కార్తీకమాసం శివన్నామ స్మరణతో ఓలలాడిన మనందరి లోని ఆధ్యాత్మిక భావాలను మరోసారి తట్టిలేపేందుకు ధనుర్మాసం వచ్చేసింది...
కార్తీకమాసం పరమేశ్వరునికి ఇష్టమైన మాసం కాగా, దనుర్మాసం శ్రీమహా విష్ణువును కొలిచి తరించే మాసం.
ఈ మార్గశిర శుద్ధ త్రయోదశితో అంటే డిసెంబరు 16 నుండి ధనుర్మాసం ప్రారంభం అవుతోంది.
సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించే శుభముహూర్తమే ధనుర్మాసారంభం కూడా.
డిసెంబరు 16వ తేదీన సాయంత్రం 5.29 గంటలకు ధనుస్సంక్రమణం ప్రవేశిస్తుంది.
ఈ సందర్భంగా ధనుర్మాసం ప్రాముఖ్యత ను తెలుసుకుందాం.
【డిసెంబర్ 17 నుండి జనవరి 14 , 2020 వరకు ధనుర్మాసం 】
విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ధనుర్మాసం
అసలు ధనుర్మాసం అంటే ఏమిటి ??? అది ఎలా మొదలు అవుతుంది , ఎప్పుడు మొదలు అవుతుంది.? అని మనం ఇప్పుడు తెలుసుకుందాము .
భారత దేశం లో ప్రధానం గా మన మాసాలు, పంచాంగాలు కూడా రెండు విధాలుగా లెక్కిస్తారు.
అవి 1. చాంద్రమానం 2. సౌరమానం.
చాంద్ర మానాన్ని అనుసరించి లెక్కించేవే మన చైత్రం నుండి ఫాల్గుణం వరకు ఉన్న మాసాలు.
అవి కాక సౌరమానం ప్రకారం సూర్యుడు ప్రతి నెల ఒక రాశి లో ఉంటాడు
ఆ రాశి లో ప్రవేశించిన రోజుని మనం సంక్రమణం అని పిలుస్తాము.
అన్నిటిలో విశిష్టమైనది మకర రాశి లో ప్రవేశించిన రోజు.
దానినే మనం మకర సంక్రాంతి అని జరుపుకుంటాము.
మన సంక్రాంతి పండుగ అన్నమాట.
అంతకు ముందు సూర్యుడు ధనూరాశి లో ప్రవేశించిన రోజు నుండి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది.
ఈ రాశి లో ఆయన ఉండే నెల నే మనం ధనుర్మాసం అని పిలుస్తాము.
శ్రీ వైష్ణవులు ఈ నెల రోజులు చేసే వ్రతమే ధనుర్మాస వ్రతం.
దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుడే ధనుర్మాసం ప్రాత:కాలంలా పవిత్రమైంది.
ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం.
దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణనానికి ముందుడే ధనుర్మాసం ప్రాత:కాలంలా పవిత్రమైంది.

ధను అనగా దేని కోసం ప్రార్థించడమనే అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత విశిష్టమైంది.
ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం.
దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి.
నిజానికి ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని పెద్దలు తెలియజేశారు.
ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు.
సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు.
ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.
దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు.
దీన్నే బాలభోగం అంటారు.
సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది.
ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది.
విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం.
గోదా దేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. ధనుస్సంక్రమణ రోజున నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది.
వైష్ణవ, సూర్యాలయాలను కూడా సందర్శించడం కూడా శుభప్రదం.
ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై.
ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం.
వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురణాల్లో పేర్కొన్నారు.
ఈ మాసంలో శ్రీ మహా విష్ణువును మధుసూధనుడు పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి.
తర్వాత పదిహేను రోజులు దద్యోజనాన్ని నివేదించాలి.
పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయడ వల్ల కోరిన వరుడు లభిస్తాడు.
గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.
రోజూ ఒక కీర్తనతో ఆమె స్వామిని కీర్తించేది.
ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది.
ధనుర్మాసంలో రోజూ శ్రీకృష్ణుడికి తులసి మాల సమర్పించే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది.
ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం.
ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి.
అవివాహితులు, మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయని భావిస్తారు.
విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాత్రులని కాక శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది.
ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది.
ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు.
ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు.
రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది.
ధనుర్మాసంలో వివాహాలు జరిపించరు.
ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం.
ధనుస్సు , మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు.
కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.
ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు.
ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు.
ఇలా చేయటం శుభం.
గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు?
ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా అవుతుంది...
అరుదైపోయిన ‘హరిదాసు’ కీర్తనలు.
సంక్రాంతి నెలల్లో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసుగానం.
పూర్వం పల్లె, పట్టణం తేడ లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికే పురవీధుల్లో హరినామ గానం చేస్తూ..
వివిధ కీర్తనలతో హరిదాసులు అలరించేవారు.
ఇళ్ళల్లోని వారు ఇచ్చే ధన, ధాన్యాలను స్వయంపాకాలుగా స్వీకరించే సంప్రదాయాలను నేటికి కొనసాగిస్తున్నారు.
గత వైభవం లేకున్నా..పట్టణాల్లో ఆదరించకపోయినా కళకు జీవం పోస్తున్నవారు ఎందరో ఉన్నారు.
శ్రీ రాముడు రాజ్యంలో చింతలులేవు.
కరవు కాటకాలురావు.
దాన ధర్మాలు చేద్దామన్నా పుచ్చుకునేవారే కరువయ్యారని ప్రజలు ధర్మ దేవతను ఆడిపోసుకునేవారట.
అది విన్న వేగులు రాముడితో చెప్పగా వారి దాన, ధర్మాలను పుచ్చుకునేందుకు హరినామాన్ని గానం చేసే గాయకులను రాజ్యంలో తిరుగాడేలా చేశారని, వారే నేడు కనిపించే హరిదాసులని చెపుతుంటారు.
హరిదాసు అనగా పరమాత్మకు సమానం.
మనుషులు ఇచ్చే ధానధర్మాలు అందుకుని వారికీ ఆయురారోగ్యాలు, భోగాభోగ్యలు కలగాలని దీవించేవారే హరిదాసులు.
నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరిస్తారు.
సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా వారి శిరస్సుపై ధరించే పంచలోహ పాత్రగా భావిస్తారు…..
- స్వస్తీ...
మరిన్నీ తెలియని విషయాలను తెలుసుకునేందుకు ramkarri.org ని వీక్షించండి...

ధనుర్మాస ప్రాముఖ్యత

హరిదాసులు ధనుర్మాసపు రాయబారులు..
అరుదైపోయిన ‘హరిదాసు’ కీర్తనలు.
సంక్రాంతి నెలల్లో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసుగానం.
పూర్వం పల్లె, పట్టణం తేడ లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికే పురవీధుల్లో హరినామ గానం చేస్తూ..
వివిధ కీర్తనలతో హరిదాసులు అలరించేవారు.
ఇళ్ళల్లోని వారు ఇచ్చే ధన, ధాన్యాలను స్వయంపాకాలుగా స్వీకరించే సంప్రదాయాలను నేటికి కొనసాగిస్తున్నారు.
గత వైభవం లేకున్నా..పట్టణాల్లో ఆదరించకపోయినా కళకు జీవం పోస్తున్నవారు ఎందరో ఉన్నారు.
ఎలా వచ్చిందీ పద్ధతి…
శ్రీ రాముడు రాజ్యంలో చింతలులేవు.
కరవు కాటకాలురావు.
దాన ధర్మాలు చేద్దామన్నా పుచ్చుకునేవారే కరువయ్యారని ప్రజలు ధర్మ దేవతను ఆడిపోసుకునేవారట.
అది విన్న వేగులు రాముడితో చెప్పగా వారి దాన, ధర్మాలను పుచ్చుకునేందుకు హరినామాన్ని గానం చేసే గాయకులను రాజ్యంలో తిరుగాడేలా చేశారని, వారే నేడు కనిపించే హరిదాసులని చెపుతుంటారు.
హరిదాసు అనగా..