సముద్ర తీరంలో ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో,
విశ్వంలొ అన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయంటారు సైంటిస్టులు.
వాటిలో ఒక నక్షత్ర మండలానికి చెందిన అనేక సౌర కుటుంబాలలో ఒక సూర్య కుటుంబానికి చెందిన 9 గ్రహాలలో భూమి అనే ఒక గ్రహం మీద మనం బతుకుతున్నాం అంటే...
మన జీవితం ఎంత క్షణికం..?
సృష్టి, స్థితి, లయం నిరంతర పరిణామం,
ఈ పరిణామాల కాలంతో పోలిస్తే ఇక్కడ మనం జీవించే కాలం లిప్తపాటు మాత్రమే.
అద్బుతమైన, ఈ మానవ జీవితానికి పరమార్ధం, జీవితాన్ని వీలైనంత వరకు అర్దవంతంగా జీవించడమే,
మనం బతికే, చివరి క్షణం వరకు జీవితం ఓ వేడుకగా సాగాలి.
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో జ్ఞానులు మానవ జీవితాన్ని సుసంపన్నం చేయడానికి, ఆనందమయం చేయడానికి ఎన్నో మార్గాలను శోధించి మనకు అందించారు.
అలాంటి ఆహార, విహార, విజ్ణానాన్ని క్లుప్తంగా, సులభంగా ఆచరణకు అనువుగా అందించే ప్రయత్నమిది.
ఈ విధానాలను అచరించి ప్రతి ఒక్కరు సంపూర్ణ అరోగ్యాన్నిపొంది తాము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.
జీవితం అంటే?
ఈ జీవితం ఎంతో గొప్పది,మళ్ళీ, మళ్ళీ రాని ఓకే ఒక్క అపూర్వ అవకాశం.
గడుస్తున్న ప్రతి రోజు, జీవితపు దూరం తగ్గిస్తుంది.
నిన్న రాత్రి ప్రపంచంలో మనతో పాటు నిద్రించిన వారిలో కొందరు ఈ రోజు లేరు,
కానీ మనం ఉన్నామంటే మనకీ రోజు బోనస్ వంటి అద్భుత వరం.
జీవించడమనే వరం ఎంత విలువైనదో, తెలియాలి అంటే ఒకసారి ఆసుపత్రి వద్దకు వెళ్ళండి.
అక్కడి రోగుల దైన్యమైన చూపులు చూడండి?
కనీసం ఒక్క రోజైనా బ్రతికించమని వైద్యులను ప్రాధేయ పడే వారిని చూడండి?
ప్రాణాలతో వుండి ఆచేతనావస్తలో ఉన్న అభాగ్యులను చూడండి?
జీవితం విలువ తెలియాలంటే జీవితపు చివరి రోజు వరకు వేచివుండవద్దు ,
అప్పుడు తెలిసినా ఉపయోగంలేదు.
ఇప్పుడే జీవితాన్ని చైతన్యవంతంగా తీర్చిదిద్దుకుందాం రండి.
మీలో గొప్పశక్తి…
ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయగల శక్తి వుంది .
మీరు మీ కుటుంబానికో , మీ ఊరికో, దేశానికో ఓ మార్గదర్శకం కాగలరు,
మీ జీవితం విలువను తెలుసుకునే కొద్దీ మీ హద్దులు చెరిగిపొతాయి.
మీరు విశ్వమానవులవుతారు .
అప్పుడు మీరు, మీచుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనందమయంగా మార్చుతారు.
అందమైన జీవితానికి పునాది ఆరోగ్యం
శారీరకంగా, మానసికంగా,ఆద్యాత్మికంగా ఆరోగ్యంగా వుంటేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు.
అలా ఉంటేనే ,మనం ఏదైనా సాధించగలం.
నిండు నూరేళ్లు అనారోగ్య సమస్యలు లేకుండా జీవించడం అనే ఆలోచనే నేటి తరానికి ఓ అత్యాశగా కనిపిస్తుంది.
చిన్నపిల్లలకు కంటి అద్దాలు, యువతరానికి మధుమేహం , రక్తపొటు చాలా కామనై పోయాయి.
ఇలాంటి పరిస్థితులలో 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించడం సాధ్యమేనా? అని సందేహం కలగడం సహజమే.
ఆసుపత్రులు వ్యాధులకు చికిత్స, తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి కానీ, ఆరోగ్యాన్ని ఇవ్వవు, ఎందుకంటే ఆరోగ్యం మందులలో లేదు. మంచి ఆహారపు అలవాట్లు , జీవన శైలిలో ఉంది.
దినసరి జీవన శైలి
సంపూర్ణ ఆరోగ్యానికి , ఒక ప్రణాళికా బద్దమైన జీవన విధానం చాలా ముఖ్యం.
1, తెల్లవారు జామున 4- 5 గంటల మధ్య సూర్యోదయం కాక ముందే నిద్రలేవడం వల్ల మెదడులొ పిట్యూటరీ గ్లాండ్స్ చురుకుగా వుండి మన శరీరం ఆ రోజు చేయవలసిన పనులను జాగృతం చేస్తుంది.
2, చిరునవ్వుతో ఈ రోజంతా నేను ఆనందంగా గడుపుతాను అనుకోవాలి.
3, మంచంపైనే ఒక్క నిముషం ఉండి, దీర్ఘంగా శ్వాస తీసుకొని, ఒక పక్కకు తిరిగి మెల్లగా లేవాలి.
భూమాతకు నమస్కరించి క్రిందకుదిగి , దుప్పట్లు , దిండు సరిచేసుకోవాలి.
4, మొఖం కడుక్కోని వేడినీళ్ళతో గార్లింగ్ చేయాలి.
5, గోరు వెచ్చని నీటిలో తేనె ,నిమ్మరసం, సబ్జాగింజలు కలుపుకొని తాగాలి.
6, ఉదయపు నడక 30 నిమిషాలు,ఒక కిలో మీటర్ నడిస్తే మంచిది. నడిచే టప్పుడు కాళ్ళు,చేతులు బాగా చాచి ,తల ఎత్తుకొని నిటారుగా నడవాలి.
7, సూర్య నమస్కారాలు – కనీసం 12 భ్రమణాలు చేయాలి.
8, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల లోపు ఎండలొ కనీసం 45 నిమిషాలు పాటు వుండటం వలన, శరీరానికి ఎంతో అవసరమైన డి – విటమిన్ అందుతుంది.
స్నానించడం…
వేడి నీటితో స్నానం మంచిది.
మనం వాడే సబ్బులు, షాంపూలు, పౌడర్లు వలన రకకకాల కెమికల్స్ మన శరీరంలొకి నేరుగా ప్రవేశించి కొన్ని వ్యాధులకు కారణమవుతున్నాయి.
సున్నిపిండి, కుంకుళ్ళు, షీకాయ మొదలగు సాంప్రదాయ పద్దతులను పాటించడం ఆరోగ్యానికి మంచిది.
ప్రతిరోజూ తలస్నానం చేయగలిగితే చాలా మంచిది.
పూజ
కనీసం 20 నిముషాలు మీ ఇష్ఠదైవాన్ని పూజించాలి.
పూజ మనసుని ప్రక్షాళన చేస్తుంది.
మీకు ఆ రోజంతా భగవంతుని ఆశీస్సులుంటాయనే ధైర్యం వుంటుంది.
మంచి భావనతో ప్రారంభ మయ్యే రోజు ఆహ్లాదంగా వుంటుంది.
నీరు
నీరు జీవనాధారం.
గోరు వెచ్చని నీరు,
అవసరమైన మేరకే తాగాలి.
భోజనం చేసేటప్పుడు కేవలం నోరు తడుపుకోవడానికి తీసుకోవాలి.
తిన్న తరువాత 30 నిమిషాలు వరకు నీరు త్రాగరాదు.
నీటిని కేవలం రాగి సీసాలు, గ్లాసులలొ మాత్రమే త్రాగాలి.
ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదు.
మినరల్ వాటర్ ను అసలు త్రాగవద్దు.
అందులో శరీరానికి కావలసిన లవణాలు ఏమి వుండవు. మినరల్ వాటర్‌కి ప్రత్యామ్నాయం లేకపోతే, ఆ నీటిలో కొంచెం సైందవ లవణం, కొంచెం పసుపు కలిపి తాగలి.
సుమారుగా రోజుకు 3 నుండి 4 లీటర్ల వరకు తీసుకోవచ్చు.
గాలి
కోట్ల కణాలతో నిర్మితమైన ఈ దేహానికి ప్రాణశక్తి పుష్కలంగా ఉండాలంటే , శ్వాస మీద
దష్టి కేంద్రీకరించాలి.
మనం ఏ పని చేస్తున్నా దీర్ఘ శ్వాస తీసుకోవడం శారీరక , మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది.
ఆహారం….
మొలకెత్తిన పెసర్లు, దానిమ్మ గింజలు , నల్లని ఎండు ద్రాక్ష(30 నిమిషాలు నీళ్ళలో నానబెట్టినవి), అంజూరా, రాత్రిపూటనానపెట్టిన బాదం గింజలు వీటిని బాగా కలుపుకొని ఇంట్లో అందరూ 4 చెంచాలు చొప్పున బాగా నమిలి తినాలి.
ఇది మీకు కావలసిన ప్రొటీన్ ఓమేగా ప్యాటి యాసిడ్ , ఎంజైములు, యాంటీ ఆక్సిడింట్స్ అందిస్తాయి.
రాగి జావ
ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళల్లో రక్త హీనత నివారణకు రాగి జావ ప్రతి రోజు కనీసం 1 గ్లాస్ త్రాగాలి.
రాగి జావ తయారీ : రాగుల్ని సుద్ది చేసి మొలకెత్తించాలి. వాటిని నీడలో ఆరబెట్టి ,కిలోకి 100 గ్రాముల చొప్పున సగ్గుబియ్యం ,బార్లి గింజలు కలిపి మర పట్టించుకోవాలి. వేడిగా కాచిన నీళ్లలో రాగి పిండిని కలుపుకోవాలి.
ఈ జావని ఉదయం పూట మజ్జిగలో కలుపుకొని తాగాలి.
అమృతాహారం
తయారీ: బీటురుట్-1 , (సుగర్ వ్యాధి వున్న వారికి వద్దు) పుదీనా -2 కట్టలు , కొత్తిమీర – 2 కట్టలు , మెంతి -1కట్ట తీసుకొని బాగా కడిగి తరిగి మిక్సీ వేసి పేస్టుగా చేయాలి.
వెచ్చని నీరు , నిమ్మకాయ , కొంచం సైంధవ లవణం కలుపుకొని రొజుకు 3 సార్లు త్రాగాలి.
విహారం :
మీరు అదేపనిగా కూర్చొని పనిచేయకుండా 30 నిమిషాలకు ఒక సారి లేచి అటు ఇటు తిరిగి వెళ్ళి పని చేసుకోవాలి.
లంచ్ 12 నుండి 1 గంట లోపు తీసుకుంటే మంచిది.
భోజనం తయారు చేయడం అనేది భగవంతుడికి నైవేద్యం పెట్టడంతొ సమానం.
భోజనాన్ని శుచిగా స్నానంచేసి అగ్నికి నమస్కరించి తినేవారందరూ, ఆనందంగా, ఆరోగ్యంగా, వుండాలని అని నమస్కరించి చెయ్యాలి...
వంటకు కేవలం స్ఠిల్ పాత్రలను వాడాలి. సైందవ లవణం 80 రకాల సూక్ష్మపోషకాలను కలిగి వుంటుంది .
కావున సాదారణ ఉప్పుకు బదులు సైందవ లవణం వాడాలి.
గానుగ నూనెను వంటకు వాడాలి.
కారం మితంగా వాదుకోవాలి,
చింతపండు పులుసు కంటే, నిమ్మకాయ వాడుకోవాలి.
అన్నం కొసం చాలా తక్కువగా పాలిష్ బియ్యాన్ని గాని ,కొర్ర బియ్యాన్ని గాని వాడుకొవాలి.
అన్నం వండే టప్పుడు గంజి వార్చాలి. రైస్ కుక్కర్ లలో , అల్యుమినియం పాత్రలలో వంట చేయరాదు.
జొన్నలు, రాగులు, సద్దలు, కొర్రలు, మెదలగు వాటిని పిండి చేయించి మల్టిగ్రేన్ రొట్టెలు తయారు చేసుకొవచ్చు.
కూరలు ఆకుకూర పప్పు, మిక్సిడ్ కూరగాయలు ఆవిరి మీద ఉడికించి తాలింపు వేసుకొని తినాలి.
పెరుగు బదులుగా జీలకర్ర మజ్జిగ వీలైనన్ని సార్లు తాగవచ్చు.
భోజనం తరువాత 10 నిమిషాల నడక మంచిది.
సాయంత్రం 4 గంటలకు కొన్ని పండ్లు, గ్రీన్ టీ తిసుకుంటే మంచిది,
ప్రతి రొజు ప్రతి ఒక్కరు పైనాపిల్ జ్యుస్ 1 గ్లాస్ తప్పనిసరిగా తీసుకోవాలి.
రాత్రి 7 గంటలకు అల్పాహరం , మల్టీగ్రేన్ రొట్టె, కూర తీసుకుంటే చాలు.
తరువాత కాసేపు నడక,
కుటుంబ సభ్యులతొ సంబాషణ అనంతరం 9 గంటలకు నిద్రపొవాలి.
పాలు 6 సంవత్సరాలు దాటినవారు తీసుకొరాదు.
పాలలొ వుండె కెసిన్ అనే ప్రొటిన్ జీర్ణం చేసే ఏంజైము 6 సంవత్సరాలు వయస్సు తరువాత వుండదు.
మానసికంగా…
మంచి పుస్తకాలు , స్నేహితులు , కుటుంబ సభ్యులతో గడపడం అవసరం, ఈ సమాజం పట్ల మనకు బాద్యత వుంది.
ఈ ప్రపంచంలో చిన్న మార్పుకోసం ఐనా కృషి చేయాలి.
మనకి నచ్చడం, నచ్చక పోవడంలో ప్రపంచాన్ని చూడకూడదు,
జీవితం ఒక పండుగలా వుండాలి,
మనం వున్న చోట సంతోషం చిందులు వేయాలి.
ప్రతి చిన్ని విషయాన్ని ఆస్వాదించాలి.
శాంతి , సహనం , చిరునవ్వు , మానసిక ఆనందాన్నిచ్చి, అనేక రకాల రుగ్మతలను దూరం చేసి, జీవితాన్ని సుఖమయం చేస్తాయి....
- స్వస్తి...