మన దేశంలో దసరా పండుగ సందర్భంగా చాలా చోట్ల దుర్గమ్మను పూజిస్తే తెలంగాణలో మాత్రం బతుకమ్మను జరుపుకునే విషయం గురించి చాలా మందికి తెలిసిందే. బతుకమ్మ పండుగ అంటేనే అందరికీ టక్కున గుర్తొచ్చేది పూలు. రంగు రంగుల పూలను తీసుకొచ్చి అందమైన ఆకారంలో పేర్చి ఈ పండుగను జరుపుకుంటారు

ఇంతకీ ఈ పండుగ ఎలా వచ్చింది. ఎందుకు వచ్చింది అనే విషయం చాలా మందికి తెలియదు.



బతుకమ్మ పండుగ వెనుక దాగిఉన్న కథ :


బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. ఈ బతుకమ్మ పండుగ దసరా పండుగకు రెండు రోజుల ముందు మొదలవుతుంది. ఈ పండుగతో పాటు దసరాను కూడా ఎంతో విశిష్టంగా చేసుకుంటుంటారు. ఇక్కడ విశేషం ఏమిటంటే బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైనది. అసలు బతుకమ్మ పండుగ ఎలా వచ్చిందో చరిత్రలో ఎన్నో కథలు ఉన్నాయి.

ఒక రాజ్యంలో ఏడుగురు అన్నదమ్ములకు ఒక్కగానొక్క ముద్దుల చెల్లెలు ఉంది. ఆ ఏడుగురు అన్నదమ్ములు వీరాది వీరులే. అందరకి పెళ్లిళ్లయ్యాయి. ఆ ముద్దుల చెల్లెలు అన్నదమ్ములతో పాటు ఆ ఇంట్లోనే ఉండేది. ఆ ముద్దుల చెల్లెలు ఆ ఏడుగురు అన్నదమ్ములు గారాబంగా చూసుకోవడం వారి భార్యలకు నచ్చదు. ఒకరోజు ఆ ఏడుగురు అన్నదమ్ములు వేటకు వెళ్లారు.

ఇక అదును చూసుకొని ఆమె ఏడుగురు వదినలు సూటిపోటి మాటలతో హింసించడం మొదలుపెట్టారు. వారు పెట్టే బాధలను తట్టుకోలేక పోయింది. ఇక పెద్ద వదిన పాలలో విషం ఇవ్వడంతో ఆ చిట్టి చెల్లు మరణిస్తుంది. ఆమెను ఎవరకి తెలియకుండా ఒకచోట పూడ్చిపెడతారు. వారు పాతిపెట్టిన చోట తంగేడు చెట్టు విరగపూస్తుంది.

తరువాత ఆ ఏడుగురు అన్నదమ్ములు ఆ చిట్టి చెల్లెలు కోసం గాలించని ప్రదేశం లేదు, కొండలు, గుట్టలు అన్ని ప్రాంతాలు తిరిగి అలసిపోయి తమ ఊరికి చేరుకున్న తరువాత ఊరిలో విరగబూసిన తంగేడు చెట్టు దగ్గరకు వచ్చి ఆగుతారు. ఆ చెట్టు నుంచి ఆత్మ రూపంలో చెల్లెలు తనకు జరిగిన విషయం చెప్పుకుంటుంది. అప్పుడు ఆ ఏడుగురు అన్నలు నీకు ఏమి కావాలో కోరుకోమంటే ఈ తంగేడు పూలలో నన్ను చూసుకోండని, ఏటా నా పేరున పండుగ చేయండని చెప్పిందని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.

ఇక బతుకమ్మ గురించి మరొక కథ కూడా ప్రాముఖ్యతలో ఉంది


కొన్నేళ్ల క్రితం సంతానం లేక పరితపిస్తున్న దంపతులకు ఒక పాప దొరకగా, ఆ పాపను అమ్మవారి ప్రసాదంగా బావించి పెంచి పెద్ద చేయగా, ఆమె పెద్దదైన తరువాత లోకహిత కార్యాలు చేయడంతో ఆమె చుట్టూ చేరి దైవ స్వరూపంగా మహిళలు కొలుస్తుండటంతో ఈ పండుగ వచ్చిందని చెప్పుకుంటుంటారు.

మరొక కథగా


ఒక బాలబాలిక భూస్వామ్యుల అకృత్యాలను వారి చేసే దారుణాలను భరించలేక ఆత్మహత్య చేసుకుందట. కొన ఊపిరితో అల్లాడుతున్న ఆమెను కలకాలం ‘బతుకమ్మా’ అని దీవించడంతో అప్పటి నుంచి ‘బతుకమ్మ’ అనే పేరుతో పండుగ చేసుకుంటారని చెబుతుంటారు. అందుకే ఈ పండుగను ప్రత్యేకంగా మహిళలే చేసుకుంటారు. మహిళలందరూ తమకు ఎలాంటి ఆపదలు రావద్దని, తమ కుటుంబమే మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా గౌరమ్మను పూజిస్తుంటారు.

మరొక కథగా


తెలంగాణ గ్రామీణ సమాజంలో అప్పట్లో నవాబులు, భూస్వాములు, పెత్తదారిలా చేతిలో నలిగిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు. వారి చెవులను చూసి తోటి మహిళలు విచారిస్తూ వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో” అనే పాటల వెనుక ఉండే మర్మం ఇదేనని చరిత్రకారులు చెబుతుంటారు.

ఇలా ఎన్నో కథలు ప్రాచీనంలో ఉన్నాయి. బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు రోజుకొక నైవేద్యంతో పూజిస్తుంటారు.తెలంగాణాలో ఉన్న ప్రతి మహిళ బంగారు బతుకమ్మలను తయారు చేసుకొని ఈ తొమ్మిది రోజులు పూజిస్తుంటారు.


బతుకమ్మ పండుగను ఎలా చేస్తారు..?


బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారని అందరికి తెలిసిన విషయమే కానీ ఆ తొమ్మిది రోజుల విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గౌరీ అమ్మవారికి తొమ్మిది రకాల పువ్వులను సమర్పిస్తారు. బంతి, చామంతి, తంగేరి, రుద్రాక్ష, కుంబడి, వీరా, మందారం, గడ్డిపూలు మొదలగు వాటిని గుమ్మరించి రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి...దానిపైన పసుపు ముద్దను ఉంచుతారు. దీనినే బతుకమ్మ దేవత గౌరమ్మగా ఎంతో భక్తితో కొలుస్తారు. బతుకమ్మ పండుగను మానవాళికి, పకృతికి మధ్య ఉన్న సంబంధాలను తెలిపే పండుగగా బతుకమ్మ పండుగను చెప్పుకుంటారు. మనుషులందరికి ప్రకృతితో విడదీయరాని బంధం ఉంటుందని ప్రతి ఒక్కరు ఎంతో ఆహ్లాదంగా, ప్రకృతికి దగ్గరగా ఈ పండుగను జరుపుకుంటారు. కుటుంబాన్ని, పాడిపంటలను చల్లంగా చూడాలంటూ ఆ తల్లిని వేడుకుంటారు.


‘బతుకమ్మ’ పండుగ ఎలా మొదలయ్యిందో తెలుసా?


తెలంగాణ రాష్ట్రంలో ఎంతో విశిష్టతగా జరుపుకునే పండుగలలో బతుకమ్మ పండుగ ముఖ్యమైనది.
 ఒక్కొక్క పువ్వేసి ఉయ్యాలో అంటూ ఎంతో భక్తి పారవశ్యంతో ఆడపడుచులు అందరూ తొమ్మిది రోజుల పాటు పువ్వులను పూజించే సంప్రదాయమే ఈ బతుకమ్మ పండుగ. ప్రకృతి పరవసించేలా పాటలు పాడుతూ నింగినంటేలా సంబరాలు జరుపుకుంటాం.

బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారని అందరికి తెలిసిన విషయమే కానీ ఆ తొమ్మిది రోజుల విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


గౌరీ అమ్మవారికి తొమ్మిది రకాల పువ్వులను సమర్పిస్తారు. బంతి, చామంతి, తంగేరి, రుద్రాక్ష, కుంబడి, వీరా, మందారం, గడ్డిపూలు మొదలగు వాటిని గుమ్మరించి రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి...దానిపైన పసుపు ముద్దను ఉంచుతారు. దీనినే బతుకమ్మ దేవత గౌరమ్మగా ఎంతో భక్తితో కొలుస్తారు. బతుకమ్మ పండుగను మానవాళికి, పకృతికి మధ్య ఉన్న సంబంధాలను తెలిపే పండుగగా బతుకమ్మ పండుగను చెప్పుకుంటారు.

మనుషులందరికి ప్రకృతితో విడదీయరాని బంధం ఉంటుందని ప్రతి ఒక్కరు ఎంతో ఆహ్లాదంగా, ప్రకృతికి దగ్గరగా ఈ పండుగను జరుపుకుంటారు. కుటుంబాన్ని, పాడిపంటలను చల్లంగా చూడాలంటూ ఆ తల్లిని వేడుకుంటారు.


బతుకమ్మ కథ :


ఇప్పటివరకు బతుకమ్మ పండుగకు సంబంధించిన చాలా కథలు ప్రాచుర్యంలో వున్నాయి. అందులో ముఖ్యమైనదిగా ఎక్కువమంది చెప్పుకునేది మాత్రం పూర్వం ఒక బాలిక కొంతమంది భూస్వాముల ఆకృత్యాలను ఎదురించి వీర మరణం పొందిదట..
ఆ వీర మాతకు ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా’ అని దీవించి సంబరాలు జరుపుతూ వచ్చారట. అందుకే ఈ పండుగ ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినదిగా సంబరాలు జరుపుకుంటామని చెబుతారు.


బతుకమ్మ తొమ్మిది రోజుల పండుగ విశిష్టత :


మొత్తం తొమ్మిది రోజుల పాటు, తొమ్మిది పేర్లతో బతుకమ్మ పూజలందుకుంటుంది. ఆ తొమ్మిది పేర్లు, వాటి విశిష్టత, విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎంగిలిపూల బతుకమ్మ

బతుకమ్మ నవరాత్రులు మొదలైన మొదటి రోజును ఎంగిలిపువ్వు అమ్మవారు అంటారు. అలా ఎందుకొచ్చిందంటే బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటిని వాడిపోకుండా నీటిలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. కాబట్టి మొదటి రోజును ఎంగిలిపువ్వు అమ్మవారు గా పిలుస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ రోజు తెలాంగాణ ఆడపడుచులంతా తమలపాకులు, తులసి ఆకులు వాయనంగా ఇచ్చుకుంటారు.

2. అటుకుల బతుకమ్మ

నవరాత్రుల రెండవ రోజునాడు ఉదయాన్నే తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు సేకరిస్తారు. ఆతర్వాత ఆ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి, పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ అందరూ కలసి సంబరాలు చేసుకుంటారు. సాయంత్రం వేళలో ఆ పూల గొబ్బెమ్మలను చెరువులలో నిమజ్జనం చేస్తారు. రెండవ రోజు ప్రసాదంగా అటుకులు వాయనంగా పెడతారు.


3. ముద్దపప్పు బతుకమ్మ

నవ రాత్రుల మూడవ రోజు కూడా బతుకమ్మను అందంగా పూలతో పేరుస్తారు. ముఖ్యంగా సీతమ్మజడ, చామంతి, మందార, రామబాణం పూలతో అలంకరించి తామర పత్రాలతో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. ఆ తరువాత ఆ బతుకమ్మ శిఖరంపై గౌరమ్మ తల్లిని ఉంచి ఉదయం నుండి పూజలు చేస్తూ సాయంత్రం నాలుగు బాటలు కలిసే దగ్గరో లేక గుడి దగ్గరో అందరూ కలసి చుట్టూ తిరుగుతూ ఆడతారు. ముఖ్యంగా ఆడవాళ్లు ఆటపాటలతో సంబరాలు చేసి ఆ బతుకమ్మను చెరువులో వేసి వస్తారు. మూడవ రోజు ప్రసాదంగా  బెల్లం,సత్తుపిండి, చక్కర, పేసర్లు కలిపి వాయనంగా పెడుతారు.


4. నాన బియ్యం బతుకమ్మ

నవరాత్రుల నాలుగవ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి పూజలు నిర్వహిస్తారు. శిఖరంపై గౌరమ్మను పెట్టి పాటలు పాడతారు. నానబెట్టిన బియ్యం బెల్లంతో కలిపి ముద్దలు చేసి వాయనంగా ఫలహారంగా పెడుతారు.


5. అట్ల బతుకమ్మ

ఈ ఐదవ రోజు కూడా అయిదు రకాల పూలు తంగేడు, గునుగు, చామంతి, మందార, గుమ్మడి పూలతో అయిదంతరాలుగా పేర్చి బతుకమ్మను ఆడుతారు. ఈ రోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడుతారు.


6.అలిగిన బతుకమ్మ

నవరాత్రుల ఆరోవరోజు ఎలాంటి పూలతో బతుకమ్మను పేర్చరు. పూర్వకాలంలో ఆరోవరోజు  బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్దా తగిలిందని అది అపచారం కనుక ఆరవరోజు బతుకమ్మను పేర్చి పూజలు లాంటివి చేయరు.


7. వేపకాయల బతుకమ్మ


ఏడవరోజున కూడా బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతారాలు పేర్చి ఆటపాటలతో పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈరోజు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు.


8. వెన్నముద్దల బతుకమ్మ


ఎనిమిదవ రోజు కూడా తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు లాంటి పూలతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆట,పాటల మధ్య చెరువులో వేస్తారు. ఈరోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు.


9. సద్దుల బతుకమ్మ


తొమ్మిదో రోజు అంటే పండగ చివరి రోజు ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. ఆరోజు ఎన్ని రకాల పూలు దొరికితే అన్నిరకాల పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఈరోజు ఆడవాళ్లు చాలా ఉత్సాహంగా ఆటపాటలతో సంబరాలు చేస్తారు. తెలుగందం ఉట్టిపడేలా ఆటపడుచులంతా అమ్మవారిని పూజిస్తారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్న గౌరమ్మను కూడా పూజిస్తారు. చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడే వరకు ఆడుకుంటారు. పెద్ద బతుకమ్మ రోజు అందరూ కలసి ఆనందంతో బతుకమ్మను ఆడుకొని చెరువులో నిమజ్జనంతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది.



- స్వస్తి....