మన గ్రామదేవతలు ఎలా వెలిశారు ? ౹౹ మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి ? ౹౹ గ్రామ దేవతా వ్యవస్థ ౹౹ గ్రామ దేవతల ఆవిర్భావము ౹౹ గ్రామ దేవతా నామ విశేషాలు ౹౹ పృధ్వీ దేవత ౹౹ జల దేవత ౹౹ అగ్ని దేవత ౹౹ వాయు దేవత ౹౹ ఆకాశ దేవత ౹౹ Ram Karri
వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు.
ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.
ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది.
ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారికోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వికులు.
అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.
దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు.
అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథినాడు కచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే.
అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది.
గ్రామ దేవతల ఆవిర్భావము:
పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది.
అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామదేవతలను ఏర్పాటు చేసారు తొలి దశలో.
పృధ్వీ దేవత :
పృధ్వీ అంటే నేల,
ఇది పంటకి ఆధారము,
కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు.
గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార. ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు.
జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని,
నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు.
మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము,
అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూవుండడము,
దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము.
ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ.
పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని చేనుకి వెల్తూండేవారు కాదు.
అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది.
ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో జాతర చేస్తూండేవారు.
అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.
జల దేవత:
జలానికి సంభందించిన తల్లి గంగమ్మ – గంగానమ్మ.
ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది.
గుడి ఎత్తుగా కట్టినా తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.
తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే.
👉పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి.
అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు.
ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ' అని కూడా అంటారు.
పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=#సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది.
👉బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.
👉గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= #సత్తెమ్మ.
👉అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న)అమ్మ పుల్లమ్మ.
ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
👉ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.
బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= అప్పలమ్మ అన్నారు.
👉భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల (భోజనమనే పదానికి విక్రుతి)+అమ్మ= బోనాలమ్మ.
అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు.
👉లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= గుర్రాలమ్మ అయినది.
👉ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు.
ఉదా:- సోమప్రోలు+అంబ='సోమపోలమాంబ' అన్నారు.
సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట అని ఇప్పుడు వాడుకలో పిలవబడుతుంది. అలా చాలా గ్రామాల పేర్లు గ్రామ దేవతల పేరుతోనే పిలుస్తున్నారు.
ఓం శ్రీ మాత్రే నమః...
- స్వస్తీ... మరిన్నీ ఇలాంటి పోస్టుల కొరకు www.ramkarri.org ని వీక్షించండి...
రచయిత గురించి :
✍ రామ్ కర్రి
జ్ఞానాన్వేషి 🧠, ధర్మ రక్షక్ 📿, నవ యువ కవి 📖,
రచయిత ✒️, బ్లాగర్ 🪩 ,. టెక్ గురు 🖥️ ,
సామాజిక కార్యకర్త 🩸 , . .
📖 తెలుగు భాషా సంరక్షణ వేదిక 📚 , . .
🪷 సంజీవని ఔషధ వన ఆశ్రమం 🌱 ,
మరియు
🛕 జ్ఞాన కేంద్ర 🚩
వ్యవస్థాపకులు .