బెడ్‌రూమ్‌కు స్మార్ట్ ఫోన్లు వద్దు.. హాలుకే పరిమితం చేస్తే?

ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లే. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఒక్క క్షణం గడపలేని వారి సంఖ్య పెరిగిపోతుంది. ఉదయం నుంచి రాత్రి నిద్రించేంత వరకు స్మార్ట్ ఫోన్లను తెగవాడేసే వారు అధికమవుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ రేడియోషన్ ద్వారా ముప్పు పొంచి వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే నిత్యజీవితంలో వైర్‌లెస్ కనెక్టివిటీ ఒక భాగమైపోయింది.

సెల్‌ఫోన్ సిగ్నళ్లు, వై ఫై టెక్నాలజీ, రిమోట్ వర్కింగ్ వంటి విధానాల వల్ల తెలియకుండానే మన ఆరోగ్యం వైర్‌లెస్ సిగ్నళ్ల రేడియేషన్‌కి గురవుతుంది. ఇలా చాలాకాలం పాటు రేడియేషన్‌కు మానవ శరీరం గురవడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్, ఇన్‌ఫెర్టిలిటీ వంటి సమస్యలతో పాటు అంతుచిక్కని రోగాలు వచ్చే ఛాన్సుందని వైద్యులు చెప్తున్నారు.

రేడియేషన్ ప్రభావం కారణంగా ముక్కు, గొంతు, చెవికి సంబంధించిన రుగ్మతలు తప్పవట.

రోజురోజుకీ వైర్‌లెస్ రేడియేషన్ తరంగాల సాంద్రత పెరుగుతోందని.. తద్వారా అంతు చిక్కని రోగాలు మానవాళిని వెంబడిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే రాత్రిపూట స్మార్ట్ ఫోన్లను పడక గదికి తేవడం కూడదని.. హాలులోనే వాటిని పరిమితం చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు.

రింగ్ టోన్‌ వాల్యూమ్ పెంచేసి హాలులో స్మార్ట్ ఫోన్లను వుంచడం ద్వార పిల్లల్లో రేడియేషన్ ప్రభావం చాలామటుకు తగ్గుతుంది. అలాగే పడకగదిలో వైఫై వంటి టెక్నాలజీ ఉపయోగించే పరికరాలు వుండకపోవడం చాలామంచిదని వైద్యులు సూచిస్తున్న
కంటి చూపు కాపాడుకునేలా
పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా తలెత్తుతున్న సమస్యలో కంటి సమస్యలను ప్రధానంగా చెప్పవచ్చు. కంప్యూటర్‌లపై పని సమయం పెరగడం, స్మార్ట్‌ఫోన్లపై ఆధారపడటం కంటిచూపుపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఎటువంటి కంటి సమస్యలు లేకపోయినా కూడా సమయానుసారం కంటి వైద్యుని సంప్రదించి కంటి పరీక్షలు చేయించు కోవడం తప్పనిసరి. సరైన ఆహారప్రణాళిక, ప్రణాళికా బద్దమైన జీవనం మీ కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరం. భవిష్యత్‌ లో కంటి సమస్యలు రాకుండా కూడా నిరోధించవచ్చు. విటమిన్లు మినరల్స్‌ సరైన మోతాదులో శరీరానికి అందేలాగా ఆహార ప్రణాళికలలో మార్పులు చేసు కోవడం ద్వారా అనేక కంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యం గా కంటి శుక్లాలు, గ్లకోమా , వయసు ప్రభావం వలన కళ్ళలో మచ్చలు, రే చీకటి, కళ్ళు పొడిబారడం వంటి అనేకసమస్యలను క్రమం తప్పకుండా చేయించుకునే కంటి పరీక్షల ద్వారా నివారించవచ్చు.

కంటిచూపును కాపాడుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలి చాలా ముఖ్యం. విటమిన్‌ ఏ, విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, బీటా కెరోటిన్‌, జింక్‌, ఒమేగా3 ఫాటీ ఆమ్లాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా కంటి సమస్యలను చాలావరకు నియంత్రించవచ్చు.
- కంప్యూటర్‌, లాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వినియోగించడం కండ్లకు భౌతికంగా, ఆరోగ్య పరంగా ఎక్కువ హానిచేస్తాయి. ఉద్యోగరీత్యా ఉపయోగించేవారు, టైమ్‌పాస్‌ కోసం గేమ్స్‌ ఆడేవారు ఎక్కువసేపు కండ్లను స్క్రీన్‌ కి అప్పగించడం వల్ల కండ్లపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. దీంతో నెమ్మదిగా కంటి చూపు మందగించడం, తలనొప్పి వంటి సమస్యలను వస్తాయి. కంప్యూటర్‌పై ఎక్కువ సమయం పనిచేసేవారు ప్రతి అరగంటకు ఒకసారి 2,3 నిమిషాల పాటు కండ్లకు విశ్రాంతిని ఇవ్వాలి. కండ్లను కాసేపు మూసుకోవడం, చల్లని నీటితో కడుక్కోవడం మంచిది.
- అనేకమంది కళ్ళద్దాలు ధరించడం చాలామంది ఇబ్బందిగా భావిస్తారు. అద్దాలు కంటి చూపును మెరుగు పరచడానికి ఉపయోగపడుతాయి తప్ప కంటిపై చెడుప్రభావం చూపించవని గుర్తుంచుకోవాలి. వయసును బట్టి, డాక్టరు సూచన ప్రకారమే కళ్ళద్దాలను ఉపయోగించాలి. టీనెజ్‌లో ఉన్నవారు కనీసం ఆరునెలలకు ఒకసారి, మధ్యవయసు వారు ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలి. కనీసం రెండేండ్లకు ఒకసారైనా కళ్ళద్దాలు మార్చాలి.
- కండ్లు ఎర్రగా మారడం, మంటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. నీళ్ళు ఎక్కువగా ముఖ్యంగా ఎండాకాలం లో నీళ్లు ఎక్కువగా తాగితే కళ్ళు పొడిబారకుండా కాపాడుకోవచ్చు.
- తక్కువ కాంతిలో చదివితే కంటి చూపు మందగిస్తుందని అంటారు. అయితే తక్కువ కాంతిలో చదవడం వల్ల కండ్లు ఒత్తిడికి లోనవుతాయి...బాగా అలసిపోవడంతో తలనొప్పి వస్తుంది. డిమ్‌ లైట్‌ (తక్కువ కాంతి) లో చదవాల్సి వస్తే , కాంతి నేరుగా పేజీ మీద కాంతి పడేలా చూసుకోవాలి. దాంతో కండ్లపై ఒత్తిడి తగ్గుతుంది.
- అనారోగ్యకరమైన వ్యసనాల వల్ల కంటిచూపు మందగించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పొగతాగేవారిలో కండ్లలో మచ్చలు వస్తాయి. ఇవి క్రమంగా పెరిగి కంటిచూపుపై ప్రభావం చూపిస్తాయి. కాన్సర్‌, ఊపిరి తిత్తుల సంబంధిత వ్యాధులే కాకుండా పరోక్ష ధూమపానం కంటిఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కండ్లలో ఉన్న అతి చిన్న రక్తనాళాలు దెబ్బతినడంతో పాటు రెటీనా మీద ప్రభావం చూపుతుంది.
- మేకప్‌ చేసుకునే వారు కండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మస్కారా వేసుకునేవారు కండ్లలోని కార్నియా కి గీతలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పౌడర్లు, ఫేస్‌ క్రీములు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సౌందర్య సాధనాల్లోని రసాయనాలు కండ్లలోకి పోయి... కంటిచూపుపై ప్రభావం చూపిస్తాయి. దీనితో అనేక రకాల కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
- గ్లాసెస్‌ వాడేవారు రోజూ వాటిని శుభ్రపరచుకున్న తర్వాతే ధరించాలి. గోరువెచ్చని నీళ్ళతో సున్నితంగా మైక్రోఫైబర్‌ క్లాత్‌ వినియోగించి శుభ్రపరచాలి. అప్పుడే మీ గ్లాసెస్‌ ఎక్కువ కాలం మన్నుతాయి. కంటిచూపు బాగుంటుంది.
- కాంటాక్ట్‌ లెన్స్‌ ఉపయోగించేవారు నిద్రకు ఉపక్రమించే ముందు కాంటాక్ట్‌ లెన్సులను తీసి..కండ్లను శుభ్రపరచుకోవాలి. కాంటాక్ట్‌ లెన్సులతో నిద్రిస్తే.. వీటిపై బాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. ఇది మరిన్ని సమస్యలకు కారణం అవుతుంది.
ఆకుకూరలతో..
- కంటి చూపు కాపాడుకోవాలంటే క్యారెట్‌ ఎక్కువగా తినాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తారు. క్యారెట్‌తో పాటు ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు కంటిచూపును కాపాడటంలో అద్భుతంగా పనిచేస్తాయి. కంటిలోన మచ్చలు తగ్గుముఖం పట్టడం లో, లేదా మచ్చలు రాకుండా నివారిస్తాయి.


---------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -

Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -


Web Sites & Blogs :

Intellectual Brainy || Ram Karri || Tech Guru Ram || Ammaku Prematho || Nannaku Prematho || Ethics of Old Genarations || Telugu Quotes Park || Health Tips || Telugu Vignana Sarvaswam || Telugu Whatsapp Group's || Go for Green World || Naaku Amma Cheppindhi ||Karri Ram || Left Handers Club India || Lefties Rule The World || BroadMind Creation's || Mana Telugu Patalu Lyrics || Pusthakalayam || Voice Of Ram || RamKarri.In || RamKarri.Com ||

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---

Facebook Id https://www.facebook.com/UrsRamKarri
Google Map : Ram Karri
LinkedIn      : https://www.linkedin.com/in/karriram

----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------