మరణం సహజం ,

మరణం అవసరం ,

మరణం లేని జీవితం భయంకరంగా ఉంటుంది..

మరణం గురించిన అవగాహన మాత్రమే మనిషిని జీవించేలా చేస్తుంది...

మరణం గురించిన భయం మనిషిని ప్రతీ నిమిషం చంపేస్తుంది...

మనిషి తన జీవితాన్ని ఇతరుల జీవితాలను చూసి ఒక అవగాహన పెంచుకొని వివిధ దశలుగా ప్లాన్ చేసుకుంటాడు...

బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అంటూ విభజించి
సమాజం నిర్దేశించిన పరిధిలో సంపాదించుకొని
తరువాత హాయిగా బ్రతకాలని ప్రణాళికలు వేసుకుంటాడు...

కానీ ఆ ప్రణాళికలు ఎప్పుడూ సఫలం కావు.

ప్రతీ నిమిషం కష్టపడుతూ...

జీవించడాన్ని వాయిదా వేసుకున్న మనిషి...

 తీరా జీవించే స్థాయి వచ్చే లోపే మరణిస్తాడు...

ఒకవేళ బ్రతికినా...

 తను ఇంతకాలం కష్టపడి దాచుకున్న డబ్బు, పరపతి మొదలయినవి అన్నీ కూడా అతనికి మంచి మానవ సంబంధాలను ఏర్పర్చుకోవడానికి ఉపయోగపడవు...

కేవలం డబ్బు కోసమో, పరపతి వలనో ఇతరులు తనను ప్రేమిస్తారు...

అవి లేనప్పుడు తనను ప్రేమించరు అని అర్ధమైనప్పుడు విపరీతమైన డిప్రెషన్ కి లోనవుతారు...

వ్యక్తి తన జీవితంలో ప్రతీ క్షణం పుడుతూ...

మరుక్షణం చనిపోతూ ఉంటాడు.

జీవితం అంటే ఆలోచననే.

ఆలోచనలు వస్తూ , పోతూ ఉండటమే జీవితం.

ఆ ఆలోచనలు శాశ్వతంగా ఆగిపోవడమే మరణం.

శారీరక మరణం ఒక్కసారే ఉండొచ్చు,

కానీ మరణించాక తను మరణించాను అనే ఆలోచన రాకముందే మరణిస్తాడు.

మరణిస్తానేమో అనే భయం మనిషిని ప్రతీ నిమిషం చంపేస్తుంది.

మరణాన్ని అర్ధం చేసుకున్న తరువాత మాత్రమే జీవితాన్ని ఎలా జీవించాలో అర్ధం అవుతుంది.

మరణం అర్ధం కానీ జీవితం నిరార్థకంగా ముగుస్తుంది.

                                                         


- స్వస్తీ...


ఇటువంటి మరెన్నో అద్భుతమైన విషయాల కొరకు ప్రతీరోజూ వీక్షిస్తూ ఉండండీ మన https://www.ramkarri.org/  వెబ్సైట్ ని...


అలాగే ఈ విషయాలన్నీటినీ మీ చరవాణి లో పొందటానికి https://wa.me/918096339900 ఈ లింక్ ను నొక్కి మీ వివరాలు మాకు పంపండి... అలాగే మా వాట్సాప్ నెంబర్ ని మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి...



ధన్యవాదములు...