1.  తాజా ఆహారం అందుబాటులో లేక, వండుకోవదానికి సమయం కేటాయించుకో లేక ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద, బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సిన ఖర్మపట్టడం విదేశీయుల

 నిస్సహాయత !


 56 భోజన వంటకాలను పక్కనపెట్టి ఎవడో ఏనాడో వండి పెట్టిన రొట్టెని కాలవలో పారెయ్యకుండా, ఫ్రిజ్జిలో మురగబెట్టి పెట్టీ మోడ్రన్ స్టైల్ పేరుతో ఆ పిజ్జాల్ని వేడిచేసి ₹ 400 / - పెట్టి  మరీ తినడం, 

మన అజ్ఞానం

క్షమించాలి ఇది నిజం


2. ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలి తట్టుకోలేక, కోట్లూ సూట్లూ వేసుకోవడం 

వారి నిస్సహాయత...


వేసవి వేడిలో చమటలతో ఉక్కపోసి వళ్ళంతా జిడ్డుజిడ్డుగా అతుక్కుంటూ చిర్రెెత్తిపోతున్నా కూడా పెళ్లి రోజు వెర్రిగా కోట్లూ సూట్లూ వేసుకుని  తిరగడం 

మన అజ్ఞానం

క్షమించాలి ఇది నిజం


3. తాజా భోజనం వండేవాళ్ళు లేక ఫ్రీజ్ వాడడం, అమెరికా యూరోప్ 

వాళ్ళ నిస్సహాయత...


రోజూ తాజా కూరగాయలు వస్తున్నా, వారం రోజుల కూరగాయలు ఫ్రీజ్ లో కుక్కి కుక్కి అవి  మురుగుతున్నవాటిని వండుకు తినడం, 

మన అజ్ఞానం

క్షమించాలి ఇదినిజం


4 . ఔషధ మొక్కల జ్ఞానం లేక, మూలికలతో పరిచయం లేక, వారు జీవ జంతువుల మాంసం తో కెమికల్స్ తో ఏవేవో మందులు తయారు చేయడం, వాటి సైడ్ ఎఫెక్ట్స్ కి వేరేవేరో రోగాల పాలవ్వడం 

వారి నిస్సహాయత...


 మరి ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం తెలిసినప్పటికీ, పట్టించుకోకుండా... కెమికల్  మందులు ఉపయోగించడం, సైడ్ ఎఫెక్ట్ లతో కొత్తరోగాలు తెలిసితెలిసి తెచ్చుకోవడం 

మన అజ్ఞానం

క్షమించాలి ఇదినిజం


5. సరిపడ ధాన్యం లేక పంటలు పండక పళ్ళూ కాయలూ దొరకకా  పాముల్ని, కప్పల్నీ, కుక్కల్ని నక్కల్ని కూడా చంపి తినడం 

వాళ్ళ నిస్సహాయత...


 మరి 1600 రకాల ఆహార ధాన్యాలు లభిస్తున్నా వాళ్ళల్లా తినడానికి ప్రయత్నించడం 

మన అజ్ఞానం

క్షమించాలి ఇదినిజం


6. కొబ్బరి నీళ్ళూ మావిడి పళ్ళు బత్తాయి పళ్ళూ, సపోటా, అంబలి, చల్ల, మజ్జిగ, పాలు మొదలైనవి లేకపోవడం లేదా తెలియకపోవడం వల్ల పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు తాగడం 

వారి నిస్సహాయత...


 అవన్నీ కాక ఎన్నో రకాల ప్రాకృతిక పానీయాలు అందుబాటులో ఉన్నా... పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ఆధునికంగా అభివృద్ది చెందామని భావించండం 

మన అజ్ఞానం

క్షమించాలి ఇదినిజం


7. వాళ్ళ పంపుల్లో నీళ్ళు గడ్డకడుతుంటే టాయిలెట్ కి వెళ్ళిన  తరవాత కడుక్కోలేక టిష్యూ పేపర్లతో తుడుచుకొని తిరగడం స్నానం చెయ్యలేక సెంటేసుకుని పడుకోవడం 

వాళ్ళ నిస్సహాయత...


 సుబ్బరంగా మనకు నీళ్ళొస్తున్నా కడుక్కోకుండా  

తుడుచుకొని, సెంటేసుకుని తిరగడం 

మన అజ్ఞానం

క్షమించాలి ఇదినిజం


8. ఎలాంటి ముందుచూపూ లేక, మరుగుదొడ్ల నీళ్ళని నదుల్లో  కలుపుకోవడం మళ్ళీ వాటినే శుభ్రం చేసుకుని తాగడం 

వాళ్ళ బుద్దిహీనత


అన్నీ తెలిసి తెలిసి వాళ్ళని గుడ్డిగా అనుసరించి అదే అభివృద్ది అనుకుని మనం కూడా మన నదుల్ని మురికి కూపాలు చేసుకుని మంచినీటి కోసం ఏడవడం 

మన అజ్ఞానం

క్షమించాలి ఇది నిజం


9. తోటలూ మొక్కలూ లేక ఎక్కడో ఎవరి దగ్గరో బానిసలా బతికడం కాయలూ పళ్ళూ కొనుక్కు తెచ్చుకోవడం. సరియైన కుటుంబ వ్యవస్థ లేకపోవటం వల్ల, నా అనే వాళ్ళు లేక, అశాంతిగా ఒంటరిగా జీవించడం 

వాళ్ళ నిస్సహాయత...


చక్కగా పల్లెల్లో ఫాం హౌసుల్లాంటి ఇళ్ళల్లో, చక్కని ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో,  పెరట్లో బోలెడన్ని మొక్కలేసుకుని, చెట్టుకి పండిన కాయలూ పళ్ళూ తిన్నన్ని తిని పక్కవాళ్ళకిచ్చి సంతోషంగా, అందరితో కష్ట సుఖాలను పంచుకుంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించే మనం...

ఆ అమెరికా, యూరోప్ వారిని అనుకరించడం... ఇలా కొట్టుకు చస్తూ, ఏడుస్తూ బతకడం... 

మన అజ్ఞానం

క్షమించాలి ఇదినిజం


10. చెట్లు పెంచుకోవడానికి ఏ ఎరువెయ్యాలో తెలియక రసాయనిక మందులేసుకోవడం కడుపులో ఎసిడిటీలు కేన్సర్లూ  తెచ్చుకోవడం 

వాళ్ళ నిస్సహాయత...


ఇంట్లో వుండే ఎద్దులూ, ఆవులు, కోళ్ళు, మేకల మల మూత్రాలను బయో ఫెర్టిలైజర్స్ గా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గా వాడుకుంటూ హాయిగా ఆరోగ్యంగా బతికిన మనం...

వాటిని వదిలి అమెరికా, యూరోప్ వాళ్ళ మోజులో పడి వాళ్ళని అనుసరించి, మనం కూడా ఆ క్రిమిసంహారక మందులే వాడుతూ, ఇమ్యూనిటీ నాశనం చేసుకుంటూ ఆ రోగాలే తెచ్చుకోడం 

మన అజ్ఞానం

క్షమించాలి ఇదినిజం


11. ఒక్కోసారి ఆరునెలల పాటు వాళ్లకు సూర్యుడు కూడా కనిపించడు కనక వాషింగ్ మెషిన్ లో ఉతికేసిన బట్టలు సూర్యరశ్మిలో ఎండబెట్టే అవకాశం లెక డ్రైయ్యర్లో ఆరబెట్టుకుంటూ వాటికున్న ఎరోబిక్ ఎనరోబిక్ బాక్టీరియాల్లో కొన్ని చావకపోయినా హానికరమైన కెమికల్స్ వేసుకుని బతకడం 

వాళ్ళ నిస్సహాయత...


హాయిగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి నిండుగా వున్నా వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టల్ని అందులోనే ఆరబెట్టుకోవడం మన బుద్దిహీనత 

మన అజ్ఞానం

క్షమించాలి ఇదినిజం


12. గడ్డకట్టేసిన నీటితో  స్నానం చెయ్యలేక శానిటైజేషన్ పేరుతో మురికి చేతులపైనే పురుగులమందులు జల్లుకుంటూ...

అవే బట్టలతో ఇల్లంతా తిరగడం, మంచాల మీద పడుకోవడం... వాటివల్ల మాటిమాటికీ రోగాలు తెచ్చుకోవడం మందులు మింగడం 

వాళ్ళ నిస్సహాయత...


హాయిగా నీళ్ళొస్తున్నా స్నానం చెయ్యకుండా స్టైల్ పేరుతో కుక్కకంపు కొట్టే సెంట్లు కొట్టుకుంటూ తిరగడం 

మన అనంతమైన అజ్ఞానం.


మరోసారి మళ్ళీ క్షమించాలి ఇదినిజం


13. దూరంగా నిలబడి ఆహ్వానించడం, నమస్కరించడం, 

చెప్పులు వేసుకుని ఏ ఇంట్లోకి వెళ్ళక పోవడం. 

కాళ్ళు చేతులూ కడుక్కోవడానికి బకెట్ తో నీళ్ళివ్వడం 

మన సంస్కారం. మన పెద్దలు మనకు నేర్పిన అత్యుత్తమ సంస్కారం. దాన్ని వదిలేసి ఇవ్వాళ ఏడవడం 

మన అజ్ఞానం.!

క్షమించాలి ఇదినిజం


14. విపరీతమైన చలితట్టుకోలేక ఇంటాబయటా అవే సాక్స్ అవే బూట్లతిరగడం 

వాళ్ళ నిస్సహాయత.


ఇంట్లోకి వచ్చేముందు చెప్పులు గుమ్మం బయటే వదిలెయ్యడం, బయట తిరిగిన బట్టల్ని బాత్ రూములొ  తడిపేసి స్నానం చేసి ఇంట్లోకి రావడం మన పద్దతి. అలాంటి పద్దతుల్ని చాదస్తం పేరుతో... ఆలోచన లేకుండా వదులుకోవడం 

మన అజ్ఞానం

క్షమించాలి ఇదినిజం

 

మనం ఎంతో ఆత్మీయత గుండెల్లో పొంగితే కానీ చేతులు పట్టుకోలేం, హత్తుకుని కౌగిలించుకోలేం. తల మీదో బుగ్గల మీదో ముద్దులు పెట్టుకోలేం కానీ అవి అమెరికా వాళ్ళకి అత్యంత సహజం..

కానీ నేడు దాన్ని వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య మానవాళి... అంతా 

భారతీయుల్ని చూసి  క్వారంటైన్ జ్ఞానం నేర్చుకుంటోంది. నేర్చుకోమంటోంది.


కనీసం ఇప్పటికైనా మనం మన మడి ఆచారాలను మళ్ళీ పాటించడం ప్రారంభించకుంటే అది 

మన అజ్ఞానం

క్షమించాలి ఇదినిజం


🧐🧐🧐 జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అజ్ఞానం అంతా వాళ్ళని చూసి మనకుగా మనం తెచ్చిపెట్టుకున్న అజ్ఞానం...

 

మన బానిస మనస్తత్వ అజ్ఞానం...


విదేశీ వ్యామోహ అజ్ఞానం...


కరోనా లాంటి వైరస్ లను కొంపమీదకు తెచ్చిపెట్టుకునే అజ్ఞానం...


అమెరికాలో యాపిల్ ఫోన్ అంత మంచిఫోన్ మరొకటి లేదు.

అన్నది ఎంత నిజమో...


అమెరికా, యూరోపియన్ ప్రజలు తినేంత అనారోగ్యకరమైన ఆహారం...

వాళ్ళ కున్నన్ని ఆర్టిఫిషల్ అలవాట్లు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. అన్నది కూడా అంతే నిజం...


ఆధునీకరణ, ఫ్యాషన్, మొదలగు పేర్లతో ఋషులు మనకు అందించిన

దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా...

ప్రాకృతిక జీవనాన్ని  వదలేసుకోవడం 

మన అజ్ఞానం


క్షమించాలి ఇదినిజం

 


వేటిని స్వీకరించాలో వాటినే స్వీకరిద్దాం...


కానీ గుడ్డిగా...

మోజుతో...

వెర్రిగా...

అనాలోచనతో...

అనుకరిస్తే...

పోతాం! 


ఏం వచ్చి పోతాం?


కరోనా లాంటివి వచ్చి పోతాం!..




- స్వస్తీ...