ఈ పుస్తకం పెద్దలకు మాత్రమే మేము కొని మీ కోసం ఇక్కడ ఉచితంగా ఇస్తున్నాము... గమనించగలరు... పుస్తకం ఈ పేజీ చివరిలో ఉంటుంది...

పుస్తకం పేరు : వాత్స్యాయన కామసూత్రాలు.

ముద్రించిన వారు : మోహన్ పబ్లికేషన్స్.

రచయిత : శ్రీధర శ్రీరామకృష్ణ.
                  వాత్సాయనుని కామసూత్రాలు అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం) గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము.

 ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు.

 దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.

గ్రంథంలోని కొంతభాగం మానవ లైంగిక ప్రవర్తన గురించి చెప్పబడింది.

గ్రంథములోని చాలా భాగం గద్యములోనే రచించబడగా, పలు చోట్ల అనుష్టుభ పద్యాలు కూడా ఉన్నాయి.

కామము అనగా కోరిక.

లైంగిక వాంఛ కూడా కామమే.

 సూత్రము అనగా నియమము.

సాధారణంగా కామశాస్త్రమనే గ్రంథాల సమహారంలో కామసూత్ర అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంథం.

క్రీ.పూ 400-200 సంవత్సరాల మధ్యలో కామసూత్ర రచించబడి ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయము.

చరిత్రకారుడు జాన్ కీయే కామసూత్ర ఒక సంకలనమని, ఇది ప్రస్తుతమున్న స్థితిలో క్రీ.శ. రెండవ శతాబ్దములో సేకరించబడినదని చెప్పాడు.

విషయ సంగ్రహం
కామసూత్ర పీఠికలో వాత్సాయనుడు అతని కంటే పూర్వపు గ్రంథకర్తల యొక్క రచనలు తన రచనకి ఎలా ఉపయోగపడ్డాయో ప్రస్తావిస్తాడు.

 తన రచనలోని ఏడు భాగాలు దత్తకుడు, సువర్ణనభుడు, ఘోతకముఖుడు, గోనర్దియుడు, గోనికపుత్రుడు, చారాయణుడు, మరియు కుచుమారుని రచనల యొక్క సంగ్రహాలని తెలుపుతాడు.

 వాత్సాయనుని కామసూత్రాలు 1250 పద్యాలతో, 36 విభాగాలు, 7 భాగాలుగా వ్రాయబడ్డాయి. బర్టన్, ఇవే పురుషార్ధాలు:

1). ధర్మ: Virtuous living.
2). అర్థ: Material prosperity.
3). కామ: Aesthetic and erotic pleasure.
4). మోక్ష: Liberation.

జీవన్మరణ చక్రం నుంచి విముక్తినే మోక్షమంటారు.

జీవన్మరణ చక్రం నుంచి విముక్తిని కోరుకొనే వారు మోక్షమే ప్రధాన పురుషార్థంగా భావిస్తే,

 ధర్మార్థకామాలు జననానికి మరణానికి మధ్య జరిగే నిత్య జీవితపు పురుషార్థాలు.

 కామసూత్రం (బర్టన్ అనువాదం) లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:

కామానికంటే అర్థము, అర్థానికంటే ధర్మము ఉన్నతమయిన జీవితలక్ష్యాలు.

కానీ, ప్రజల నిత్యజీవిత అవసరాలను తీర్చే శక్తి అర్థానికే ఉంది కనుక, దేశాలను పరిపాలించే రాజులు మాత్రం అర్థాన్నే ప్రధాన పురుషార్థంగా స్వీకరించాలి.

 పడుపు వృత్తియే జీవనాధారముగా కల స్త్రీలకు కామమే ప్రధాన పురుషార్థము.

 వీరిరువురి విషయంలొ పయిన చెప్పిన నియమము వర్తించదు.(Kama Sutra 1.2.14)

మానవ జీవితంలో అన్నిటికంటే ఉన్నతమయిన లక్ష్యం "ధర్మం". తరువాత భద్రత (ఆర్థిక మరియు సామాజిక) నిండిన జీవితం ఆశయకరం.

సుఖభరితమయిన జీవితము అన్నిటికంటే చివర కోరదగినది.

 జీవిత లక్ష్యాల గురించి సంశయము కలిగినప్పుడు, తికమక కలిగినప్పుడు, అధమ లక్ష్యాలను త్యజించి ఉన్నతలక్ష్యాలను ఎంచుకోవాలి.

అర్థసాధనకయి ధర్మాన్ని, కామసాధనకయి అర్థసాధనను, త్యజించరాదు.

అయితే, ఈ నియమానికి కోన్ని ఆక్షేపాలు (exceptions) ఉన్నాయి.

వాత్సాయనుని ప్రకారం, అర్థసాధనకు కావలసిన విద్యను బాల్యంలోనే అభ్యసించాలి.

 యవ్వనదశ కామసాధనకు అనువుగా ఉంటుంది.

వార్ధక్యదశ దగ్గరయ్యేకొద్దీ మానవుడు ధర్మసాధనపై దృష్టిని నిలిపి, మోక్షమునకై ప్రయత్నించాలి.

కామసూత్ర గ్రంథాన్ని తాంత్రిక శృంగారానికి సంబంధించిన గ్రంథంగా అనుకోవటం పొరపాటు.

 హిందూ తంత్రములో శృంగారము ఒక భాగమైనప్పటికీ, తంత్రక్రియకు సంబంధించిన శృంగార కర్మలు కామసూత్ర గ్రంథంలో లేవు.

పుస్తకము గురించి వివరణ :


           ఏడు అధికరణాలుగల ఈ కామసూత్రంలో మొదటిది సాధికాధికరణం. దీన్ని వాత్స్యాయనుడు ఐదు ప్రకరణాలుగా విభజించాడు. ఈ ఐదింటిలో మొదటిదైన సంగ్రహంలో శాస్త్రంలో చెప్పే విషయాలు సంగ్రహంగా వివరింపబడ్డాయి. రెండవదైన త్రివర్గప్రతిపత్తిలో ధర్మార్థ కామాలను ఎలా సేవించాలో చెప్పబడింది. మూడవదైన విద్యా సముద్దేశంలో నాట్యము, సంగీతంవంటి కళల స్వరూపాలు, వాటి సాధన మార్గాలు, వాటికెట్టివారు అధికారులో చర్చించబడింది. నాల్గవదైన నాగరిక వృత్తంలో నగరంలో నివసించే వారైన నాగరీకుల ప్రవర్తన గురించి చెప్పబడింది. ఇక ఐదవదైన నాయక సహాయ దూతీ కర్మ విమర్శలో నాయకా నాయికలకు సహాయపడే దూతిక (దూతకు స్త్రీలింగం)ల గురించి వ్రాయబడి ఉంది. ఇలా విషయానికి తగినట్టుగా ఆ ప్రకరణాలకు పేర్లు పెట్టాడు శాస్త్రకారుడు.

రెండవ అధికరణం సాంప్రయోగికం. పది అధ్యాయాలూ, పదిహేడు ప్రకరణాలు ఇందులో ఉన్నాయి. స్త్రీ పురుషుల అంగప్రమాణం, స్కలనమయ్యే సమయం స్త్రీ పురుషులలో భావ ప్రాప్తి రతావస్థాపనాధ్యాయంలో వర్ణింపబడ్డాయి. కౌగిలింతలు, ముద్దులు, గోళ్ళ నొక్కులు, పంటి నొక్కులు, సంభోగానికి స్త్రీ పురుషులిద్దరినీ సిద్ధపరచటం, ఉపరతి, రతారంభం, రతి సమాప్తి, రతి గతి విశేషాలు, ప్రణయకలహాలూ ఈ అధికరణంలో వాత్స్యాయనుడు వివరించాడు.

మూడవ అధికరణమైన కన్యా సంప్రయుక్తకంలో ఐదు అధ్యాయములు, తొమ్మిది ప్రకరణములు ఉన్నాయి. వివాహము చేసుకొనుటలో అవలంభించే విధానాలు, సంబంధములు గురించిన నిర్ణయాలు, భార్యలను వశపరచుకొనే ఉపాయాలు, బాలలను పొందాలంటే హృదయాభిప్రాయాలను సూచించే రీతులు, కనుసైగలతో ప్రియుణ్ణి మళ్ళింపజేసేవిధానాలు, సేవకు వాళ్ళద్వారా కన్యను పొందేటటువంటి మార్గాలూ ఇందులో వ్రాయబడి ఉన్నాయి.

పురుషుని వివాహం చేసుకున్నప్పట్నుంచీ కన్య 'భార్య'గా పిలవబడుతుంది. 'భార్య'ను గురించి చెప్పేది భార్యాధికరణం. ఇందులో రెండు అధ్యాయాలు ఎనిమిది ప్రకరణాలు ఉన్నాయి. ఒక భర్త అధీనంలోనే ఉన్న భార్యను 'ఏకచారిణి' అంటారు. ఏకచారిణి నడుచుకోవల్సిన విధానం, భర్త దూరంగా ఉన్నప్పుడు అవలంబించాల్సిన విధానాలు, ఒక పురుషునికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలున్నప్పుడు వారిలో పెద్ద భార్య అవలంభించాల్సిన విధానం, చిన్న భార్య నడుచుకోవల్సిన రీతి-రివాజులు, రెండో పెళ్ళి చేసుకున్న స్త్రీ, గయ్యాళి అవటం మూలంగా భర్తచే వదిలివేయబడ్డ స్త్రీ, అంతఃపుర స్త్రీల యొక్క నడవడికలు, వారి పట్ల పురుషుడు ఎలా నడుచుకోవాలి అన్న విషయాలు ఇందులో వివరింపబడ్డాయి.

ఇతరుల భార్యలతో సంగమించే విషయములను వివరించేది ఈ ఐదవదైన పారదారికాధికరణం. దీనిలో ఆరు అధ్యాయములు, పది ప్రకరణములు ఉన్నాయి. స్త్రీ పురుషుల శీలంగురించి, స్త్రీ రతి విషయంలో వెనుకంజ వేయడానికి గల కారణాలను గురించి, స్త్రీల విషయంలో ఉత్సుకతచూపే పురుషుల గురించి, ప్రయత్నం లేకుండానే లొంగే స్త్రీల గురించి మొదటిది అధ్యాయంలోనూ, స్త్రీ పురుషుల పరిచయాలు ఎలా జరిగేదీ, ఒకరిపట్ల మరొకరు ఉత్సాహాన్ని ఎలా చూపించేదీ రెండో దానిలోనూ, స్వభావాన్ని పరీక్షించటం మూడో దానిలోనూ, దూతిక చేసే పనులు నాల్గవ దాని లోనూ, ఈశ్వర కామితం గురించి ఐదవ దానిలోనూ, అంతఃపుర స్త్రీల రక్షణ గురించి ఆరవ అధ్యాయం లోనూ వివరింపబడ్డాయి.

ఆరవ అధికరణమైన వైశికంలో ఆరు అధ్యాయాలు, పన్నెండు ప్రకరణాలు ఉన్నాయి. వేశ్యల వలన దొరికే సుఖం గురించి ఇందులో వివరింపబడింది. వేశ్యల దగ్గరకు వెళ్ళడానికి సాయపడే వారి గురించి, వేశ్య సంపర్కం పొందదగిన, దగని పురుషుల గురించి, వేశ్యలవిధేయత గురించి, డబ్బు సంపాదించే ఉపాయాల గురించి స్త్రీ విరక్తి కలిగిన వారిని గుర్తించటం గురించి, వియోగం పొందిన వారిని కలపటం గురించి పై ఆరు అధ్యాయాల్లోనూ వివరింపబడింది.

ఈ శాస్త్రంలో ఆఖరిదైనది. ఏడవది అయిన ఔపనిషదికాధికరణంలో రెండు అధ్యాయాలూ, ఆరు ప్రకరణాలూ ఉన్నాయి. ఏ ఉపాయం ద్వారానూ కామాన్ని పొంద కుదరకపోతే ఏ ఔషధాలు, ఎలా ఉపయోగించాలి, నష్టపోయిన కామాన్ని తిరిగి ఎలా పొందాలి, కామవృద్ధికోసం ఎలాంటి యోగ ప్రక్రియలున్నాయి, పోగొట్టుకున్న ప్రేమానురాగాలు ఎలా తిరిగి పొందాలి దానిని ఎలా వృద్ధి చేసుకోవాలి లాంటివి ఈ రెండు అధ్యాయాలలోనూ చెప్పబడ్డాయి. ఇలా వాత్స్యాయన కామ సూత్రాలు ముప్ష్పె ఆరు అధ్యాయాలను, అరవై నాలుగు ప్రకరణాలను, ఏడు అధికరణాలను, వెయ్యి శ్లోకాలను కలిగి ఉంది.

ఇది వాత్స్యాయన కామ సూత్రాల్లో ప్రథమాధికరణంలోని శాస్త్ర సంగ్రహం అనే మొదటి అధ్యాయం.


మేము కొని మీ అందరూ చదవటం కోసం ఇక్కడ ఉచితముగా ఇస్తున్నాం..

మీరు ఈ వెబ్సైట్ నుండే ఉచితంగా చదువుకోండి...
మరిన్నీ అద్భుతమైన పుస్తకాల కొరకు వీక్షిస్తూనే ఉండండి... మన www.ramkarri.org ని...స్వస్తీ...