🌊 సముద్రమంత శాంతం ఉన్న రాముడిని అడిగితే...
🏹 రావణుడి లాంటి శత్రువు దొరకడం తన అదృష్టం అంటాడు.

👑 రావణుడు అనగానే...

👹 సీతను అపహరించిన పది తలల రాక్షసుడే లోకానికి గుర్తొస్తాడు.

కానీ...

🔟 ఆ పది తలలు క్రూరత్వానికి గుర్తులు కావు.

📖 నాలుగు వేదాలు, 📚 ఆరు శాస్త్రాలపై ఆయనకున్న పట్టుకి నిదర్శనం.

🔭 ఆస్ట్రాలజీ లో అత్యున్నత గ్రంథమైన 'రావణ సంహిత' రాసిన మొదటి సైంటిస్ట్ రావణుడు.

✨ ఆయన మేధస్సుకు దేవతలు కూడా ఆశ్చర్యపోయారు.

🔯 రావణుడు ఒక గొప్ప ఆస్ట్రాలజర్.

📚 ఈరోజుకి కూడా జ్యోతిష్య శాస్త్రంలో 'రావణ సంహిత' అనేది ఒక మాస్టర్ పీస్.

🪐 గ్రహాల గమనాన్ని లెక్కకట్టడంలో...
🌿 ఆయుర్వేదంలో...
ఆయనకు ఉన్న నాలెడ్జ్ ఎవరికీ లేదు.

🕉️ శివుడిని మెప్పించడం కోసం తన తలలు నరికి అగ్నిలో వేశాడు.

🎻 తన చేతి నరాలను కోసి వీణ తీగలుగా మార్చి 'శివ తాండవ స్తోత్రం' పాడాడు.

🙏 ఆయన పాడిన శివతాండవ స్తోత్రం...

ఈరోజు కూడా వినేవారికి భక్తిని గుర్తు చేస్తుంది.

✨ ఈ రోజుకీ ఆ స్తోత్రాన్ని మించిన పవర్ఫుల్ మంత్రం మరొకటి లేదు.

📚 జ్ఞానం...
ఎవరి దగ్గర పుట్టిందన్నది ముఖ్యం కాదు.

💡 ఎవరి జీవితంలో నిలిచిందన్నదే ముఖ్యం.

🛕 రాముడు సముద్రం మీద వారధి కట్టే ముందు, శివుడి ఆశీస్సుల కోసం యాగం చేయాలనుకుంటాడు.

🕉️ రాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేయడానికి సరైన బ్రాహ్మణుడు దొరకనప్పుడు, రావణుడే స్వయంగా వచ్చి యాగం చేశాడు.

🙏 తన మీద యుద్ధానికి వస్తున్న రాముడికి "విజయీభవ" అని దీవించిన ఏకైక పండితుడు రావణుడు!

📜 ఇది వాల్మీకి రామాయణంలో లేదు కానీ, ఆనంద రామాయణం, కంబ రామాయణం లాంటి పురాణాల్లో మరియు రామేశ్వర స్థల పురాణంలో ఉన్న బలమైన కథ.

⚖️ అది చారిత్రకంగా అందరూ అంగీకరించిన కథ కాకపోయినా...

💡 ఆ కథ చెప్పే భావం మాత్రం ఒకటే.

📚 జ్ఞానానికి శత్రుత్వం ఉండదు.

🏰 మనకు లంకాదహనమే తెలుసు, కానీ లంకా వైభవం తెలియదు.

👑 రావణుడి పాలనలో లంకలో ఒక్కడంటే ఒక్కడు కూడా ఆకలితో లేడు.

🤝 కులాలు లేవు, అడుక్కునేవాడు లేడు.

💰 ప్రతి ఇల్లూ బంగారంతో నిండి ఉండేది.

🎓 ప్రతి ఒక్కరికీ విద్య, సంపద ఉండేది.

👑 ఒక రాజుగా తన ప్రజలకు ఆయన ఏనాడూ విలన్ కాదు... దేవుడే!

📖 రావణుడు కేవలం వేదాలు చదివినవాడు కాదు.

🎼 'సామవేదం' (సంగీతానికి మూలం) లో ఆయనకు మించిన పండితుడు లేడు.

🎻 తన నరాలు కోసి వీణ వాయించినప్పుడు శివుడు కరిగిపోయాడు.

⚔️ యుద్ధరంగంలో కూడా రావణుడి రథం మీద నుండి వచ్చే శబ్దం ఒక గొప్ప మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లా ఉండేదని వాల్మీకి వర్ణించాడు.

🏆 గెలిచినవాడు కూడా... ఓడిపోయినవాడి దగ్గర నేర్చుకోవచ్చు.

⚔️ యుద్ధంలో ఓడిపోయి ప్రాణాలు విడుస్తున్న సమయంలో...

🏹 రాముడు లక్ష్మణుడిని రావణుడి వద్దకు పంపాడు.

👑 ఒక రాజు ఎలా ఉండాలి? రాజ్యం ఎలా ఏలాలి? అని లక్ష్మణుడికి **'రాజనీతి'**ని బోధించిన నిస్వార్థమైన గురువు రావణుడు.

💡 ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది...

📚 జ్ఞానం... శత్రువుని చూసి పుట్టదు.

🌿 రాముడి గొప్పతనం...

⚔️ రావణుడిని చంపడంలో లేదు.

🤝 రావణుడి గొప్పతనాన్ని తగ్గించకుండా...

అతని తప్పుని ఎదుర్కొనడంలో ఉంది.

🏆 గెలిచినవాడి విలువ... ఎదుటివాడి స్థాయిని బట్టి తెలుస్తుంది.

👑 రాజు అంటే... తనని పొగిడేవాళ్లతో కాదు, తన తప్పు చెప్పేవాళ్లతో నిలబడాలి.

🗣️ మందోదరి చెప్పింది.
🗣️ విభీషణుడు చెప్పాడు.
🗣️ కుంభకర్ణుడు కూడా చెప్పాడు.

వినలేకపోయింది చెవులు కాదు... 😔 అహంకారం.

🌍 రావణుడు ప్రపంచాన్ని జయించాడు...

కానీ...

❌ "నేను తప్ప చేస్తున్నాను" అనే ఒక్క ఆలోచనని మాత్రం జయించలేకపోయాడు.

💭 కొన్నిసార్లు... మనిషిని శత్రువు ఓడించడు.

అతని మీద అతనికున్న అహంకారమే ఓడిస్తుంది.

⚖️ రాముడు... ధర్మాన్ని వదల్లేదు.

🔥 రావణుడు... అహంకారాన్ని వదల్లేదు.

ఇద్దరూ మహానుభావులే.

కానీ...

🟢 ఒకరు తన బలాన్ని నియంత్రించారు.

🔴 ఇంకొకరు... తన బలమే తనని నియంత్రించనిచ్చారు.

అదే... రామాయణం మొత్తం చెప్పిన పెద్ద తేడా.

🕊️ రాముడు ధర్మానికి నిలబడ్డాడు.

📚 రావణుడు జ్ఞానానికి నిలబడ్డాడు.

కానీ...

జ్ఞానం ఉన్నంత మాత్రాన ధర్మం దొరకదు.

ధర్మం లేకపోతే... జ్ఞానం కూడా రక్షించబడదు.

అందుకే...

📖 రామాయణం రాముడి విజయం మాత్రమే కాదు.

💡 రావణుడి పతనం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం కూడా.

⏳ రావణుడు లక్ష్మణుడికి బోధించేటప్పుడు...

"శ్రీరాముడిని శరణు కోరి, సీతను ఇచ్చేద్దాం అనే మంచి ఆలోచన నాకు చాలాసార్లు వచ్చింది, కానీ వాయిదా వేశాను.

సీతను ఎత్తుకొచ్చే చెడు పనిని మాత్రం క్షణాల్లో చేసేశాను.

అదే నా పతనానికి కారణం అయింది" అని రావణుడు తన తప్పును నిజాయితీగా ఒప్పుకున్నాడు.

✅ అందుకే మంచి పని చేయాలి అని ఆలోచన రాగానే ఆ క్షణమే చేసేయాలి.

⏳ రేపటికి వాయిదా వేయకూడదు.

❌ అదే చెడు పని చేయాలి అనిపిస్తే మాత్రం...

దాన్ని ఎంత వీలైతే అంత వాయిదా వేయాలి అని రావణుడు చెప్తాడు.

💭 మనిషిని ఒక్క తప్పుతో కొలవడం ఎంత సులభమో... రావణుడు గుర్తు చేస్తాడు.

📝 కొన్ని జీవితాలు...

ఒక్క తప్పుతో ముగిసిపోవు.

ఒక్క తప్పుతోనే గుర్తుండిపోతాయి.

🙏 శత్రువులో కూడా గురువుని చూడగలిగిన రాముడికి...

📚 శత్రువైనా గురువుగా మారిన రావణుడికి...

తేడా ఒక్కటే!

🕊️ ఒకరు ధర్మాన్ని నమ్మారు,

⚖️ ఇంకొకరు కర్మాన్ని నమ్మారు.

✍️. . . మీ రామ్ కర్రి
 జ్ఞానాన్వేషి 🧠, ధర్మ రక్షక్ 📿, నవ యువ కవి 📖, రచయిత ✒️, బ్లాగర్ 🪩 ,. టెక్ గురు 🖥️ , 
 సామాజిక కార్యకర్త 🩸 ,
📖 తెలుగు భాషా సంరక్షణ వేదిక 📚 , 
 🪷 సంజీవని ఔషధ వన ఆశ్రమం 🌱 ,
మరియు 
 🛕 జ్ఞాన కేంద్ర 🚩 వ్యవస్థాపకులు . . . 
 www.ramkarri.org 
 8096339900