మనం సమగ్రమైన భారత తెలుగు కాలమానాన్ని (జంత్రి) మరచిపోయి, అర్థంలేని గ్రెగోరియన్ (ఆంగ్ల) క్యాలండర్ ను అనుసరిస్తున్నాం అని గమనించాలి...


భారతీయ కాలమానం (జంత్రి) ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది.. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకృతికి విరుద్ధం.. 

ఎలాగో గమనించండి..

భారతీయ కాలమానం ప్రకారం సూర్యోదయంతో దినం మొదలవుతుంది.. 

మనకు ఒక రోజు అంటే ఇవాళ తెల్లవారుఝాము నుండి మరునాటి తెల్లవారు వరకూ.. 

కానీ గ్రెగోరియన్ క్యాలండర్ మాత్రం అర్ధరాత్రి పూట దినం మొదలవుతుంది.. 

అది తిరిగి అర్ధరాత్రి వరకూ కొనసాగుతుంది..

సృష్టిలో ఏ ప్రాణి అయినా తెల్లవారు ఝామునే నిద్ర లేస్తుంది.. 

మనుషులంతా ఉదయాన్నే నిద్ర లేని దైనందిన కార్యక్రమాలకు సిద్ధమవుతాం.. 

పక్షుల కిలకిలరావాలు సుమధురంగా వినిపించేది.. 

తోటల్లో పూవులు వికసిస్తాయి.. 

ఆవులు దూడలకు పాలను ఇస్తాయి.. 

మరి ఈ చర్యలన్నీ అర్ధరాత్రి జరగడం మీరెప్పుడైనా చూశారా? 

ప్రకృతి నియమాల ప్రకారం సాగే ఈ చర్యలు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి పూట జరగడం మీరు ఎక్కడైనా చూశారా?

మనం ఆలయాల్లో సుప్రభాత ప్రార్ధనలు తెల్లవారునే ఎందుకు చేస్తాం? 

అర్ధరాత్రి ఎందుకు చేయం.. 

మన పండుగలు భారతీయ కాలమానం ప్రకారమే జరుపుకుంటున్నం.. 

గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడైనా జరుపుకుంటున్నామా?

భారతీయ సాంప్రదాయం ప్రకారం ఉగాదితో నూతన సంవత్సరం ఆరంభం అవుతుంది.. 

సూర్యమానమైనా, చంద్రమానమైనా గ్రహాల గమనం, ప్రకృతి ధర్మాల ప్రకారం మన కాలమానం రూపుదిద్దుకుంది.. 

జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం అని చెప్పడానికి సరైన ప్రమాణాలు లేవు.. 

రోమన్లు, గ్రీకులు పాటించే గ్రెగోరియర్ క్యాలెండర్ కాలగమనంలో అనేక మార్పులకు లోనైంది.. 

యూరోప్ దేశాల వలస పాలన ద్వారా ప్రపంచ దేశాలన్నిటిపైనా బలవంతాన రుద్దబడింది.. 

ఆంగ్లేయుల ద్వారా మన దేశానికి దాపురించింది..

నిజానికి స్పష్టమైన కాలగణన ఉన్న భారతీయ కాలమానమే ప్రపంచానికి ఆదర్శం..

 గ్రెగేరియన్ క్యాలండర్లో ఎన్నో లోపాలు కనిపిస్తాయి..

మనం నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సింది ఉగాది రోజునే..

 జనవరి 1వ తేదీన జరుపుకోవాలని నియమం ఏమీ లేదు..

 ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ను అనుసరిస్తున్నాయి.. 

దీన్ని మనం క్యాలెండర్ మార్పుగానే గుర్తించాలి..

అందుకే ఇప్పుడు తెలుగు వారి కోసం మన భారతీయ కాలమాన సూచికని  ( జంత్రి )  అచ్చ తెలుగు లో ముద్రించడం జరుగుతుంది... ఇందులో  తెలుగు మొదటి నెల ( చైత్రం ) తో మొదలయ్యి పాల్గుణం తో ముగుస్తుంది... 

ఆంగ్ల క్యాలెండర్ మాదిరి జనవరి నుండి డిసెంబర్ ఉండదు...

తిధుల ద్వారా ఈ భారతీయ జంత్రి (క్యాలెండర్) ని రూపొందించడం జరుగుతుంది... ఇదే నిజమైన కాల సూచిక...

 ఈ కాల సూచిక (జంత్రి) ను చైత్రం మాసపు మొదటి రోజయిన చైత్ర శుద్ధ పాడ్యమి రోజున విడుదల చేయడం జరుగుతుంది...

మీకు ఈ తిధుల ఆధారంగా గణించబడిన కాల సూచిక ( క్యాలెండర్ ) ( జంత్రి ) కావాలి అనుకుంటే మీ యొక్క ఇంటి చిరునామా ను 8096339900 కి పంపండి...




తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?

ఓసారి నారద మహర్షి, విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓ యుద్ధంలో 60 మంది పుత్రులు చనిపోతారు. అప్పుడు నారదముని చేసిన ప్రార్థనకు విష్ణువు కరుణించి నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ వుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.

మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకునేందుకు మీ కోసం ఆ 60 తెలుగు సంవ‌త్స‌రాలు.

(1867,1927,1987): ప్రభవ
(1868,1928,1988): విభవ
(1869,1929,1989): శుక్ల
(1870,1930,1990): ప్రమోదూత
(1871,1931,1991): ప్రజోత్పత్తి
(1872,1932,1992): అంగీరస
(1873,1933,1993): శ్రీముఖ
(1874,1934,1994): భావ
(1875,1935,1995): యువ
(1876,1936,1996): ధాత
(1877,1937,1997): ఈశ్వర
(1878,1938,1998): బహుధాన్య
(1879,1939,1999): ప్రమాది
(1880,1940,2000): విక్రమ
(1881,1941,2001): వృష
(1882,1942,2002): చిత్రభాను
(1883,1943,2003): స్వభాను
(1884,1944,2004): తారణ
(1885,1945,2005): పార్థివ
(1886,1946,2006): వ్యయ
(1887,1947,2007): సర్వజిత్
(1888,1948,2008): సర్వదారి
(1889,1949,2009): విరోది
(1890,1950,2010): వికృతి
(1891,1951,2011): ఖర
(1892,1952,2012): నందన
(1893,1953,2013): విజయ
(1894,1954,2014): జయ
(1895,1955,2015): మన్మద
(1896,1956,2016): దుర్ముఖి
(1897,1957,2017): హేవిళంబి
(1898,1958,2018): విళంబి
(1899,1959,2019): వికారి
(1900,1960,2020): శార్వరి
(1901,1961,2021): ప్లవ
(1902,1962,2022): శుభకృత్
(1903,1963,2023): శోభకృత్
(1904,1964,2024): క్రోది
(1905,1965,2025): విశ్వావసు
(1906,1966,2026): పరాభవ
(1907,1967,2027): ప్లవంగ
(1908,1968,2028): కీలక
(1909,1969,2029): సౌమ్య
(1910,1970,2030): సాదారణ
(1911,1971,2031): విరోదికృత్
(1912,1972,2032): పరీదావి
(1913,1973,2033): ప్రమాది
(1914,1974,2034): ఆనంద
(1915,1975,2035): రాక్షస
(1916,1976,2036): నల
(1917,1977,2037): పింగళ
(1918,1978,2038): కాళయుక్తి
(1919,1979,2039): సిద్దార్థి
(1920,1980,2040): రౌద్రి
(1921,1981,2041): దుర్మతి
(1922,1982,2042): దుందుభి
(1923,1983,2043): రుదిరోద్గారి
(1924,1984,2044): రక్తాక్షి
(1925,1985,2045): క్రోదన
(1926,1986,2046): అక్షయ


తెలుగు సంవత్సరాలు వాటి పేర్లు.

60 తెలుగు సంవత్సరాలు

01 – ప్రభవ
02 – విభవ
03 – శుక్ల
04 – ప్రమోదూత
05 – ప్రజోత్పత్తి
06 – అంగీరస
07 – శ్రీముఖ
08 – భావ
09 – యువ
10 – ధాత
11 – ఈశ్వర
12 – బహుధాన్య
13 – ప్రమాది
14 – విక్రమ
15 – వృష
16 – చిత్రభాను
17 – స్వభాను
18 – తారణ
19 – పార్థివ
20 – వ్యయ
21 – సర్వజిత్తు
22 – సర్వధారి
23 – విరోధి
24 – వికృతి
25 – ఖర
26 – నందన
27 – విజయ
28 – జయ
29 – మన్మథ
30 – దుర్ముఖి
31 – హేవిలంబి (లేదా) హేమలంబ
32 – విలంబి
33 – వికారి
34 – శార్వరి
35 – ప్లవ
36 – శుభకృతు
37 – శోభకృతు
38 – క్రోధి
39 – విశ్వావసు
40 – పరాభవ
41 – ప్లవంగ
42 – కీలక
43 – సౌమ్య
44 – సాధారణ
45 – విరోధికృతు
46 – పరీధావి
47 – ప్రమాదీచ
48 – ఆనంద
49 – రాక్షస
50 – నల
51 – పింగళ (లేదా) పింగల
52 – కాళయుక్తి (లేదా) కాలయుక్తి
53 – సిధ్ధార్థి
54 – రౌద్రి
55 – దుర్మతి
56 – దుందుభి
57 – రుధిరోద్గారి
58 – రక్తాక్షి
59 – క్రోధన
60 – అక్షయ



సంవత్సరమునకు ఋతువులు ఆరు. అవి…


1. వసంతఋతువు [ చైత్రం, వైశాఖం ] చెట్లు చిగురించి పూవులు పూయును.
2. గ్రీష్మఋతువు [ జ్యేష్టం, ఆషాఢం ] ఎండలు మెండుగా ఉండును.
3. వర్షఋతువు [ శ్రావణం, భాద్రపదం ] వర్షములు విశేషముగా ఉండును.
4. శరదృతువు [ ఆశ్వయుజం, కార్తీకం ] మంచి వెన్నెల కాయును.
5. హేమంతఋతువు [ మార్గశిరం, పుష్యం ] మంచు కురియును, చల్లగా నుండు కాలము.
6. శిశిరఋతువు [ మాఘం, ఫాల్గుణం ] చెట్లు ఆకులు రాల్చును.


వసంతఋతువు – మార్చి 20 నుండి మే 20 వరుకు, గ్రీష్మఋతువు – మే 20 నుండి జూలై 20 వరుకు, వర్షఋతువు – జూలై 20 నుండి సెప్టెంబర్ 20 వరుకు, శరదృతువు – సెప్టెంబర్ 20 నుండి నవంబర్ 20 వరుకు, హేమంతఋతువు – నవంబర్ 20 నుండి జనవరి 20 వరుకు, శిశిరఋతువు – జనవరి 20 నుండి మార్చి 20 వరుకు.




తెలుగు నెలలు :


తెలుగు నెలలు పన్నెండు. నెలకు ముప్పై రోజులు. పదిహేను రోజులు ఒక పక్షం. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి)తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.


12 తెలుగు నెలలు


01. చైత్రమాసము
02. వైశాఖమాసము
03. జ్యేష్ఠమాసము
04. ఆషాఢమాసము
05. శ్రావణమాసము
06. భాద్రపదమాసము
07. ఆశ్వయుజమాసము
08. కార్తీకమాసము
09. మార్గశిరమాసము
10. పుష్యమాసము
11. మాఘమాసము
12. ఫాల్గుణమాసము



తెలుగు పక్షములు :


పక్షము అనగా 15 రోజులకు (లేదా కచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి.

1. శుక్ల పక్షం : అమావాస్య నుంచి పౌర్ణమి వరకు శుక్ల పక్షం. శుక్ల అంటే తెల్లని అని అర్థం.

2.కృష్ణ  పక్షం : పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కృష్ణ పక్షం. కృష్ణ అంటే నల్లని అని అర్థం.


మహాలయ పక్షము :

బాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అందురు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని పితృ పక్షము అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగర ఖండమున ఉంది.




నవ గ్రహాలు :


1. సూర్యుడు
2. చంద్రుడు
3. అంగారకుడు (మంగళగ్రహం)
4. బుధుడు
5. గురువు
6. శుక్రుడు
7. శని
8. రాహువు
9. కేతువు

నవ గ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు నిర్వహించడం చాలామంది హిందువుల ఆచారాలలో ఒక ముఖ్యమైన అంశం. చాలా ఆలయాలలో ముఖ్యంగా శివాలయాలలో నవగ్రహాల మందిరాలు ఉంటాయి.

ఒక్కో గ్రహానికి ఒక్కో వర్ణం ఉంటుంది. 

అవి వరసగా

తెలుపు వర్ణం : శుక్రుడు, చంద్రుడు
పసుపు వర్ణం : గురువు
ఎరుపు వర్ణం : అంగారకుడు, సూర్యుడు
ఆకుపచ్చ వర్ణము : బుధుడు
నలుపు వర్ణము : శని

పొగరంగు (దూమ్ర వర్ణం ) : రాహువు, కేతువు




నవగ్రహ దేవతలు :

1. సూర్యుడు – శివ
2. చంద్రుడు – దేవి
3. కుజుడు – స్కంధ
4. బుధుడు – హరి
5. గురుడు – బ్రహ్మ
6. శుక్రుడు – ఇంద్ర
7. శని – యముడు
8. రాహువు – మృత్యు
9. కేతువు – చిత్రగుప్త



అధిక మాసము :

పంచాంగ గణనం ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంబావు రోజులు తేడా ఉంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. ఇదే మాదిరిగా చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇందువల్ల ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావడం జరగకుండా పోతుంది. అటువంటప్పుడు సూర్యసంక్రాంతి లేకుండా పోయిన చాంద్రమాసానికి అధికమాసం అని పేరుపెట్టారు.

ఈ అధిక మాసము ఎప్పుడూ చైత్రమాసము నుండి ఆశ్వయుజమాసము మధ్యలోనే వస్తుంది. ఒక సారి అధిక మాసము వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆతర్వాత నిజ మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మైల మాసం అని అంటారు. అనగా ఈ అధిక మాసంలో ఎలాంటి శుభ కార్యాలు, ముఖ్యమైన దైవకార్యాలు చేయకూడదు.


వివరణ :

సూర్యుని చుట్టూ భూమి చుట్టివచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ భ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర భ్రమణమే మూలం. భూమి చుట్టు చంద్రుని ప్రదక్షిణాకాలాన్ని నెల అంటారు. దాన్నే చాంద్ర మాసమని అంటారు. ఆ విదంగా ఏర్పడిన 12 చాంద్ర మాసాలను కలిపి ఒక సంవత్సరం అని అనలేము. సూర్యుడు …. మేషం, వృషభం వంటి 12 రాశులలో ఒక్కో రాశిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌర మాసం అని అంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి ప్రవేశించ డాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోను జరుగుతుంది. కాని మనం మకర రాశి సంక్రమణాన్ని మాత్రమే మకర సంక్రాంతిగా గుర్తిస్తున్నాము. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు…… రెండు నెలల పాటు ఒకే రాశిలో వుండటం వల్ల ఏర్పడేదే అధిక మాసం. ఇందులో మొదటి నెలలో రవి సంక్రాంతి వుండదు. దాన్నే అధిక మాసం అంటారు.

అధిక మాసము చంద్ర మానము ద్వారానే వస్తుంది. చాంద్ర మానం అంటే చంద్ర కళలను (తిథులను) ఆదారంగా ఒక నెల రోజులను లెక్కించడము. సూర్యుడు ఏడాదిలో 12 రాశుల చక్రాన్నిపూర్తి చేస్తే చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే వుంటాడు. అనగా 12 x 27 = 354 రోజులు. సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి 365 రోజులా, 6 గంటలు, 11 నిముషాలు 31 సెకెండ్లు పడుతుంది. చంద్రునికైతె 354 రోజులె పడుతుంది. వీరిద్దరి మధ్య సుమారు 11 రోజులు తేడా ఉంది. ఈ వ్యత్యాసం వల్ల భూమి సూర్యుని చుట్టు 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగుతున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు….. ఏడాదికి 12 మాసాల చొప్పున 238 మాసాలు రావలసి వుండగా 235 మాత్రమే వస్తున్నాయి. అనగా చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగు తున్నాడని అర్థం. ఆ లెక్కన ప్రతి ముప్పై రెండున్నర సౌర మాసాలకు ఒక చంద్ర మాసం అధికంగా వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించిన వారు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞలే.



తెలుగు తిథులు :

తిథి అనగా… తేది, దినము, రోజు అని అర్థం.  తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.

పక్షంలోని తిథులు
పాడ్యమి (అగ్ని)
విదియ (బ్రహ్మ)
తదియ (గౌరి)
చవితి (వినాయకుడు)
పంచమి (సర్పము)
షష్ఠి (కుమార స్వామి)
సప్తమి (సూర్యుడు)
అష్టమి (శివుడు)
నవమి (దుర్గా దేవి)
దశమి (యముడు)
ఏకాదశి (శివుడు)
ద్వాదశి (విష్ణువు)
త్రయోదశి (మన్మధుడు)
చతుర్దశి (శివుడు)
పౌర్ణమి/పూర్ణిమ/పున్నమి (చంద్రుడు)
అమావాస్య (పితృదేవతలు)


ఆకాశంలో చంద్రుడు అమావాస్య రోజున పూర్తిగా కనిపించడు. ఆ మరుదినము సన్నని రేఖలా కనుపించిన చంద్రుడు దిన దినాభివృద్ధి చెందుతూ 15వ రోజున పూర్ణ చంద్రుడుగా కనిపిస్తాడు. ఆరోజు పౌర్ణమి. ఆ మరు దినము చంద్రుడు దినదినానికి క్షీణించి 15వ రోజున పూర్తిగా కను మరుగౌతాడు. ఆ రోజు అమావాస్య.



తిథి శూలలు :

తూర్పు : పాడ్యమి నవమి
ఆగ్నేయము : తదియ, ఏకాదశి
దక్షిణము : పంచమి, త్రయోదశి
నైరుతి : చవితి, ద్వాదశి
పడమర : షష్ఠి, చతుర్ధశి
వాయవ్యము : సప్తమి, పూర్ణిమ
ఉత్తరము : విదియ, దశమి
ఈశాన్యము : అష్టమి, అమావాస్య




తెలుగు వారములు :

ప్రతి దినమునకు ఒక పేరు ఉంది.

వారముల పేర్లు

ఆదివారము
సోమవారము
మంగళవారము
బుధవారము
గురువారము
శుక్రవారము
శనివారము
ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు.




తెలుగు నక్షత్రాల పేర్లు : 

ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షం లో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వం లో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

27 నక్షత్రాలు

· అశ్వని
· భరణి
· కృత్తిక
· రోహిణి
· మృగశిర
· ఆరుద్ర
· పునర్వసు
· పుష్యమి
· ఆశ్లేష
· మఖ
· పూర్వఫల్గుణి
· ఉత్తరఫల్గుణి
· హస్త
· చిత్త
· స్వాతి
· విశాఖ
· అనూరాధ
· జ్యేష్ట
· మూల
· పూర్వాషాఢ
· ఉత్తరాషాఢ
· శ్రవణ
· ధనిష్ఠ
· శతభిష
· పూర్వాభాద్ర
· ఉత్తరాభాద్ర
· రేవతి

మరికొన్ని వివరాలు

పురుష నక్షత్రాలుఅశ్వని, పునర్వసు, పుష్యమి, హస్త, శ్రవణము, అనూరాధ, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర
స్త్రీనక్షత్రాలుభరణి, కృత్తిక, రోహిణి, ఆర్ద్ర, ఆస్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాఢ, ధనిష్ట, రేవతి

నపుంసక నక్షత్రాలుమృగశిర, మూల, శతభిష

యోగములు :

పంచాంగం ప్రకారం యోగ నామములు 27. అవి…
· వైధృతి
· విష్కంభ
· ప్రీతి
· ఆయుష్మాన్
· సౌభాగ్య
· శోభన
· అతిగండ
· సుకర్మ
· ధృతి
· శూల
· గండ
· వృద్ధ
· ధృవ
· వ్యగత
· హర్షణ
· వజ్ర
· సిద్ధి
· వ్యతపత
· వరియన
· పరిఘ
· శివ
· సిద్ధ
· సాధ్య
· శుభ
· శుక్ల
· బ్రహ్మ
· ఇంద్ర

రాశుల పేర్లు :

జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో కలిసి నూట ఎన్మిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి.  సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాస కాలం ఉంటాడు. ఆ తరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి రెండు గంటలు చొప్పున ఇరవైనాలుగు గంటల కాలాన్ని పన్నెండు లగ్నాలుగా విభజిస్తారు.

12 రాశులు

మేషరాశి (మార్చి 21 – ఏప్రిల్‌ 20)
వృషభరాశి (ఏప్రిల్‌ 21 – మే 20 )
మిథునరాశి (మే 21 – జూన్‌ 21)
కర్కాటకరాశి (జూన్‌ 22 – జూలై 20)
సింహరాశి (జూలై 21 – ఆగష్టు 20)
కన్యారాశి (ఆగష్టు 21 – సెప్టెంబర్‌ 20)
తులారాశి (సెప్టెంబర్‌ 21 – అక్టోబర్ 20)
వృశ్చిక రాశి (అక్టోబర్ 21 – నవంబర్ 20)
ధనూరాశి (నవంబర్ 21 – డిసెంబర్‌ 20)
మకరరాశి (డిసెంబర్‌ 21 – జనవరి 20)
కుంభరాశి (జనవరి 21 – ఫిబ్రవరి 20)
మీనరాశి (ఫిబ్రవరి 21  – మార్చి 20)

12 రాశుల స్వరూపం :

జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు. వాటి స్వరూపం.
మేషం : మేక ఆకారం.
వృషభం : కుమ్ముతున్న ఎద్దు.
మిధునం : గదను ధరించిన పురుషుడు.
కర్కాటకం : ఎండ్రకాయ ఆకారం.
సింహం : సింహాకారము.
కన్య : సస్యమును, దీపమును చేత పట్టుకుని తెప్ప మీద ఉన్న కన్య.
తుల : త్రాసు ధరించిన పురుషుడు.
వృశ్చికము : తేలు ఆకారము.
ధనస్సు : ధనస్సు ధరించిన పురుషుడు.
మకరము : మృగము వంటి ముఖము కలిగిన మొసలి.
కుంభము : రిక్త కుంభము చేత పట్టిన పురుషుడు.
మీనము : అన్యోన్య పుచ్ఛాభిముఖమై ఉన్న రెండు చేపలు

తెలుగు మాసముల వివరణ :

చైత్ర మాసము 

తెలుగు సంవత్సరంలో మొదటి నెల. పౌర్ణమి రోజున చిత్త నక్షత్రము (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల చైత్రము. ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఈ నెలతో వసంత ఋతువు ప్రారంభం కావడం వల్ల చెట్లన్నీ కొత్తగా చిగురించడం, పూతపూయడం మొదలు పెడతాయి. చలికాలం ముగియడంతో వాతావరణం నులివెచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

చైత్ర శుద్ధ పాడ్యమి
చైత్ర శుద్ధ విదియ
చైత్ర శుద్ధ తదియ
చైత్ర శుద్ధ చతుర్థి
చైత్ర శుద్ధ పంచమి
చైత్ర శుద్ధ షష్ఠి
చైత్ర శుద్ధ సప్తమి
చైత్ర శుద్ధ అష్ఠమి
చైత్ర శుద్ధ నవమి
చైత్ర శుద్ధ దశమి
చైత్ర శుద్ధ ఏకాదశి
చైత్ర శుద్ధ ద్వాదశి
చైత్ర శుద్ధ త్రయోదశి
చైత్ర శుద్ధ చతుర్దశి
చైత్ర పౌర్ణమి / పూర్ణిమ
చైత్ర బహుళ పాడ్యమి
చైత్ర బహుళ విదియ
చైత్ర బహుళ తదియ
చైత్ర బహుళ చవితి
చైత్ర బహుళ పంచమి
చైత్ర బహుళ షష్ఠి
చైత్ర బహుళ సప్తమి
చైత్ర బహుళ అష్ఠమి
చైత్ర బహుళ నవమి
చైత్ర బహుళ దశమి
చైత్ర బహుళ ఏకాదశి
చైత్ర బహుళ ద్వాదశి
చైత్ర బహుళ త్రయోదశి
చైత్ర బహుళ చతుర్దశి
చైత్ర బహుళ అమావాస్య




వైశాఖ మాసము :


వైశాఖ మాసము తెలుగు సంవత్సరంలో రెండవ నెల. పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రము (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల వైశాఖము. దానాలు ఇవ్వడానికి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైన మాసంగా పురాణాలలో చెప్పడం జరిగింది.

వైశాఖ శుద్ధ పాడ్యమి
వైశాఖ శుద్ధ విదియ
వైశాఖ శుద్ధ తదియ
వైశాఖ శుద్ధ చతుర్థి
వైశాఖ శుద్ధ పంచమి
వైశాఖ శుద్ధ షష్ఠి
వైశాఖ శుద్ధ సప్తమి
వైశాఖ శుద్ధ అష్ఠమి
వైశాఖ శుద్ధ నవమి
వైశాఖ శుద్ధ దశమి
వైశాఖ శుద్ధ ఏకాదశి
వైశాఖ శుద్ధ ద్వాదశి
వైశాఖ శుద్ధ త్రయోదశి
వైశాఖ శుద్ధ చతుర్దశి
వైశాఖ పౌర్ణమి / పూర్ణిమ
వైశాఖ బహుళ పాడ్యమి
వైశాఖ బహుళ విదియ
వైశాఖ బహుళ తదియ
వైశాఖ బహుళ చవితి
వైశాఖ బహుళ పంచమి
వైశాఖ బహుళ షష్ఠి
వైశాఖ బహుళ సప్తమి
వైశాఖ బహుళ అష్ఠమి
వైశాఖ బహుళ నవమి
వైశాఖ బహుళ దశమి
వైశాఖ బహుళ ఏకాదశి
వైశాఖ బహుళ ద్వాదశి
వైశాఖ బహుళ త్రయోదశి
వైశాఖ బహుళ చతుర్దశి
వైశాఖ బహుళ అమావాస్య




జ్యేష్ఠ మాసము :

తెలుగు సంవత్సరంలో మూడవ నెల. పౌర్ణమి రోజున జ్యేష్ట నక్షత్రము (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈనెల జ్యేష్ఠము.

జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి
జ్యేష్ఠ శుద్ధ విదియ
జ్యేష్ఠ శుద్ధ తదియ
జ్యేష్ఠ శుద్ధ చతుర్థి
జ్యేష్ఠ శుద్ధ పంచమి
జ్యేష్ఠ శుద్ధ షష్ఠి
జ్యేష్ఠ శుద్ధ సప్తమి
జ్యేష్ఠ శుద్ధ అష్ఠమి
జ్యేష్ఠ శుద్ధ నవమి
జ్యేష్ఠ శుద్ధ దశమి
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి
జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి
జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి
జ్యేష్ఠ పౌర్ణమి / పూర్ణిమ
జ్యేష్ఠ బహుళ పాడ్యమి
జ్యేష్ఠ బహుళ విదియ
జ్యేష్ఠ బహుళ తదియ
జ్యేష్ఠ బహుళ చవితి
జ్యేష్ఠ బహుళ పంచమి
జ్యేష్ఠ బహుళ షష్ఠి
జ్యేష్ఠ బహుళ సప్తమి
జ్యేష్ఠ బహుళ అష్ఠమి
జ్యేష్ఠ బహుళ నవమి
జ్యేష్ఠ బహుళ దశమి
జ్యేష్ఠ బహుళ ఏకాదశి
జ్యేష్ఠ బహుళ ద్వాదశి
జ్యేష్ఠ బహుళ త్రయోదశి
జ్యేష్ఠ బహుళ చతుర్దశి

జ్యేష్ఠ బహుళ అమావాస్య



ఆషాఢ మాసము :

తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజును వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు.

అధిక ఆషాఢమాసము వచ్చిన సంవత్సరం పూరీ జగన్నాధ ఆలయంలోని మూలవిరాట్టుల్ని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలు చేయిస్తారు. దీన్ని ‘నవకళేబర ఉత్సవం’ అంటారు.

ఆషాఢ శుద్ధ పాడ్యమి
ఆషాఢ శుద్ధ విదియ
ఆషాఢ శుద్ధ తదియ
ఆషాఢ శుద్ధ చతుర్థి
ఆషాఢ శుద్ధ పంచమి
ఆషాఢ శుద్ధ షష్ఠి
ఆషాఢ శుద్ధ సప్తమి
ఆషాఢ శుద్ధ అష్ఠమి
ఆషాఢ శుద్ధ నవమి
ఆషాఢ శుద్ధ దశమి
ఆషాఢ శుద్ధ ఏకాదశి
ఆషాఢ శుద్ధ ద్వాదశి
ఆషాఢ శుద్ధ త్రయోదశి
ఆషాఢ శుద్ధ చతుర్దశి
ఆషాఢ పౌర్ణమి / పూర్ణిమ
ఆషాఢ బహుళ పాడ్యమి
ఆషాఢ బహుళ విదియ
ఆషాఢ బహుళ తదియ
ఆషాఢ బహుళ చవితి
ఆషాఢ బహుళ పంచమి
ఆషాఢ బహుళ షష్ఠి
ఆషాఢ బహుళ సప్తమి
ఆషాఢ బహుళ అష్ఠమి
ఆషాఢ బహుళ నవమి
ఆషాఢ బహుళ దశమి
ఆషాఢ బహుళ ఏకాదశి
ఆషాఢ బహుళ ద్వాదశి
ఆషాఢ బహుళ త్రయోదశి
ఆషాఢ బహుళ చతుర్దశి
ఆషాఢ బహుళ అమావాస్య






శ్రావణ మాసము :

 తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల శ్రావణము. ఈ మాసంలో విరివిగా వర్షాలు పడతాయి.
శ్రావణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్/తెలంగాణలో స్త్రీలు వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం. అదే విధంగా ఈమాసంలోనే మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం కూడా చాలా మంది పాటిస్తారు.

శ్రావణ శుద్ధ పాడ్యమి
శ్రావణ శుద్ధ విదియ
శ్రావణ శుద్ధ తదియ
శ్రావణ శుద్ధ చతుర్థి
శ్రావణ శుద్ధ పంచమి
శ్రావణ శుద్ధ షష్ఠి
శ్రావణ శుద్ధ సప్తమి
శ్రావణ శుద్ధ అష్ఠమి
శ్రావణ శుద్ధ నవమి
శ్రావణ శుద్ధ దశమి
శ్రావణ శుద్ధ ఏకాదశి
శ్రావణ శుద్ధ ద్వాదశి
శ్రావణ శుద్ధ త్రయోదశి
శ్రావణ శుద్ధ చతుర్దశి
శ్రావణ పౌర్ణమి / పూర్ణిమ
శ్రావణ బహుళ పాడ్యమి
శ్రావణ బహుళ విదియ
శ్రావణ బహుళ తదియ
శ్రావణ బహుళ చవితి
శ్రావణ బహుళ పంచమి
శ్రావణ బహుళ షష్ఠి
శ్రావణ బహుళ సప్తమి
శ్రావణ బహుళ అష్ఠమి
శ్రావణ బహుళ నవమి
శ్రావణ బహుళ దశమి
శ్రావణ బహుళ ఏకాదశి
శ్రావణ బహుళ ద్వాదశి
శ్రావణ బహుళ త్రయోదశి
శ్రావణ బహుళ చతుర్దశి
శ్రావణ బహుళ అమావాస్య


బాధ్రపద మాసము :

తెలుగు సంవత్సరంలో ఆరవ నెల. చాంద్రమానం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వాబాధ్ర లేదా ఉత్తరాబాధ్ర నక్షత్రం ఉండడం వలన ఇది బాధ్రపద మాసం అనబడింది. ఇది వర్షఋతువు కావున విరివిగా వర్షాలు పడును.
బాధ్రపద శుద్ధ చవితి (వినాయక చవితి) నుంచి తొమ్మిది రాత్రులు గణపతి నవరాత్రాలు జరుపుకుంటారు. చివరిరోజున నిమజ్జనం వైభగంగా జరిపిస్తారు.
భాద్రపద శుద్ధ పాడ్యమి
భాద్రపద శుద్ధ విదియ
భాద్రపద శుద్ధ తదియ
భాద్రపద శుద్ధ చతుర్థి
భాద్రపద శుద్ధ పంచమి
భాద్రపద శుద్ధ షష్ఠి
భాద్రపద శుద్ధ సప్తమి
భాద్రపద శుద్ధ అష్ఠమి
భాద్రపద శుద్ధ నవమి
భాద్రపద శుద్ధ దశమి
భాద్రపద శుద్ధ ఏకాదశి
భాద్రపద శుద్ధ ద్వాదశి
భాద్రపద శుద్ధ త్రయోదశి
భాద్రపద శుద్ధ చతుర్దశి
భాద్రపద పౌర్ణమి / పూర్ణిమ
భాద్రపద బహుళ పాడ్యమి
భాద్రపద బహుళ విదియ
భాద్రపద బహుళ తదియ
భాద్రపద బహుళ చవితి
భాద్రపద బహుళ పంచమి
భాద్రపద బహుళ షష్ఠి
భాద్రపద బహుళ సప్తమి
భాద్రపద బహుళ అష్ఠమి
భాద్రపద బహుళ నవమి
భాద్రపద బహుళ దశమి
భాద్రపద బహుళ ఏకాదశి
భాద్రపద బహుళ ద్వాదశి
భాద్రపద బహుళ త్రయోదశి
భాద్రపద బహుళ చతుర్దశి
భాద్రపద బహుళ అమావాస్య


ఆశ్వయుజ మాసము  :

తెలుగు సంవత్సరంలో ఏడవ నెల. ఈ నెల పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రము (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఇది ఆశ్వయుజము. ఈ నెల పాడ్యమి నుండి నవమి వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. చివరి రోజైన అమావాస్య నాడు దీపావళి పండుగ.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
ఆశ్వయుజ శుద్ధ విదియ
ఆశ్వయుజ శుద్ధ తదియ
ఆశ్వయుజ శుద్ధ చతుర్థి
ఆశ్వయుజ శుద్ధ పంచమి
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి
ఆశ్వయుజ శుద్ధ సప్తమి
ఆశ్వయుజ శుద్ధ అష్ఠమి
ఆశ్వయుజ శుద్ధ నవమి
ఆశ్వయుజ శుద్ధ దశమి
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి
ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి
ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి
ఆశ్వయుజ పౌర్ణమి / పూర్ణిమ
ఆశ్వయుజ బహుళ పాడ్యమి
ఆశ్వయుజ బహుళ విదియ
ఆశ్వయుజ బహుళ తదియ
ఆశ్వయుజ బహుళ చవితి
ఆశ్వయుజ బహుళ పంచమి
ఆశ్వయుజ బహుళ షష్ఠి
ఆశ్వయుజ బహుళ సప్తమి
ఆశ్వయుజ బహుళ అష్ఠమి
ఆశ్వయుజ బహుళ నవమి
ఆశ్వయుజ బహుళ దశమి
ఆశ్వయుజ బహుళ ఏకాదశి
ఆశ్వయుజ బహుళ ద్వాదశి
ఆశ్వయుజ బహుళ త్రయోదశి
ఆశ్వయుజ బహుళ చతుర్దశి
ఆశ్వయుజ బహుళ అమావాస్య

కార్తీక మాసము :

 తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము.
ఈ కార్తీకమాసము స్నానములకు మరియు వివిధ వ్రతములకు శుభప్రథమైనది. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది.
కార్తీక శుద్ధ పాడ్యమి
కార్తీక శుద్ధ విదియ
కార్తీక శుద్ధ తదియ
కార్తీక శుద్ధ చతుర్థి
కార్తీక శుద్ధ పంచమి
కార్తీక శుద్ధ షష్ఠి
కార్తీక శుద్ధ సప్తమి
కార్తీక శుద్ధ అష్ఠమి
కార్తీక శుద్ధ నవమి
కార్తీక శుద్ధ దశమి
కార్తీక శుద్ధ ఏకాదశి
కార్తీక శుద్ధ ద్వాదశి
కార్తీక శుద్ధ త్రయోదశి
కార్తీక శుద్ధ చతుర్దశి
కార్తీక పౌర్ణమి / పూర్ణిమ
కార్తీక బహుళ పాడ్యమి
కార్తీక బహుళ విదియ
కార్తీక బహుళ తదియ
కార్తీక బహుళ చవితి
కార్తీక బహుళ పంచమి
కార్తీక బహుళ షష్ఠి
కార్తీక బహుళ సప్తమి
కార్తీక బహుళ అష్ఠమి
కార్తీక బహుళ నవమి
కార్తీక బహుళ దశమి
కార్తీక బహుళ ఏకాదశి
కార్తీక బహుళ ద్వాదశి
కార్తీక బహుళ త్రయోదశి
కార్తీక బహుళ చతుర్దశి
కార్తీక బహుళ అమావాస్య


మార్గశిర మాసము :

తెలుగు సంవత్సరంలో తొమ్మిదవ నెల.
మార్గశిర శుద్ధ పాడ్యమి
మార్గశిర శుద్ధ విదియ
మార్గశిర శుద్ధ తదియ
మార్గశిర శుద్ధ చతుర్థి
మార్గశిర శుద్ధ పంచమి
మార్గశిర శుద్ధ షష్ఠి
మార్గశిర శుద్ధ సప్తమి
మార్గశిర శుద్ధ అష్ఠమి
మార్గశిర శుద్ధ నవమి
మార్గశిర శుద్ధ దశమి
మార్గశిర శుద్ధ ఏకాదశి
మార్గశిర శుద్ధ ద్వాదశి
మార్గశిర శుద్ధ త్రయోదశి
మార్గశిర శుద్ధ చతుర్దశి
మార్గశిర పౌర్ణమి / పూర్ణిమ
మార్గశిర బహుళ పాడ్యమి
మార్గశిర బహుళ విదియ
మార్గశిర బహుళ తదియ
మార్గశిర బహుళ చవితి
మార్గశిర బహుళ పంచమి
మార్గశిర బహుళ షష్ఠి
మార్గశిర బహుళ సప్తమి
మార్గశిర బహుళ అష్ఠమి
మార్గశిర బహుళ నవమి
మార్గశిర బహుళ దశమి
మార్గశిర బహుళ ఏకాదశి
మార్గశిర బహుళ ద్వాదశి
మార్గశిర బహుళ త్రయోదశి
మార్గశిర బహుళ చతుర్దశి
మార్గశిర బహుళ అమావాస్య


పుష్య మాసము :

తెలుగు సంవత్సరంలో పదవ నెల. పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రము (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల పుష్యము.
ఆంధ్రులకు పెద్ద పండుగైన సంక్రాంతి ఈ మాసంలోనే జరుపుకుంటారు. అయ్యప్ప స్వామి దీక్ష కార్తీకమాసములో ప్రారంభమై పుష్యమిలో కూడా నడుస్తుంది.
పుష్య శుద్ధ పాడ్యమి
పుష్య శుద్ధ విదియ
పుష్య శుద్ధ తదియ
పుష్య శుద్ధ చతుర్థి
పుష్య శుద్ధ పంచమి
పుష్య శుద్ధ షష్ఠి
పుష్య శుద్ధ సప్తమి
పుష్య శుద్ధ అష్ఠమి
పుష్య శుద్ధ నవమి
పుష్య శుద్ధ దశమి
పుష్య శుద్ధ ఏకాదశి
పుష్య శుద్ధ ద్వాదశి
పుష్య శుద్ధ త్రయోదశి
పుష్య శుద్ధ చతుర్దశి
పుష్య పౌర్ణమి / పూర్ణిమ
పుష్య బహుళ పాడ్యమి
పుష్య బహుళ విదియ
పుష్య బహుళ తదియ
పుష్య బహుళ చవితి
పుష్య బహుళ పంచమి
పుష్య బహుళ షష్ఠి
పుష్య బహుళ సప్తమి
పుష్య బహుళ అష్ఠమి
పుష్య బహుళ నవమి
పుష్య బహుళ దశమి
పుష్య బహుళ ఏకాదశి
పుష్య బహుళ ద్వాదశి
పుష్య బహుళ త్రయోదశి
పుష్య బహుళ చతుర్దశి
పుష్య బహుళ అమావాస్య


మాఘమాసం :

తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది.
మాఘ శుద్ధ పాడ్యమి
మాఘ శుద్ధ విదియ
మాఘ శుద్ధ తదియ
మాఘ శుద్ధ చతుర్థి
మాఘ శుద్ధ పంచమి
మాఘ శుద్ధ షష్ఠి
మాఘ శుద్ధ సప్తమి
మాఘ శుద్ధ అష్ఠమి
మాఘ శుద్ధ నవమి
మాఘ శుద్ధ దశమి
మాఘ శుద్ధ ఏకాదశి
మాఘ శుద్ధ ద్వాదశి
మాఘ శుద్ధ త్రయోదశి
మాఘ శుద్ధ చతుర్దశి
మాఘ పౌర్ణమి / పూర్ణిమ
మాఘ బహుళ పాడ్యమి
మాఘ బహుళ విదియ
మాఘ బహుళ తదియ
మాఘ బహుళ చవితి
మాఘ బహుళ పంచమి
మాఘ బహుళ షష్ఠి
మాఘ బహుళ సప్తమి
మాఘ బహుళ అష్ఠమి
మాఘ బహుళ నవమి
మాఘ బహుళ దశమి
మాఘ బహుళ ఏకాదశి
మాఘ బహుళ ద్వాదశి
మాఘ బహుళ త్రయోదశి
మాఘ బహుళ చతుర్దశి
మాఘ బహుళ అమావాస్య


ఫాల్గుణ మాసము :

తెలుగు సంవత్సరంలో పన్నెండవ నెల.
ఫాల్గుణ శుద్ధ పాడ్యమి
ఫాల్గుణ శుద్ధ విదియ
ఫాల్గుణ శుద్ధ తదియ
ఫాల్గుణ శుద్ధ చతుర్థి
ఫాల్గుణ శుద్ధ పంచమి
ఫాల్గుణ శుద్ధ షష్ఠి
ఫాల్గుణ శుద్ధ సప్తమి
ఫాల్గుణ శుద్ధ అష్ఠమి
ఫాల్గుణ శుద్ధ నవమి
ఫాల్గుణ శుద్ధ దశమి
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి
ఫాల్గుణ శుద్ధ ద్వాదశి
ఫాల్గుణ శుద్ధ త్రయోదశి
ఫాల్గుణ శుద్ధ చతుర్దశి
ఫాల్గుణ పౌర్ణమి / పూర్ణిమ
ఫాల్గుణ బహుళ పాడ్యమి
ఫాల్గుణ బహుళ విదియ
ఫాల్గుణ బహుళ తదియ
ఫాల్గుణ బహుళ చవితి
ఫాల్గుణ బహుళ పంచ
మి
ఫాల్గుణ బహుళ షష్ఠి
ఫాల్గుణ బహుళ సప్తమి
ఫాల్గుణ బహుళ అష్ఠమి
ఫాల్గుణ బహుళ నవమి
ఫాల్గుణ బహుళ దశమి
ఫాల్గుణ బహుళ ఏకాదశి
ఫాల్గుణ బహుళ ద్వాదశి
ఫాల్గుణ బహుళ త్రయోదశి
ఫాల్గుణ బహుళ చతుర్దశి
ఫాల్గుణ బహుళ అమావాస్య