పార్వతి జనని భవాని శ్రీ రాజరాజేశ్వరి సర్వలోకపాలిని మానిని దేవి

నీరజాక్షి పరమపావని కామాక్షి నిరంజని మామవ అంబా॥


శ్రీకరి జనని మృడాని శ్రీ రాజరాజేశ్వరి హ్రీంకారరూపిణి హరిణాక్షి దేవి


శ్రీ కాంచీపురవాసిని కామాక్షి శ్రీ కామేశ్వరి మామవ అంబా॥


శాంభవి జనని పురాణి శ్రీ రాజరాజేశ్వరి శర్వరీశ ధారిణి శంకరి దేవి


శ్యామకృష్ణ పరిపాలిని కామాక్షి శ్యామళాంబికే మామవ అంబా॥




          అమ్మలు గన్నఅమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ మమ్ము కరుణించి కాపాడమ్మా! 

అంటూ ఆ కనక దుర్గా దేవిని నిండు మనసుతో  ప్రార్ధిస్తూ ఆ అమ్మవారి కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని...

 అందరి ఇంట సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో కూడిన ఆనందం వెల్లివిరియాలని, 

ఈ విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలని మనసారా కోరుకుంటూ ....


మన వెబ్సైట్ వీక్షకులకు, నా తోటి బ్లాగర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు.




ఈ సందర్భంగ దసరా గురించి రెండు ముక్కలు.

విజయదశమికి గల మరిన్ని పేర్లు

దసరా
దుర్గ నవరాత్రి
దుర్గోత్సవం

విజయదశమి ఎప్పుడు చేస్తారు


తెలుగు నెలల ప్రకారం ఆశ్వియుజ మాసము శుక్లపక్షములో దసరా నవరాత్రులు జరుగుతాయి. ఈ నవరాత్రులలో ముఖ్యమైనవి 8,9 మరియు 10 రోజులు. ఈ రోజులని కొన్ని చోట్ల దుర్గాష్టమి, నవరాత్రి మరియు విజయదశమి/దసరా అందురు


విజయదశమి ప్రత్యేకత ఏమిటి?


దసరా భారత్ మరియు నేపాల్ లో లొ హిందువులు జరుపుకొను పండుగలలో ముఖ్యమైనది. ఈ పండుగ గురించి చాలా కధలు ప్రచారంలో ఉన్నవి. వాటిలో కొన్ని మీ కోసం:


◆ భారతదేశంలో వ్యవసాయం మొదలుపెట్టు సమయం ఇది కాబట్టి తమతమ పైరుని రక్షించమని మరియు భూమికి మంచి సారం ఇచ్చి దిగుబడి పెంచమని ఈ పండుగ జరుపుకుంటారు.


◆ రామరావణుల యుద్ధము 10 రోజులు జరిగింది. ఆ యుద్ధము దసరా పండుగ మొదటి రోజున మొదలయి ఆఖరి రోజుకి రావణుని అంతంతో ముగిసింది. రాముడు రావణుడితో యుద్దసమయమున చండి యగము చేయగా ఆ యాగమునకు మెచ్చి దుర్గమ్మ రావణుని చంపు మార్గము సూచించింది. అట్లా రావణుడిని చంపి రాముడు తన వానర సేనతో అయొధ్యకి సీతసమేతుడై దసరా రోజున వచ్చాడు అని ఒక కధ


◆మహిశాసురుడు అనే రాక్షసుడు దున్నపొతు రూపంలో వుండేవాదు అతనికి ఉన్న బలముతో పరాక్రమముతో దేవతలను మానవులను అందరిని ఓడించాడు. బ్రహ్మవిష్ణుమహేస్వరులు కూడా అతని ముందు తలవంచక తప్పలేదు. అప్పుడు త్రిముర్తుల శక్తితో ఒక అందమైన 10 చేతులు కలిగిన శక్తిని తయారు చేసారు. ఆ శక్తికి సకల దేవతలు ఒక్కొక శక్తిని ఇచ్చి బలవంతురాలుగా చేసారు. ఆ శక్తి దుర్గమ్మగా అవతారము ఎత్తి సింహం వాహనంగా చేసుకొని మహిశాసురునితో భీకర పోరు చేసెను. ఆ సమరం 10 రోజులు సాగి చివరికి విజయదశమి రొజున ముగిసింది. దుర్గమ్మ గెలుపుని గుర్తుచేసుకుంటూ చెడు మీద మంచి విజయం సాధించిన రోజుగా ఈ పండుగను జరుపుకుంటారు.


◆ పూర్వము దక్షుడను ఒక ప్రజాపతికి ఉమ అను కూతురు కలదు. ఆమె పరమశివుడిని తన భర్తగా తలచి నిష్ఠగా పూజలు చేస్తు వుండెను. ఆ పుజలకి మెచ్చి పరమశివుడు ఆమెను వివాహము చేసుకొనెను. అది దక్షునికి ఇష్టం లేని వివాహము. కొన్ని రోజుల తర్వాత దక్షుడు యగ్నం చేస్తూ అందరిని పిలిచి పరమశివునిమాత్రము పిలవకపోయెను. అంతట ఆగ్రహించిన ఉమదేవి భర్తకు జరిగిన అవమానము తాళలేక యగ్నగుండములో ప్రాణత్యాగము చేసెను. ఉమదేవి ఆత్మహత్య గురించి తెలుసు కున్న శివుడు ఆగ్రహముతొ తన జెటాజుటమునించి ఒక పాయతో వీరభధ్రుడిని సృష్తించెను. శివుడు ఉమదేవి శరీరమునిగైకొని భాదతో ప్రపంచవిహారము చేయసాగెను. అంతట విష్ణువు తన చక్రముతో ఉమదేవి శరీరముని చిన్నాభిన్నము చేసెను. ఆ ముక్కలు పడిన చోట్లనె మనము ఇప్పుడు శక్తి పీటాలుగా పూజిస్తున్నాము. ఆ తర్వాత కొంత కాలానికి ఉమదేవి పార్వతిగా జన్మించి పరమశివుని పెళ్ళాడెను. ఆ పిమ్మట విషునువు కోరిక మేర శివుదు దక్షుడిని క్షమించెను. పార్వతిదేవి ప్రతి సంవత్సరం దసరానాదు తన తండ్రైన హిమలయుని వద్దకు పిల్లథొ ఇష్టసఖులతో కలిసి వస్తుంది కావున ఈ ఉత్సవం జరుపుకొనెదరు.

విజయదశమి ఎలా జరుపుకుంటారు?

విజయదశమి పండుగ తొమ్మిది రోజులు జరుగును. ఈ రోజులలో కొన్నీ ప్రదేశాలలొ గుడిలో అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరిస్తారు. ముఖ్యంగా విజయవాడ లోని దుర్గమ్మ అలంకారములు చూచుటకు రాష్ట్రమంతటి ప్రజలు వస్తారు. కోందరు భవాని మాల వెసుకొని విజయదసమి నాడు ఇరుముడి దించి మాలని ముగిస్తారు.


సామాన్యుల విషయానికి వస్తే దసరా రోజున పొద్దునే లేచి తలస్నానం చేసి దుర్గమ్మకి పూజ చేసి పిండివంటలతో కూడిన నైవెద్యం అమ్మవారికి పెడతారు. కొన్ని చోట్ల రాత్రికి గుడిలో సెమీపూజ జరుగుతుంది ఆ పుజా సమయములో జమ్మి చెట్టుకి ఈ పద్యము రాసిన చీటి పెట్టి ఏదన్నా కోరుకుంటే తప్పక జరుగుతుంది అని నమ్మకము.

 ఆ శ్లోకము :

"శమీ శమైతే పాపం శమీ శత్రువినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం"




- స్వస్తి...