జ్వరం వచ్చినపుడు మన తాతలు  పాటించే ఈజాగ్రత్తలు తీసుకోండి..

తడి పనులు చేయరాదు(అంట్లు - గుడ్డలు ఉతకరాదు)

చలి గాలికి తిరగరాదు- చెవులో దూది పెట్టుకోవాలి

ఫ్యాన్ గాలికి దూరంగా పడుకోవాలి..

 గోరు వెచ్చని నీరు త్రాగాలి

ద్రవాహారం-మజ్జిగ అన్నం బాగా పిసికి త్రాగాలి

 రాగి జావ త్రాగాలి

తేలికగా అరిగే ఆహారం తినాలి

నోరు చేదుగా ఉంటే, జీర్ణశక్తి బాగ లేనట్టు లెక్క- పొట్ట క్లియర్ అయ్యేంతవరకు నోరు చేదుగా ఉంటుంది- అందుకని చక్కెర-బెల్లం-ఉప్పు-నూనె-చింతపండు పులుసులు -ఇతర నెమ్ము పదార్దాలు-కలిపిన పదార్దాలు-బేకరి- తినకూడదు

సాయంత్రం అయిదు నుంచి ఇంటి లోపల -గుమ్మానికి ఎదురుగా కాకుండా మూల పడుకోవాలి..

బయట తిరగరాదు

సాయంత్రం స్నానం చేయరాదు

మధ్యాహ్నం త్వరగా తడిగుడ్డతో శరీరం తుడుచుకోవాలి

 అంతే జ్వరం తగ్గిన వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి-

లేకుంటె తిరిగి జ్వరం మొదలవవచ్చు

పగలు నిద్రపోరాదు

 జ్వరం ఎక్కువైనపుడు తడిగుడ్డతో తుడుస్తూ ఉండాలి.

ఎక్కువ వేగంగా తిరుగుతూ ఉండకూడదు

 తగ్గినా కూడా, వారంపాటు ఎక్కువ రెస్టు తీసుకోవాలి.

మానసికంగా మంచి ఆలోచనలు చేస్తూ ప్రశాంతంగా ఉండాలి..

వేళకు భోజనం చేయాలి

చల్లగా ఉన్న  ఆహారాలు తినవద్దు

ఆహారం వేడిగ ఉన్నప్పుడే తినండి

ఈరోజుల్లో ఇలాంటి కనీస జాగ్రత్తలు ఏమీ చెప్పకుండా, అధికంగా యాంటీబయాటిక్స్ ఇస్తూపోతున్నారు.దుర్మార్గం కదా !..