🌦️🌧️ వానలు పలురకాలు ⛈️🌨️


గాంధారివాన 

కంటికి ఎదురుగా ఉన్నది  కనిపించనంత జోరుగా కురిసే వాన


మాపుసారివాన

 సాయంత్రం కురిసే వాన


మీసరవాన 

మృగశిరకార్తెలో కురిసే వాన


దుబ్బురువాన 

తుప్పర/తుంపర వాన


సానిపివాన

 అలుకు (కళ్లాపి) జల్లినంత కురిసే వాన


సూరునీల్లవాన 

ఇంటి చూరు నుండి ధార పడేంత వాన


బట్టదడుపువాన 

ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన


తెప్పెవాన 

ఒక చిన్న మేఘం నుంచి పడే వాన


సాలువాన

 ఒక నాగలిసాలుకు సరిపడా వాన


ఇరువాలువాన 

రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన


మడికట్టువాన 

బురదపొలం దున్నేటంత వాన


ముంతపోతవాన 

ముంతతోటి పోసినంత వాన


కుండపోతవాన 

కుండతో కుమ్మరించినంత వాన


ముసురువాన

 విడువకుండా కురిసే వాన


దరోదరివాన 

ఎడతెగకుండా కురిసే వాన


బొయ్యబొయ్యగొట్టేవాన 

హోరుగాలితో కూడిన వాన


రాళ్లవాన

 వడగండ్ల వాన


కప్పదాటువాన 

అక్కడక్కడా కొంచెం కురిసే వాన


తప్పడతప్పడవాన 

టపటపా కొంచెంసేపు కురిసే వాన.


దొంగవాన 

రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన


కోపులునిండేవాన 

రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన


ఏక్దారవాన

 ఏకధారగా కురిసే వాన


మొదటివాన 

విత్తనాలకు బలమిచ్చే వాన


సాలేటివాన 

భూమి తడిసేంత భారీ వాన


సాలుపెట్టువాన 

దున్నేందుకు సరిపోయేంత వాన



- స్వస్తీ...


.