రేపు సంభవించే సుదీర్ఘ సంపూర్ణ సూర్య గ్రహణం గురించిన విశేషాలు :

     రేపు సంభవించే  త్రిపాదధిక కంకణాకార  సూర్య గ్రహణం గూర్చి ప్రాచీన గ్రంధాల ఆధారంగా సప్రమాణంగా, ‌సశాస్త్రీయముగ విజ్ఞాన ఘనులైన, పెద్దలైన, మన పండితులు ఏమి చెప్పారో తెల్సుకుందాం.

 వాటిని యథాతథంగా కాకపోయినా... కనీసం యథాశక్తినైనా ఆచరిద్దాం తరిద్దాం ఆనందిద్దాం.

స్వస్తిశ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య  అనగా
ది. 26-12-2019 గురువారం త్రిపాదధిక కంకణాకార సూర్యగ్రహణం సంభవించ నుంది.

ఇట్టి  గ్రహణాల గూర్చి పాశ్చాత్యులు ఓ భావనకు వొచ్చేకంటే ఎంతో ముందు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుండే మన భారతీయులు గ్రహణాల గూర్చి ఖచ్చితమైన లెక్కలతో తగు ప్రాధాన్యతను ఇచ్చారు.

భారత కాలమానం ప్రకారం ...

గ్రహణ స్పర్శ కాలం - ఉదయం గం. 8-11 నిమిషాలకు,
 గ్రహణ మధ్య కాలం  ఉదయం గం.9-38 నిమిషాలకు,
గ్రహణ మోక్ష కాలం పగలు గం.11-20 నిమిషాలకు.

మన తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాలలో సమయ సంస్కారం బట్టి అనుసరించి గ్రహణ ప్రారంభసమయాలను చూసుకోవాలి.

సూర్య గ్రహణం భారతదేశంతో సహ , ఇంకా కొన్ని ప్రాంతములందు సూర్య గ్రహణం కనబడుతుంది.

ఈ సూర్య గ్రహణం  ఏ నక్షత్రానికి ఏ ఏ రాశుల వారికి ఎంత  దోషమో ఆ దోష నివృత్తికై పరిహార ప్రక్రియలు

 శ్లో.జన్మక్షే నిధనం గ్రహేజ నిభతో ఘాతః క్షతిః శ్రీర్వ్యధా
చింత సౌఖ్య కళత్ర దౌస్ధ్య మృతయః స్సుర్శాననాసః సుఖం
లాభోపాయ ఇతి క్రమాత్త ద శుభ ధస్త్యే జపహపః స్వర్ణగో
దానం శాంతి రధో గ్రహం త్వశుభదం నో వీక్షమహుః పరే 

తా.జన్మ నక్షత్రమందు గ్రహణం వచ్చిన నాశనం, జన్మ రాశి యందు గ్రహణం వచ్చిన మానసిక సమస్యలు, ద్వితీయ మందు హాని, తృతీయ మందు సంపద, చతుర్ధమందు రోగం, పంచమం నందు చికాకులు, షష్టమందు సౌఖ్యం, సప్తమం నందు భార్యకు కష్టాలు, అష్టమం నందు మరణతుల్య కష్టాలు, నవమం నందు గౌరవ భంగం, దశమం నందు సుఖం, ఏకాదశం నందు లాభం, ద్వాదశం నందు అపాయం. అశుభ దోష పరిహారానికి జపం, స్వర్ణ దానం, గోదానం, శాంతి చేయాలి. అశుభ ఫలప్రదమైన గ్రహణాన్ని చూడరాదు.

గ్రహణ దోషం గల నక్షత్రం:

 మూలా నక్షత్రం  వారికి  దోషం అధికం.  ఇట్టి నక్షత్ర జాతకులందరికి గ్రహణ శాంతి చేసుకోవాలి. వీరు గ్రహణాన్ని వీక్షించ రాదు.

గ్రహణ దోషం గల రాశులు:

 "ధనస్సు వారికి దోషం అధికం కలదు"

"కన్య రాశి నుంచి గ్రహణరాశియైన ధనస్సు నాలుగో రాశి అవటంచే తులారాశి వారికి దోషమే"

"సింహ రాశి నుంచి గ్రహణరాశియైన ధనస్సు 5 వ రాశి అవ్వటం వలన సింహరాశి వారికీ దోషమే"

"వృషభరాశి నుంచి గ్రహణరాశియైన ధనస్సు 8 వ రాశి ధనస్సు అవ్వటం వలన  వృషభరాశి వారికీ దోషమే"
" మకరరాశి నుంచి గ్రహణరాశియైన మకరం12 వ రాశి అవ్వటం వలన కుంభరాశి వారికి కూడా దోషమే"

1.తుల,
2.కర్కాటక,
3.మీనము,
4.కుంభం
ఈ పై నాలుగు రాశుల వారికి శుభఫలం.

1.మేషం,
2.మిథునం,
3.వృశ్చికం,
4.సింహం,
 పై మూడు రాశుల వారికి దోషం మిశ్రమం అనగా మధ్యమ ఫలము కలుగును.

  ధనస్సు రాశి వారికి మరియు మకర,వృషభ,కన్య, రాశుల  వారికీ గ్రహణ శాంతి సశాస్త్రీయంగా జరిపించుకోవటం శ్రేష్ఠం.

వీరు గ్రహణాన్ని పొరపాటున కూడా వీక్షించ రాదు...

ఇక ఈ గ్రహణఫలితాలు వివిధరాశులలో  జన్మించిన వారిపై ఎలా ఉంటాయి?

శ్లో.త్రిషడ్దశాయేషుపగతం నరాణాం
శుభప్రదం స్యాద్గ్రహణం రవీంద్వోః
ద్విసప్తనవమేషు మధ్యమంస్యాత్
శేషేష్వనిష్టం కథితం మునీంద్రైః"

అనగా జన్మరాశినుండి 3,6,10,11 రాశులలో గ్రహణం శుభం.
2,7,9 లయందు మధ్యమం. మిగలిన రాశులయందు అనగా 1,4,5,8,12 అశుభం.

 వివిధరాశులవారికి గ్రహణఫలితాలు  శుభముగా లేనివారు బింబదానము,
ఆ నక్షత్రజపము, కేతుగ్రహ సూర్యగ్రహ జపములను సద్బ్రాహ్మణుల చేత జరిపించుకోవాలని
శాస్త్రం తెలియజేస్తోంది.

బింబదానం అంటే ?

బంగారంతో లేదా వెండితో సూర్య బింబాన్ని, బంగారు  లేక (వెండితోగాని) కేతు ప్రతిమలను చేయించి అంత
  శక్తిలైనివారైతే పిండితో చేసిన వాటిని కంచుపాత్రలో ఆవునేయి వేసి, వీటిని అందులో ఉంచి ఆయా గ్రహాలకు పూజచేసి దోష నివృత్తిని సూచించే మాటలను సంకల్పంలో చెప్పి అనంతరం వాటినన్నింటిని వస్త్ర,దక్షిణాది సహితంగా చక్కని సద్బ్రాహ్మణునకు దానమీయాలి. గ్రహణానంతరం ఎంత త్వరగా ఈ దానం చేసుకుంటే అంత మంచిది.

 గ్రహణఫలితాలు  ఇలా ఉంటాయని   చెప్పి ప్రజలను భయపెట్టడం భావ్యమా? అని కొంతమంది కామెంట్ చేసారు. వారికి నా సమాధానం :

మన మహర్షులు ఈ ఫలితాలను మనలను భయపెట్టే ఉద్దేశ్యంతో తెలుపలేదు. ప్రారబ్ధాన్ని దైవపూజ,దానము ఇత్యాది పురుషప్రయత్నా లద్వారా నివారణ లేక ఉపశమనం పొందవచ్చన్న గొప్ప సత్యాన్ని అందివ్వటమే వారి ఆశయం. కనుక ఆ విషయాన్ని మీ ముందు ఉంచటం జరిగింది.

కావున గ్రహణ శాంతి సశాస్త్రీయంగా జరిపించుకోవటం శ్రేష్ఠం.

 సూర్య గ్రహణ శాంతి స్నానమును ఇలా చేసిన దోషం నివృత్తి అవుతుందని మహర్షులు వచనంగా గ్రంధాధారంగా తెలియవస్తున్నది.

శ్లో.పాధ:శమీకోకనదైరనిష్టే
విధూపరాగే తిలదారు వర్ణై:!
సిద్దార్ధదూర్వామధుకాలమేయై
రనిష్టనాశాయ తు మజ్జనం స్యాత్!!


సూర్య గ్రహణం


చంద్రుడు ఎప్పుడైతే భూమికి,సూర్యునికి మధ్యగా ప్రయాణిస్తాడో అప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఐతే గ్రహణం ఏర్పడటానికి మాత్రం సూర్యుడు,చంద్రుడు మరియు భూమి ఒకే సరళ రేఖ లో ఉండాలి.

సూర్య గ్రహణం అమావాస్య నాడు ఏర్పడుతుంది.కానీ ప్రతి అమావాస్య రోజూ సూర్య గ్రహణం ఏర్పడదు.దానికి కారణం ప్రతి అమావాస్య రోజూ భూమి,చంద్రుడు మరియు సూర్యుడు ఒకే సరళ రేఖలో లేకపోవడమే.సూర్య గ్రహణం ఏర్పడిన సందర్భం లో సూర్యుని వైపు ఉన్న చంద్రుని భాగాన్ని కాంతి పూర్తిగా ఆక్రమిస్తుంది. అంటే భూమి వైపు ఉన్న చంద్రుని భాగం పూర్తిగా చీకటి అనమాట (చంద్రుడు కనిపించని రోజునే కదా మనం అమావాస్య అంటాం!)

సూర్య గ్రహణం ముఖ్యం గా నాలుగు రకాలుగా ఏర్పడుతుంది.

1) సంపూర్ణ సూర్య గ్రహణం: చంద్రుడు సూర్యుడిని పూర్తిగ కప్పివేయడం వల్ల ఇది జరుగుతుంది. అత్యంత ప్రకాశ వంతమైన గోళం వలే కనిపించే సూర్యుడు చంద్రుడి ఛాయ వల్ల ఒక సన్నటి అంచు వలే కనిపిస్తాడు. ఏదైన సమయంలొ సంపూర్ణ సూర్య గ్రహణం భూమి మీద ఒక ప్రదేశములొ వారికి మాత్రమే కనిపిస్తుంది.

2) అంగుళీయక (యాన్యులర్) సూర్య గ్రహణం: సూర్యుడు చంద్రుడూ ఒకే కక్ష్య లోకి వస్తారు. కాని సూర్యుని కంటే చంద్రుని పరిమాణము చిన్నదిగా ఉండడం వలన, చంద్రుని చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఒక ఉంగరం వలే కనిపిస్తాడు.

3) సంకర గ్రహణం: ఇది సంపూర్ణ మరియు అంగుళీయక సూర్య గ్రహణాలకు మధ్యస్తంగా ఉంటుంది. ఈ సంకర గ్రహణము భూమిపై కొన్ని ప్రదేశాలలో సంపూర్ణ గ్రహణంగా, మరి కొన్ని ప్రదేశాలలో పాక్షికంగాను కనిపిస్తుంది. సంకర గ్రహాణాలు అరుదు.

4) పాక్షిక సూర్య గ్రహణం: సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడూ ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు. పాక్షిక గ్రహణం భూమి మీద చాలా భాగాలనుండి కనిపిస్తుంది.

గ్రహణము యేయే రాశులయందు సంభవించునో వారు బంగారు రాహు, కేతు వెండి చంద్రబింబములను పూజించి, నెయ్యితో నిండిన కంచుగిన్నెను, వస్త్రములను, నువ్వులతో తగిన దక్షిణలు కలిపి దానమీయవలయును. మరియు రావిచెట్టును తాకకుండా 21 ప్రదక్షిణలు చేయవలయును. గ్రహణ సమయమునందు దానము గ్రహించువారు దొరకకున్న గ్రహణానంతరము సంకల్పించుకున్నదానికి ద్విగుణీకృతంగా దానమీయవలయును.

గ్రహణములందు నూతన మంత్రానుష్ఠానము విశేష ఫలప్రదము. ఇష్టదేవతా మంత్రమును, గాయత్రీ మంత్రమును జపించవలయును. 
వానివలన మంత్రములు పరిశుద్ధమగును. 
జపం చేయకున్న మంత్రములు మాలిన్యమగును. వేదమంత్రమునకు మాలిన్యముండదు.

జాతాశౌచ మృతాశౌచములు కలిగియున్ననూ గ్రహణ స్నానాదికములు చేయవలయును.

గ్రహణ సమయమునందు సర్వ జలములు గంగా జలములు. సర్వ ద్విజులు వ్యాస భగవానులు. సర్వ దానములు భూదాన సమానమగును.

గ్రహణ సమయమున శయనించిన రోగము. మలమూత్ర విసర్జన, మైధునము చేసిన నరకము కలుగును.

గ్రహణమునకు ముందు వండిన వంటలను భుజించరాదు. ముడి పదార్థములు, పచ్చళ్ళు మొదలగు నిల్వ ఉంచిన పదార్ధములపై దర్భలను పరువవలెను.

గ్రహణము వదిలిన తరువాత శుద్ధ సూర్య బింబమును దర్శించుకుని, స్నానము చేసి వంటలు చేసుకొనవచ్చును. బాలలు, వృద్ధులు, అశక్తులు, పుత్రవంతులగు గృహస్థులు గ్రహణ ఘడియలు విడిచి భుజించవచ్చును.

గ్రహణ కాల దాన మంత్రము :

మమ జన్మరాశి జన్మ నక్షత్ర స్ధిత సూర్య గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి పూర్వక ఏకాదశ స్ధాన స్ధిత గ్రహ సూచిత శుభ ఫలావాప్త్యర్ధం సూర్యబింబ నాగబింబ దానం కరిష్యే.

తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధనా!
హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదో భవ!!
విధుంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత!
దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్ధవేత్!! 

అను మంత్రముచే చదివి

గ్రహణ సూచిత అరిష్ట వినాశార్ధం మమ శుభ ఫలావాప్త్యర్ధం ఇదం కేతుబింబ సూర్య బింబదానం ఘృతపూర్ణ కాంశ్య పాత్ర సహితం యధాశక్తి తిల వస్త్ర దక్షిణాసహితం తుభ్యమహం సంప్రదదే నమమ. అని దానమీయవలయును.


సంపూర్ణ సూర్య గ్రహణ శాంతికి తీసుకోవలసిన జాగ్రత్తలు :

ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం చేసి, నదీ తీరాన జపం చేసుకుంటే ఆ ఫలితం ఇంకా ఎక్కువ. గ్రహణ స్పర్శ కాలమున నదీస్నానం, మద్యకాలమున తర్పణం, జపము, హోమం, దేవతార్చన విడువుచుండగా దానం, స్నానం చేయటం మంచిది. గ్రహణ కాలమున భాగవన్నామస్మరణ చేయటం ఉత్తమం. గురువు ఉపదేశించిన మంత్రజపము, వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జపము గ్రహణ కాలమందు మరియు ఏడురోజుల వరకు తప్పనిసరిగా ఆచరించవలెను. గ్రహణం రోజు ఉపవాస దీక్ష చేస్తే మంచిది. గ్రహణ సమయమందు గో భూ హిరణ్యాది (గోవులను, భూములను, బంగారాన్ని) దానములు చేయవలెను.

జ్యోతిష్య సలహాలు :

1) గర్భవతులు ప్రత్యేకించి గ్రహణ అనిష్ట ఫలము గల గర్భవతులు గ్రహణ సమయంలో మీ గోత్ర నామాల పేరిట నిష్ఠావంతులైన బ్రాహ్మణులచే
” గర్భ రక్షణ స్తోత్రము ” పారాయణము చేయించాలి.

2) పిల్లలు , వయో వృధ్ధులు ఉన్న వారు వారి పేరిట
” మృత్యుంజయ స్తోత్ర పారాయణము ” చేయించాలి.

3) అందరూ ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది.



- స్వస్తీ...