మూసిన కన్ను తెరవకపోయినా,
తెరిచిన కన్ను మూయకపోయినా,
శ్వాస తీసుకుని వదలకపోయినా,
వదిలిన శ్వాస తీయకపోయినా,
ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు.
మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్థాక్ష్యిణ్యంగా మరచిపోయేలా చేస్తుంది కాలం.
విరోధులు స్నేహితులైనా, పశ్చాతాపపడినా,
మనసు మార్చుకున్నా మరల కనిపించం.
ఫెయిర్ అండ్ లవ్‌లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన
ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు లేదా భూమి లో కలిసి పోక తప్ప దు
ఈ క్షణం మాత్రమే నీది,
మరుక్షణం ఏవరిదో?
ఏమవుతుందో ఎవరికి తెలుసు?
ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా
నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు..
ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా,
సంపన్నులైనా బలవంతులైనా
అవయవక్షీణం - ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు.
ఈ సృష్టిలో మనము మొదలు కాదు.
చివర కాదు.
ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము.
అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకువెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకువెళ్లక తప్పదు..
చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్థాయం మనకి లేదు.
ఈ భూమ్మీద కాలమనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం.
మనం సహప్రయాణికులం మాత్రమే.
కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ.
అందుకే మనుషుల్లా జీవిద్దాం.
మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ, భారత, భాగవతాదులను, ఖురాన్, బైబిల్ ల ను..
ఎవరి కి నచ్చిన విధంగా ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం. అందులోని సంశయాలను తీర్చుకుందాం.
ఈ సందేశం
చాలా నిరుత్సాముగా
వైరాగ్యం గా
అతి గా
అనిపించవచ్చు
కానీ ఈ సందేశం గూడార్ధం ఏమిటి అంటే...
"మన కర్తవ్యాన్ని పాటిస్తూ,
కుటుంబం ను బాగా చూసుకుంటూ
అవకాశం ఉంటె
ఇతరులకు సహాయం చేస్తూ...
ఎవరికైనా సహాయం చేయకపోయినా హాని చేయకుండా... "
ఉన్నన్ని రోజులు జీవితాన్ని ఆస్వాదిస్తూ
మరియు ఎంజాయ్ చేస్తూ ఉండమని కోరుతున్నాను...
- శుభం భూయాత్ . . .