కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం...
ఇది ‘యుగచక్రం’.
వర్షకాలం, చలికాలం, ఎండకాలం... ఇది ‘రుతుచక్రం’.
రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు... ఇది ‘కాల చక్రం’.
బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం... ఇది ‘జీవిత చక్రం’.
సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ పరమేశ్వరుడి నిర్దేశానుసారం ‘చక్ర భ్రమణం’ నిరంతరంగా సాగిపోతూనే ఉంటుంది.
రంగులరాట్నంలో కింది నుంచి పైకి, పైనించి కిందికి తిరుగుతున్నట్టే మనిషి జీవితంలో సుఖానుభవాలు, దుఃఖానుభవాలు...
ఒకదాని వెంట మరొకటిగా కలుగుతూనే ఉంటాయి.
ఈ సత్యం తెలిసికూడా మనసును మాయపొర కమ్మేయడంతో రాగబంధాలకు లోనైన మనిషి
నిరంతరం బాధపడుతుంటాడు.
జీవిత ప్రయాణం అంటే-
గమ్యం వైపు గమనం.
ఏది గమ్యం అనేదే జటిలమైన ప్రశ్న!
గమ్యాన్ని నిర్దేశించేది కోరిక.
ఆ కోరికను ప్రేరేపించేవి మూడు- ధనం, సుఖం, కీర్తి.
ఎంత ధనం కావాలి, ఎంత సుఖాన్ని అనుభవించాలి, ఎంత కీర్తిని మూట కట్టుకోవాలి?
ఈ ‘ఎంత’ అనేదానికి ‘అంతు’ ఉందా?
చాలామంది విషయంలో లేదు, ఉండదు!
మనిషి జీవితంలో- బాల్యం అమాయకంగాను,
కౌమారం జిజ్ఞాసతోను,
యౌవనం ఆశలతోనూ గడిచిపోతాయి.
వార్ధక్యం వచ్చేసరికే అసలు సమస్య మొదలవుతుంది.
జీవిత చరమాంకంలోనూ కోరిక చావదు.
ఇంకా ధనం కావాలి, సుఖాలు కావాలి,
కీర్తి ప్రతిష్ఠలు కావాలి.
ఇంకా, ఇంకా, ఇంకా...
ఈ పరుగును ఎక్కడ ఆపాలో తెలియకపోవడమే
దుఃఖానికి హేతువు అవుతుంది.
అలాగని కోరికే లేకుండా జీవించడం సాధ్యమే కాదు.
ఆ కోరిక ఎంతవరకు అనే విచక్షణే సుఖదుఃఖాలను నిర్ణయిస్తుంది.
#ఓం #శివోహం
గమనిక : క్రింద వాట్సాప్ అని ఉన్న లింక్ ని నొక్కి నేరుగా మీ సలహాలు, సూచనలను నాతో వాట్సాప్ ద్వారా పంచుకొని.. మరింత విలువయిన విషయాలను అందివ్వడానికి సహకరించండి...
Blog : Ram Karri
Whatsapp : http://wa.me/+918096339900
-- స్వస్తి
---------------------------------------------------------
૨αɱ ҡα૨૨เ
ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.
--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -
Whatsapp : +918096339900 ,
Phone : +919492089900 .
--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -
Web Sites & Blogs :
Ram Karri || Intellectual Brainy || Ram Karri || Tech Guru Ram || Ammaku Prematho || Nannaku Prematho || Ethics of Old Genarations || Telugu Quotes Park || Health Tips || Telugu Vignana Sarvaswam || Telugu Whatsapp Group's || Go for Green World || Naaku Amma Cheppindhi ||Karri Ram || Left Handers Club India || Lefties Rule The World || BroadMind Creation's || Mana Telugu Patalu Lyrics || Pusthakalayam || Voice Of Ram || RamKarri.In || RamKarri.Com ||
-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -
Facebook Id : https://www.facebook.com/UrsRamKarri
Google Map : Ram Karri
LinkedIn : https://www.linkedin.com/in/karriram
----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------