మీ జీవితాన్ని మరో కోణంలో చూడండి


➡ జీవితంలోంచి దువ్వెన అనే వస్తువును తీసేయండి

అపుడు ఏం జరుగుతుంది ?

మీరు జడలు కట్టిన జుట్టుతో భయంకరంగా ఉంటారు .


➡ మీ జీవితంలోంచి అద్దం అనే వస్తువును తీసేయండి.

తర్వాత మీరు మిమ్మల్ని చూసుకోలేనంత అసహ్యంగా ఉంటారు.


➡ ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే నిద్ర రాక మరుసటి దినం ఏపనీ సక్రమంగా చెయ్యలేరు.


➡ మీ జీవితాన్నే అందంగా, సౌఖ్యంగా చేస్తూన్న ఇలాంటి చిన్న చిన్న వస్తువులకు మీరెప్పుడయినా థాంక్స్ చెప్పారా ?

 

➡ మూడు పూటలూ మీకు సకాలంలో తిండి ఏర్పాటు చేస్తున్న మీ తల్లికో లేక మీ భార్యకో ఒక్క రోజైనా థాంక్స్ చెప్పారా ? 


➡ మూడు నిముషాలపాటు చెట్లు  స్ట్రైక్ చేస్తే భూమండలం అంతా శవాల దిబ్బ ఐపోతుంది.

చెట్టు యొక్క దయా దాక్షిణ్యాలపై బతుకుతున్న  మీరు ఒక్క రోజైనా ఏ చెట్టునైనా  ప్రేమగా స్పర్శిస్తూ థాంక్స్ చెప్పారా ?





➡ ఎండకూ, వానకూ, అమ్మకూ, నాన్నకూ నిన్ను ఆనందంగా ఉంచుతున్న ఈ ప్రకృతి గురువుకు మీరు తినే తిండికి

ఎప్పుడైనా థాంక్స్ చెప్పారా ?


➡ అంటే మీకు తీసుకోడమే తప్ప ఇవ్వడం రాదన్నమాట !

సత్యం ఏమిటంటే ఇస్తేనే తిరిగి లభిస్తుంది.


➡ నిజానికి పై వస్తువులేవీ మీ దగ్గరనుండీ ఏమీ ఆశించకుండా... నిస్వార్థంగా....ఎన్నో యుగాలుగా సేవ చేస్తున్నాయి.


➡ మీకు సౌఖ్యాన్ని ఇచ్చిన ప్రతీ ఒక్క వస్తువుకు మనసులో కృతజ్ఞత సమర్పించి చూడండి !

మీ మనసు పవిత్రతతో కడిగివేయబడి నిష్కల్మషం ఐపోతుంది.

ఇదే అంతః శుద్ధి !

ఇదే పవిత్రత !

ఇదే దైవత్వం !

ఇలాగే స్వచ్ఛతను సాధించాలి.


➡ సృష్టిలో స్వచ్ఛమైన ప్రతిదీ అత్యంత శక్తి కల్గివుంటుంది.


➡ ప్రతీ రోజూ మీకు సహాయం చేస్తున్న ప్రతీ వస్తువూ, మనిషి, జంతువు, ప్రకృతి.. ఇలా అన్నిటికీ హృదయంలో నిండుగా కృతజ్ఞత ప్రకటించడం సాధన చేయాలి.

ఇది మీకు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.


 


-  స్వస్తీ...