కృతజ్ఞత అనే తాళం చెవి ద్వారా మనం ప్రతికూల విషయాలను, అనుకూలవిషయాలుగా మార్చుకోవచ్చు.

కృతత అనేది ఒక టీకా మందు.

అది ఒక విషనాశిని.

క్రిమినాశిని.

మీ దిన చర్యలో ఏ మంచి విషయం జరిగినా , దానికి కృతజ్ఞత చూపండి.

అదెంత స్వల్పమైనదైనా సరే " " ధన్యవాదములు " అనండి.

 బస్ లో సీట్ దొరికినా, మీకిష్టమైన పాటవిన్నా,

 ఇలా ప్రతిదానికీ కృతజ్ఞత చెప్పండి.

మీలో కృతజ్ఞతాభావం కలిగినపుడల్లా, మీరు ప్రేమను ప్రచరించినట్లే.

మీరు జీవితంలో పొందిన వాటికి, పొందుతున్న వాటికి పొందబోయే వాటికి కూడా పొందిన భావనతో కృతజ్ఞులుగా ఉండండి.

కృతజ్ఞత ఒక చిన్న మాటే " ధన్యవాదములు " అయితే ఇది చెప్పేటప్పుడు హృదయ పూర్వకంగా చెప్పాలి.

ఆపదాలను మీరు చెప్పేకొద్ది మీ హృదయం కృతజ్ఞతతో నిండి పోతుంది.

అపుడు మీనుండి ఎక్కువ ప్రేమ ప్రసరించ బడుతుంది .

కృతజ్ఞత వల్ల నష్టపోయేది ఏమి లేదు.

అది భూప్రపంచం లో సర్వ సంపదలకూ కారణ భూతమైనది.

మీరు ఏ విషయానికైతే కృతజ్ఞతా భావం తో ఉంటారో అది మీకు మరిన్ని రెట్లు ఎక్కువగా లభిస్తుంది.

మన ఆరోగ్యం చాలా బాగున్నందుకు, రాత్రి హాయిగా నిద్ర పోయినందుకు, ఏరోజు కారోజు జీవించి ఉన్నందుకు, ఇలా ప్రతి ఒక్కదానికి, రోజుకి వందలసార్లు మనం కృతజ్ఞత చెప్పాలి.

అపుడే అవి ఇంకా బాగా మెరుగవుతాయి.

 మీ జీవితంలో ప్రతి క్షణమూ కృతజ్ఞతా భావానికొక అవకాశం.

అది మీ ప్రేమను పెంచు తుంది.

మనజీవితంలో జరిగే అన్నింటికీ
మనం ఎల్లవేళలా కృతజ్ఞతా భావంతో ఉందాం.

మన జీవితాలను, ఆనందమయం చేసుకుందాం.



- స్వస్తీ...