ఈ రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, గీతా జయంతి. ( 14.12.2021 )


5155 సంవత్సరాల క్రితం శ్రీ కృష్ణ పరమాత్మ ఈ ఏకాదశి రోజున గీతను అందించారు.

భగవద్గీత - ప్రపంచమంతా గౌరవించే గ్రం.

గీత అంటే మాట,వాక్కు .

భగవంతుని వాక్కులే భగవద్గీత.

ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత.

అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగాను, 
అర్జునుడిని దూడగాను మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా,
 ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, 
ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, 
మరొపక్క లోకానికి పాలను (ఉపనిషత్ సారమైన గీతను) అందిచాడట.

అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం.

కృష్ణుడంటాడు 'ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్ధ దర్పణం .......' అని,

అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్ధములకు అద్దం వంటిది.

 దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణపదం పొందుతారు.

గీత చదివితే అర్దమవుతుంది

పరమాత్మకు మనపై ఎంత ప్రేమ ఉందో. దురలవాట్లకు లోనైనా, నీచుడైనా, పతనమార్గంలో పయనిస్తున్నా, నన్ను నమ్మినవాడిని అసహ్యించుకోకండి.

 నన్ను నమ్మాడు కనుక ఉద్ధరించే బాధ్యత నాదే.

నన్ను నమ్మినవారు ఎప్పటికి నాశనమవ్వరు.

నేనే వారిని ఉద్ధరిస్తాను అంటూ అందరి పట్ల పరమత్మ తన ప్రేమను వ్యక్తం చేస్తారు.


భగవద్గీత సారం అర్దమైతే మనం ఎవరిని ద్వేషించము.

 అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని, ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అంటాడు భగవానుడు.

 నిజమే ఈలోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలుపెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు.

ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి.

మనం వ్యక్తిని ద్వేషించడం కాదు, చెడు లక్షణాలను, చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరచుకోకుండా ఉంటాము.

గీత ఎవరు చదవాలి అన్న ప్రశ్న వస్తుంది. 

దానికి సమాధానం ఒక్కటే.

మనం లోకంలో చూస్తే ఎవరైన చనిపోతే భగవద్గీత పెడతారు.'ఆత్మశాంతి' కోసం పెట్టామంటారు.

చేయాల్సినవన్ని చేసేశాక, జరగవలసినవన్ని జరిగిపోయాక, ఎంతో పుణ్యం చేస్తే కాని దొరకని మానవ జన్మ, మానవ శారీరం పోయాక అప్పుడు వింటే ఏం లాభం? అయినా అప్పుడు వినడానికేమంటుంది? శవం వినలేదుగా. బ్రతికున్నప్పుడే చదవాలి భగవద్గీత. 

తత్వం బోధపడాలి.
అప్పుడే జన్మ చరితార్ధం అవుతుంది.

మీకో విషయం తెలుసా?

మన జీవితం మనమే రాసుకుంటాము. 12 నుండి 40 సంవత్సరముల మధ్య మనం ఏ ఏ కర్మలు (పనులు) చేస్తామో,అవి ఆ తరువాతి జీవితాన్ని నడిపిస్తాయి.

ఈ 28 సంవత్సరముల కాలంలో మనిషికి ఎటువంటి కర్మలైన (అవి మంచివో, చెడ్డవో) చేసే అధికారముంది.

 ఆ తరువాత ఈ కర్మలను బట్టే మన జీవితం నడుస్తుంది.

ఈ విషయాన్ని జ్యోతిష్యం ఒప్పుకుంది.

చిన్నవయసులోనే భగవద్గీత చదివితే మనం జీవితం సుఖమయమవుతుంది, శాంతి లభిస్తుంది.

మనం ఏమి చేయాలో, ఏలా చేయాలో అర్ధమవుతుంది. భగవద్గీతను యువత ఖచ్చితంగా చదవాలి.

ఇక అందరు అంటారు భగవద్గీత ఒక "మతగ్రంధం" అని.

మనం ఇతర మతగ్రంధాలను చదివితే, అందులో ఇతర మతస్థులను ద్వేషించమని, చంపమని, వారు జంతువులకంటే హీనమని చాలా చాలా కనిపిస్తాయి.

 కాని గీతలో ఇటువంటి వాక్యాలు ఒక్కటి కూడా కనిపించవు.

అందరిని ప్రేమించమని, అందరు ఒక్కటేనని, అంతా పరమాత్మ మయమేనని గీత అంటుంది.

గీతను మతగ్రంధంగా చూస్తే
 ప్రపంచంలో అన్ని మతాలవారిని ప్రేమించమని చెప్పిన "ఏకైక" మతగ్రంధం భగవద్గీత. కాని భగవద్గీత మతగ్రంధం కాదు.

అది సద్చిదానందుడు, నిరాకరుడు, నిర్గుణుడు, నిత్యుడు, పరంధాముడైన పరమాత్మ వచనం.

భగవద్గీత మహాభారత ఇతిహాసంలో ఉన్నా,
 గీతను ఉపనిషత్తుగా చెప్పారు మహర్షులు.

ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంది.
 ఇతిహాసం మాములుగా చదివిన అర్దమవుతుంది.
 కానీ ఉపనిషత్తు అర్దమవ్వాలంటే గురువు కావాలి.
గురువుగారికి దగ్గరగా ఆసనం వేసుకుని కుర్చుంటే, తాను అనుభవంలోకి తెచ్చుకున్న తత్వాన్ని గురువు పరమప్రేమతో శిష్యుడికి అర్దమయ్యేలా చెప్తారు.

అలా చెప్పిన ఆ తత్వం శిష్యుడిని ఉద్ధరిస్తుంది,
భగవంతునికి దగ్గర చేస్తుంది.

అలా గురువుకు దగ్గరగా కూర్చుని అర్దం చేసుకోవలసినదే ఉపనిషత్తు.

గీత కూడా ఉపనిషత్తే.

అందుకే గీత చదువాలనుకున్నవారు తగిన గురువును కానీ, గురువులు రాసిన గీతా బాష్యాన్ని కానీ చదవడం వలన సులువుగా అర్దమవుతుంది.

గీతను చదువాలనుకునే వారి కోసం ఎందరో గురువులు గీతకు బాష్యం రాసారు.

తెలుగు నాట కాళహస్తి స్వామిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశనందగిరి స్వామివారి గీతామకరందం సుప్రసిద్ధం.

అది అనేకానేక ఇతర భాషల్లోకి అనువదించబడింది.

అలాగే స్వామి శివానందగారు కూడా గీతకు బాష్యాన్ని రాసిన ప్రముఖులలో ఒకరు,

 అలాగే గోరఖ్‌పూర్ గీతాప్రెస్ వారి గ్రంధం కూడా బాగుంటుంది.

 ఇంకా అనేకమంది గీతకు భాష్యం రాసారు.

 గీతను చదువాలనుకునేవారు అటువంటి గ్రంధాలను తీసుకుంటే ఎంతో సహాయకరంగా ఉంటుంది.

అలాగే ఇస్కాన్, త్రైత సిద్ధాంత భగవద్గీత వంటివి చదువకపోవడమే చాలా మంచిది.


నిజమైన దేవుడు ఆయనను నమ్మినా, నమ్మకున్న ఎవరిని ద్వేషించడు, ద్వేషించమని చెప్పడు.

అందరిని మంచిగా బ్రతకమనే చెప్తాడు.

గీతలో పరమాత్మ కూడా అందరు సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు.

 అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి

ఒక కాంతికిరణం.

ఒక ఆశాపుంజం.

అంతేనా?

భగవద్గీత ఈరోజు ఒక management science.

ప్రపంచంలో ఉన్న universities లో ఇతరులని ఎలా manage చేయాలో నేర్పుతారు.

కాని గీత మనల్ని మనం ఏలా manage చేసుకోవాలి నేర్పుతుంది.

ఎందుకంటే మనల్ని మనం నియత్రించుకోకపోతే, ఇక లోకాన్ని ఎలా నియంత్రిస్తాము?

అందుకే ఈరోజు గీతను పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలలో ఒక management science గా బోధిస్తున్నారు.

భగవద్గీత సన్యాసుల కోసమంటారు కొందరు.

భగవద్గీత చదివినవారు సన్యాసులైతే ఈరోజు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేది కాదు.

ఎందుకంటే భగవద్గీత గాంధీ, భగత్ సింగ్ వంటి ఎందరో మహానుభావులను ఈ దేశానికి అందించింది.

ఈ ప్రపంచానికి E=mc²  సూత్రాన్ని చెప్పిన Albert Einstein,
తాను ఆ సూత్రం చెప్పడానికి ప్రేరణ ఇచ్చింది భగవద్గీత

అని చెప్పిన మాటలు మనం మరచిపోకూడదు.

Alexander గురువైన Aristotle కూడా Alexander భారతదేశం నుండి
 తిరిగివస్తున్న సమయంలో భగవద్గీత తీసుకురమ్మని చెప్తాడు.

భగవద్గీతను చదవడం కాదు, అర్ధం చేసుకుంటే మన జీవితం సార్ధకమవుతుంది.

 అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు

భగవద్గీతలో ఒక్క శ్లోకాని అర్ధం చేసుకుని జీవితంలో అనుసరించినా, కొద్దిగా గంగాజలం త్రాగినా, కృష్ణపరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు.

వారికి మోక్షం లభిస్తుందని.

భగవద్గీతను రోజు చదవండి.

ఓం శాంతిః శాంతిః శాంతిః



- స్వస్తి....