ఆది పరాశక్తి - శ్రీచక్రం - మానవ దేహం


🕉ఓంశ్రీమాత్రేనమః 🕉


ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మనమహర్షులు.

 వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి.

అయినావేటికి అవి ప్రత్యేక పనికొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి.

 అంటే ఒకగొలుసు లోని వేరు వేరు లింకులన్నమాట.

 మానవశరీరంలో ఒక్కొక్కఅవయవానికి ఒక్కొక్కస్థానము, పని ఉంటుంది.

అలాగే ఈ విశ్వంలోఒక్కొక్క దేవతకుఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించిఉన్నాయి.

 ఈ దేవతలకు యంత్రం రూపమయితే,

 మంత్రం నాదమవుతుంది.

వేదవాక్కులచే అట్టిదేవతలు ప్రత్యక్షమవుతారని,అనుగ్రహిస్తారని,
తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు.

 వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించు కున్నాయి.

యంత్రమంటే ఏమిటి ?

యంత్రమనగా ఆరాధించేదేవత యొక్క (శక్తి) స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆయంత్ర రూపంలోనిక్షిప్తమవుతుంది.

 మనపెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగాభావించారు.

అవి

1)ఇచ్ఛాశక్తి,
2) జ్ఞానశక్తి.
3) క్రియాశక్తి.

ఏ పనిచేయాలన్నా
ఆపని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి.
 అదే ఇచ్ఛాశక్తి.

తరువాత ఆ పని ఎట్లాచేయాలని ఆలోచనచేయడమే జ్ఞానశక్తి.

 ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండుకలిగిన తరువాతకార్యాచరణ జరుపటమే క్రియాశక్తి.


 సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడుశక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈమూడు శక్తుల కలయికే.


ఈ మూడు శక్తులనుసూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోనిమూడు బిందువులలోఉండే దేవతలు వీరే.


నేటి శాస్త్రజ్ఞులు కూడా, ఏపదార్థమైనా శక్తిరూపాంతరమేననిచెబుతున్నారు. నేడుమనం చూస్తున్న విజ్ఞానశాస్త్రం ద్వారా కనిపెట్టబడినవస్తుజాలమంతా ఈక్రియాశక్తి యొక్క రూపాంతరమే.


 విజ్ఞానవేత్తలైన మనమహర్షులు ఈ మూడుశక్తులు కలిసిన శక్తినే‘ప్రకృతి’ అని, ‘పరాశక్తి’ అని, ‘అవ్యక్తం’, ‘శుద్ధమాయ’ అనిఅంటారు.

 అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మ నిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయికఅయిన పరాశక్తే అని తెలుస్తున్నది.

 కాబట్టి ఆపరాశక్తే ఈ జగత్తుకు మాత(తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకువారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీఆ జగన్మాత లేదా పరాశక్తి, వారికి అందిస్తోంది.

  శ్రీ చక్ర ఆవిర్భావం
🌟🌟🌟🌟🌟🌟


ఉండేది బ్రహ్మమొక్కటే. ఈబ్రహ్మం సత్‌, చిత్‌, ఆనందస్వరూపములు కలది.

 అదిచలనము లేనిది, నిశ్చలమైన దైనప్పటికి,చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం.


కేవలం కాంతి (ప్రకాశ) రూపముగా నున్న బ్రహ్మము నందు ఏర్పడిన మొదటి కదలికను ‘విమర్శ’ (ఆలోచన) అన్నారు. తాంత్రికులు కాంతినిపరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగానుభావించారు. కాంతి(ప్రకాశ) స్వరూపమైనబ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలిక వల్ల నాదము ఏర్పడినది.ఈ ప్రథమ నాదముసూక్ష్మరూపమైనబిందువుగా ఏర్పడినది.

 ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తులవిజృంభణము కలదు. దీనినే
”పరాబిందువు”
అందురు.
ఇందులో కామేశ్వర, కామేశ్వరీస్వరూపములు కలవు.*

 ఈబిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయచక్రమని పేరు. ఈ బిందువేే శ్రీచక్రము నకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంతక్రిందికి దిగివచ్చి శబ్దబ్రహ్మముగా మారుతుంది.అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు(బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈపరాబిందువు నందుశివశక్తులొకటిగాఉంటాయి.

శ్రీ చక్రం – పరాశక్తి వేర్వేరు కాదు

అలా ఒకటిగా నున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి.

1) శివశక్తులొకటిగా నున్న‘బిందువు’,

2) అచేతనంగాఉన్న ‘శివుడు’,

3) ‘చేతనా స్వరూపమైన శక్తి’.

ఈమూడు బిందువులే త్రిగుణాత్మకము.* *త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వర తత్వాన్ని సూచిస్తోంది.

మనం పరాశక్తి శుద్ధస్వరూపాన్ని దర్శించలేం,కనీసం ఊహించలేం. కనుక పరాశక్తిమాత తన మొదటిరూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనాసౌలభ్యాన్ని కల్పించింది.


 శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థములకు సమన్వయం కలుగుచున్నది.

 పరాశక్తికి శ్రీచక్రానికి ఏ మాత్రం భేదం లేదు.
 శ్రీ దేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరుకాదని, ఈ మూడూ ఒకేపరబ్రహ్మ స్వరూపమని శ్రీలలితా సహస్ర నామస్తోత్రము తెలియచేస్తోంది.


శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది.
 ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు,
చంద్రుడు,
కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర,
అగ్ని,
మన్మథుడు, సూర్యుడు,
ఇంద్రుడు,
శివుడు,
స్కంధుడు, దూర్వాసుడు

అను పన్నెండు మంది,
పన్నెండు శాస్త్రవిధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవతంత్రము తెలుపుచున్నది.

   శ్రీ చక్ర నిర్మాణం
🌟🌟🌟🌟🌟🌟

🔴బిందువు,
🔻త్రికోణము,
🛑అష్టకోణచక్రము, అంతర్దశారము – బహిర్దశారమను దశత్రికోణచక్రము, చతుర్దశారము,
అష్ట దళ పద్మము, షోడశదళ పద్మము, భూపురము అను తొమ్మిది ఆవరణములతో కూడినది శ్రీచక్రం.


శ్రీచక్రంలో ఉన్న మొత్తము త్రిభుజాల సంఖ్య 43. మొత్తము పద్మములసంఖ్య 24. మొత్తమువృత్తముల సంఖ్య 7 (బిందువుతో కలిపి).

 ఈశ్రీచక్రము లోని తొమ్మిదిచక్రములను (శివచక్ర, శక్తిచక్రములను) నవయోనులని వ్యవహరిస్తారు.

 త్రికోణ, అష్ట కోణ, దశకోణద్వయము, చతుర్దశకోణములు ఐదూ శక్తికోణములు. బిందువు, అష్టదళము, షోడశ దళము, చతురస్రము అను నాలుగూ శివచక్రాలు. ఈచక్రంలోని బహిర్దశార, అంతర్ద శారములనుకలిపితే శ్రీచక్రము అష్టాచక్రా అవుతుంది.

నవ ద్వారా అంటే తొమ్మిది త్రికోణములు. వాటిలోనాలుగు శివాత్మకం, ఐదుశక్త్యాత్మకం.

శ్రీచక్రంలోని నవావరణములు ఆరోహణ క్రమంలో ఇలాఉన్నాయి.


1. భూపుర త్రయం – త్రైలోక్య మోహన చక్రం,

2. షోడశ దళ పద్మం – సర్వాశా పరిపూర చక్రం,

3. అష్ట దళ పద్మం – సర్వసంక్షోభిణీ చక్రం,

4. చతుర్దశారము – సర్వసౌభాగ్య చక్రం,

5. బహిర్దశారము – సర్వార్థ సాధక చక్రం,

6. అంతర్దశారము – సర్వరక్షాకర చక్రం,

7. అష్ట కోణము – సర్వరోగహర చక్రం,

8. త్రి కోణము – సర్వసిద్ధిప్రదా చక్రం,

9. బిందువు – సర్వానందమయ చక్రం...

ఒక్కొక్క ఆవరణలోనిదేవతలను సాక్షాత్కరించుకొనుటకు కొన్ని ప్రత్యేక బీజమంత్రములు కలవు.


 శ్రీదేవీ ఖడ్గమాల స్తోత్రమునందు, శ్రీదేవీ బీజాక్షర సంబోధనమ్‌, న్యాసాంగ దేవతలు, దివ్యౌఘగురువులు, సిద్ధౌఘగురువులు, మానవౌఘ గురువులు, తొమ్మిది ఆవరణములలోని వివిధదేవతలు నమస్కారనవాక్షరి దేవతల పేర్లు, విడివిడిగా, విపులముగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు మొదటిఆవరణలో త్రైలోక్యమోహన చక్రం, అచ్చటి దేవతలుఅణిమాది సిద్ధులు. ఇవి మనలోని వివిధరకములైన మానసికప్రవృత్తులు.


శ్రీ చక్రం – మానవ శరీరం
🌟🌟🌟🌟🌟🌟

గమనించవలసిన విషయమేమంటే, ఈజగత్తులోని సకలతత్వాలు, సకలభువనాలు, పరమశివుడు,
పరాశక్తి మానవుని యందు కూడా కలవు.

 మానవ శరీరమును రెండుభాగములుగా చూస్తే – నాభి నుండి పైభాగముఊర్థ్వలోకమని, క్రిందిభాగం అధోలోకమని, ఈరెండింటిని కలిపే వెన్నెముకను మేరుదండమని అంటారు.

శ్రీ చక్రమును కూడామేరువు అంటాము. మేరుపర్వతము కూడాభూమికి ఇరుసు వంటిది. ఏ రకంగా పరాశక్తి దివ్యస్వరూప కాంతులచేత జగత్తంతా ప్రకాశ వంతమవుతుందో, మన మేరుదండము లోని కుండలినీ శక్తిచేత శరీరమంతా చైతన్యమవుతుంది.

మనలో ఆత్మ ఉన్నదని అంగీకరించినట్లే మన శరీరనిర్మాణ ప్రాధాన్యం కూడాగుర్తించాలి. నవావరణాత్మక మైన శ్రీచక్రానికి,
మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది.

శ్రీచక్రాన్నిఆరాధిస్తే అన్నిదేవతామూర్తులనుఆరాధించినట్లేననితంత్రశాస్త్రం తెలుపుతోంది.


శ్రీ అంటే శుభకరమైనది. దీనిని నవచక్రమని, వియత్‌ చక్రమని, నవయోని చక్రమని అంటారు. చక్రము ఎప్పుడూ పరిభ్రమిస్తుంది. దీనికి ఆద్యంతము లుండవు. కేంద్ర బిందువు నుండి పరిధి వరకు ఎక్కడ కొలిచిననూ సమానంగా ఉంటుంది.

 చక్రారాధనము ప్రతిమారాధన కన్న శక్తివంతం.మంత్రం వలె యంత్రం కూడా మహిమగలదే.

దేహో దేవాలయః ప్రోక్తోజీవో దేవస్సనాతనః
త్యేజేదజ్ఞాన నిర్మాల్యంసోహంభావేన పూజయేత్‌ !


శరీరమే దేవాలయము. జీవుడే అక్కడి దేవుడు, అజ్ఞానమనే మాలిన్యాన్నిత్యజించాలి. ఆ దేవుడేనేననే భావమే పూజ. ఆభావనతోనే అర్పించాలి.

కాబట్టి సాధకుని ధ్యానము, పూజ, భావన బాహ్యము నుండి లోనికి చొచ్చుకొని పోయి ఆత్మను చేరుకోవాలి.

 విశ్వంలోని శక్తులన్ని ఈనవావరణముల ద్వారాద్యోతకమై మానవుని పంచకోశములందు అంటే

అన్నమయ, ప్రాణమయ,
మనోమయ,
 విజ్ఞానమయ, ఆనందమయ
కోశములందు ఇమిడి ఉన్నవి.


నిరంతర సాధన మార్గం
@@@@@@@@

శ్రీచక్రాన్ని మన శరీరంతో పోల్చి పరిశీలిస్తే ఆజగన్మాత శ్రీ లలితాదేవి దర్శనం ఎంత దుర్లభమో అనిపిస్తుంది.

 మనలోని కర్మ, జ్ఞానేంద్రియాలవెంట
పడి పరిగెత్తే మనస్సు, బుద్ధి, అహంకార, మమకారాలు, కామోద్రేకాలు, శృంగారాదినవరసాలు, జాగ్రద, స్వప్న, సుషుప్తాది అవస్థలు వీటినినడిపేసత్వరజస్తమోగుణాలు – వీటిన్నిటిని ఆ శ్రీదేవి విభూతులుగా గ్రహించి,వీటన్నింటినీ దాటి బిందుస్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన, సచ్చిదానంద రూపమైన, సస్వరూపాను భవము కలుగుతుంది. అదే శ్రీమాతదర్శనం. ఇది ఎన్నిజన్మలకు సాధ్యమో!


త్రైలోక్య మోహన చక్రంనుండి సర్వానందమయచక్రం వరకు మనంఎక్కవలసిన మెట్లు, తొలగించుకో వలసినతెరలు, అనుభవించవలసినసుఖదుఃఖాలు అన్నిశ్రీచక్రంలో వలె మనలోనూఉంటాయి. ఈప్రయాణంలో అడ్డంకులుపూర్తిగా తొలగవు.

 మనమే జాగ్రత్తగా, నెమ్మదిగా వాటిని దాటుకుపోవాలి. వాటిని లేకుండా చేయలేం. అందువల్లనే త్యాగరాజస్వామి కూడాతెరను తొలగించమని ప్రార్థించారు తప్ప, తెరలేకుండా చేయమనలేదు.

మనలోని ప్రాపంచిక మైన ముప్పదిఆరు తత్వములు, త్రిపుటలు, నవావరణములను నిర్లిప్తతతో,
నిష్కామంగా, నిస్వార్థంగా అనుభవిస్తూ గమ్యాన్నిచేరుకోవడానికి నిరంతర సాధన చేయాలే తప్ప వేరొక మార్గం లేదు.

​🕉🌞🌎🌙🌟🚩

    షట్చక్రాలు
🌟🌟🌟🌟🌟



మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు. శ్రీ విద్యలోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు .

మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం
తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః!!


వీటిని ఊర్థ్వలోక సప్తకమంటారు.

7. సహస్రారం – సత్యలోకం – ప్రమాతస్థానం
6. ఆజ్ఞాచక్ర – తపోలోకం – జీవాత్మస్థానం
5. విశుద్ధ చక్రం- జనలోకం – ఆకాశభూతస్థానం
4. అనాహతం – మహర్లోకం – వాయుభూతస్థానం
3. మణిపూరకం – సువర్లోకం – అగ్నిభూతస్థానం
2. స్వాధిష్ఠానం – భువర్లోకం – జలభూతస్థానం

1.  ఆధారము – భూలోకం – పృథ్వీభూతస్థానం

1. మూలాధారచక్రం  :  మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి; వాహనం – ఏనుగు.


మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఇది షట్చక్రాలలో మొదటిది. ఇది నాలుగు దళాల పద్మము. ఈ మూలాధార చక్రములో ‘సాకిన్యాంబ’ నివసిస్తుంది. ఈమెకు ఐదు ముఖములు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. వజ్రేస్వరి. ఈ దేవతకి నాలుగు చేతులు. అంకుశము, కమలం, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.


సాకిన్యాంబ వరదాది దేవతలు : 1. వరద 2. శ్రియ 3. షండా 4. సరస్వతి ( వ, శ, ష, స అను మూలాక్షరాల) దేవతలచే కోలువబడుతూ ఉంటుంది. ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టము.


2. స్వాధిష్ఠాన చక్రం : ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. జలం – సింధూరవర్ణంలో ఉంటుంది. ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది. దీనికి అక్షరాలు బం – భం – యం – యం – రం – లం. వాహనం మకరం.


3. మణిపూరక చక్రం :  బొడ్డునకు మూలంలో వెన్నెముక యందుటుంది. దానికి అధిపతి విష్ణువు. పదిరేకుల పద్మాకారంలో ఉంటుంది. బంగారపు వర్ణంతో ఉంటుంది. అక్షరాలు డం – ఢం – ణం – తం – థం – దం – ధం – నం – పం. వాహనం కప్ప.


4. అనాహత చక్రం : ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికధిదేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది.  పన్నేందురేకుల తామరపూవులవలె ఉంటుంది. అక్షరాలు కం – ఖం – గం – ఘం – జ్ఞం – చం – ఛం – జం – ఝం- ణం – టం – ఠం. తత్త్వం వాయువు. వాహనం లేడి.


5. విశుద్ధచక్రం : ఇది కంఠము యొక్క ముడియందుంటుంది. దీనికధిపతి జీవుడు. నలుపురంగు. అక్షరాలు అం – ఆం – ఇం – ఈం – ఉం – ఊం – ఋం – ౠం – ఏం – ఆఇం – ఓం – ఔం – అం – అః. తత్త్వమాకాశం – వాహనం ఏనుగు.


6. ఆజ్ఞాచక్రం : ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీని కధిపతి ఈశ్వరుడు. తెలుపురంగు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది. అక్షరాలు హం – క్షం.


7. సహస్రారం : ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రమంటాం. దీని కధిపతి పరమేశ్వరుడు. వేయిరేకుల పద్మాకృతితో ఉంటుంది. సుషుమ్నానాడిపై కొనమీద ఈ చక్రం ఉంటుంది. అక్షరాలు – విసర్గలు. దీనికి ఫలం ముక్తి.

🕉🌞🌎🌙🌟🚩