హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం 
సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం 


హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం ... కార్తీక మాసం ...


చరణం 1: 


పవిత్రతకు మరో పేరు ప్రాతః స్నానం 
భవబంధము తొలగజేయు నందాదీపం 


అశ్వమేధ ఫలమిచే యధాశక్తి దానం 
సువర్లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము 



హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం 
సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం 


హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం ... కార్తీక మాసం ...


చరణం 2 :


సంధ్యకాలపు దీపం సద్గతి నిడు పురాణం 
వందనేయ గోపుజ వనమహోత్సవం 


వింధైన నమక చమక విహిత శివాభిషేకం 
కందువ ద్వాదాసి తులసీ కళ్యాణం మన భాగ్యం 


హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం 
సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం 


హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం ... కార్తీక మాసం ... కార్తీక మాసం.... కార్తీక మాసం...






- స్వస్తీ...