కోటి సోమవారం :


                                   కార్తీకం మాసంలో ప్రతిరోజు పవిత్రమైనదే. 
అందులోనూ సోమవారం మరింత ప్రాధాన్యం కలిగిన రోజు. సోమవారంనాడు శ్రవణ నక్షత్రం ఉంటే ఆరోజును కోటి సోమవారంగా వ్యవహరిస్తారు. ఇటువంటి సోమవారాలు చాలా అరుదుగా వస్తాయి. 2019, నవంబర్‌ 4న సోమవారం శ్రవణ నక్షత్రంతో కూడియున్నది. ఈరోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలం లభిస్తుంది. నవంబర్‌ 4 సోమవారం రోజున శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి అనుసారం వారు చేస్తే మంచిది. అదేవిధంగా ఈ రోజు దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానాలు, ధర్మాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్ర ప్రవచనం.

ఇక ఆలస్యమెందుకు సోమవారం ఎవరి శక్తి అనుసారం వారు దీక్షగా ఓం నమఃశివాయ పంచాక్షరితో భక్తి ప్రపత్తులతో శివుడికి దగ్గరగా ఉపేన వాసం.. అంటే ఉపవాసం చేయండి. అనంత పుణ్యఫలాలలను పొందండి. ఉపవాసాలు, నక్తాలు, దీక్షలను 8 ఏండ్లలోపు పిల్లలు, 80 ఏండ్ల దాటిన వారు చేయకూడదు. షుగర్‌, బీపీ తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, శ్రామికులు, రైతులు వారికి అవకాశం ఉంటేనే చేయాలి. వారు చేయకున్నా దోషం లేదని పెద్దలు చెప్తున్నారు. వారి కర్మలను అంటే పనులను చేసుకుంటూ శివనామాన్ని భక్తితో జపిస్తే వారికి దీక్ష ఉన్న ఫలం లభిస్తుంది. గర్భిణులు, బాలింతలు, ఆపరేషన్‌ అయినవారు కూడా దీక్షలు చేయకున్నా దోషం లేదు. వారు కూడా తమ శక్తిమేరకు శివనామ జపం చేస్తే చాలు.



కార్తీక మాసం - కార్తీక సోమవారం :


               సోమవారము లేదా ఇందువారము అనేది వారములో రెండవ రోజు. 
ఇది ఆదివారమునకు మరియు మంగళవారమునకుమధ్యలో ఉంటుంది. 
సాంప్రదాయంగా క్రైస్తవ కాలెండరు, ఇస్లామీయ కాలెండరు మరియు హిబ్రూ కాలెండరులలో ఈ దినం వారంలో రెండవ రోజుగా పరిగణింపబడుతున్నది.
 అంతర్జాతీయ ప్రామాణిక కాలెండరు ISO 8601 లో ఈ దినం వారంలో మొదటి రోజుగా పరిగణింపబడుతున్నది.

         ఈ దినానికి ఆంగ్లంలో పేరు మండే (Monday) అనునది పాత ఆంగ్లం భాషలో "మొనాండే(Mōnandæg)" మరియు మధ్య కాలపు ఆంగ్ల భాషలో "మొనెన్‌డే (Monenday)" నుండి వచ్చింది.

దానిఅర్థము చంద్రుని రోజు. సోమవారాన్ని శివునికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.

భారత దేశంలోని అనేక భాషలలో సోమవారం అనేది సంస్కృతం భాషలోని "సోమవార (सोमवार)" నుండి ఉత్పత్తి అయినట్లు తెలుస్తుంది. సోముడు అనగా చంద్రుడు అని అర్థం. భారత దేశంలోనికొన్ని భాషలలో ఈ రోజును చంద్రవారం గా పిలుస్తారు. సంస్కృత భాషలో చంద్ర అనగా చంద్రుడు అని అర్థము.

        థాయిలాండ్ లో ఈ దినాన్ని "వాన్ జాన్" అని పిలుస్తారు. దీని అర్థము " చంద్రుని యొక్క రోజు".


"సోమ" శబ్దానికి " చంద్రుడు" అనే అర్ధమే కాక, స+ ఉమ = ఉమా సహితుడు అని శివపరమైన అర్ధము చెప్పవచ్చు.పార్వతి సహితుడైన పరమేశ్వరునుకి ఆరధన కార్తీక సోమవారాలలో విశేషం .

 సోమవారం శివునికి ప్రీతికరముగ భావిస్తాము. నిజానికి ప్రతికాలము పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతనిస్తాయి.

అయితే "శివ పురాణము " ప్రకారం "ఆదివారం" శివారాధనకు చాలా ప్రాధాన్యం. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం.

అయితే సోమవారం " సౌమ్యప్రదోషం"గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రథమని పురాణాది శాస్త్రాల వచనం. స్కందాది పురాణాలలో సోమవారవ్రతం గురించి విశేషముగ చెప్పారు.

 దీని ప్రకారం సోమవారమ్నాడు ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తిచేసి, ఉపవాసముండి సాయంకాలం శివున్ని ఆరధించి, నక్షత్రోదయ సమయాన్న ఈశ్వర నివేదితమైన వంటని తినడం నక్త వ్రతం అంటారు.

ఈ నియమముతో 16 సోమవారాలు చేస్తే అన్ని గ్రహదోషాలు పోవడమేకాక, అన్ని అభిష్టాలు నెరవేర్తాయి.

కార్తీక సోమవారం

 కార్తీకమాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని శాస్త్రం.
       అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది




- స్వస్తి...