1. పెన్ను క్యాపుకు పైన రంధ్రం గమనించారా? 
పిల్లలు ప్రమాదవశాత్తు గొంతులో వేసుకున్నప్పుడు ఊపిరి ఆడడానికి వీలుగా ఈ రంధ్రాన్ని ఉంచారు.
2. ప్యాంటు లేదా షర్టుతో పాటు ఒక చిన్న బట్ట ముక్కను జత చేసి అమ్మడం మీరు గమనించే ఉంటారు. 
మిగతా దుస్తులతో కలిపి ఉతికే ముందు రంగు వెలుస్తుందో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
3. మెజరింగ్ టేప్ అంచున మెటల్ హుక్ లాంటిది చూసే ఉంటారు. 
ఇది ఈ క్రింది విధంగా ఉపయోగ పడుతుంది. 
1) మెజర్ చేసిన తర్వాత పదునైన అంచుతో మార్క్ చేసుకోవచ్చు. 
2) మెటల్ హుక్ మధ్యలో ఉన్న రంధ్రంలో మేకును తగిలించి మెజర్ చేయవచ్చు.
4. కారుకు పెట్రోల్/డీజిల్ ఇండికేటర్ దగ్గర యారో మార్క్ ఎందుకు ఉంటుందో తెలుసా? 
కారుకు పెట్రోల్ టాంకు ఎటువైపు ఉంటుందో ఇది సూచిస్తుంది.


5. జీన్స్ ప్యాంటు వేసుకునేవారు జేబు పైన ఇంకో చిన్న జేబును గమనించే ఉంటారు. 
19వ శతాబ్దంలో ఎక్కువగా పాకెట్ వాచ్‌లు ఉండేవి వాటిని ఉంచేందుకు అనుగుణంగా ఈ పాకెట్‌లను తయారు చేశారు. 
అది ఇప్పటికీ కొనసాగుతుంది.


6. విమానాలలో కిటికీలకు చిన్న రంధ్రం గమనించే ఉంటారు. 
దీనిని బ్లీడ్ హోల్ అంటారు. 
                                            ఇది విమానం పైకి ఎగిరినప్పుడు లోపల, బయట ఉన్న గాలి ఒత్తిడుల తేడాను సమన్వయం చేయడానికి ఉపయోగపడుతుంది.7. క్యాన్ / టిన్‌లో కూల్ డ్రింక్ తాగుతున్నప్పుడు దానికి ఉన్న టాబ్‌ను గమనించారా? 
స్ట్రా ఉపయోగించి తాగుతున్నప్పుడు దీని గుడా స్ట్రా ను లోపలికి పెట్టాలి.
 స్ట్రా ను కదలకుండా ఉంచుతుంది.8. ఇయర్/హెడ్‌ఫోన్స్ జాక్‌ను ఎప్పుడైనా గమనించారా? 1, 2 లేదా 3 చారలు/రింగులు కనిపిస్తాయి. 
ఒక్క రింగ్ ఉంటే మోనో ప్లగ్ అంటే రెండు హెడ్‌ఫోన్లలో ఒకటే సౌండ్ వినపడుతుంది. 
రెండు రింగులుంటే ఎడమ, కుడి రెండు హెడ్‌ఫోన్లలో డిఫరెంట్ సౌండ్ ప్లే అవుతుంది. 
అదే 3 రింగులుంటే మైక్రోఫోన్ కూడా ఉండేలా డిజైన్ చేయబడింది.9. కంపెనీ పేర్లు/ట్రేడ్‌మార్క్ పక్కన R సింబల్ గమనించారా? 
R సింబల్ ఉంటే ఆ పేరు/ట్రేడ్‌మార్క్ అధికారికంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా వద్ద రిజిస్టర్ అయినట్టు.


10. మంకీ క్యాప్‌ల మీద మెత్తని బాల్ ఎందుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? 
ఇంగ్లీష్ సెయిలర్లు బోట్‌లో వెళ్ళినప్పుడు తల పైన డెక్‌కు తగిలితే దెబ్బ తగలకుండా ఉండటానికి డిజైన్ చేసుకున్నారు.11. దాదాపు అన్ని రూలర్లు (స్కేల్) ఒక రంధ్రాన్ని కలిగి ఉంటాయి. 
దీని ఉపయోగం ఏంటో తెలుసా? 
స్కేలును మేకుకు తగిలించడానికి. అంతే.


12. టూత్‌పేస్ట్ ట్యూబ్‌ల అడుగున ఒక కలర్ ఉంటుంది ఎందుకో తెలుసా? 
బహుశా ఆకుపచ్చ రంగు ఉంటే నాచురల్ అని, 
నలుపు ఉంటే కెమికల్స్ కలిసాయని ఎక్కడైనా చదివారా? 
అదేం లేదండి. 
అవి కేవలం ప్యాకింగ్ అప్పుడు సెన్సర్లకు ఎక్కడ కట్ చేయాలో తెలుపుతాయి అంతే.
- స్వస్తీ...