మనిషీ!
ఒక్క సారి ఆలోచించు!
ఉన్న వాడు ఉన్న వాడినే గౌరవిస్తాడు..
ధనవంతుడు ధనవంతునితోనే జత కడతాడు.
ఉపాధ్యాయుడు మెరిట్ విద్యార్ధిపైనే దృష్టి పెడతాడు.
కడుపు నిండి, సుష్టుగా భుజించిన వానికే పంచభక్ష్య భోజనం అందించడానికి ఆరాట పడతాడు..
ఓ మనిషీ
ఇది నీ నైజమా!
నీ సహజ లక్షణమా!!!!
ఓ మనిషీ ఒక్కసారి ఆలోచించు...
అందుకే నీగుణాన్ని మార్చుకుని చూడు
ఉన్నా , లేకున్నా మనిషి ని మనిషలా
ఆదరించు...
గౌరవించు,
ప్రేమ ను పంచు
నీ జత లో ధనిక,పేదల అభేదం పాటించు...
సగటు విద్యార్ధిపై నీ దృష్టి పెట్టి చూడు.
ఎంకరేజ్ చేసి చూడు..
దేశ చరిత్రలో దేశ రత్నం గా నిల్చిపోతాడేమో!
చరిత్ర ను తిరిగి వ్రాస్తాడేమో !
ఏమో ఎవరికి తెలుసు.
గుర్రం ఎగురవచ్చు!
ముసలివారిని చీదరించకండా చూడు..
వారి పై ఆప్యాయపు చిరుజల్లు కురిపించు...
వారి మోములో ఆనందం చూడు..
దివ్యాంగులను చులకనగా చూడకు..
వారి కి ఆసటగా బాసటగా వుండు..
ఊరట గా వుండు.
వారి మనసు లోకి తొంగి చూసి,
వారి సంతోషాన్ని చూడు...
బువ్వ లేని వానికి గుప్పెడు మెతుకులు అందించు..
వాని ఆవేదన తెలుసుకో...
అర్ధం చేసుకో!
మనిషి గా వాక్కును, మేధస్సు ను వాడి అక్కున చేర్ఛుకో!
మనిషి గామసలుకో మనిషీ!
єτнιϲѕ σƒ οℓ∂ gєиєяατιοи'ѕ ɓყ ૨αɱҡα૨૨เ
8096339900
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁