మందంటే ఏమిటి ?

తక్కువ మోతాదులో శరీర ధర్మాల మీద, కొన్ని సార్లు శరీర నిర్మాణం కోసం ప్రభావం చూపగలే శరీరనికి వెలుపల నుంచి ఇవ్వబడే పదార్థము పేరు "మందు"(Drug)!

అది శరీరంలోనే తయారయితే దాన్ని మందు అనము!

ఈ భూమ్మీద దొరికే రకరకాల వస్తువుల నుంచి మందులు తయారు చేస్తారు."ఖనిజాలు,రసాయనాలు, మొక్కలు, చెట్లు, ఫంగస్, బ్యాక్టీరియా, జంతువులు,, మనషులు"అన్నింటి నుంచి మందులు తయారవుతాయి.

______________________________________________________


డబుల్ బ్లైండ్ పద్దతి అంటే ఏమిటి ?

నా అనుభవం లో ఒక్కరకి రియాక్షన్ రాలేదు అనీ "అది వట్టి పనికిమాలన మందు- వాడమకండి" అనీ ఫలానా కంపెనీ మందులే మంచివి"అనీ ఇలా అంటుంటారు జనం.

మందు ఇచ్చేవారికి, మందు మింగ్రేవారికు ఇద్దరకు తెలియదు కాబట్టి దీన్ని డబుల్ బ్లైడ్ పద్దతి అన్నారు ఇందులో ప్రయోగానికి గురయిన వారి, చేసేవారి, స్వకీయత్మక (Subjective) భావాలకు అవకాశం ఉండదు.

నమ్మకానికి, ప్రయోగానికి పడదు ఫలానా మందు పనిచేస్తుంద ని నా నమ్మకం","నాకు బలంగా నమ్మకం", "మీ అల్లోపతీ వాళ్ళకు ఆయుర్వేదం, హోమియో వాళ్ళంటే కుళ్ళు".... ఇవన్నీ ప్రయోగంలో తేలిన అంశాలు కావు. ఇవన్నీ నమ్మకాలు.

______________________________________________________

మందు అసలు పేరు : 

1. పేరాసిటమాల్ (paracetamol)


కంపెనీ పేర్లు :
1. కాల్పాల్ (calpol) 500mg.., 650 mg.(GSK)💊💈

2. మేటసిన్ (metacin)💊💉

3. క్రోసీన్ (crocin)💊

4. ఫ్యాట్ మిన్ (patmin)500 mg.(Rapakos)💊

ఉపయోగాలు :
🤦🏻‍♀నొప్పులు తగ్గడానికి వాడవచ్చు.

💆‍♂జ్వరానికి వాడొచ్చు. యాస్ర్పిన్ కంటే బాగా పనిచేస్తుంది.

🗣 జలుబు, ప్లూ జ్వరాలలో వాడొచ్చు.


ఇబ్బందులు :
👩🏻‍⚕దాదాపు ఉండవు. అరుదుగా దద్దుర్లు రావచ్చు. ఎక్కువ డోసులో ఒకేసారి 20 మాత్రలు మ్రింగితే కాలేయం దెబ్బతినవచ్చు.

జాగ్రత్తలు:

7 రోజులు మించి వాడరాదు. పిల్లలకు అందేటట్లు గా ఉంచరాదు.


______________________________________________________



2. క్లోరోక్వీన్ (Chloroquine)


" జ్వరమా? మలేరియా కావచ్చు! " క్లోరోక్వీన్ బిళ్ళలు వేసుకోండి అనే ప్రకటనలు చూసే ఉంటారు. ఒకప్పుడు మన దేశంలో తగ్గినట్లు అనిపించిన మలేరియా ఇప్పుడు మరలా విజ్రంభించింది.

మందుల షాపులో :

కంపెనీ పేర్లు:

1. లారియాగో (lariago)250mg..,500mg.(ipca)💊

2. రిసోచిన్ (Resochin)150mg.,500mg.(bayer)💊

3. మెలుబ్రిన్ (Melubrinr)250 mg.(Ranbaxy)💊

4. నివాక్వాన్-P (Nivaquine-P)250mg.(Rhone-Poulene)💉💊

క్లోరోక్వీన్ "మామూలు పేరు"తో వెయ్యి మాత్రలు టిన్నులో కూడా దొరుకుతుంది. మలేరియా వర్కర్ నుంచి ఈ మాత్రలు ఉచితం లభ్యమవుతాయి.

ఇబ్బందులు :

మాత్రలు చేదుగా ఉంటాయి. వికారము, వాంతి రావచ్చు. దద్దుర్లు లేవవచ్చు. అన్నం తిన్న తర్వాత మ్రింగిత్రే వాంతి అంతగా రాదు.

మలేరియా గురించి మీరు తెలుసుకోవాల్సినవి :

2013లో దాదాపు 20 కోట్ల మందికి మలేరియా వ్యాధి సోకిందని, దాదాపు 5,84,000 మంది దానివల్ల చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా. అందులో దాదాపు 80 శాతం ఐదేళ్ల లోపు పిల్లలే. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ఈ వ్యాధి చాలా తీవ్రంగా ఉంది. దానివల్ల 320 కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారు.

1 మలేరియా అంటే ఏమిటి?
కొన్ని సూక్ష్మజీవులు వేరే జీవుల శరీరంలో నివసిస్తాయి. అలాంటి ఒక సూక్ష్మజీవి వల్ల వచ్చే వ్యాధి మలేరియా. ఆ వ్యాధి లక్షణాలు: జ్వరం, చలి, చెమటలు పట్టడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపులో తిప్పినట్లు ఉండడం, వాంతులు. వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి రకాన్ని బట్టి, వ్యాధి ఎంతకాలం నుండి ఉంది అనే దాన్నిబట్టి ఈ లక్షణాలు 48-72 గంటల వ్యవధిలో మళ్లీమళ్లీ కనిపిస్తుంటాయి.


2 మలేరియా ఎలా వస్తుంది?

ఆడ అనాఫిలిస్‌ దోమ కాటువల్ల మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవులు మనిషి రక్తంలోకి ప్రవేశిస్తాయి.

ఆ సూక్ష్మజీవులు రక్తంలో నుండి కాలేయ కణాల్లోకి (liver cells) ప్రవేశిస్తాయి. అక్కడ వాటి సంఖ్య వృద్ధి చెందుతుంది.
కాలేయ కణాలు పగిలినప్పుడు, ఈ సూక్ష్మ జీవులు బయటకు వచ్చి రక్త కణాల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడ మళ్లీ వీటి సంఖ్య వృద్ధి చెందుతుంది.

ఎర్రరక్త కణాలు పగిలినప్పుడు బయటకు వచ్చి మరిన్ని రక్తకణాల్లోకి ప్రవేశిస్తాయి.

ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశించడం, అవి పగిలిపోవడం జరుగుతూనే ఉంటుంది. ఎర్రరక్త కణాలు పగిలిన ప్రతీసారి వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.

3 ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?

మీరు మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే . . .
దోమ తెర ఉపయోగించండి. దోమతెరను
శుభ్రంగా ఉతకాలి.

రంధ్రాలు, చినుగులు లేకుండా చూసుకోవాలి.
కింద ఖాళీల్లో నుండి దోమలు రాకుండా పరుపు కిందకు పూర్తిగా నెట్టండి.

దోమలను చంపడానికి ఇంట్లో దోమల మందు కొట్టండి.
వీలైతే తలుపులు, కిటికీలకు దోమలు రాకుండా ఆపే నెట్‌లు బిగించండి. దోమలు వచ్చి నిలవకుండా ఉండేందుకు ఫ్యాన్లు, ఎ.సి.లు ఉపయోగించండి.

లేత రంగులో ఉండి, శరీరాన్ని మొత్తం కప్పే బట్టలు వేసుకోండి.
దోమలు కొన్ని చెట్లు, పొదల దగ్గరగా గుంపులుగా ఉంటాయి. వీలైతే, అలాంటి చోట్లకు వెళ్లకండి. నీళ్లు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే దోమలు అక్కడ గుడ్లు పెడతాయి.

వ్యాధి వస్తే, వెంటనే డాక్టరు సహాయం తీసుకోండి.
ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి ఉన్న దోమ కుట్టినప్పుడు ఒక వ్యక్తికి మలేరియా వస్తుంది. అలాగే వ్యాధి సోకిన వ్యక్తిని మామూలు దోమ కుట్టినప్పుడు కూడా ప్లాస్మోడియం ఆ దోమలోకి వెళ్తుంది. అదే దోమ మళ్లీ వేరేవాళ్లను కుట్టినప్పుడు వాళ్లకు కూడా మలేరియా వస్తుంది

మీరు మలేరియా ఎక్కువగా ఉండే ప్రాంతానికి వెళ్తుంటే . .
వెళ్లేముందు అక్కడున్న పరిస్థితుల గురించి ముందుగా తెలుసుకోండి. ఈ వ్యాధి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ప్లాస్మోడియం వల్ల వస్తుంది. దాన్ని బట్టి వాడాల్సిన మందులు కూడా మారుతాయి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఈ వ్యాధి విషయంలో మీరేమైనా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా అని మీ డాక్టరును అడగడం మంచిది.
మీరు ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు, పైన ఇచ్చిన జాగ్రత్తలు పాటించండి.

వ్యాధి వస్తే, వెంటనే డాక్టరు సహాయం తీసుకోండి. వ్యాధి సోకిన 1 నుండి 4 వారాల తర్వాతే వ్యాధి లక్షణాలు బయటపడతాయని గుర్తుంచుకోండి.


ఇంకా ఏమి చేయవచ్చు . . .
ప్రభుత్వ లేదా ఇతర సంస్థలు నిర్వహించే ఆరోగ్య సంరక్షణా కార్యక్రమాల నుండి ప్రయోజనం పొందండి.
గుర్తింపు ఉన్న సంస్థల మందులే వాడండి. (నాసిరకం మందుల వల్ల వ్యాధి ఇంకా ఎక్కువ కాలం ఉండవచ్చు లేదా ప్రాణాపాయం రావచ్చు.)
ఇంటి చుట్టు పరిసరాల్లో దోమలు పెరిగే ప్రాంతాలు ఉండకుండా చూసుకోండి.
మీరు మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంటున్నారా? లేదా ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చారా? అయితే, మలేరియా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరు సహాయం తీసుకోండి . . .

👩🏻‍⚕ఒళ్లు వేడెక్కడం (జ్వరం)
👩🏻‍⚕చెమటలు పట్టడం
👩🏻‍⚕చలితో వణికిపోవడం
👩🏻‍⚕తలనొప్పి
👩🏻‍⚕ఒళ్లునొప్పులు
నీరసం
👩🏻‍⚕కడుపులో తిప్పినట్లు ఉండడం
👩🏻‍⚕వాంతులు
👩🏻‍⚕విరేచనాలు

మలేరియా వచ్చినప్పుడు డాక్టరు సహాయం తీసుకోకపోతే, రక్తహీనత వస్తుంది, దానివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వ్యాధి లక్షణాలు ఎక్కువ కాకముందే, వెంటనే డాక్టరు దగ్గరకు వెళ్లండి. పిల్లలు, గర్భిణి స్త్రీలు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.


______________________________________________________




3. కో-ట్రైమాక్సజోల్ CO-TRIMOXAZOLE 

ఇది ఒక సల్పా మందు. క్రిములను చంపడానిగ్గను తయారుచేయబడిన మొదటి మందుల్లో "సల్ఫా" ఒకటి.
CO-TRIMOXAZOLE "ట్రైమెధప్రిం" ఒక వంతు"సల్ఫ మేదక్సజోల్"5 వంతుల చొప్పున కలిసి ఉన్నందున, మాముల సాల్ఫా కంటే దీని శక్తి ఎక్కువయింది .

పెన్సిలిన్ పనిచేయని రోగాల్లోను CO-TRIMOXAZOLE పనిచేస్తుంది.

ఉపయోగాలు :

శ్వాస మండల వ్యాధుల్లో, టేన్సిలైటిసే, గుండె నెమ్ము, న్యుమోనియా... వగైరా శ్వాస మండల వ్యాధుల్లో పనిచేస్తుంది.

మూత్ర మండలంలో చీము చేరిన ఎడల ఉపయోగపడుతుంది.

బాక్టీరియా క్రిములతో వచ్చే బంక విరేచనాలు పనిచేస్తుంది.

చర్మంలో చీము గానీ, తయరయితే ఉపయోగించవచ్చు.

"షాంక్రాయిడ్"అనబడు సుఖవ్యాధు లో పనిచేస్తుంది.

టైఫాయిడ్ జ్వరంలోనూ వాడొచ్చు.


మందుల షాపుల్లో :

1.Bactim,primal-heathcare 💊

2.septran

3.ciplin,cipla💊


మోతాదు (Dose) :

👶🏻 1year లోపు child's : సింగిల్ స్త్రెంగ్త్ మాత్ర పావు వంతు పొడి చేసి చక్కెరలో కలిపి ఉదయం, సాయిత్రం మింగించవచ్చు.

1-12 years సింగిల్ స్త్రెంగ మాత్ర ఉదయం ఒకటి, రాత్రికి ఒకటి వేయాలి.

👱🏻‍♀13y పైన డబల్  స్త్రెంగ మాత్ర ఉదయం ఒకటి రాత్రికి ఒకటి వేయాలి


ఇబ్బందులు :

🤦🏻‍♀వికారం,అన్నం తిన్న తర్వాత మింగ్రతే ఈ సమస్య కూడా తగ్గిపోతుంది.

దద్దర్లు, నల్లగా మచ్చలు పడవచ్చు.

👨🏻‍⚕కాలేయం దెబ్బతినవచ్చు.

 రక్తంలో కణాలు తగ్గిపోవచ్చు.


జాగ్రత్తలు (Precautions) :

👩🏻‍⚕ఎక్కువ నీళ్ళు త్రాగమని చెప్పాలి

👩🏻‍⚕గర్భిణీ స్త్రీలకు 6 వారాల లోపు వయసు గల పిల్లల కు మందు వాడరాదు.

👩🏻‍⚕4 డేస్ లో మందు ఫలితం కనపడకపోతే మందును ఆపి డాక్టర్ ను సంప్రదించండి.


______________________________________________________



4. డాక్సీసైక్లీన్  (DOXYCYCLINE)

Brand names :

1. tetradox💊

2. Doxy-1 50mg.., 100mg.., 200mg. USV 💊

3. minicyline 100mg. Plethic💈💊

"టెట్రాసైక్లీన్ " యాంటీ బయోటిక్ పనిచేసినట్లుగానే " డాక్సీసైక్లీన్" పని చేస్తుంది.

ఉపయోగాలు :

👩🏻‍⚕బంక విరేచనాలు, నీళ్ళు విరేచనాలు, కలరాలలో వాడవచ్చు.

👩🏻‍⚕దగ్గు, జ్వరం తో కళ్ళు పచ్చగా పడ్తెంటే (బ్రాంకైటిస్)

👩🏻‍⚕గొంతు నొప్పి, గుటక వేస్తే నొప్పి, దగ్గు, జ్వరం (ట్రాన్సిలైటిస్)

👩🏻‍⚕మొటిమలలో చీము పడితే;

డోస్ : 

పెద్దయిలతే 100మి. గ్రా మాత్రలు రెండు  మ్రింగలి .

ఆ పైన రోజుకో మాత్ర చొప్పున ఏడు రోజులు మింగాలి.

❌12 సంవత్సరాలలోపూ పిల్లల వాడరాదు

ఇబ్బందులు :

👨🏻‍⚕పొట్టలో నొప్పి, వికారం, వాంతి రావచ్చు.

👨🏻‍⚕గర్భిణి స్త్రీలు,12years పిల్లలు ఉపయోగించితే పళ్ళు గోధుమరంగు గా శాశ్వతంగా ఉంటుంది.

👨🏻‍⚕నీళ్ళ విరేచనాలు కావచ్చు. అలా అయితే వెంటనే మందు ఆపేస్తే తగ్గిపోతుంది.

జాగ్రతలు :

👩🏻‍⚕అన్నం తిన్నక ముందే మందు మ్రింగితే పూర్తిగా రక్తం లోనికి పోతుంది.

మందు తింటే మంట వస్తుందేమోనని , పాలు, మజ్జిగ లాంటివి తర్వాత డాక్సీసైక్లీన్ తింటే మందు పూర్తిగా రక్తం లోనికి చేరదు.



______________________________________________________



5. ప్యురజోలిడొన్ (FURAZOLIDONE) :

Brand names (కంపెనీ పేర్లు)

1.Fudone,Wockhardt 20mg..,40mg💊

2.Furoxone GSK 100mg.💊

గోధుమ రంగు లేదా పసుపు పచ్చ రంగు లో ఈ మందు లా
లభ్యమవుతుంది. మాత్రలు మ్రింగిన తర్వాత మూత్రం పచ్చగా వస్తుంది.

ఉపయోగాలు : 

నీళ్ళ విరేచనాలు, బంక నెత్తురు విరేచనాలు.
తగ్గడానికి ఈ మాత్రలు వాడవచ్చు.

💉డోస్ :

👩🏻‍⚕పెద్దలయితే 100mg మాత్ర మూడు పూటలు ఒక్కొకటి చొప్పున

👩🏻‍⚕5-12yrs child's అరమత్రా చొప్పున మూడు సార్లు

👩🏻‍⚕0-5yrs వారికి పావు వంతు మాత్ర మూడు సార్లుగా పొడి చేసి నీళ్లలో కలిపి, కొంచం చక్కెర కలిపి ఇవ్వాలి

ఇబ్బందులు :

మూత్రం పచ్చగా వస్తుంది.
గాభరా చందనక్కర్లేదు.
కొన్ని సార్లు పొట్లలో వికరమూ,
వాంతి రావచ్చు.

______________________________________________________


చిన్న పిల్లలకు సిరప్ మరియు Tablets ఇచ్చేముందు వాటిపై పెడియాట్రిక్స్ (PEDIATRICS) అన్నీ వ్రాసి ఉంటేనే వాటిని పిల్లలకు వాడాలి


EX :

1.Tyfy 300

2. Calpol

జ్వరానికి, నోపులుకు

3. Power Gyl
Oflaxcin & metro nodazole suspersion
Anti bitic

బ్యాక్టీరియా, రేసెస్, చెవు, కళ్ళు... పిల్లలకు బ్యాక్టీరియా ప్రోబ్లేమ్స్ వాటి యూస్ చేయవచ్చు

₹65


4. Benadryl

దగ్గు, జలుబు కు...
Rs:₹50


5. SINAREST

దగ్గు, జలుబు, నొప్పులు కు

₹73


ఇలా చాలానే ఉన్నాయి...

______________________________________________________


6. మెట్రోనిడజోల్ -METRONIDAZOLE


మందులు అసలు పేర్లు :

1.flagyl,Rhone-poulenc💉💊

2.Metrigyl, Unique💈💊💉

3.మెట్రోనిడజోల్ syrup

200mg/70m.l సీసా/30ml

4.మెట్రోనిడజోల్ 30ml-60ml

సిరప్

"మెట్రోనిడజోల్" అమీబా, జియర్డియా, ట్రైకోమోనాస్ అనబడు ఏకకణ రోగ జీవులను చంపుతుంది"అని రోబిక్ ఇన్ఫెక్షన్"లో కూడా పని చేస్తుంది.

ఉపయోగాలు :

👩🏻‍⚕ అమీబియాసిస్ జబ్బూ,
బంక, రక్త విరేచనాలు, కడుపు నొప్పి, లక్షణాలు"దిసెంట్రి"లో ఉంటాయి.
ఈ అమీబా ప్రేవుల్లోంచి కాలేయం లోనికి వెళ్తే"లివర్ యాబ్సిస్" అనే జబ్బు వస్తుంది. *మెట్రోనిడజోల్* పనిచేస్తుంది.

🤦🏻‍♀ ట్రైకోమోనాస్ వజైనైస్ అనే స్త్రీల వ్యాధిలో"దుర్వాసన" తో కూడిన తెల్లమైల వస్తుంది.

మర్మవాయవంలో దురద, మంట కూడా ఉంటాయి. మెట్రోనిడజోల్ పనిచేస్తుంది.

👩🏻‍⚕జియర్డియసిస్ జబ్బులో వాడతారు

👩🏻‍⚕దుర్వాసనతో కూడిన గాయలలో "యాంటీ బయాటిక్" మందులతో పాటు *"మెట్రోనిడజోల్"*ఉపగిస్తారు.

డోస్ :

💊💈200mg/400mg. Tablets and syrup

💊 400mg.పెద్దలకు 2 చొప్పున మూడు సార్లు 5-10 డేస్ ఇవ్వాలి

💊 ట్రైకోమొనస్ లో 400mg tablet .. morning and night ఒకటి చొప్పున 7 డేస్ భార్యాభర్తలిద్దరూ వాడాలి. లేదా 5 టాబ్లెట్ లు ఒకే సారి మ్రింగవచ్చు.

💊 వాసనతో కూడిన గాయాలలో 400m.g మాత్రలు మూడు పూటలు ఒక్కొకటి చొప్పున 7 రోజులు వాడాలి.

ఇబ్బందులు :

చేదుగా, వికారం వాంతి, కడుపు త్రిప్పటం రావచ్చు.
అరుదుగా తల నోపి వస్తుంది.
నోటిలో రుచి లేని తనముంటుది. ఏది తిన్నా మట్టి నోట్లో పెట్టుకున్నట్లు.

జాగ్రత్తలు :

👨🏻‍⚕అన్నం తిన్న తరువాత మాత్ర మింగాలి.

👨🏻‍⚕మందు తీసుకుంటే సారాయి త్రగారాదు

👨🏻‍⚕నిర్ణయించు డోసు తట్టుకో లేక పోతే తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

👨‍❤‍💋‍👨 భార్య భర్తలు ఇద్దరులు వైద్యం చేయింకోవాలి.


______________________________________________________


7. టినిడజోల్ TINIDAZOLE

Brand names :

1.Fasigny500mg..,1mg
Pfizer 💊

2.Tiniba ,
Cadila Health Care💊

3.Tini
Koprna💊


"METRONIDAZOLE, TINIDAZOLE" మాత్రలు ఏవైనా సరే ఇబ్బందికరంమైన రుచి ఉంటుంది.

TINIDAZOLE తక్కువ రోజులు వాడితే సరిపోతుంది.

ఉపయోగాలు, డోస్ :

అమిభియాసిన్ లో : morning 1gm, evening 1gm,3 రోజులు మింగాలి.

ట్రైకోమొనియసిస్ : 2mg ఒకేసారి

అనిరోబిక్ ఇన్ఫెక్షన్లు : మొదటి సారి 2 గ్రాములు, తర్వాత రోజుకో గ్రాము చొప్పున 5-7 రోజులు, ఆపరేషన్లు కు ముందు 12గ' మందు 2 గ్రాముల మందు ఒకేసారి మింగాలి.


ట్రైకోమొనియసిస్ జబ్బులో స్త్రీకి వైద్యం చేసేటప్పుడు ఆమె భర్తక్కుడా చేయాలి.

తెల్లమొల తగ్గేవరకు రతిలో పాల్గొనారాదు.


______________________________________________________



8. సెక్ నిడజోల్ - SECNIDAZOLE :


మెట్రో నిడజోల్,"టినిడజోల్" ల మాదిరిగానే పని చేస్తుంది. ఒకేరోజు మందు వాడితే సరిపతుంది. అనిరోబీక్ ఇన్ ఫెక్షన్లలో పని చేయదు.

ఉపయోగాలు, మోతాదు :

అమీబియాసిస్ లో 2 గ్రాములు ఒకేసారి
అమిబిక్ మిర్ యాబ్సి న్ 1.5gm for day
జియర్దిసిస్-2 గ్రాములు ఒకేసారి.
ట్రైకో మొనియసిస్ 2gm

 కంపెనీ పేర్లు :

 secnil 500mg.,💊

Seczol 500mg💊

Trisec Forte💊


వాంతులు తగ్గడానికి ఉపయోగించే ముందుల్లో దాదాపు ప్రమాదం లేని మందు ఇది
METOCLOPRAMIDE


______________________________________________________

మందులు అసలు పేర్లు వాటి ఉయోగాలు !

ప్రతి టాబ్లెట్స్,durgs వాటి కంపెనీ పేర్లు తోనే బయట దొరుకుతాయి... Durgs పై మందు అసలు పేరు కన్న వాటి కంపెనీ పేర్లు పెద్ద పెద్ద అక్షారాలతో ఉంటాయి.

ఫస్ట్ చూడవలసిందే మందు అసలు పేర్లు ఇదా!కదా?


PARACETAMAL: జ్వరానికి వాడొచ్చు

CHLOROQUINE: జ్వరం, మలేరియా

CO-TRIMOXAZOLE: క్రిములు నశిస్తాయి

DOXYCYCLINE: బంక విరోచాలు

FURAZOLIDONE: నీళ్ళ విరేచనాలు

METRONIDAZOLE: స్త్రీ పురుషులు వ్యాధిలో దుర్వాస , గాయాలు, విరోచనాలు,

TINIDAZOLE: దుర్వాసన తో కూడిన వాటికి, కడుపు నొప్పి

SECNIDAZOLE: దుర్వాసన తో కూడిన వాటికి కడుపు నొప్పి

METOCLOPRAMIDE: వాంతులు తగ్గడానికి

FERROUS SULPHATE: శరీరం లో"ఇనుము" తగ్గితే  రక్తహీనత రోగానికి

FERROUS FUMARATE: రక్త హీనత నయం చేయడానికి

CHLORPHENIRAMINE: గిట్టని పదార్థాలు వలనా వచ్చే అలర్జీని కు

CODEINE: అలర్జీ వల్లనా వచ్చే పొడి దగ్గ, నొప్పిని తగ్గించే గుణం ఉంది

AMINOPHYLLINE: ఉబ్బసం, అలర్జీతో ఆయాసం తగ్గిస్తుంది.

THEOPHYLLINE: ఉబ్బసం

LVERMECTIN: పొట్టలో పురుగులు చనిపోతాయి

ASPIRIN: నొప్పులు కు

IBUPROFEN: నొప్పులకు

ATROPINE: పొట్టలో ఉండుండి నొప్పి వస్తె..

MEBENDAZOLE: ఏలిక పాములు, నులిపురుగుల,కోకి పురుగుల పోవడానికి..

PYRANTEL PAMOATE పురుగులు, ఏలిక పాములు పోవడకి

TRANQUILISERS/ANXIOLYTICS : ఆందోళన తగ్గించే మందులు

ANTIBIOTICS:


DIURETICS: గుండె జబ్బుకు, మూత్ర పిండాలు, కాలేయం, రక్తహీనతతో... వాటికి సంబంధించిన మందులు

Drugs for intestinal colic, biliary colic, renal colic
: పొట్టలో మెలిబెట్టినట్లు వచ్చే నొప్పికి

Anti histamine drugs:
అలర్జీ, నేసల్ అలర్జీ, ఉబ్బసము, ఇయోసినోఫోలియ, పొడి దగ్గ వాడే మందులు


______________________________________________________


జ్వరం తగ్గటం కోసం మందు :


తడి గుడ్డ వైద్యం cold sponging/tepid sponging/wet sponging

సినిమాలో లాగా ఒక్క నుదుటి మీద మాత్రమే తడిగుడ్డతో నిరుపయోగం.

వళ్ళంతా తడి గుడ్డను తగిలేలా కప్పాలి.

👩🏻‍⚕జర్వం 100' డిగ్రీల కంటే తక్కువ ఉంటే ఏ వైద్యము అవసరం లేదు.

👨🏻‍⚕జ్వరం మందులు తో తాత్కాలికంగా తగ్గుతుంది. మందు ప్రభావం తగ్గగానే తిరిగి జ్వరం వస్తుంది.

👩🏻‍⚕పై పై న జ్వరం తగ్గిస్తే చాలదు. అసలు కారణం తొలగిస్తే జ్వరం పూర్తిగా తగ్గుతుంది.


Paracetamal - పేరాసిటమల్

పేరాసిటమల్ ను"Acetaminophen" అని కూడా అంటారు.

1.pyrigesic 500mg east India💊

2.paicimol 500mg..,600mg.IPCA 💊

3.Febrex 500mg..,650 mg.indoco 💊

4.Malidens 500mg. Nicholas Piramal💊

5.Neomol 150mg/ml Neon💉

జ్వరం తో పాటు ఒళ్ళు నొప్పులు కూడా ఉంటే ?


👩🏻‍⚕నుప్పులేవగా ఉండి జ్వరం తక్కువ గా ఉంటే

 మందు అసలు పేరు: Aspirin

కంపెనీ పేర్లు:

Otaspirin 500mg.Natco💊

Ecosprin 325mg.USV💊

5y below child "Aspirin" వాడటం మంచిది కాదు

5-12 తప్పనీసరియితేనే వాడాలి.

2. Ibuprofen :

Nuren 200mg...,400mg Dabur💊

Bren 200mg..,400mg.600mg koprna💊

3. Mefenamic Asid

Meftal 100mg.,250mg..,500mg.,Blue Cross 💊

Neopan250mg.. Noel💊

Mefac 250 mg. P&B💊


చిన్న పిల్లలకు సిరప్ వాడటం మంచిది

మందు గిట్టని వాళ్ళకు ఏ మందయినా ప్రమాదం అని మర్చిపోకూడదు


______________________________________________________


జ్వరం చూడటం ఎలా? ప్రమాదాలు :


👩🏻‍⚕సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.4 ఫారాన్ హిట్ డిగ్రీలు ఉంటుంది.

👨🏻‍⚕వాతావరణ మార్పులు బట్టి 97-99'  డిగ్రీలు మధ్య ఉండవచ్చు.

👩🏻‍⚕104 డిగ్రీలకు పైన జ్వరం ఎంత పెరిగితే అంత ప్రమాదం. పిల్లలలో *"ఫిట్స్"* రావచ్చు, మెదడు శాశ్వతంగా దెబ్బతిని పక్షవాతం, బుద్ది మంద్యం, మూర్ఛ జబ్బు మొదలైనవి రావచ్చు.

👨🏻‍⚕ఎంత ఎక్కువ సేపు, ఎక్కువ మోతాదు జ్వరం ఉంటే అంత ప్రమాదకరం.

కారణాలు, లక్షణాలు : 

👩🏻‍⚕శరీరం శ్రమ వలనా, మానసిక వత్తడి.. భయం ఆందోళన

👨🏻‍⚕వేరస్, బ్యాక్టీరియలాంటి సూక్ష్మ జీవులు శరీరం లోకి ప్రవేశించటం వలనా

👩🏻‍⚕ప్రమాద గాయాలు, దెబ్బలు, శరీరం కణుతుల వలనా

👨🏻‍⚕వాతావరణ వేడి వల్లనా ఇలా అనేక కారణాలు ఉన్నాయి..

లక్షణాలు :

నీరసం
తల నొప్పి
వళ్ళు నొప్పులు
ఆకలి మందగించటం
నోరు చేదుగా ఉంటుంది
ఒక్కోసారి వాంతి వచ్చినట్లు..

లక్షణాలు ఉండవచ్చు....


______________________________________________________

గజ్జి - SCABIES :


మనుషుల చర్మం మీద కొన్ని రకాల మొక్కలు, కొన్ని రకాల సూక్ష్మీవులు పెరుగుతున్నాయి. తామర,గజ్జి

గజ్జి క్రిమి ఒక సూక్ష్మ"పరాన్నజీవి" parasite.Itchmite అంటారు. క్రిమి 0.3mm నుండి 0.4mm పరిమాణం లో ఉంటుంది.

దీనికి ముందు రెండు జతలు , వెనుక రెండు జతలు కళ్ళుంటాయి.

ఈ పరాన్న జీవులు చర్మం పొరల్లో సొరంగం ఏర్పరుచుకొని నివసిస్తుంటాయి. ఈ క్రిమితో చర్మం నికి వచ్చే అంటువ్యాధి "గజ్జి"అంటారు.

కారణాలు :

రోజుల తరబడి స్నానం చేయకపోయినా , మాసిన బట్టలు రోజుల తరబడి మర్చికపోవడం, మట్టిలో ఆడటం వలన గజ్జి వస్తుంది.

వ్యాప్తి :

గజ్జి క్రిమి మందు చర్మం పై న చోటు చూసుకొని ఆ తర్వాత గుడ్లు పెడ్తుంది.

ఈ గ్రుడ్లు నుంచి 15 రోజుల వ్యవధి లో పిల్ల గజ్జి క్రిములు పుట్టుకొస్తాయి. జీవిత కాలం నెల, రెండు నెలలు , ఒకటి 30 గుడ్లు వరకు పెడుతుంది.

ఇవి చర్మం లో సొరంగాలు తొలిచే ప్రతి చోట విపరీత దురద పుడుతుంది.

వైద్యం :

గజ్జి క క్రిములను చంపడానికి  క్రింది మందులు:

Benzyl Benzoate

1.Ascabiol lotion, Rhone-Poulenc🧂

2.Scabindon ,Indon

3.Benzyl Benzoate

Gamma Benzene Hexachloride
cetrumide
1.Scbex lotion
2.Scaboma lotion

Ivermectin
1.ivermectol ,Ochoa



______________________________________________________


డిస్మేనోరియా - DYSMENORRHOEA


బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పి నీ "డిస్మేనిరియా" DYSMENORRHOEA అంటారు.

కారణాలు :

👩🏻‍⚕రజస్వల అయిన మొదట్లోనూ, పిల్లలు పుట్టటానికి మందు నొప్పి వస్తుంది కాబట్టి, గర్భసంచి ముఖద్వారా బలంగా ముడుచుకు పోవడం ఒక కారణం అనుకుంటున్నారు.

👩🏻‍⚕అండ విడుదల కావటం వలనా; గర్భనిరోధక మాత్రలు వాడితే

👩🏻‍⚕కాపర్ "టీ" లూప్ వంటి  గర్భనిరోధక సాధనాలు అమర్చటం వలనా

👩🏻‍⚕మానసిక ఒత్తిడి, ఆందోళనల వలనా

👩🏻‍⚕"Endometriosis" వలనా

👩🏻‍⚕అండవహికలలో చీము చేరే "Salpingitis" అనే జబ్బు వలనా... కడుపు నొప్పి రావచ్చు.

లక్షణాలు :

👨🏻‍⚕కడుపు నొప్పి రావడం,
👨🏻‍⚕వాంతులు
👨🏻‍⚕అయోమయంగా ఉండటం
👨🏻‍⚕స్పృహ తప్పటం...

మొదలైన లక్షణాలు ఉంటాయి.

వైద్యం :

👩🏻‍⚕ఒక కాన్పు కాగానే సాధారణంగా తగ్గిపోతుంది.

👩🏻‍⚕విశ్రాంతిని మించిన వైద్యం అవసరం లేదు.

👩🏻‍⚕కడుపు నొప్పి తగ్గించే మాత్రలు ఏవైనా వాడవచ్చు.

మందులు అసలు పేరు :

Dicyclomine కలిసి ఉండే మందులు

Brand names:

Novigan -N ,Dr.Reddy's💊

Meftal-Spas💊💉

Cyclopam💉💊

Colinol💉💊

Clomin 2ml💊💉

Colimex 500mg..,💊

Hyoscine Butyl Bromide

Buscopan 10mg...💉💊

వేడి నీళ్ళు స్నానం లేదా పొత్తి కడుపు మీద వేడి నీళ్ళు కపటం పెట్టవచ్చు.

ఈ నొప్పి భరించటం నా వల్ల కాదు అనే వాళ్ళు డాక్టర్ నీ సంప్రదించాలి.


______________________________________________________


బహిష్టు ని వాయిదా వేయటం - Postponement of Menstruation


పండుగలు, ప్రయాణాలు, శుభకార్యాలు, పరీక్షలు.... వగైరాలున్నడు స్ర్తీలు "నెలసరి బహిష్ట వాయిదా" ని కావాలి అని డాక్టర్ నీ కలుస్తూ ఉంటారు ఇది జబ్బు కాదు. చిన్న సర్దుబాటు.
బహిష్టు మొత్తం ఋతుచక్రం స్త్రీ శరీరం లో తయారుయ్యే స్త్రీ హర్మన్లు (ఈ స్ట్రోజన్, ప్రోజెస్టిరాన్, ల్యుటినైజింగ్ హర్మన్) నిర్దేశించిన ట్లే జరుగుతుంది.
ఈ స్ట్రోజన్, ప్రోజెస్టిరాన్ లు అనే హర్మనులు కలిసి ఉండే మందులు తక్కువ డోస్ లో పిల్లలు పుట్టకుండా వాడే " FAMILY PLANNING " మందుల్లో

ఇవే మందులను బహిష్టను వాయిదా వేయటం కూడా ఉపయోగిస్తారు.

మందు అసలు పేరు :

 Levo-Norgestyl +

Etinyl-Estadiol

Ovral 0.25mg+0.05mg Wyeth 💊.

Ovral -G 0.5 mg+0.05mg Wyeth💊

Ovral-L 0.15mg.+0
.03mg Wyeth💊

Or

Norethindrone

Primolut-N 5mg
Regestrone 5mg
Amenova 5mg
Dubogen 5mg

Dose :

Levo - Norgestrel 0.15 mg+
Etinyl Oestradiol 0.03mg.
Mala-D💊

👩🏻‍⚕ఎన్నాళ్ళు వాయిదా వేయాలని అనుకుంటే అంతకాలం రోజుకో ఒక మాత్ర చొప్పున మ్రింగాలి.

👩🏻‍⚕మద్యన ఒక రోజు మారిపోతే మరుసటి రోజు రెండు మ్రింగాలి .

👩🏻‍⚕బహిష్టు కావటానికి కనీసం 3-4 రోజుల ముందు గార్ ఈ మాత్రలు వాడటం మొదలు పెట్టకపోతే బహిష్టు వాయిదా వేయలేం.

ఆపేస్తే 3-4 రోజులో బహిష్టు అవుతుంది.

______________________________________________________


మహిళల్లో బుతుస్రావం గురించి కొన్ని సాధారణ అపోహలు
సమీరా ఆమె బాస్ ను ఒక రోజు లీవ్ కావాలని కోరారు. ఎందుకు? ఎందుకంటే ఆమెకు పీరియడ్స్ మొదలైన రోజు. ఆమెకు ఆ సమయంలో చాలా తక్కువ మరియు నీరసమైన భావనలు ఉంటాయి. ఆమెకు ఆఫీసు లేదా పార్టీకి హాజరు కావడానికి మూడ్ ఉండదు. ఆమె షాప్ కి వెళ్ళటానికి తిరస్కరిస్తుంది. ఇక్కడ ప్రతి స్త్రీ తెలుసుకోవలసిన ఋతుస్రావానికి సంబంధించిన కొన్ని అపోహలు ఉన్నాయి.

మహిళల్లో ఋతుస్రావం గురించి 9 సాధారణ అపోహలు :
దీనిలో మొత్తం నిజం లేదు. ఎందుకంటే రక్తం నష్టం వలన శరీరం బలహీనం అవదు. మీరు 150 ml రక్తాన్ని మాత్రమే కోల్పోతారు. అంటే 4-6 స్పూన్ల రక్తాన్ని మాత్రమే కోల్పోతారనేది నిజం. కానీ,మీకు రక్తహీనత ఉంటే అది ఒక బిన్నమైన పరిస్థితి అని చెప్పవచ్చు.

ఋతు రక్తం ఒక ఏలియన్ గా భావన :
నో మహిళలు! రక్తం,ఋతు చక్రం సమయంలో రక్తాన్ని పోలి ఉంటుంది. సాధారణ రక్తస్రావం ఉన్నప్పుడు, చెడు వాసన ఉండదు. దాని గురించి అసాధారణం ఏమీ లేదు.గుర్తుంచుకోండి! బాక్టీరియా నివారించేందుకు ప్యాడ్స్ మార్చండి.మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది.

వ్యాయామం లేకపోవుట :
ఇది ఒక చెత్త అపోహ మాత్రమే. మీ వర్క్ అవుట్స్ మిమ్మల్ని నిర్వీర్యం చేయవచ్చు. కానీ, మీకు యోగ సాధన ఉంటే,అప్పుడు స్త్రేచింగ్ మరియు భారీ శ్వాస ఆసనాలను నివారించాలి. మీరు కూడా మహాసముద్రాలలో ఈత కోసం వెళ్ళవచ్చు. చింతించకండి,రక్త స్రావాలు ఉంటే సొరచేపలు విందు చేసుకుంటాయని భయపడకండి.

సెక్స్ మానుకోండి :
మీరు ఇబ్బందిగా భావిస్తే, మీరు సెక్స్ ను నివారించవచ్చు. కానీ,మీకు మరియు మీ భాగస్వామికి ఇష్టమైతే, అప్పుడు విశ్రాంతిని మర్చిపోండి. ఏమి అనుకుంటున్నారు? భావప్రాప్తి అనేది మీకు తీవ్రమైన తిమ్మిరిని కలిగిస్తుందా.

ఋతు తిమ్మిరి :
ఇది ప్రతి స్త్రీ ఎదుర్కొనే మొట్టమొదటి ఇబ్బంది. మొదటి రోజు తీవ్రమైన నొప్పి ఉండటం సాధారణం. అలాగే మీరు చాక్లెట్లు తింటే ఇది తగ్గుతుంది. ఇది బాగా పనిచేస్తుంది. నమ్మండి. ఇంకా తగ్గకపోతే ఒక గైనకాలజిస్ట్ ని సంప్రదించండి.

విశ్రాంతి, గర్భం రాదు :
ఇది ఒక అపోహ మాత్రమే. పీరియడ్స్ సమయంలో మీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని ఆపదు. మీరు పిరియడ్ సమయంలో కూడా గర్భం పొందవచ్చు. అలాగే ఒక మంచి కండోమ్ ను ఉపయోగించండి. అవాంఛిత గర్భం ధరించినప్పుడు,దానిని నిరోధించడానికి గర్భ నిరోధక మాత్రలను తీసుకోవాలి.

జుట్టు శుభ్రం చేయకూడదు :
ఎవరు చెప్పారు? పిరియడ్ సమయంలో షాంపూ ఉపయోగించ కూడదని ఖచ్చితమైన కారణం ఏమి లేదు. మీరు మీ జుట్టును శుభ్రం చేయవచ్చు. అలాగే జుట్టు కత్తిరించుట,హెయిర్ స్పా కి వెళ్ళుట, జుట్టుకు రంగు వేయుట,జుట్టు స్రైట్ చేయుట వంటివి చేయవచ్చు.

తినకూడదు :
ఇది ఒక అపోహ మాత్రమే. ఈ రోజులలో ఏదైనా తినవచ్చు. మీకు నచ్చినది ఏదైనా తినవచ్చు. ఈ 5 రోజులు ఎటువంటి ప్రత్యేక ఆహారం చార్ట్ అనుసరించవలసిన అవసరం లేదు.

28 రోజుల చక్రం:
సాదారణంగా ఋతుస్రావ చక్రం మహిళ యొక్క భౌతిక ఆరోగ్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది. 28 రోజుల చక్రం కేవలం సగటు సమయం మాత్రమే. కాబట్టి మహిళలు ఉత్సాహంగా నినాదాలు చేయండి ! మీకు కావలసింది చేసి ఆనందించండి!

______________________________________________________

వళ్ళంతా నొప్పులు -  BODY PAINS :


నొప్పిని తిట్టకండి నొప్పి మన శరీరంలో ఏ భాగంలోనైనా రానియండి. అదొక మంచి పనిచేస్తుంది.

"ఏదో సమస్య వచ్చింది. జాగ్రత్త తీసుకోండి" అని మొదడును హెచ్చరిస్తుంది.

ఆ నొప్పి ప్రమాదకరమైందా  కదా అని తెచ్చుకొని, నొప్పిని, నొప్పికి కారణంన్నీ తొలగించుకోడానికి ప్రయత్నం చేయాలి.

కొన్ని నొప్పులు కు మందులు అవసరం లేదు
వేడి నీళ్ళు స్నానం చేసి, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది.
నిద్ర లేచేసరికి నొప్పులు మటుమాయం!

జ్వరంలో భాగంగా వచ్చే నొప్పులయితె, జ్వరం తగ్గటానికి ఉపయోగించే "Aspirin"లేదా paracetamal జ్వరం నొప్పులు తగ్గిపోతాయి.

రక్తం తక్కువగా ఉన్న (రక్తహీనత) వాళ్ళ నొప్పులు వస్తాయి. విడిగా నొప్పులు తగ్గటానికి మందులు వాడినా ఉపయోగం లేదు. రక్తం పెరగడానికి వాడే మందులు రక్తం పెరిగితే నొప్పులు వాటంతట అవే తగ్గుతాయి.

ఎక్కువగా అమ్మాయిలు కు ఈ problem ఉంటుంది

తీసుకొనే ఆహారం లో ఎక్కువగా బ్లడ్ చేరేలా ఫుడ్ అండ్ ఫ్రూట్స్ తీసుకోండి...

______________________________________________________


డ్రింకింగ్ వాటర్ వల్ల ఉపయోగాలు :

డ్రింకింగ్ వాటర్ కాళీ పొట్టతో తాగితే హెల్త్ కి చాలా మంచిది. దీని వల్ల తలనొప్పి, హార్ట్ సిస్టం, ఫాస్ట్ హార్ట్ బీట్, ఎక్సెస్ ఫిట్నెస్, కిడ్నీ అండ్ యూరిన్, షుగర్ మరియు కంటి వ్యాధులు తగ్గుతాయి.

డే ట్రీట్మెంట్ విధానం

నిద్ర లేచిన వెంటనే పరగడుపున బ్రష్ చేయక ముందు 1 గ్లాస్ వాటర్ తాగాలి.

తర్వాత మామూలుగా బ్రష్ చేసి 45 నిమిషాలు ఏమి తిన కూడదు.

45 నిమిషాలు తర్వాత ఏమైనా  తినవచ్చు.

బ్రేక్ ఫాస్ట్ తర్వాత 15 నిమిషాలు వాటర్ తాగకూడదు.

లంచ్, డిన్నర్ తర్వాత 2 గంటలు వరకు ఏమి తినకూడదు.

ఈ విధంగా చేస్తే హై బ్లడ్ ప్రెషర్, షుగర్, క్యాన్సర్, గ్యాస్ లాంటి వ్యాధులు నివారించవచ్చు.


______________________________________________________


అన్నం అరగకపోవడం - INDIGESTION :

జీర్ణాశయం ఎర్రగపొక్కినా, జీర్ణాశయం ఆమ్లం యాసిడ్ అన్నవహికలోకి ఎగదట్టనా అన్నం అరగలేదంటము ఎక్కువ ఆహారం గబ గబ మ్రింగితే అన్నం అరగకపోడం రావచ్చు. సాధారణంగా అన్నం తిన్నాక ఆరగకపోవడం జరుగుతుంది. కొంత మంది లో తిండి తినటంతో సంబంధం లేకుండా కూడా అన్నం అరగకపోవటం జరగవచ్చు.


______________________________________________________


ప్రమాదాల / గాయాల నివారణ :

గాయాల నివారణ గురించిన సమాచారాన్ని అందరూ పంచుకొని, ఆచరించటం ఎందుకు ముఖ్యమంటే....

గాయాల కారణంగా ప్రతి ఏటా సుమారు 75 వేల మంది పిల్లలు మరణిస్తున్నారు. మరో 40 కోట్ల మంది తీవ్రంగా బాధపడుతున్నారు....

అనేక గాయాలు శాశ్వతమైన అంగవైకల్యానికి, మెదడు దెబ్బ తినడానికి దారి తీస్తాయి. చిన్న పిల్ల మరణానికి, అంగవైకల్యానికి గాయాలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి.

సాధారణంగా గాయాలు ఎక్కువగా కింద పడటం, కాలటం, నీటిలో మునగటం ఇంకా రోడ్డు ప్రమాదాల వల్ల అవుతాయి.

వీటిలో ఎక్కువగా ఇంట్లోగానీ, ఇంటికి దగ్గర గానీ సంభవిస్తాయి. దాదాపు వీటన్నింటినీ నిరోధించవచ్చు.

గాయం అయిన వెంటనే ఏం చేయాలి అనేది తల్లిదండ్రులకు తెలిస్తే, అనేక గాయాల తీవ్రతను తగ్గించవచ్చు.

ముఖ్య సందేశాలు :

గాయాల నివారణ గురుంచి తెలుసుకోవటానికి ప్రతి కుటుంబం / సమాజం ఏయే హక్కులు కలిగి ఉన్నాయి.

తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్న పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ, పరికరాలను సురక్షితంగా ఉంచినట్లయితే, అనేక తీవ్రమైన గాయాలను నివారించవచ్చు.

మంట, వంటింటి స్టౌ, దీపాలు, అగ్గి పెట్టెలు, విద్యుత్ పరికరాల నుంచి చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి.
చిన్నపిల్లలు ఎక్కటానికి ఇష్టపడతారు. కనుక, మెట్లు, బాల్కనీలు, రూఫ్ (పైకప్పు), కిటికీలు, ఆట ప్రదేశాలను చిన్న పిల్లలు కింద పడకుండా సురక్షితంగా తీర్చిదిద్దాలి.

చాకులు, కత్తెరలు, పదునైన లేదా వాడియైన వస్తువులు, పగిలిన గాజు ముక్కలు గాయాలు చేయగలవు. ఇలాంటి వస్తువులను చిన్న పిల్లలకు అందకుండా, వారికి దూరంగా ఉంచాలి.

చిన్న పిల్లలు వస్తువులను నోట్లో పెట్టుకోవటానికి ఇష్టపడతారు. కనుక, చిన్న సైజు వస్తువులను పిల్లలు మింగకుండా నిరోధించటానికి వాటిని దూరంగా పెట్టాలి.

విషము, బ్లీచ్ ద్రవం, ఔషధాలు, యాసిడ్, కిరోసిన్ లాంటి ఇంధనాలను నీటి బాటిళ్లల్లో నిల్వ చేయరాదు. ఇలాంటి ద్రవాలను, విషపదార్థాలను సూచిస్తూ స్పష్టంగా ముద్రించి వున్న కంటెయినర్లలోనే ఉంచి, వాటిని చిన్న పిల్లలకు అందకుండా వారి దృష్టిలో పడకుండా పెట్టాలి.

చిన్నపిల్లలు రెండు నిముషాల వ్యవధిలోనే అతి కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుటికీ మునిగిపోగలరు. వారు నీటిలో లేదా నీటికి దగ్గరగా ఉన్నప్పుడు ఒంటరిగా వదలరాదు.

చిన్నపిల్లలు ముఖ్యంగా ఐదేళ్ల లోపు వారికి రోడ్డుపైన ఉంటే తీవ్ర అపాయం పొంచి ఉంటుంది. రోడ్డుపైన వారికి తోడుగా ఎల్లవేళలా ఒకరు ఉండాలి. చిన్నపిల్లలు నడవటం నేర్చుకున్న వెంటనే రోడ్డుపై సురక్షితంగా ఎలా నడవాలో బోధించాలి.


______________________________________________________


మనిషి గురించి కొన్ని వాస్తవాలు :


1. శరీర ఉష్ణోగ్రత 98.4'F (37'C) ఉంటుంది.

2. రక్తపీడనం 120/80 mm Hg.

3. మనిషి బరువు స్ర్తీ లు 50kg పురుషులు 60kg సరాసరి ఉంటుంది.

4. శరీరం లో రక్త మోతాదు 5 లీటర్ ఉంటుంది

5. ఊపిరి పిల్చేది నిముషానికి 15-20 సార్లు.

6. రోజూ శరీరం అవసరమయ్యే నీళ్ళు 3 లీటర్లు దాదాపు.


______________________________________________________


పైల్స్‌ వ్యాధి - చికిత్స :


కొందరు పైల్స్‌ వంటి సమస్యలతో ఎంతో బాధపడుతుంటారు. మల విసర్జన ద్వారం వద్ద వచ్చే ఇటువంటి వ్యాధులు వారికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి.

పైల్స్‌తో పాటు ఫిషర్‌, ిఫిస్టులా వంటి వ్యాధులు నేడు సాధారణంగా అందరికీ వస్తున్నాయి.

అవసరమైన వైద్యం చేయించుకొని ఈ వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహార నియమాలు, తగిన జాగ్రత్తలతో ఈ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

పైల్స్‌ :

సాధారణంగా వస్తున్న వ్యాధుల్లో పైల్స్‌ ఒకటి.
పైల్స్‌ ఎక్కువగా మధ్య వయ స్సులో ఉన్నవారికి వస్తుంది. పీచు పదా ర్థాలు తక్కువగా తీసుకున్నవారికి, మంచి నీళ్లు తక్కువగా తాగేవారిలో ఈ వ్యాధి కని పిస్తుంది.

సై్పసీ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుం ది. పైల్స్‌ వల్ల విరోచనాలకు ముందు లేదా తర్వాత రక్తం రావడం జరుగుతుంది. కొన్ని సార్లు రక్తం గడ్డలు, గడ్డలుగా కూడా వస్తుంది.

మరికొన్నిసార్లు లోపలి మాంసం బయటకు కూడా రావచ్చు. పైల్స్‌ వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. పైల్స్‌ను మూడు గ్రేడులుగా విభజించవచ్చు. మొదటి గ్రేడులో పైల్స్‌ లోపల మాత్రమే కనిపిస్తుంది. రెండవ గ్రేడులో లోపలి నుంచి బయటకు వచ్చి మ ళ్లీ వాటంతట అవే లోపలికి వెళ్లిపోతాయి.

మూడవ గ్రేడులో బయటకు వచ్చి బయటే ఉంటాయి. నాలుగవ గ్రేడులో బయటకు వచ్చిన వాటికి ఇన్‌ఫెక్షన్‌ రావచ్చు. కొన్ని సార్లు పైల్స్‌ ఆపరేషన్‌ తర్వాత కూడా మళ్లీ వచ్చే అవకాశం ఉంది. వీటిని సెకండరీ హెమరాయిడ్స్‌ అని అంటారు.

ఫిషర్‌ : 

ఈ వ్యాధి ఏ వయస్సు వారికైనా రావచ్చు. ఇది రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం. మలద్వారం పగిలి ఫిషర్‌ వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి విపరీతమైన నొప్పి వస్తుంది. కొన్నిసార్లు రక్తం కూడా రావచ్చు. రక్తం ఒకటి, రెండు చుక్కలు మా త్రమే వస్తుంది. విరోచనాలు అయిన తర్వా త నొప్పి ప్రారంభమై మూడు, నాలుగు గం టల వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఫిషర్‌ మలద్వారానికి ముందు వైపు, వెనుకవైపున కూడా ఉంటుంది. మరికొన్నిసార్లు ఫిషర్‌తో పాటు చర్మం కూడా ముందుకు చొచ్చుకు వస్తుంది. దీన్ని సింటినైన్‌పైల్‌ అంటారు.

ఫిస్టులా :

ఈ వ్యాధిని కొందరు లూటి అని కూడా అంటారు. ఇది ఈ రకం వ్యాధు లన్నింటికెల్లా ఇబ్బందికరమైన సమస్యగా చెప్పుకోవచ్చు. పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఈ వ్యాధి వ స్తుంది. పిస్టులా వ్యాధి రెండు రకాలు. మల ద్వారానికి పోయే పై దారిలో ఏర్పడేది ఒక రకం, కింది భాగంలో ఏర్పడేది మరో రకం. పైభాగంలో వచ్చేది సామాన్యంగా సమాంతరంగా ఉంటుంది. కింది భాగంలో వచ్చే దారి వంకరగా ఉంటుంది. ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావచ్చు. ము ఖ్యంగా ఎక్కువ సేపు కూర్చొని ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంది.

బయటకు చిన్న రంధ్రా లుగా కనపడవచ్చు. కొన్నిసార్లు అవి మూ సుకుపోయినప్పుడు ఇన్‌ఫెక్షన్‌ వచ్చి చీము పట్టే అవకాశాలు ఉంటాయి. నొప్పి కూడా ఉండవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ వల్ల నొప్పి వస్తుంది. పిస్టులాను లోలెవెల్‌, హైలెవెల్‌ రకాలుగా వర్గీకరిస్తారు. లోలెవెల్‌ రకం దోవ పొడవు గా ఉంటుంది. ఇది రెండు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. హైలెవెల్‌లో దోవ పొడవు కొన్నిసార్లు నాలుగు, అయిదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు విరోచనాలు కంట్రోల్‌ కాకపో వచ్చు. చీము, రక్తం కూడా రావచ్చు.

పరీక్షలు : 

పైల్స్‌ వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. వీరికి ప్రాక్టోస్కోపిక్‌ పరీక్షను నొప్పి లేనప్పు డు చేస్తారు. ఈ పరీక్షలో పైల్స్‌ బాగా కనిపిస్తాయి. కొలోస్కోపిలో పైల్స్‌, ఫిషరీ, ఫిస్టులా వ్యాధులను తెలుసుకోవచ్చు. పొట్ట స్కానింగ్‌లో వేరే పేగులకు ఏమైనా గడ్డలు ఉన్నాయా తెలుస్తుంది. పిస్టులోగ్రామ్‌ పరీ క్షను పిస్టులా ఉన్నవారికి నిర్వహిస్తారు. దారి పొడవు ఎంతోఉందో తెలుసుకోవడం జరుగుతుంది. బేరియన్‌ ఎనిమా పరీక్ష ద్వా రా పెద్ద పేగు ఎలా ఉండో తెలుసుకోవచ్చు.

వైద్యం :

పైల్స్‌ వ్యాధి వచ్చిన వారిలో మొదటి, రెండు గ్రేడులుగా ఉన్నవారికి చాలా వరకు మందులతో నయమవుతుంది. కొన్నిసార్లు స్ల్కీరో థెరపీ ద్వారం పరీక్ష చేస్తూ డాక్టర్‌ పైల్స్‌లోకి ఇంజెక్షన్‌ చేస్తారు. ఆ ఇంజెక్షన్‌ ఇవ్వడం వల్ల వాటిలో రక్త ప్రసరణ తగ్గి కృశించుకుపోతాయి. పైల్స్‌ బాగా ముదిరిన వారికి ఎమరోయెక్టమీ ఆపరేషన్‌ ద్వారా వాటిని తొలగిస్తారు. ఫిషర్‌ వచ్చినవారి ఆహారంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.


విరోచనాలు సాఫీగా సాగేందుకు మందులు వాడాలి.

ఈ విధంగా చేసినా ఇబ్బంది మళ్లీ వస్తుంటే విరోచనాలు జరిగే దారి బిగుసుకు పోతుంది.

ఆ సమయంలో ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ను స్పింటరాటమి అని అంటారు.

పిస్టులా వ్యాధిని హై లెవెల్‌, లో లెవెల్‌ను బట్టి వైద్యం చేస్తారు. కొన్నిసార్లు వీటిని తీసివేయాల్సి ఉంటుంది.

ఈ ఆపరేషన్‌ చేసేటప్పుడు విరో చనాలను ఆపుకునేందుకు ఎలాంటి ఇబ్బం ది కలగకుండా చూసుకోవాలి.

 ఈ ఆపరేష న్‌ను ఫిస్టురెక్టమీ అని అంటారు.

జాగ్రత్తలు :
ఈ వ్యాధులు వచ్చినవారు సమతుల ఆహారం తీసుకోవాలి. ఆహారం లో పీచు పదార్థాలు(పండ్లు, కూరగాయలు) ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి.

ఉప వాసాలు చేయకూడదు. విరోచనాలు అ య్యేందుకు మందులు ఎక్కువగా వాడ కూడదు.

 మన జీవన విధానంలో కొన్ని మార్పు లు చేసుకోవడం ద్వారా ఇటువంటి వ్యాధులకు చాలావరకూ దూరంగా ఉండవచ్చు.

ముఖ్యంగా పీచు పదార్ధాలు అధికంగా ఉం డే ఆహారం తీసుకోవడం వల్ల శరీర క్రి యలు ఆరోగ్యంగా ఉంటాయి.

పైల్స్, ఫిషలా హోమియోకేర్ వైద్యం :

తీవ్రమైన నొప్పి, ఎవరికి చెప్పుకోలేని బాధ, మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా రక్తస్రావం కావటం లేదా మలబద్దకం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు.

ఈ సమస్యలకు కారణం. ‘‘పైల్స్ లేదా ఫిషర్స్ లేదా ఫిస్టులా’’ అనవచ్చు.

మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వలన ఈ సమస్యలు తీవ్రతరం, సర్వసాధారణం అవుతున్నాయి.

పైల్స్ :

మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి. వాపునకు గురి అయి, తీవ్రమైన నొప్పి, రక్త స్రావం కలగటాన్ని పైల్స్ అంటారు.

పైల్స్‌కి కారణాలు, వాటిని తీవ్రతరం చేసే అంశాలు :

దీర్ఘకాలికంగా మలబద్దకం
పొత్తిడుపు ఎక్కువ కాలం వత్తిడికి గురి అనటం
దీర్ఘకాలికంగా దగ్గు ఉండటం
గర్భధారణ సమయంలో
కాలేయ సంబంధిత వ్యాదులతో బాధపడే వారిలో పైల్స్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

 పైన తెలిపిన కారణాల వలన మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడి, వాటిలోని కవాటాలు దెబ్బతినడం, రక్తనాళాలు సాగదీతకు గురై, అందులో రక్తం నిల్వ ఉండడం వలన మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర వత్తిడి ఏర్పడుతుంది.

దాంతో తీవ్రమైన నొప్పి వచ్చి, రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది.

పైల్స్‌ని ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ అని రెండురకాలుగా విభజిస్తారు.

ఇంటర్నల్ పైల్స్ :

మలవిసర్జన మార్గంలో రక్తనాళాలు వాపుకు గురవడం వలన ఇది ఏర్పడుతుంది. ఇందులో అంత ఎక్కువ నొప్పి ఉండదు.

ఎక్స్‌టర్నల్ పైల్స్ అనగా మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపుకు, గురై వాటిపైన ఉన్న మ్యూకస్ పొర బయటికి పొడుచుకొని రావడాన్ని ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటారు.

దానిలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ఉండవచ్చు.

ఫిషర్స్ :

మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్ అని అంటారు. ఇది చాలా నొప్పి, మంటతో కూడి ఉంటుంది.

కారణాలు :

దీర్ఘకాలికంగా మలబద్దకం ఉండి మలవిసర్జన సమయంలో వత్తిడి ఏర్పడి మలద్వారం ద్వారా ఫిషర్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ కాలం విరేచనాలు ఉండడం వలన, కూడా ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది.

గర్భధారణ సమయంలో కూడా ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది.

క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కాలరైటివ్స్ జబ్బులతో బాధపడే వారిలో ఫిషర్ ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది.

ఫిస్టులా :

అనగా, రెండు ఎపితికల్ కణజాల మధ్య ఉండే ఒక గొట్టంలాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అని అంటారు. మానవ శరీరంలో ఫిస్టులా అనేది ఎక్కడైనా ఏర్పడవచ్చు. కాని సర్వసాధారణంగా ఏర్పడే ఫిస్టులాలో ఆనల్ ఫిస్టులా ఒకటి.

ఇది ఎక్కువ ఊబకాయం ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా రెండు పిరుదుల మధ్యప్రాంతంలో మలద్వారానికి పక్కన ఏర్పడుతుంది. చర్మం పైన చిన్న మొటిమలాగ ఏర్పడి నొప్పి, వాపు ఏర్పడి రెండు మూడు రోజులలో పగిలి చీము కారుతుంది.

దానిమూలంగా తీవ్రమైన నొప్పి, చీము, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని తీవ్రతను బట్టి వారానికి నెలకు 1, 2 సార్లు మళ్ళీ మళ్ళీ తిరగబెట్టడం వలన సాధారణ జీవన విధానాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.

ఫిస్టులా ఒక్కొక్కసారి మలద్వారంలోకి తెరచుకోవడం వలన ఇందులో నుండి మలం వస్తుంది. దీనినే ఫిస్టులా ఇన్ అనో అంటారు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఫిస్టులా మళ్ళీ వచ్చే అవకాశం 90 శాతం వరకు ఉంటుంది.

కారణాలు :

ఊబకాయం గంటల తరబడి కదలకుండా ఒకేచోట కూర్చొని పనిచేసేవారిలో, తీవ్రమైన మలబద్దకంతో బాధపడే వారిలో ఊక్రాన్స్ డిసీజ్ లేదా అల్సరేటివ్ కాలైటిస్ జబ్బులతో బాధపడే వారిలో.

నిర్ధారణ పరీక్షలు :

సిబిపి
ఇఎస్‌ఆర్
ఫిస్టులోగ్రమ్
ఎమ్మారై, సీటీస్కాన్
మొదలైన నిర్ధారణ పరీక్షల ద్వారా ఇతర తీవ్రమైన వ్యాధులను, వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు.

పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలు చిన్న సమస్యలు అని అనిపిస్తాయి కాని ఇది రోగి దినచర్యలను చాలా ప్రభావితం చేస్తాయి.

చాలామంది వివిధరకాల చికిత్సలు చేయించుకొని విసిగి పోయి, చివరి ప్రయత్నంగా ఆపరేషన్ చేయించుకుంటారు.

కాని చాలామందిలో ఈ సమస్యలు తిరగబెట్టడం సర్వసాధారణంగా కనిపిస్తుంది.

హోమియో కేర్‌లో వైద్యం :
హోమియోకేర్ ఇంటర్ నేషనల్ ‘జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ ట్రీట్‌మెంట్ ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, మలబద్దకం వంటి వాటికి మూలకారణాలను గుర్తించి వైద్యం చేయడం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చు.

ఈ సమస్యలు మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా, ఎలాంటి ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ వైద్యం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చు.


తీసుకోవలసిన జాగ్రత్తలు :

సరైన పోషకాహారం తీసుకోవడం
ఆహారంలో పీచు (ఫైబర్) పదార్థాలు అధికంగా ఉండేటట్లు చూసుకోవడం
మాంసాహారం తక్కువగా తినడం
మలవిసర్జన ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండే విధంగా చూసుకోవడం
సరి అయిన వ్యాయామం చేయడం
ఊబకాయం రాకుండా చూసుకోవడం.


______________________________________________________


Corona Virus : 


మన దేశంలో... కేరళలో ఏడుగురికి కరొనా వైరస్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో... వారిపై పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే... హైదరాబాద్‌లో నలుగురికి ఈ వ్యాధి సోకి ఉండొచ్చన్న అనుమానంతో టెస్టులు చేస్తున్నారు.

మన దేశంలో ప్రస్తుతానికి ఈ వ్యాధి ఎవరికీ సోకలేదని చెబుతున్నా.... ఇది వైరస్ కాబట్టి... గాలి ద్వారా ఒకరి నుంచీ మరొకరికి సోకుతుంది కాబట్టి... కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదే.

అవేంటో చకచకా తెలుసుకుందాం.

వ్యాధి లక్షణాలు : 
ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. గొంతు మంటగా ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే... వెంటనే డాక్టర్‌ను కలవాలి.

వైరస్ ఎలా వ్యాపిస్తుంది : 
ప్రస్తుతం ఇది మనుషుల నుంచీ మనుషులకు వ్యాపిస్తోంది. వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా... పక్కన ఉన్నవారికి వచ్చే ప్రమాదం ఉంది.

అలాగే... రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది. రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా... అక్కడ ఉండే వైరస్... బాడీపైకి వచ్చి... క్రమంగా అవి నోట్లోంచీ ఊపిరి తిత్తుల్లోకి వెళ్తాయి.

అంతే వైరస్ వచ్చినట్లే. ఇవి ఎంత వేగంగా వస్తాయంటే... చేతులు శుభ్రం చేసుకునేలోపే వచ్చేస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ప్రస్తుతానికి ఈ వైరస్‌కి మందు (వ్యాక్సిన్) లేదు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలి.

 ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని మీ చేతులతో టచ్ చేయవద్దు. రోగులకు దగ్గరగా ఉండొద్దు. అలాగని వారిని అంటరాని వారిలా చూడకూడదు.

అయినా ఆ ఛాన్స్ డాక్టర్లు మీకు ఇవ్వరు. ఈ వైరస్ ఎవరికైనా వచ్చినట్లు తెలిస్తే... డాక్టర్లు ఆ వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచేస్తారు.

ఎవరికైనా దగ్గు, జ్వరం లాంటివి వస్తే... వాళ్లు జనంలో తిరగకుండా ఇంట్లోనే ఉంటూ... ఎక్కువ నీళ్లు తాగాలి.

 ఒకట్రెండు రోజుల్లో అవి తగ్గకపోతే... ఎవర్నీ టచ్ చెయ్యకుండా వెంటనే డాక్టర్‌ను కలవడం బెస్ట్ ఆప్షన్.


______________________________________________________


జలుబు - COMMON COLD :


ముక్కు వెంట ధారాపాతంగా నీరు, టపీ టపీ మని తుమ్ములు, తలదిమ్ము, చిరాకు, విసుగూ,బగ్రుబర్రుమని చిదటం- ఇవన్నీ కలిస్తే దానిపేరు "జలుబు"Common Cold"

జలుబు చేస్తే దాని మీద రోగకారక సూక్ష్మ జీవులు చేరుతాయి. దగ్గు గళ్ళ వస్తాయి.యాంటీబయాటిక్స్ మందులు వాడితే ప్రేవుల్లో ఉపయోగకరమైన సూక్ష్మ జీవులు కూడా చనిపోతాయి. బి. కాంప్లెక్స్ లోపం వస్తుంది

జలుబు తో వచ్చే తల నొప్పి మాత్రలు వాడితే కడుపు లో మంట వస్తుంది.

B.complex తో అదోరకమైన వాసన వస్తుంది. యంటాసిడ్ ద్రావకం త్రాగితే నోరంతా మట్టి తిన్న వస్తుంది.

వ్యాప్తి :
జలుబు లో ముక్కువెంట నీళ్ళు కరుతాయి. జలుబుతో బాధపడే వ్యక్తి దగ్గినప్పుడు,చిదిన్నపుడు,తుమ్మినప్పుడు ఆ నీళ్ళు లో కలిసుండే వైరస్ గాల్లో చేరుతాయి. అవి ఇతరులకి వ్యాపిస్తాయి.

కారణాలు :
జలుబు ను తెచ్చిపెట్టే వైరస్"కామన్ కోల్డ్ వైరస్"అంటాం. ఇందులో 60 పై గా ఉన్నాయి. ఒకసారి ఒక వైరస్ తో జలుబు చేయవచ్చు . ఇదే అన్నీ ఒక దానికి వ్యాక్సిన్  కనిపెడితే మిగిలిన59  వాటికి.?

వందల రకాల మందులు మార్కెట్ లో ఉన్నాయి. ఒక్కటి జలుబుని తగ్గించలేదు.

లక్షణాలు :
తల నొప్పి, వళ్ళు నొప్పులు, స్వల్పంగా జ్వరం, కళ్ళ వెంట, ముక్కు వెంట నీళ్లు కారటం, ముక్కు దురద, తుమ్ములు, ముక్కు లో మంట, ముక్కు ఎర్రగా కంది పుండు పడినట్లువటం, ముక్కు దిబ్బడ, ముదిరితే పసుపు పచ్చని చీమిడి, గొంతునొప్పి వగైరా లక్షణాలుంటాయి.


______________________________________________________


ప్రతీరోజు ఈ పేజీని అప్డేట్ చేయడం జరుగుతుంది కనుక మీకు వీలయినప్పుడల్లా ఈ పేజీ ని చూస్తూ ఉండండీ...

అలాగే

ఇలాంటి ఉపయోగకరమైన విషయాలను తెలుసుకోవడం కొరకు www.ramkarri.org ని వీక్షిస్తునే ఉండండీ...

ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను మీ వాట్సాప్ లో పొందటానికి ఈ క్రింద ఉన్న గ్రూప్స్ లలో ఏదయినా గ్రూప్ లో చేరండీ...


💊 వైద్య రత్నాకరం 💉