శరన్నవరాత్రులలో సరస్వతీ పూజ.. పరాశక్తి, జ్ఞాన ప్రదాత శక్తిరూపం
ఈ రోజు అక్టోబరు 5 2019 శనివారం రోజు సప్తమి తిధి రోజు మూలా నక్షత్రం ఉన్నది కావునా ఆరోజు సరస్వతి ఆమ్మ వారిని పూజిస్తే తల్లి అనుగ్రహం కలుగుతుంది.మనకు ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతిదేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది.ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవుని భార్యా సరస్వతీ దేవి చదువుల తల్లి ఈ ఆమ్మవారి వాహనం హంస, నెమలి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ దేవి గురించి ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాథలు సరస్వతీ దేవి,అమ్మవారి పేరుతొ సరస్వతీ నది అని కుడా ఉంది. శరన్నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది.
ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95), పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాథలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది.
సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు.ఈ అమ్మవారు అధికంగా హంస వాహినిగా, వీణా పాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం.
"శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి".
పరాశక్తి, జ్ఞాన ప్రదాత :
పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.
జ్ఞాన ప్రదాతగా సరస్వతి - కొన్ని గాథలు :
పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు.
వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.
పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్య ప్రథమైన సూర్య స్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేద వేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు.
ఆ స్తుతిలో తాను గురు శాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని గ్రంథ రచనా శక్తి ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదే పదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది.ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో కనబడుతుంది.
సరస్వతీ స్తోత్రం :
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || ౧ ||
దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ |
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాఽసమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా || ౨ ||
సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా |
విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా || ౩ ||
సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ || ౪ ||
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || ౫ ||
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః || ౬ ||
నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |
విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః || ౭ ||
శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః || ౮ ||
ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః || ౯ ||
మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః |
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః || ౧౦ ||
వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః || ౧౧ ||
సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞే తే నమో నమః || ౧౨ ||
యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |
దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః || ౧౩ ||
అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః |
చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః || ౧౪ ||
అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |
అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః || ౧౫ ||
జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః |
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః || ౧౬ ||
పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః |
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ || ౧౭ ||
మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః || ౧౮ ||
కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః || ౧౯ ||
సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే |
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి || ౨౦ ||
ఇత్థం సరస్వతీస్తోత్రమగస్త్యమునివాచకమ్ |
సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ || ౨౧ ||
సరస్వతీ దేవి పూజ విధానం :
ఎలాంటి పూలు, దుస్తులు వాడాలి?
సరస్వతీం చతాం నౌమి వాగధిష్ఠాతృ దేవతాం
దేవత్వం ప్రతిపద్యంతే యదనుగ్రహతో జనా:
(అర్థం- వక్కుకు అధిష్ఠాన దేవత అయిన సరస్వతీ మాతా !, నీ అనుగ్రహం పొందిన వారు దైవత్వం కూడా పొందగలుగుతున్నారు)
అన్ని విద్యలకి అధి దేవత అయిన తల్లి సరస్వతీ మాత, ఆతల్లిని పూజించిన వారికి తద్వారా ఆమె అనుగ్రహం పొందినచో అన్నిరకాల ఆటంకాలు విద్యాపరంగా తొలగిపోతాయి.)
దేవీ నవరాత్రుల 9 రోజులలో 9అలంకారాలతో పూజించడం అలవాటు. కానీ దేవీ మాహాత్మయం మొదలైన గ్రంథాలలో 9రోజుల పాటు 9 రూపాలు వేరుగా చెప్పారు. ( శైలపుత్రీ, బ్రహ్మచారిణి మొదలైనవి9) ఇవి కాకుండా వెంకటేశ్వర స్వామి 9రోజుల పాటు 9 వాహన సేవలు చెప్పబడింది.
ఇందులో ప్రత్యేకంగా చేసేపూజలలో అందరూ పాల్గొనేవి ఇవి.
కుమారీ పూజ,
శమీ పూజ,
ఆయుధ పూజ,
సరస్వతీ పూజ.
ఇప్పుడు ప్రత్యేకంగా సరస్వతీ పూజ విధానం గురించి చెపప్పుకుందాం.
మూలా నక్షత్రం, సప్తమినాడు వచ్చిన రోజున చేయ వలసింది ఈ పూజ.
వీలైన వారు గుడిలో, దేవీమంటపాలలో, లేని స్థితులలో ఇంటిలో సరస్వతీ పటం ఉంచి పూజించ వచ్చు.
సరస్వతీ పూజకి తెల్లపూలు వాడాలి.
చదువుకునే విద్యార్థులు ప్రత్యేకంగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వీలైతే తెల్లవస్త్రాలు, లేదా పట్టుబట్టలు ధరించాలి.
అమ్మవారిముందు తాము చదువుకునే పుస్తకాలుపెన్నులు, 2ఉంచి,
అమ్మవారితో పాటు ఆయా పుస్తకాలు కూడా పూజించాలి.
చదవ వలసినవి
శ్రీ సరస్వతీ కవచం
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమేపాతుసరస్వతః
శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మేసర్వదా వతు
ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతిశ్రోత్రేపాతు నిరస్తరమ్
ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు
ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాంమే సర్వదా వతు
ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా ఓష్ఠం సదా వతు
ఐం ఇత్యేకాక్షరో మంత్రోమమ కంఠం సదావతు
ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం స్కంధౌమే శ్రీం సధా వతు
ఓం హ్రీం విద్యాధిషాంతృదేవ్యై స్వాహా వక్షః సదా వతు
ఓం హ్రీం హేతి మమహస్తౌ సదావతు
ఓం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదావతు
ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదా వతు
ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహాగ్నిరుదిశిరక్షతు
ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రోనైరృత్యాం సర్వదావతు
ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాంవారుణే వతు
ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదావతు
ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు
ఐం సర్వశాస్త్ర వాసిన్యై స్వాహేశాన్యాం సదావతు
ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్యంసదావతు
హ్రీం పుస్తకవాసిన్యై స్వాహాధోమాం సదావతు
ఓం గ్రంధబీజస్వరూపాయై స్వాహా ఆమం సర్వదావతు
అమ్మవారి నవరాత్రులలో 9రోజులకి 9దేవతలకి విడివిడిగా అష్టోత్తర నామాలు, సహస్ర నామాలు చదువుతూ పూజించాలి .
నైవేద్యం - క్షీరాన్నం, పాలతో బెల్లం నైయ్యివంటి పదార్థాలు కలిపి చేసినవి నివేదించాలి, చలివిడి వడపప్పు పానకం వంటివి ప్రత్యేక నైవేద్యాలు. నానబెట్టి మొలకలు ఎత్తించిన పెసర్లు, సెనగలు వంటి పదార్తాలు చాలా మంచి ఫలితాలు ఇచ్చే నైవేద్యాలు.
ప్రదక్షిణ, స్తోత్రాలు. వీలైనంత వరకు చేయాలి.
ఉపవాసం ఉండాలా ? - పదిహేను సంవత్సరాలలోపు పిల్లలు ఉపవాసం ఉండకూడదు. అసలు ఏమీ తినకుండా కూడా అమ్మవారిని పుజించకూడదు.
శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రం :
సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా |
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రగా || ౧ ||
శివానుజా పుస్తకధృత్ జ్ఞానముద్రా రమా పరా |
కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ || ౨ ||
మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా |
మహాభాగా మహోత్సాహా దివ్యాంగా సురవందితా || ౩ ||
మహాకాళీ మహాపాశా మహాకారా మహాంకుశా |
సీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ || ౪ ||
చంద్రికా చంద్రవదనా చంద్రలేఖావిభూషితా |
సావిత్రీ సురసా దేవీ దివ్యాలంకారభూషితా || ౫ ||
వాగ్దేవీ వసుధా తీవ్రా మహాభద్రా మహాబలా |
భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా || ౬ ||
జటిలా వింధ్యవాసా చ వింధ్యాచలవిరాజితా |
చండికా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైకసాధనా || ౭ ||
సౌదామినీ సుధామూర్తిస్సుభద్రా సురపూజితా |
సువాసినీ సునాసా చ వినిద్రా పద్మలోచనా || ౮ ||
విద్యారూపా విశాలాక్షీ బ్రహ్మజాయా మహాఫలా |
త్రయీమూర్తీ త్రికాలజ్ఞా త్రిగుణా శాస్త్రరూపిణీ || ౯ ||
శుంభాసురప్రమథినీ శుభదా చ సర్వాత్మికా |
రక్తబీజనిహంత్రీ చ చాముండా చాంబికా తథా || ౧౦ ||
ముండకాయప్రహరణా ధూమ్రలోచనమర్దనా |
సర్వదేవస్తుతా సౌమ్యా సురాసురనమస్కృతా || ౧౧ ||
కాళరాత్రీ కళాధారా రూపసౌభాగ్యదాయినీ |
వాగ్దేవీ చ వరారోహా వారాహీ వారిజాసనా || ౧౨ ||
చిత్రాంబరా చిత్రగంధా చిత్రమాల్యవిభూషితా |
కాంతా కామప్రదా వంద్యా విద్యాధరా సుపూజితా || ౧౩ ||
శ్వేతాసనా నీలభుజా చతుర్వర్గఫలప్రదా |
చతురాననసామ్రాజ్యా రక్తమధ్యా నిరంజనా || ౧౪ ||
హంసాసనా నీలజంఘా బ్రహ్మవిష్ణుశివాత్మికా |
ఏవం సరస్వతీ దేవ్యా నామ్నామష్టోత్తరశతమ్ || ౧౫ ||
- స్వస్తి...