అదిగో.. బూచాడోస్తున్నాడు... ఆ .. అను ..ఈ ముద్ద తినేయ్.. లేకపోతే ఎత్తుకుపోతాడు.. గుటుక్కున మింగేసా నమలకుండా నా చిన్నతనంలో ...  కారణం భయం..

ఏమండీ జాగ్రత్త... ఊరెళితే ఎవరినో ఒకరిని కాపలా పెట్టి వెళ్ళండి... అసలే ఏదో గ్యాంగ్ దిగిందిట ఊర్లోకి... పొరపాటున వెళ్ళినా ప్రశాంతత వుండదు ... కారణం భయం..

ఏమోయ్... మీ పిల్లాడికి పెళ్లి చేయవా... లేదు సర్... నేటి సమాజంలో ఈ యువత ఫాస్ట్ నేచర్ కి మా వాడు కంగారు పడి; అసలు పెళ్ళే వద్దని భీష్మించుకు కూర్చున్నాడు... పెళ్ళంటే తాచుపాములా లేస్తున్నాడు... కారణం భవిష్యత్లో వివాహ జీవితం సఫలమవుతుందో; విఫలమవుతోందో అనే భయం కారణం.

ఒక పరిస్థితిలో భయం మంచిని కలగజేస్తే... మరొక పరిస్థితిలో మళ్ళీ తిరిగి లేవలేని నష్టాన్ని కలగజేస్తుంది కదా....

భయం అంటే ..... నాలో వున్న కొన్ని బలహీనతల వలన వచ్చే నెగటివ్ వైబ్రేషన్స్ .... అనాలోచిత ఆలోచనలకు హేతువై ... ఏమీ లేనిదాని  గురించి ఒంటరిగా  విపెరీతంగా ఆలోచించి... మనసు పాడు చేసుకొని.... నిత్య కార్యక్రమాలను కూడా సవ్యంగా చేయలేని స్థితి....

జ్ఞాన కేంద్ర కుటుంబ చిట్టి చిన్నారి సలహా....

1. భయం అనిపించినప్పుడు... ఒంటరిగా కూర్చొని... కళ్ళు మూసుకొని ... భయాన్ని చిరునవ్వుతూ ఆహ్వానిస్తూ... మనస్సు లగ్నం చేసి కూస్తంత ఊపిరి బలంగా లాగి వదిలితే... ఆ నిశ్వాసకి లోపల వున్న చింత అనే భావన నీకు తెలీకుండానే గాలిలో కలసిపోతుంది... అప్పుడు ఏయ్ ఇంత చిన్న విషయం గురించి ఇన్ని రోజులు, నెలలు సంవత్సారాల భవిష్యత్ పాడుచేసుకున్నానే అనే  చేదు నిజం మ్రింగడం చాలా కష్టం కదా...

2. భయానికి భయపడి పోయి; ఒక చోట కుదురుగా కూర్చోలేక ... వీళ్ళ దగ్గరకు, వాళ్ళ దగ్గరకు శ్రమ, ధనం , సమయం వెచ్చించి... వారిచ్చే చెత్త సలహాలకు మరింత భయం ఎక్కువై... పొరపాట్లు చేసేసి ... మానసిక ఆందోళన పాదరసంలాగా విపరీతంగా పెరిగిపోతే ... ఆసుపత్రి మంచం ఆహ్వానం పలుకుతుంది.

3. భయం నీలో వున్న  అంతర్మదనం... నీలో పుట్టిన భయం నీకే అర్ధం కాకపోతే... నేటి బిజీ లైఫ్ లో నిన్ను పూర్తిగా స్టడీ చేసి; నీ భయానికి కారణం కనుగొని; ఉపశమన వాక్యాలు, సలహా సూచనలు చెప్పే ఓపిక, ఖాళీ ఎవరికో వుందని వారి అపాయింట్మెంట్ గురించి కొన్ని రోజులు వేచి చూచే నువ్వు ఎంత అమాయకుడవు మిత్రమా....

మిగతా విషయాలలో ఆందరిని గడగడలాడించే నువ్వు.... భయానికి భయపడటం హాస్యాస్పదం కదా....

ఏమో భయమా...... నేను వీక్ అనుకుంటున్నావా... అస్తమాను నా దగ్గరకు వస్తున్నావు... ఖబడ్దార్... నీ అంతు తేలుస్తాను నా జోలికి వస్తే... అని నీ అంతర మనిషి సాయంతో ఒక్క రంకె వేయి... పారిపోతుంది...

కాని పిచ్చివాడా... నీలో పుట్టిన భయానికి నువ్వు ఆమడ దూరం పారిపోవటం ఏమిటి అని ఎప్పుడు అనిపించలేదా....

నిత్య జీవితంలో భయాలు పిచ్చి మొక్కలు; కుక్క గోడుగులుగా పుట్టుకి వస్తూ వుంటాయి... వాటిని ప్రతీ క్షణం ఎప్పటికప్పుడే ఆదిలోనే తుంచే ప్రయత్నం చేయి... లేకపోతే.. నీ జీవిత కాలం సరిపోదు... నిత్యానందం అనేది నీ జీవితంలో కనుమరుగైనట్లే ....

ఈ రోజే ప్రయత్నించి... నీ లోపల ఉన్న భయాన్ని ప్రేమతో బయటకు సాగనంపు... నీ ప్రేమకు గులామై... భయం, వాత్సల్యంలకు మధ్య వున్న బద్ధ శత్రుత్వం వలన... జీవితంలో నీ జోలికి భయం రాదని ... 🙏🏻🙏🏻🙏🏻