మన ఋషులు మోక్ష సాధన గురించే కాదు ,ఇహ లోకం లో  సుఖ సంతోషాలతో ఉండా లంటే ఏం చేయాలో కూడా చెప్పారు .

వీటిలో అత్యంత ముఖ్యమైనవి ఆరోగ్య సూత్రాలు . పాంచ భౌతిక శరీరాన్ని రోగాల బారి నుండి ఎలా కాపాడుకోవాలో చెప్పే సూత్రాలను ప్రతి వ్యక్తీ పాటించాలి .

నిజానికి రోగాలలో అత్యధిక శాతం జీర్ణ మండలానికి చెందినవే అయి ఉంటాయి . 
అందుకే మనం తినే ఆహారం , త్రాగే నీరు స్వచ్చం గా , సంతులితం గా ఉండాలి . 

ఆ విధం గా మన ఆహార అలవాట్లను తీర్చి దిద్దు కొంటే 80%జబ్బులు అస్సలు రానే రావు .

కాబట్టి ,  ప్రజారోగ్య పరిరక్షణ కేవలం వ్యక్తి త్వ మార్పు ద్వారా నే సాధ్యం .

ధర్మ సాధనకు , కర్మ పరిపాకానికి అత్యంత అవసరమైనది మన శరీరం . 

దీనిని కాపాడు కోవడానికి కొన్ని నియమాలు పాటించాలి .

మనిషి , ప్రక్రుతి కి ఎంత దగ్గరగా ఉంటె అంత మంచిది .

అంటే ,ప్రకృతికి విరుద్ధమైన వాటిని మనం ఏమీ తీసుకో కూడదు . 

అలాంటి పనులు చేయ కూడదు .

 ఆహారం ,నీరు ,గాలి , అలాగే మన విహారాలు (-భావాలు ,ఆలోచనలు ) అన్నీ కూడా ప్రకృతికి అనుగుణ్యం గా ఉండాలి.

ప్రకృతికి దగ్గరగా అంటే , పంచ భూతాలను  మనం కలుషితం చేయకుండా చూడాలి . అలాగే ,పాంచ భౌతిక శరీరం ను కూడా మనం కలుషితం చేయ కూడదు . 

ఆహారాన్ని ఒషధం  లా చూడాలి . 

అలాగే గోరు వె చ్చని అనగా మన శరీర ఉష్ణోగ్రత కి సమాన మైన వేడి ఉన్న స్వచ్చ మైన  నీటిని గుటకలు వేస్తూ (గట గటా త్రాగ కూడదు ) త్రాగాలి .

నిజానికి ప్రొద్దుటే, ముఖం కూడా కడుక్కో కుండా , కనీసం లీటర్ నీటిని త్రాగాలి (ఉషాపానం ).

నోటిలోని లాలా జలం ఎన్నో ఒష ధులతొ , ఎంజైమ్ లతో మిళిత  మై ఉన్న క్షార రసం .

జీర్ణాశయం లో జట ర  రసం . ఒషధులతొ , ఎంజైమ్ లతో మిళిత  మై ఉన్న ఆమ్ల రసం .

చిన్న ప్రేగులలో ఆంత్ర  రసం . ఒష ధులతొ , ఎంజైమ్ లతో మిళిత  మై ఉన్న క్షార రసం .

ప్రక్రుతి లో ,అలాగే మన శరీరం లో ఉన్న త్రిగుణాలు , వాయు - కఫ -పిత్త దోషాలు అన్నీ సమ స్థితిలో ఉండే విధం గా మన ఆహార - విహారాలు ఉండాలి .

వనస్పతులు , వాన స్పతులు ,ఫలములు ,గింజలు ,బెరడు ,పూలు ,కాయలు , తృణ ధాన్యం , మషాలా దినుసులైన -లవంగం ,యాలుకలు ,మెంతులు ,ఆవాలు ,శొంటి ,ఇంగువ,పసుపు  ; అలాగే బెల్లం ,తేనే ,నూనె , ఆవు నెయ్యి  తదితర భారతీయ గ్రామీణ వంటింటి పదార్ధాలన్నీ మనలోని త్రిగుణాలను ,త్రిదోషాలను సమస్తితిలో ఉంచడానికి సాయ పడే ఆరోగ్య ప్రదాయినిలు .

నూనె , అది స్వచ్చమైన గానుగ నుండి గాని మర నుండి గాని తీసిన ముడి నూనె (రిఫైన్ చేయ కుండా ) ని మాత్రమే వాడాలి. 

అందులో మాత్రమే ప్రోటీన్స్ ,ఫాటి యాసిడ్స్ ,ముఖ్యం గా HDL కొలెస్టరాల్ ఉంటుంది .

ముడి నూనె వాతాన్ని తగ్గిస్తుంది . వాతం  ఎక్కువ ఐతే స్ట్రోక్ -గుండె ,మెదడు ,రక్త నాళాల జబ్బులు వస్తాయని తెలుసు గదా !

పిత్తమును శమింప చేయడానికి ఆవు నెయ్యి , ఇంగువ ,నల్ల జీల కర్ర , వాము , పచ్చి ధనియాలు అవసరం .

అలాగే ఋతువులను అనుసరించి మన శరీరం లో ఏర్పడే "వాత -పిత్త -కఫ దోషాల అసమ తుల్యత" ను సమతుల్యం చేసే ఆహార పదార్దాలు తీసు కోవాలి .

కఫ దోషానికి కారణమైన ఫాస్పరస్ లోపాన్ని బెల్లం అద్భుతం గా పూరిస్తుంది .

శొంటి ,అల్లం ,తమలపాకు కూడా కఫ ఉపశ మనులే .

పిత్త దోష నివారణకు నెయ్యి ... దేశ వాళీ ఆవు నెయ్యి ,
వాత దోష నివారణకు నూనె ... శుద్ధమైన ముడి నూనె .  జలయుక్తమైన పదార్ధములైన రసములు ,మజ్జిగ ,పెరుగు ,పాలు అన్నీ వాత నాశ కము లే .

ఉసిరి ,తాని కాయ ,కరక్కాయ -త్రిఫల(3:2:1 నిష్పత్తి ) ---ఇవి  మూడు దోషాలను కూడా తగ్గిస్తాయి .

గోమూత్రం కూడా 3 దోషాలను తగ్గిస్తుంది .

పంచదార విషం ? కారణం అది జీర్ణ మవ్వడానికి ఎక్కువ శక్తి అవసరం . 

జీర్ణ మైన తర్వాత అది రక్తం లో ఆమ్లత్వాన్ని పెంచుతుంది . 

 మనం ఎలా ఉండాలి ? 

వాతావరణానికి , పరిసరాలకు అనగా పర్యావరణానికి అనుకూలం గా మన ఆహార ,విహార ములను ఏర్పరచు కోవాలి . 

 పరిసరాలలో ఉన్న వృక్ష -జంతు జాలం , నీటి లభ్యత , వాతావరణ లోని తేమ శాతం , నేల - మట్టి లక్షణాలు , పండే పంటలు , ఉష్ణోగ్రత ,సంఘం లో ఉన్న ప్రజా సమూహాలు - ఇవన్నీ మనిషి పంచ భౌతిక శరీరాన్ని ప్రభావితం చేస్తాయి .

నిజానికి మన సనాతన ధర్మ శాస్త్రజ్ఞులు ఐన మహర్షులు ఇవన్నీ బేరీజు వేసుకొని కొన్ని ఆచారాలను మానవాళికి అలవాటు చేశారు .

ఎందుకంటే ,మన ఆరోగ్యం మన చేతుల్లో నే ఉండాలి . ప్రభుత్వాల నుండి గాని , మరే ఇతర సంస్థల నుండి గాని ఆరోగ్య పరమైన సాయం అందాలని అనుకో కూడదు . 

ఆరోగ్య సూత్రాలు పాటించ కుండా ప్రభుత్వమే అన్నీ చేయాలని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది . 

ఎవరైతే ,తన శరీర ఆరోగ్య రక్షణకు అవసరమైన  ప్రాధమిక నియమాలు అమలు చేసు కొంటూ ,ఎలాంటి దురలవాట్లు లేకుండా జీవనం సాగిస్తారో వారే నిజమైన దేశ భక్తులు .

కాని మనం నేడు చూస్తున్నాం ... శీతల ప్రాంతాల వారు వారి అవసరాలకు అనుగుణం గా కనిపెట్టిన ప్రెజర్ కుక్కర్ , ఫ్రిజ్ , ఎయిర్ కండిషనర్ , గ్రైండర్ మొదలైన పరికరాలు ఉష్ణ ప్రాంతీయుల మైన మనం విపరీతం గా వాడేస్తున్నాము .

 అవి మనకు ఎంత  చెడు ను కలగ చేస్తున్నాయో  పరిశీలిస్తే,  బానిసత్వ ము నుండి ,సోమరితనం నుండి ఇంకా మనం విముక్తి పొంద లేదు అని తేట తెల్ల మవుతుంది . 

 ఇద్దరూ ఉద్యోగాలు చేసుకొనే భార్యా భర్తలు ఉన్న ఇళ్ళే కాదు , చివరికి గ్రామాలలో కూడా ఈ పరికరాలు రాజ్య మేలుతున్నాయి .

సన్నికలు ,రోలు ,తిరగలి ఇవన్నీ ఎపుడో మూల పడ్డాయి . 

వాటితో పాటే , ఇబ్బడి ముబ్బడిగా సిజేరియన్ ఆపరేషన్ లు ,రక్త పోటు  ,షుగర్,కీళ్ళ నొప్పులు లాంటి శారీరక ఇబ్బందులు ,విసుగు ,మాంద్యం ,ఆందోళన అనే మానసిక జబ్బులు పేట్రేగి జనం కూడా మూలన పడుతున్నారు .

తిరగలి తిప్పే స్త్రీల నడుము ,పొట్ట భాగం సన్నగా ఉండి  ,లోని గర్భాశయం చుట్టూ ఉన్న కండరాలు ,కీళ్ళు మెత్త బడి కాన్పు సాఫీగా సులువుగా అవుతుంది .

నేటి కాలం లో సమయం ఆదా అవుతుందనో , శ్రమ తగ్గుతుం దనో ఈ పరికరాలకు మనం బానిస లై పోయాం !

వీటి వలన  పోషక విలువలు లేని ఆహారం, వ్యాయామం లేని శరీరం  , విసుగు , సోమరితనం, అనారోగ్యం ,.... మొత్తానికి , హుషారు లేని బతుకు -ఇదీ  నేటి భారత సమాజ ముఖ చిత్రం .

మన శరీరానికి ఏం కావాలి ? 

ఆహారం - నీరు - గాలి .
అనగా  స్థూల పరిమాణం లో హైడ్రోజన్ ,ఆక్సిజన్ ,నైట్రోజన్ ,కర్బనం , సూక్ష్మ పరిమాణం లో ఐరన్ ,ఐయోడిన్ ,భాస్వరం ,కాల్షియం ,సోడియం ,పోటాష్ ,మాంగనీస్ ,మెగ్నీషియం ఇలా సుమారు 108 మూలకాలు కూడా సూక్ష్మాతి సూక్ష్మ పోషక పరమాణువులు కావాలి .

అనగా ఆహారం కోసం మనం సాధారణం గా ఆధార పడే వృక్ష సంపద , వనస్పతుల సంపద ను మనం స్వీకరించి  నప్పుడు ఆయా పరమాణువుల తో నిర్మితమైన అణు సముదాయాలు మన కణ ములలోని మైటోకాండ్రియ కొలిమిలో భస్మం అవ్వడం ద్వారా శక్తి విడుదల  అవుతుంది . 

శక్తి ఒక్కటే కాదు ,మనకు అవసర మైన అమైనో ఆసిడ్ లు ,ట్రై గ్లిసరైడ్ లు ,గ్లూకోజు అణువులు కణం సైటో ప్లాసమ్ లో ఉండాలి .

మనిషి నిప్పుని కనుగొన్న తర్వాత వృక్ష , జంతు ఆహార పదార్ధాలను కాల్చుకొని , ఆ తర్వాత మట్టితో పాత్రలు చేయడం కనిపెట్టి, ఆ పాత్రలలో వండుకోవడం చేసే వాడు .

గుణం లో ,స్వభావం లో పరస్పర విరుద్ద పదార్ధాలను ఒకే సారి తీసు కో కూడదు .

పెరుగు - మినపప్పు
పాలు -ఉల్లి ,
నెయ్యి -తేనే .

పగటి పూట భోజనం  తర్వాత కాసేపు కునుకు తీయాలి . 

కాని , సాయంత్రం భోజనం తర్వాత కనీసం 2 గంటల తర్వాత మాత్రమే నిద్ర పోవాలి .

ముడి ఆహార పదార్ధాలను ఎందుకు వండు కోవాలి ?  

తేలికగా జీర్ణం చేసుకొని తద్వారా పోషక అణువులను పేగుల నుండి తేలికగా రక్తం లోకి శోషణ చేసు కోవడానికి
ముడి ఆహార పదార్ధాల ను పచనం చేయాలి .

మన శరీర కణాలు ఎలాంటి సైజు ,ఎలాంటి ఆకారం లో ఉన్న  పోషక అణువులను స్వీకరించ గలవో అలాంటి అణువులు పుష్కలం గా ఉండే వాటిని అత్యంత పోషక   ఆహారమని  అంటారు .

 ఏదైనా పోషక అణువుల విలువ ఆయా అణువుల రూపం , పరిమాణం పైనే ఆధారపడి ఉంటుంది .

మనిషి వండటం కనిపెట్టి న తర్వాత  అంతకు మునుపు  జీ ర్ణం చేసుకో లేని రక రకాల పదార్ధాలను కూడా తినడం ప్రారంభించాడు .

పదార్ధాలను పచనం చేస్తున్నప్పుడు వాటికి గాలి ,సూర్య రశ్మి  పుష్కలం గా తగులుతూ ఉండాలని ,అప్పుడే ఆ పదార్ధం శరీరానికి పనికి వస్తుందని ,అలా జరగక పోతే అది సారం లేని నిర్జీవమైన   పిప్పితో సమానమని - మన మహర్షులు సూచించారు .

వృక్ష పదార్ధం ( బియ్యము , బార్లీ ,,గోధుమ ,జొన్న ,రాగులు, పప్పు దినుసులు   ) పండటానికి ఎంత సమయం తీసుకొంటే ,  అంత  ఎక్కువ సమయం అది పచన మవ్వడానికి పడుతుందని కూడా మహర్షుల వాక్యం . 

కాబట్టి లోహ పాత్రలు వాడినప్పుడు వాటి హెచ్చు ఉష్ణ ప్రసారణ ధర్మం వలన పదార్ధం త్వరగా ఉడికినట్లు కనిపిస్తుంది గానీ , పూర్తిగా ఉడ కదు . కేవలం మెత్త పడుతుంది .

మట్టి పాత్రల వలన మనకు కలిగే ఉపయోగ మేమిటి ?

మట్టితో చేసిన పాత్రల నిర్మాణంలో ని సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలి ,సూర్య కిరణాల రేడియేషన్ వెలుపల నుండి పాత్ర లోనికి నిరాఘాటం గా ప్రసరించడం వలన ఆ వంట పదార్ధం ఎక్కువ సమయం నిల్వ ఉంటుంది .

అలాగే మట్టి పాత్రలకు సూక్ష్మ రంద్రాలున్నా ,  ఉడుకుతున్న పదార్ధాల ఆవిరి బయటకు పోనివ్వకుండా అవి వాల్వు'లెక్క పనిచేయడం వలన పదార్ధం పచనం కావడానికి తక్కువ నీరు ,నూనె సరి పోతుంది . 

దీనివలన ఆహారం ఎక్కువ సమయం నిల్వ ఉంటుంది .

ఆమ్ల మరియు క్షార ఆహార పదార్ధాలను మట్టి పాత్రల లో వండినప్పుడు , వాటిని తట స్థీకరణ చేసి పదార్ధానికి మంచి రుచి ని కలగ చేస్తాయి .

మట్టితో చేసిన పాత్రలు ఇనర్ట్ గా ఉండటం వలన పదార్ధాలతో ఎలాంటి రసాయన చర్య చెందవు .

 అలాగే సన్నగా ఉడకటం అనేది ఇన్ఫ్రా రెడ్ (పరారుణ ) వేడితో నెమ్మదిగా జరిగే ప్రక్రియ . 

దీని  వలన మషాలా దినుసులు కొంచెం వేసినా , అవి పదార్ధం లో లోపలికి చొచ్చు కెళ్ళడం  వలన  చక్కని రుచి వస్తుంది .

ముఖ్య అవసరా లైన ఆహారం ,నీరు సేకరించడం ,స్వీకరించడానికి తగిన విధం గా పచనం చేయడం , అవసర మైతే నిల్వ ఉంచుకోవడం -ఇవన్నీ మన శరీరానికి హాని కలగని రీతిలో చేసు కోవాలి .

మన ఋషులు ఏమి సూచించా రంటే , -వండిన ఆహారాన్ని కేవలం 48నిముషాలలో తినాలి . 

అలా తినకపోతే ,పోషక విలువలు క్రమం గా తగ్గుతూ పోతాయి .

పదార్ధాల తాజా దనం అత్యంత ముఖ్యమైన విషయం .

 పిండి ,రవ్వలు ,బియ్యం -ఇవన్నీ ఎప్పటి కప్పుడు పొట్టు వలిచి వాడుకోవడం అత్యంత ఆరోగ్య కర విషయం . 

కనీసం 15 రోజులు మించ కుండా వీటిని వాడు కోవాలి .

మందులు ,అసెంద్రియ కాంప్లెక్స్ ఎరువులు వాడని పంటల ద్వారా దిగుబడి అయ్యే ధాన్యం ,పండ్లు ,కూరగాయలు
మన ఆహారం గా చేసుకోవడం మన బాధ్యత  .... 

అది మన కనీస కర్తవ్యం .

ఆహారం తీసుకొంటు న్నప్పుడు నీరు త్రాగ కూడదు .

ఎలాంటి పదార్ధాలు తినాలి , ఆయా పదార్ధాల ను ఎలా పండించాలి  , ఎలా సేకరించి శు భ్ర పరచి పిండి - రవ్వ చేయాలి , వాటిని ఎలా ఎంత కాలం నిల్వ చేసుకోవాలి , ఎలా ఏ పాత్రలు ఉపయోగించి  వండాలి , ఎలా తినాలి , వండిన పదార్ధాలను ఎంత సమయం లో తినాలి ------ ఇవన్నీ కూడా  మన ఆరోగ్యాన్ని శాసించే  అత్యంత ముఖ్యమైన విషయాలు .

సూర్యోదయం నుండి 2 గంటల లోపే జటరాగ్ని బాగా ఎక్కువ ఉండటం వలన ఆ సమయం లోనే ఎక్కువ మోతాదు లో ఆహారం అదీ సంపూర్ణ  సమతుల ఆహారం తీసుకోవాలి . 

ఎట్టి పరిస్థితిలో నూ ఉదయం 9 గంటల లోపే ఆహారం తీసు కోవాలి .

సరి ఐన శ్వాస కోసం ప్రాణా యామం ఎంత ముఖ్యమో సరైన ఆహార స్వీకరణ కు అంతే అవసరమైన పై నియమాలు
సనాతన ధర్మ పరుల మైన మనందరం కూడా పాటించాలి .

మనది ఉష్ణ దేశం .
ఉష్ణ ప్రాంతాల ప్రజలలో త్రిగుణా లలో ని వాయు గుణం ఎక్కువగా ఉండటం వలన దానిని తగ్గించే విధం గా మన ఆహారం మొదలగు  , అలవాట్లను తీర్చి దిద్దు కోవాలి .



- స్వస్తీ...