ఏ దేశ సంస్కృతి అయినా ఆ దేశ ఆత్మ అయి ఉంటుంది. మన భారతీయ సంస్కృతి యొక్క మహత్తు అపారమైనది. ఈ సంస్కృతిలో ఆదికాలం నుంచీ వస్తున్న సంప్రదాయాల వెనుక గొప్ప తాత్త్విక, వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయి.భారతీయ సంస్కృతి యొక్క అపురూప రత్నము నమస్కారము. నమస్కారానికి అర్థము వందనము. నమస్సు లేక ప్రణామము. మన సంస్కృతిలో నమస్కారానికి ఒక స్థానము, మహత్తు ఉన్నాయి. పాశ్చాత్య సంస్కృతియందు కరచాలనం (షేక్ హ్యాండ్) చేసుకున్నట్టుగానే భారతీయ సంస్కృతిలో రెండు చేతులూ జోడించి, తలను వంచి ప్రణమిల్లే ప్రాచీన పద్ధతి ఉంది. దీన్ని కరెక్టుగా చెప్పాలంటే సంస్కారంతో కూడిన నమస్కారం అనాలి. నమస్కారం అనేది ఒక ఉత్తమ సంప్రదాయం. దివ్య జీవితానికి ప్రవేశ ద్వారము. మనకంటే పెద్దలను, మాతా పితరులను, గురువులను, సాధువులను, సజ్జన, మహాత్ములను, ఉత్తములను కలుసుకున్న సమయంలో వారి ఎదుట చేతులు జోడించి, తలను వంచినట్లయితే మనలో ఉండే అహంకారం నశించి, అంత:కరణము నిర్మలమై వినయము అలవడుతుంది. ఆడంబరాలు, ఆర్భాటాలు, డాంబికాలు పోయి పరళ స్వభావులుగా, సాత్వి కులుగా మారతాము. మనస్ఫూర్తిగా చేసిన నమస్కారమే పైన చెప్పిన విధంగా సంస్కారంతో కూడిన నమస్కారం అవుతుంది.రెండు చేతులు జోడించి హృదయానికి దగ్గరగా ఆనించి, శిరస్సు వంచి చేసే నమస్కారము సరైన పద్ధతిలో చేసే నమస్కారము. ఈ నమ స్కారానికి జేజే, దండం, అంజలి వంటి పర్యాయ పదాలుగా చెప్పుకునే పేర్లు కూడా ఉన్నాయి.దేవుడి ముందు నిలబడి చేసే నమస్కారం శ్రేష్ఠమైనది. రెండు చేతులూ జోడించటం చేత జీవన శక్తిని, తేజో వలయాన్ని రక్షించే ఒక చక్రము ఏర్పడుతుంది. ఆ వందనం విశేష లాభదా యకమైనది. ఇక వందనము చందనము వలే శీతలమైనది. వందనం వలన వినయము, శాంతి, ఉత్తమత్వ్తం సిద్ధిస్తాయి. ఆలోచనలలో సంయమనాన్ని, ప్రవృత్తికి నియంత్రణనూ, విశ్వాసాన్ని పొందగలం. ఉత్తమ వ్యక్తిత్త్వం అలవడుతుంది. వినయశీలి అందరకు ఇష్టుడుఒక్క చేత్తో చేసే నమస్కారం నమస్కారంగా పరిగణింపబడదు. మనం చేసే పనిని అనుసరించి మన విలువ ఉంటుంది. సమాజంలో తరతరాల నుంచి పిల్లలకు పెద్దలు పద్ధతులను, సం ప్రదాయాలను, మర్యాదలను, కట్టుబాట్లను, నియమాలను వినయ విధేయతలను నేర్పిస్తూ, వివరిస్తూ మన సంస్కృతి విశిష్టతను, వార సత్వంగా అందిస్తున్నారు. తరువాతి తరాల వారు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతున్నారు.నమస్కారం భారతీయ సంప్రదాయమై తరతరాల నుంచి వస్తున్నది. ఎదుటి వారికి, పెద్దలకు నమస్కారం చేయటం ద్వారా వారి పట్ల మనకున్న గౌరవ మర్యాదలను, వినయ విధేయతలను, భక్తి, శ్రద్ధలను తెలుపవచ్చు. తప్పును మన్నించమని అడగటాన్ని, వేడుకోవటాన్ని నమస్కారం తెలుపుతుంది. మన నమస్కారానికి ఎదుటి వారు చేసే నమస్కారాన్నిప్రతి నమస్కారం అంటాము. నమస్కారానికిప్రతి నమస్కారం చేయటం మన సంస్కారాన్ని తెలుపుతుంది.ఇటువంటి ఉత్తమమైన మన భారతీయ సంస్కృతిని వదిలేసి పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి కరచాలనం చేయటం వలన ఒకరి చేతులు మరొకరు అందుకోవటం మూలాన చాలా అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. జీవశక్తి నశించి ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వారితో కరచాలనం చేస్తే, వారికుండే ఇన్ఫెక్షన్ ఎదుటివారికి సోకవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఏదైనా ‘టచ్’ చేయకుండా చేసే నమస్కారమే అన్ని విధాలా శ్రేయస్కరము.స్వచ్ఛమైన నమస్కారానికి సాటి, పోటీ లేదు, రాదు. మరి మరుగైపోతున్న భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మికతను, నమస్కారాన్ని మళ్లి అలవాటు చేసుకుందామా!
--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -
Whatsapp : +918096339900 ,
Web Sites & Blogs :
Intellectual Brainy || Ram Karri || Tech Guru Ram || Ammaku Prematho || Nannaku Prematho || Ethics of Old Genarations || Telugu Quotes Park || Health Tips || Telugu Vignana Sarvaswam || Telugu Whatsapp Group's || Go for Green World || Naaku Amma Cheppindhi ||Karri Ram || Left Handers Club India || Lefties Rule The World || BroadMind Creation's || Mana Telugu Patalu Lyrics || Pusthakalayam || Voice Of Ram || RamKarri.In || RamKarri.Com ||
-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Facebook Id : https://www.facebook.com/UrsRamKarri
Google Map : Ram Karri
LinkedIn : https://www.linkedin.com/in/karriram
---------------------------------------------------------
૨αɱ ҡα૨૨เ
ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.
--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -
Whatsapp : +918096339900 ,
Phone : +919492089900 .
--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -
Web Sites & Blogs :
Intellectual Brainy || Ram Karri || Tech Guru Ram || Ammaku Prematho || Nannaku Prematho || Ethics of Old Genarations || Telugu Quotes Park || Health Tips || Telugu Vignana Sarvaswam || Telugu Whatsapp Group's || Go for Green World || Naaku Amma Cheppindhi ||Karri Ram || Left Handers Club India || Lefties Rule The World || BroadMind Creation's || Mana Telugu Patalu Lyrics || Pusthakalayam || Voice Of Ram || RamKarri.In || RamKarri.Com ||
-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Facebook Id : https://www.facebook.com/UrsRamKarri
Google Map : Ram Karri
LinkedIn : https://www.linkedin.com/in/karriram
----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------