వందల ఏళ్ల క్రితం ఒకసారి ఖలీఫా రషీద్ విందు ఏర్పాటు చేశారు...

 మంత్రులు కూర్చుని విందు ఆరగిస్తున్నారు...

 ఖలీఫా తన సింహాసనం పై కూర్చుని దర్జాగా మద్యాన్ని సేవిస్తున్నారు...

 అంతలోనే బహలూల్ దానా అనే పండితుని రాకతో ఖలీఫా నాలుక్కరుచుకున్నారు...

 మద్యపానం నిషేధం అని పండితుడు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టినందుకు సిగ్గు పడ్డాడు...

 తన తప్పు కప్పి పుచ్చుకునెందుకు గురువు గారు నాదొక సందేహం అని అడిగాడు...

 దానికి గురువు గారూ అడుగు నాయనా అని అన్నారు...

 ద్రాక్ష పళ్ళు తినడం పాపమా?

కాదు బాబు

2వ ప్రశ్న ద్రాక్ష పళ్ళు తిన్న తరువాత మంచి నీళ్ళు తాగొచ్చా?

తాగొచ్చు నాయనా

ద్రాక్ష పళ్ళు తిని మంచి నీళ్ళు తాగి ఆ తర్వాత ఎండలో కాసేపు నిలబడితే తప్పా?

కాదు నాయనా

దానికి రాజు మరి ద్రాక్ష పళ్ళు నీళ్ళుపోసి కలిపి ఎండలో ఎండబెట్టి వాటి పానీయాలను తాగితే ఎలా తప్పవుతుంది మీరే చెప్పండి అని గర్వంగా అడిగాడు

దానికి గురువు గారు ఇలా బదులిచ్చారు...

 ఖలీఫా నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్పు అని అన్నారు...

 1 ఎవరి నెత్తి మీద అయినా దోసిళ్ళ తో మట్టి గుమ్మరిస్తే ఏమైనా నష్టమా అని అడిగారు...

 దానికి ఖలీఫా నష్టం ఏమి లేదు గురువు గారు అని బదులిచ్చాడు...

2 ఆ తర్వాత అదే తల మీద నీళ్ళు గుమ్మరిస్తే ఏమైనా నష్టమా అని అడిగారు...

 దానికి ఖలీఫా నష్టం ఏమి లేదు గురువు గారు అని బదులిచ్చాడు...

 3 ఈ మట్టి ని నీళ్ళతో కలిపి ఎండలో ఎండబెట్టి ఒక ఇటుకను తయారు చేసి ఆ ఇటుకరాయ తో తల పై మౌదితే ఏదైనా నష్టమా అని అడిగారు...

 దానికి ఖలీఫా గురువు గారు మీరేంటి వింతగా మాట్లాడుతున్నారు...

 ఆ ఇటుకతో తల మీద మౌదితే గాయం అవ్వదూ ప్రాణహాని జరగొచ్చు...

 దానికి గురువు గారు ఇలా బదులిచ్చారు...

 మట్టి నీళ్ళు కలిపిన ఎండిన ఇటుకకు తలను పగలగొట్టే శక్తి ఎలా ఉంటుందో అలాగే ద్రాక్ష- నీళ్ళు కలిపి వండివార్చిన పానీయానికి మత్తెక్కించ్చె శక్తి దాగి వుంటుంది...

 ఆ అపరిశుద్దమైన పానీయాన్ని సేవించడం వల్ల బుద్ది క్షీణిస్తుంది...

 తాగిన ముఖంలో ఎంతటి పాపానికి అయినా ఎంతటి అఘాయత్యానికి అయినా ఒడిగడతాడు మనిషి,

 అందుకే మద్యపానం నిషేధం...


- స్వస్తీ...