సింహం పరుగెడుతుంది .. ఇంకా ఇంకా వేగంగా పరుగెడుతూ ఉంది. సింహానికి ముందు ఓ లేడీ పరుగెడుతూంది తన పరుగే తనని బ్రతికిస్తుందని తెలిసే వేగంగా పరుగెడుతూ ఉంది లేడీ.
కాని,,, లేడీ పరుగు సింహం పంజా కి ఆగక తప్ప లేదు. సింహానికి లేడీ బలికాక తప్పలేదు. అందుకే సింహం అడవికి రాజు అంటారు
ఇలాంటి సంఘటనలు రోజు జరిగెవే..
ఆ అడవిలో రోజు ఏదో ఒక ప్రాణి సింహానికి బలి కావాల్సిందే..
ఈ విషయం ప్రతి ప్రాణికి తెలుసు..
అలా అని అవి అడవి వదిలి పెట్టి వచ్చాయా..???
సింహం బాగా పరుగెడుతుంది అని తెలుసు
సింహం పంజా కి అమితమైన శక్తి ఉందని తెలుసు
సింహం ఏ ప్రాణి నైనా సరే ఓడించగలదు అని తెలుసు..
అయినా...
ఏ ప్రాణి అడవి వదిలి రాలేదు..
కారణం..
సింహం మీద ఉన్న భయం కంటే
ఎలాగైనా తప్పించుకోగలను అనే నమ్మకంమే ఎక్కువ..
మూగ ప్రాణాలు చావు ఎదురించి బ్రతుకుతున్నాయి..
కాదు కాదు
సింహం ఎదురైతే చంపిందేమో అనే భయం ద్వారా వచ్చే ఆలోచన ను ఎదురించి బ్రతుకుతున్నాయి..
నువ్వు మూగ ప్రాణివి కాదు
నువ్వు శక్తి లేనివాడివి కాదు
నువ్వు ధైర్యం లేనివాడివి కాదు
అయినా భయపడుతున్నావ్...?
నీ జీవితానికి లక్ష్యానికి ఎవడో అడ్డు వచ్చాడని
ఈ జీవితానికి ఎదో తక్కువైదని...
నీకు రావాల్సింది రాలేదని..
నీకు వచ్చేది ఎవడో ఎత్తుకుపోయాడని..
దేవుడు నాకు అది కొదువ చేశాడని..
అమ్మానాన్న ఏది సంపాదించలేదని..
ఎందుకు నీలో నుంచి నువ్వే పారిపోతూన్నావ్..
నా జీవితం ఇంతేనని నీకు నువ్వే ఎదుగుదలకు ఆనకట్ట వేసుకుంటున్నావ్..
నేస్తం దీన్ని ఏమంటారో తెలుసా?
పారిపోవడం అంటారు..
మనిషి గా పుట్టి కూడా పారిపోతున్నావ్..
ఒక విషయం..
అడవి లో జంతువులు సింహానికి భయపడి అడవి వదిలి వచ్చి ఉంటే
ఈ మనుషుల చేతిలో ఎప్పుడో అంతరించి పోయేవి.
నువ్వు నువ్వన్న దానిలో ఏ సమస్యకో, ఏ వ్యక్తికో భయపడి పారిపోతూన్నావా..
అయితే గుర్తుంచుకో ..
ప్రకృతి నిన్ను నిలబెట్టిన దారిలో నుంచి నువ్వు పారిపోయిన మరుక్షణం నీ అంతం తథ్యం.
గుర్తుంచుకో... నేస్తం.
మరో మాట..
సింహం అడవికి రాజు అనే టైటిల్ ఎవరో జాలిపడి ఇవ్వలేదు
దాని పరుగు
దాని చూపు
దాని లక్ష్యం
దాని శక్తి
దాని కష్టంమే దానికి ఆ టైటిల్ తెచ్చి పెట్టాయి..
నీకు అంతే..
సింహం అడవికి రాజు కదా అని మిగితా ప్రాణులు వాటంతట అవే వచ్చి బలి అవుతున్నాయా..
లేదు
రాజు అయిన సరే
తిరుగులేని జీవి అయిన సరే
గెలుపు కోసం
కడుపు కోసం పరుగెట్టాల్సిందే..
వింటున్నారా.. మనమూ అంతే..ఆలోచిద్దాం.....మారదాం...ఏమంటారు....