కరోనా దెబ్బకి మనం బతికుండగా నమ్మలేని,  జీవితకాలంలో ఊహించలేని,  కొన్ని గొప్ప సంఘటనలు జరిగాయి :

1.  సంపూర్ణ మద్య నిషేధం అమలు.

2. దిక్కుమాలిన తెలుగు సీరియల్స్ ఆగిపోవడం.

3. పెద్ద నగరాల్లో ఆఫీస్ నుంచి ఇంటికి చేరే సమయంలో నాలుగు గంటల దాకా బయటే ట్రాఫిక్ లో గడిచిపోయే పరిస్థితి నుంచి బయట పడటం.

4. ట్రాఫిక్ జామ్లు లేని నగరాలు, కూడళ్ళు.

5.  కాలుష్య రహిత పట్టణాలు.

6.  ఇంటి యజమాని పిల్లల చదువు సంధ్య లు గమనించడం, వాళ్లతో ఆడుకోవటం.

7. మగవాళ్ళు ఇంటి పనుల్లో, వంట పనుల్లో సాయం చేయడం.

8. డబ్బులు నగలు, షాపింగ్,  ఇతర అనవసర వస్తువులు మీద తగలకుండా, అవసరమైనవి మాత్రమే కొనుక్కోవడం.

9. డబ్బులు అతి జాగ్రత్తగా పొదుపు గా వాడుకోవడం.

10.  బయట  అడ్డమైన దరిద్రాలు తినకపోవడం.

11. వ్యక్తిగత శుభ్రత మీద,  పరిసరాల శుభ్రత మీద జాగ్రత్తలు తీసుకోవటం.

12.  బండిలో పెట్రోల్ తగలేసి ఊరు,వాడ   త్రిపాద నక్షత్రాల లాగా తిరక్కపోవడం.

13. సాధ్యమైనంతవరకు నాన్వెజ్ మానేసి వెజ్ తినడం.

14. భారతీయ సాంప్రదాయ పద్ధతులు గుర్తు తెచ్చుకుని పాటించడం.

15. సామాజిక బాధ్యత గురించి ఆలోచించడం, పక్కవారికి రోగాలు రాకూడదు అని కోరుకోవడం.

16. డబ్బు ఎంత ఉన్నా, అవసరమైనప్పుడు మన పని మనమే చేసుకోవాలి, అని గుర్తెరిగి , పని మనిషి లేకపోయినా ఇంటి పనులు కలసి మెలసి అంతా చేసుకోవడం.

 ఈ 16 సూత్రాలు,  లాక్ డౌన్  తర్వాత కూడా పాటిస్తే,   ఆరోగ్యం,మనశ్శాంతి,ఐశ్వర్యం, క్రమశిక్షణ,  ఒళ్ళు వంచి పని చేయడం , అన్నీ మీ సొంతం.



- స్వస్తీ...