గా నిద్ర లేక పోవుట.
👉🏼 తలనొప్పి.
👉🏼 గుండె వేగంగా పని చేయుట.
👉🏼 నాడి అధికంగా వుండుట.
👉🏼 కళ్ళు బైర్లు కమ్ముట.
👉🏼 కళ్ళు తిరుగుట.
👉🏼 శరీరం పాలి పోవుట.
👉🏼 అరికాళ్ళు, అరిచేతులు చల్లగా వుండి చెమటలు పట్టుట.
👉🏼 ఛాతి నొప్పి.
👉🏼 కొన్ని సందర్భాలలో గుండె పోటు వచ్చే అవకాశం వుంటుంది.
👉🏼 మూత్ర పిండాలు సరిగా పనిచేయక పోవడం వలన యూరియా,క్రియాటినిక్ లాంటి పదార్ధాలు రక్తములో అధికమై ప్రాణాపాయం కలిగిస్తాయి.
👉🏼 ప్రమాదకరమైన లోబిపి లో షాక్ వచ్చి ప్రాణాపాయం కావచ్చు.
నివారణ కోసం చేయాల్సిన నియమాలు:
👉🏼 మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే మీరు పాటించే జీవనశైలి మార్పులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
👉🏼 మీ బరువును గమనించండి
మీ శరీరబరువు వైపు ధ్యాస ఉంచి తగిన జాగ్రత్తలు పాటించాలి.బరువు పెరగడం వలన రక్తపోటూ పెరుగుతుంది, అలాగే బరువు తగ్గితే రక్తపోటు కూడా తగ్గుతుంది.
👉🏼 ఊబకాయం అనేది పెరిగిన రక్తపోటు మరింత విపరీతమయ్యేందుకు ఓ ప్రమాద కారకంగా ఉంటుంది.,
👉🏼 మీరు మీ ఎత్తు మరియు వయస్సుకు తగిన బరువును కల్గి ఉండేందుకు ప్రయత్నం చేయాలి.
నిత్య వ్యాయామం:
👉🏼 అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి మీ రోజువారీ దినచర్యలో వ్యాయామం తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది.
👉🏼 వారానికి కనీసం 5 రోజులు 30 నిమిషాల నడక వంటి చర్యలు మీ రక్తపోటును నియంత్రించడంలో మీకు సహాయపడతాయి.
🙏🏼 ఇతర వ్యాయామాలైన ఈత, నృత్యం, జాగింగ్, పరుగు మొదలైనవాటిని మీ రోజువారీ కార్యకలాపాలలో భాగంగా చేసుకోవచ్చు.
కాకపోతే డాక్టర్ గారి సలహాలతో చేయడం మంచిది.
👉🏼 మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా మంచిది.
👉🏼 ఆరోగ్యకరమైన ఆహారాల జాబితాలోకి ఏమొస్తాయంటే తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు మరియు తక్కువ కొవ్వు కల్గిన డెయిరీ, పాల ఉత్పత్తులు. ఇంకా, మంచి కొలెస్ట్రాల్ తో కూడిన ఆహారాలు మరియు సంతృప్త కొవ్వులు (saturated fats) కూడా ఆరోగ్యకర ఆహారాల జాబితాలోకి వస్తాయి.
👉🏼 ఈ నియమిత ఆహారాన్ని “DASH-ఆహారం” అని పిలుస్తారు.
👉🏼 "DASH అంటే Dietrary Approaches to Stop Hypertension."
👉🏼 ఉప్పు తినడాన్ని పరిమితం చేయండి.
👉🏼 రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడానికి తినే ఉప్పును తగ్గించడం చాలా ముఖ్యం.
👉🏼 ధూమపానం వదిలేయండి
ధూమపానం (smoking) రక్తపోటును పెంచుతుంది.
👉🏼 బీడీ/సిగరెట్ ధూమపానాన్ని మీరు నెమ్మదిగా తగ్గించి అటుపై ధూమపానాన్ని పూర్తిగా మానేయొచ్చు,
👉🏼 దీనివల్ల గుండెజబ్బులొచ్చే ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. మంచి ఆరోగ్యానికి కూడా మీరు ధూమపానం నిలిపివేయవచ్చు.,
👉🏼 ఒత్తిడిని నిర్వహించండి
ఒత్తిడితో కూడిన జీవనశైలి రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది.
👉🏼 ఒత్తిడిని తగ్గించుకొని, నెమ్మదిని అలవర్చుకుని, ధ్యానం చేయడం నేర్చుకొని దాన్ని క్రమంగా అభ్యసించడం ద్వారా మీ రక్తపోటును నియంత్రించడం సాధ్యపడుతుంది.
👉🏼 వేయించిన ఆహారపదార్థాలు, జంక్ ఫుడ్ తినడం ఆపి, మీ దిననిత్య ఆహారంలో పచ్చికూరగాయలు, తాజా పళ్ళు మరియు తృణధాన్యాలు వంటి ఆరోగ్యకర పదార్థాలను తినడం ప్రారంభించండి.
👉🏼 ఒత్తిడి కూడా అధిక రక్తపోటుకు ఒక ముఖ్యమైన కారణం కావచ్చు.
👉🏼 యోగా, ధ్యానం, లోతైన శ్వాస-వ్యాయామాలు వంటి ఒత్తిడినిర్వహణా చర్యలు తీసుకోవడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవచ్చు మరియు మీ రక్తపోటునూ అదుపులో వుంచుకోవచ్చు.
ముఖ్య విన్నపం :
ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి.
- స్వస్తీ...