“ఎందుకంత అవస్థ పడుతున్నావ్! నన్ను చంపటానికొచ్చావని తెలుసు. చంపరా పిరికిపందా! ఓ మనిషిని చంపబోతున్నావు అంతే కదా ” అని గర్జించాడతను.



కాళ్లలో రెండూ, మోకాళ్లలో రెండూ, చాతీలో రెండు, పక్కటెముకల్లో రెండు, గుండెలో ఒకటీ మొత్తం తొమ్మిది బుల్లెట్లు శరీరంలో దిగబడటం వల్ల మరణం సంభవించిందని అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలిపింది.


నేటికీ ప్రపంచ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...చే రూపం.

నీ రూపం
నీ పోరాట పటిమ
ప్రపంచ యువతరానికి నేటికీ ఆదర్శం.
ప్రపంచంలో ఎకడచుసినా నీ రూపం...
ఏ కీ చైన్ చూసినా, టీ షార్ట్ చూసినా .....
మరో వైపు నీ రూపం శత్రువు గుండెల్లో నేటికీ దడపుట్టిస్తోంది...
నువ్వందించిన స్ఫూర్తి
ఆచరణలో నీవు చూపిన తెగువ
నేటికీ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది..
.


చే గెవారా దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు.
రాజకీయ నాయకుడు.
ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకించాడు.
క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడు.
అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14 న ఒక మధ్య తరగతి కుటుంబంలో చే జన్మించాడు.
 1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు.
ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు.
విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు




1950 వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టా కు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం(1956-1959)లో ముఖ్య పాత్ర పోషించాడు.
డాక్టర్ గా మరియు మిలిటరీ కమాండర్ గా సేవలందించాడు.
ఈ సమయం లోనే ఇతను 'చే' గా పిలువబడ్డాడు.

చే గెవారా అసలు పేరు ఎర్నెస్టో గెవారా డి లా సెర్నా. గెవారా ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని 'చే' అని పిలువనారంభించారు.

ఈ పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు చే పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్ గా పనిచేసాడు.

 క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు.
ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశం లో కూడా పర్యటించాడు.

 తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చే క్యూబా సామ్యవాద దేశం గా మారటానికి దోహదపడ్డాడు.

ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా
ఎదురించడానికి సిద్దంగా ఉండు - చే


అలా 1967, అక్టోబర్ 9 మద్యాహ్నం 1:10 నిముషాలకు, బొలీవియా సేనలకు చిక్కిన పోరాటయోధుడు చే గెవారా హత్య జరిగింది.

మరణం దేహానికే కానీ ఆలోచనలకు కాదని చరిత్ర నిరూపించింది.

చే గెవారా మరణించి నాలుగు దశాబ్దాలు నిండాయి.

దేశదేశాల విప్లవకారులు, రాజకీయవిశ్లేషకులు అతని గురించి ఇంకా చర్చిస్తూనే ఉన్నారు.

అనుకూలంగానో, వ్యతిరేకంగానో.
గొప్ప రాజకీయవేత్త, మేధావి, దుస్సాహసికుడు, నిజాయితీకల విప్లవకారుడు, ఒంటెత్తు తత్వమనిషి, ఆదర్శవంతమైన నాయకుడు, స్వాప్నికుడు, ప్రేమికుడు – అంటూ ఎవరికి తోచినట్లుగా వాళ్లు నిర్వచిస్తూనే ఉన్నారు.


చే గెవారా జీవితంలోని సమకాలీన ప్రాధాన్యతను కాత్యాయని గారు రచించిన చే గెవారా అనే పుస్తకం మనముందుకు తెస్తుంది.

క్యూబా విప్లవోద్యమంలో కార్యకర్తగా అడుగుపెట్టి, ఫిడల్ కాస్త్రో కు కుడి భుజంగా మెసలి, విముక్త క్యూబా రాజ్య పునర్నిర్మాణంలో ప్రధాన పాత్రవహించి, బొలీవియా విమోచనోద్యమంలో అసువులు బాసిన అమరవీరుడు చెగువెరా.

ఆయన తన జీవితమంతా అమెరికన్ సామ్రాజ్యవాదం మీద రాజీ లేని పోరాటాన్ని సాగించాడు.

జీవితానికీ మరణానికీ సార్ధకత ఉండాలని తపించిన అచ్చమైన మనిషి. మార్పు జీవితమంత విశాలమైనది అని చెప్పిన విప్లవకారుడు.

ప్రభుత్వాలు మానవజాతిని రెండు పరస్పర వ్యతిరేక వర్గాలుగా విభజించే దిశగా వెళితే, నేను సామాన్యులుండే వర్గం తరపునే నిలుస్తానని ప్రకటించుకొన్న విశ్వమానవుడు.


చే గెవారా జీవితమంతా సామ్రాజ్యవాద శక్తులతో జరిపిన పోరాటాలమయం.

తన మార్గం అనితర సాధ్యం అనిపించేలా జీవించిన ఒక గెరిల్లా యోధుడు ఇతను.

క్యూబా విప్లవవిజయానంతరం లభించిన అధిపత్యాన్ని స్వచ్ఛందంగా వొదులుకొని మరిన్ని ఇతర లాటిన్ అమెరికన్ ప్రాంతాలను విముక్తం చేయాలని మరలా విప్లవపోరాటమార్గన పయనించిన గొప్ప ధీశాలి.

ఆ ప్రయత్నంలో బొలీవియా సైనికులకు చిక్కి హత్యచేయబడ్డాడు.


ఏమిటీ మనిషి? ఎందుకలా ప్రవర్తించాడు? ఇతనికేం కావాలి? సుఖమైన జీవితాన్ని వొదిలిపెట్టి ఎందుకలా చిత్తడి బురదలో వందలకిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రాణాలకు తెగించి పోరాడాడు? ఒక మనిషిని శృంఖలాలనుంచి విముక్తుడిని చేయటానికి మరో మనిషిపై తుపాకి గురిపెట్టాలా? 

అన్న ప్రశ్నలకు చనిపోయే ముందురోజువరకూ చే వ్రాసుకొన్న డైరీలలో కొన్ని సమాధానాలు దొరుకుతాయి.
ఇతని నిబద్దత, రాజకీయ అవగాహనా, పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్ర్ర్యాలను అందించాలన్న తపన వాటి ప్రతీ పేజీలో కనిపిస్తాయి. 
మార్పు తీసుకురావటానికి చే గావేరా ఎంచుకొన్న విధానం హింసాపూరితం కావొచ్చు, కానీ ఇతని నిజాయితీని శంకించలేము.


“మార్పు అనేది ముగ్గగానే రాలిపడే పండు కాదు, మనమే దానిని రాల్చాలి” అన్న చే గువేరా మాటలే అతని జీవితం.





-స్వస్తి...