మన పూర్వీకులు మనకి వారసత్త్వంగా అందించిన చాలా పద్ధతులు సంప్రదాయాల్ని నేటి తరం అంతగా పాటించక పోవొచ్చు . కాని మన పూర్వీకులు చేసిన ప్రతి పనిలోనూ ఒక అద్భుతమైన ఆరోగ్య కరమైన విషయం దాగి ఉంది.

తులసి, వేప, రావి, ఈ మూడు చెట్లు మనకి దగ్గరగా ఉంటే కాన్సర్ మనకి దూరంగా ఉన్నట్టే. ఎలా అంటారా అయితే చదవండి మరి.

రాత్రి పూట చెట్ల మీద దెయ్యాలు ఉంటాయని చెబుతూ ఉంటారు కాని నిజానికి అది వాస్తవం కాదు. ఎందుకంటే ఉదయం అంతా ప్రాణ వాయువుని అందించిన చెట్లు రాత్రి అయ్యేటప్పటికి మాత్రం విషవాయువులు ( కార్బన్ డై ఆక్సైడ్ ) ని విడుదల చేస్తాయి. అలా చెట్ల కింద రాత్రి పడుకుంటే ఉపిరాడక చాల మంది చనిపోతారు.

కాని చాల మంది శాస్త్రీయ వివరణ లేకపోవడం వల్ల ఆ మనిషిని దెయ్యమే చంపేసిందని భావించేవారు.

ప్రతి చెట్టు రాత్రి పూట విషవాయులు విడుదల చేసినప్పటికి కొన్ని మొక్కలు, చెట్లు మాత్రం నిరంతరం ప్రాణవాయువుని విడుదల చేస్తాయి. అవి

1.తులసి


2. వేప



3. రావి



అందుకే మిగతా మొక్కల్ని పెరడ్లో ఉంచినా తులసిని మాత్రం గుమ్మానికి ఎదురుగా ఉంచుతాం. అలాగే వేపని ఇంటి పెరడు లో పెంచుతారు. రావి చెట్లను గుడి వద్ద, అలాగే ఊరి మధ్యలో రచ్చబండ గాను వేస్తారు.

ఎందుకిలా చేస్తారంటే పొద్దునే ఇంట్లో ఆడవారు స్నానం చేసి తులసి కోట చుట్టూ తిరిగేటప్పుడు శరీరం లో ఉష్ణక్రియ జరిగి శరీరం ఆక్సిజన్ గ్రహించే స్థాయి పెరుగుతుంది. తులసి నుండి వచ్చే ఆక్సిజన్ ని గ్రహించి శరీరం స్వచ్చమైన ప్రాణ వాయువుని పొందుతుంది.

 ఇదే విధంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చెయ్యమని కూడా మన పెద్దలు చెబుతారు. ఇందులో కూడా అదే ఆంతర్యం ఇమిడి ఉంది. అలాగే వేపను కూడా దైవంగా భావించి పూజిస్తారు. రావి చెట్టు చుట్టూ దారం చుడుతూ తిరుగుతారు.

ఊరికినే తిరగమంటే ఎవరు తిరగరు కాబట్టి మన పెద్దలు ప్రతి విషయానికి ఆధ్యాత్మికతతో ముడి వేసారు. శరీరం శ్రమ చేసిన తరవాత విశ్రాంతి పొందే సమయం లో దైవ దర్శనం కలిగితే మనసుకి స్వాంతన కలుగుతుంది అందుకే గుడి చుట్టూ , చెట్లు చుట్టూ ప్రదక్షిణలు చేసిన తరవాత దైవ దర్శనం చేసుకోమంటారు పెద్దలు. ఇలా చేసిన మనుషులకి అధికస్ధాయి లో ఆక్సిజెన్ అంది కాన్సర్ వంటి రోగాలు దరికి రావు. ఎందుకంటే కాన్సర్ వచ్చే కారణాలలో శరీరానికి ఆక్సిజన్ అందక పోవడం కూడా ఒక ప్రధాన కారణమే . ఇలా తులసి, వేప, రావి వంటి వాటిని మనకి దగ్గరలో పెంచడం ద్వారా కాన్సర్ వంటి రోగాల్ని దూరం చెయ్యవచ్చు.