కులం అనేది వారివారి వృత్తి ధర్మానికి సంబందించినది. 

"తక్కువ కులం - పెద్ద కులం" అంటూ ఏమిలేదు, 

అది కొందరు అతి గర్వమున్నవాళ్ళు వారికి వారు విధించుకున్న ఒక నిబందన మాత్రమే. 

ప్రతి కులం వారికి సమాన గౌరవముంది. 

కులానికి, మతానికి ఎటువంటి సంబంధం లేదు. 

కులాల పేరుచెప్పి హైందవ ధర్మాన్ని విచ్ఛిన్నం చేసి మతమార్పిడులకు పాల్పడుతున్నవారిని తరిమి తరిమి తన్నాలి. 

రైతు :

రైతులు దేశానికి వెన్నెముక అంటారు. రైతులు నివసించేది పల్లెల్లోనే.

 రైతు అంటే వ్యవసాయదారుడు

దేశానికి ఆహారం పెట్టగలిగిన వాడు రైతు. 

దేశ జనాభాలో అధిక శాతం వ్యవసాయదారులే. 

వీరు ప్రకృతి కరుణా కటాక్షం మీద అధార పడి బ్రతుకుతున్నారు. 

రైతుల మీద ఆధారపడి అనేక కుల వృత్తుల వారు ఉన్నారు. 

నిజానికి రైతులు, కులవృత్తి పనివారు ఒకరి మీద ఒకరు అదార పడి ఉన్నారు. 

ఆ ఇద్దరి బాంధవ్యం ఎంతగా పెనవేసుకుని పోయిందంటే ఒకరు లేనిదే మరొకరు లేరనే విధంగా వుండేది. 

ఇదంతా గతం. 

భూమిని నమ్ముకొని ప్రకృతి మీద ఆధార పడిన రైతులు వర్షాలు లేక వారి జీవన విధానము విచ్ఛిన్నమైనది. 

రైతులనే అంటి పెట్టుకొని వున్న ఈ కులవృత్తి పని వారి జీవన విధానము కూడా విచ్ఛిన్నమై పోయింది.

 ఈ కుల వృత్తి వారు కేవలము రైతులకు పొలం పనులలో సహాయం చేస్తూ వారికి కావలసిన పనిముట్లును తయారు చేసి ఇవ్వడమే కాకుండా రైతుల సంస్కృతిలో, సామాజిక పరంగా కూడా విడదీయ లేని బాందవ్య కలిగి వుండే వారు. 

ఇదంతా ఒకప్పటి సంగతి. 

వారిరువురి బాంధవ్యం ఎలా వుండేదో.....  ?

ఇప్పుడెలా ఉందొ...?

అర్థ శతాబ్దం కాలంలో జరిగిన మార్పులను గమనిస్తే అర్ధం అవుతుంది.


కుల వృత్తులు ఎలా ఉంటాయి?

1.చాకలి :

ఇది పల్లెల్లో చాల ప్రధానమైన వృత్తి. 

చాకలి లేనిదే పల్లెల్లో సాంప్రదాయమైన పనులు చాల జరగవు. 

వారిది ముక్యమైన పని అందరి బట్టలను వుతికి తేవడం. 
మధ్యాహ్నం ఒకరు వచ్చి ప్రతి ఇంటి వద్ద కొంత అన్నం కూర తికుని వెళ్లి తింటారు. 

అలాగె రాత్రికి కూడ కొంత అన్నం పెట్టాలి. 

దీని కొరకు చాకలి స్త్రీ ఒక గంప, ఒక పాత్ర తీసుకొని ప్రతి ఇంటికి వెళ్లి అన్నం కూరలు తీసుకుంటుంది. 

అన్నాన్ని గుడ్డ పరచిన గంపలో వేసుకుంటే కూరలను ఒక పాత్రలో పోసుకుంటుంది. 

ఆ విధంగా వూరి వారి అందరి కూరలు ఒకే పాత్రలో సేకరించడము వలన అది ఒక ప్రత్యేక రుచిని కలిగి వుంటుంది. 

ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పుట్టినదే సామెత.. 

చాకలి కూర. 

వూరి వారి బట్టలి అన్ని కలిపి వున్నా సాయంత్రానికి ఎవరి ఇంటి బట్టలు వారివి వేరు చేసి వారి వారికిస్తారు. 

బట్టలను వారు అంత బాగ గుర్తు పట్టగలరు. 

అందుకే చదివిన వాడికన్న చాకలి మిన్న అన్న నానుడి పుట్టింది.

పల్లెలోని ఏ కుటుంబంలోనైనా ఆడపిల్లలు సమర్తాడితే ఆ సందర్బంలో ఆ అమ్మాయి ఒంటి పైనున్న బట్టలు చాకలికి చెందుతాయి. 

ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక సామెతె పుట్టింది. 

అదేమంటే సరదాకి సమర్థాడితే చాకలి చీర పట్టుక పోయిందట. 

సామెత వివరణ ఒక అమ్మాయి సరదాకి తాను సమర్థాడినట్లు ప్రకటించింది. 

ఆనవాయితి ప్రకారము చాకలి వచ్చి స్నానం చేయించి ఆ చీర పట్టుకొని పోయిందట. 

అదే విధంగా వివాహము వంటి శుభ కార్యాలలోను, చావు వంటి అశుభ కార్యాలలోను చాకలి, మంగలి వంటి వారు తప్పని సరిగా నిర్వహించ వలసిన కార్యాలు కొన్ని వుంటాయి. 

వాటినే చాకలి సాంగెం, అని మంగలి సాంగెం అని అంటారు. 

చావులో గాని, పెండ్లి లోగాని చాకలి వారి పని దీవిటి పట్టడము. 

అది పగలైనా, రాత్రి అయినా దీవిటి పట్టవలసినదే. ఆ విధానము ఒక తప్పనిసరి అయిన సాంప్రదాయము అయిపోయినది. 

వీరు దీవిటి పట్టడమనే తంతు దేవుని ఊరేగింపులోను, గంగమ్మ జాతర వంటి జాతర సందర్బంలోను తప్పని సరి. 

గంగమ్మ జాతరలో చాకలి వారే పూజారులు. ఈ విధానములో వీరికి కొంత సంభావన ముట్టుతుంది.

గ్రామంలో ‘రజకులు’ (చాకలి) కొన్ని కుటుంబాలకు ఒక కుటుంబం చొప్పున రోజు మార్చి రోజు బట్టలు ఉతుకుతూ ప్రతి దినం అన్నం పెట్టించుకొని వెళ్ళేవారు. 

పదవులు నిర్వహించే వారు, భాగ్యవంతులు చాకలికి ‘ఇస్త్రీ పెట్టె’(iron box) ఇచ్చి బట్టలు ‘చలువ’ చేయించుకొనే వారు. సంవత్సరానికి కుటుంబానికి నిర్ణయించిన ‘మేర’ ప్రకారం ధాన్యం వగైరా తీసుకనే వారు. 

చాకలి వాళ్ళే రైతుల సహాయంతో ‘బట్టీ’ల ద్వారా సున్నం తయారుచేసి కుటుంబానికి కావలసినంత ఇచ్చేవారు. 

తాంబూలం వేసుకొనే వారికి వీరు ప్రత్యేకమైన సున్నం ఇచ్చేవారు. 

పెళ్ళి మొదలైన శుభకార్యాలకూ, దైవకార్యాలకూ రజకులు పందిళ్ళు వేసి మామిడి తోరణాలు కట్టేవారు. 

వంట చెరకు విషయంలో కూడా వీరు రైతులకు ఎంతో సహకరించే వారు.

చాకలి వారు చేయ వలసిన పనులలో మరొకటి ఏమంటే చిన్నపిల్లలకు పురిటి స్నానము చేయించడము, ఆ సందర్బాని ఊరివారందని పిలవడము వీరి విధులల్లో ఒకటి. 

ఆ చాకలి ప్రతి ఇంటికి వెళ్లి పలాన వారింటిలో పురుడు పోస్తారు మీరు రావలసినదని చెప్తాడు. 

దీన్ని పురస్కరించుకొనొ ఒక సామెత పుట్టింది. 

అదేమంటే చాకలి దానికి చెప్పి చాలుకున్నడట. 

సామెత వివరణ : ఏదైనా ఒక రహస్యము చెప్పి ఎవరికి చెప్పవద్దంటే వాడు ఆ విషయాన్ని చాకలి వానికి చెప్పి చాలుకున్నాడట. అనగా చాకలి దానికి చెప్పిన విషయము వెంటనే ఆ పల్లెకంతా తెలిసి పోతుందని అర్థము.

కాలక్రమేణా వృత్తులు వ్యాపార దృష్టిని సంతరించుకొన్నాయి. సమాజం సమూలంగా మార్పు చెందింది. 

ఆధునిక పరికరాభివృద్ధి ఫలాలైన ‘లాండ్రీలు’, ‘బార్బర్‌ షాపులు’, నూలుమిల్లులు మొదలైన వాటి పోటీలో చేతివృత్తుల వారు వెనుకబడిపోయి బ్రతుకు దెరువుకోసం పట్టణాలకు వలసలు పోవలసిన దౌర్భాగ్యం పట్టింది. 

సకాల వర్షాలు లేక, పంటలు పండక, కరువు కాటకాలతో చివరకు రైతుల ఆత్మహత్యలతో దేశ ఆహారోత్పత్తి కుంటుబడుతున్నది. వ్యాపార పంటలు, ఉన్నత విద్యపై మోజు పెరగడంతో నగరీకరణ జరుగుతూ పల్లెలు చాలావరకు నగరాల్లో కలిసిపోగా మిగిలినవి వెనుకబడిపోయాయి.



2. మంగలి :

మంగలి వృత్తి కూడ ఆ నాటి సమాజంలో చాల ప్రధానమైన వృత్తి. 

ప్రతి సారి ప్రతి ఫలం ఆశించ కుండా అందరికి క్షవరంచేసే వీ ఆ పనికి గాను ఫలితానికి, మేర ద్వారా ఐదు బళ్లల వడ్లు, ఒక మోపు వరి తీసుకునేవారు. 

తలంటు స్నానం చేయించడం వంటి పనులు చేసె వారు. 

ప్రతి రోజు మంగలి పల్లెలలోనికి వచ్చి క్షురక వృత్తి చేసె వారు. 

తల క్రాపు చేయడం, పెద్దవారికి గడ్డం చేయడం వంటివి చేసె వారు.

నాయా బ్రాహ్మణులు (మంగలి వాళ్ళు) గ్రామంలో కొన్ని కుటుంబాలకు ఒకరు చొప్పున ఇంటింటికి వెళ్ళి ‘తలపని’ (క్షవరం) చేసేవారు. 

సంవత్సరాంతంలో వీరు తమ ‘మేర’ తీసుకొనే వారు. 

వివాహ కార్యాల్లో వీరు వధూవరుల చేతి, కాళ్ళ గోళ్ళు తీయటం మొదలైన ‘కన్నెపెళ్ళి’ పనులు చేసే వారు. 

పుట్టు వెండ్రుకలు తీయటం, శుభకార్యాల్లో మంగళ వాద్యాలు వాయించి తగిన పారితోషికం పొందటం వల్ల వీరి జీవనం సాగేది.

 వీరు దైవకార్యాల్లో నిలయ విద్వాంసులుగా ఉండటం వల్ల ‘దేవుని మాన్యం’ కూడా భుక్తంగా ఉండేది.

ఈ విధంగా ’Artisans’ అనీ, పంచభట వృత్తుల వారనీ వీరు గ్రామాల్లో కొన్ని ప్రత్యేక సంప్రదాయ విధానాలు కలిగి, పని హక్కు గలిగి, ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించే వారు. 

ప్రాచీన కాలం నుంచి వీరికిచ్చిన ‘మాన్యము’ వంశపారంపర్యంగా అనుభవిస్తూ కార్యసాధకులుగా ఉండేవారు.



3. కుమ్మరి :

అమ్మకానికి సిద్దంగా వున్న కుమ్మరి చేసిన కుండలు.

కుమ్మరి మట్టితో కుండలు చేసి కాల్చి రైతులకు ఇచ్చేవారు. 

వీరికి కూడ ప్రతి పలితానికి 'మేర' వరి మోపు ఇచ్చేవారు. 

పెద్ద వస్తువులైన, కాగు, తొట్టి, ఓడ మొదలగు వాటికి కొంత ధాన్యం తీసుకొని ఇచ్చేవారు. 

పెళ్లి సందర్భంగా ''అరివేణి'' కుండలని కుమ్మరి వారు ఇవ్వాలి. 

అనగా కొన్ని కుండలకు రంగులు పూసి కొన్ని బొమ్మలు వేసి ఇచ్చేవారు.

వంటకు నాడు గ్రామాల్లో దాదాపు అందరూ మట్టి పాత్రలే వాడేవారు. 

కుమ్మరులు మట్టితో తయారుచేసిన చట్లు, కుండలు, మూకుళ్ళు, బానలు, కడవలు, ముంతలు, అన్నం తినే చిప్పలు బియ్యం, ధాన్యం పోసుకొనే పెద్ద ‘గరిసెలు’ ప్రత్యేకంగా తయారుచేసి ఇచ్చేవాళ్ళు. 

సంవత్సరాంతంలో తమకు వచ్చే ‘మేర’ రైతుల నుండి తీసుకొనే వారు. 

అదనంగా వీరు వివిధ రకాల మట్టిపాత్రలు తయారుచేసుకొని ‘కావిళ్ళ’తో మోసుకొనిపోయి సమీపంలోని పట్టణాల్లో వాటిని అమ్ముకొనే వారు. 

దైవకార్యాల్లో కుమ్మరులు తమకు కేటాయించిన పనులు నియమంగా నిర్వహించే వారు.



4. వడ్రంగి :

వీరి పని కర్రలతో పని ముట్లు తయారు చేయడం. 

నాగలి, కాడిమాను, ఎద్దుల బండి, ఇంటి సామానులు తయారు చేయడం వీరి పని. 

వ్యవసాయం యాంత్రీకరణమైన ఈ రోజుల్లో వడ్రంగి చేయవలసిన వ్వయసాయ పని ముట్లు ఏమి లేవు. 

అయినా ఇంటికి సంబందిచిన ద్వారాలు, కిటికీలు వంటి పనులు వీరికి ఎక్కువగా వున్నాయి వారు ఇప్పటికి పూర్తి స్థాయిలో పనులలో నిమగ్నమై వున్నారు. 

వారికి కావలసినంత డిమాండు వున్నది.



5. మేదర :

మేదరి వారు అల్లిన బుట్టలు, తట్టలు, చాటలు మరియు ఇతర అందమైన అలంకార వస్తువులు.

వీరు వెదురు బద్దలతో తట్టలు,, బుట్టలు చాటలు దాన్యాన్ని నిలవ చేసె బొట్టలు ఎద్దుల బండికి వేసె మక్కిన వంటివి అల్లు తారు. 

గతంలో అడవులలో వున్న వెదుర్లను కొట్టి తెఛ్ఛి తట్టలు బుట్టలు అమ్మేవారు. 

అప్పట్లో బొట్టలు, మక్కెనలు, వంటి పెద్ద పెద్ద సామానులను తయారు చేయడంలో వారికి ఆదాయం బాగ వుండేది. 

తాము తయారు చేసిన వస్తువులను రైతులకు దాన్యాన్నికి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.



6. జంగం వాళ్ళు :

జంగం వారి జనాభా అతి తక్కువ. 

ముఖ్యంగా వీరు శివ భక్తులు. వీర భద్రుని ఆలయాల్లో పూజారులు వీరే వుంటారు. 

గతంలో వీరు కొన్ని పల్లెలను తమలో తమకు కేటాయించుకొని ఆ పల్లెల్లో కార్తీక మాస నెలంతా తెల్లవారు జామున తిరిగుతూ గంట వాయిస్తూ, శివనామ స్తుతి చేస్తూ తిది, వార, నక్షత్రాలను చెప్పి తెల్లవారి ప్రతి ఇంటి ఆసామి వద్ద సంబావన పొందుతారు. 

ఇలా తిరిగే వారిని జంగం దేవర అని అంటారు. 

వీరు శుభాశుబాలను చెప్పుతారు. 

వీరికి సమాజంలో బ్రాహ్మణుల తరువాత గౌరవ స్థానం వీరిదే. 

వీరి వేష ధారణ కూడ గౌరవ ప్రదంగానే వుంటుంది.

కాషాయ వస్త్రాలను ధరించి, తలపాగా కట్టి, బుజాన కావడి లేదా జోలే, ఒక చేతిలో గంట, రెండో చేతొలో శంఖం వుంటుంది.



7. కంసాలి :

లోహ వస్తువులను తయారు చేసె వారిని కంసారి అంటారు

 వీరు కత్తులు, గొడ్డల్లు, కొడవళ్లు వంటి లోహ సామానులు చేసె వారు. 

ఇప్పుడు వాటి అవసరం ఎక్కువ లేదు. 

అయినా యంత్రాలతో తయారైన రడిమేడ్ పరికరాలు సంతల్లో దొరుకుతున్నాయి.

 గతంలో అక్కడక్కడా ''కొలిమి'' వుండేది. 

కాని ఈరోజుల్లో కొలిమి ఎక్కడా లేదు.



8. గాజుల వాళ్ళు :

ఆ రోజుల్లో గాజుల శెట్టి తన మలారం బుజాన వేసుకొని పపల్లెల్లో తిరిగే వారు. 

మలారం అంటే: సన్నని పొడవైన దారాలకు గాజులను రెండు వైపులా గుత్తులు గుత్తులుగా కట్టి ఆ దారాలన్నింటిని మధ్యలో ఒకటిగా కట్టి దాన్ని బుజాన వేసుకుంటారు. 

గాజుల వాళ్ళు కొన్ని పల్లెలను తమ ప్రాంతగా విభజించుకొని ఆ యాపల్లెలలో వారె గాజులను అమ్మేవారు.



9. మాల :

వీరు హరి జనులు. ఇతర ప్రాంతాలలో వీరిని అంట రాని వారుగా పరిగణించబడినా, ఈ ప్రాంతంలో అనగా రాయలసీమ లో మాత్రం అంట రాని తనం అంత తీవ్రం వుండేది కాదు. 

వీరి జన సంఖ్య ఎక్కువే. 

వీరు ఎక్కువగా కూలీలుగా వుండే వారు. 

వీరిలో కూడ భూములున్న వారు కొందరుండేవారు. 

వీరు వ్వవ సాయ పనులు చాల బాగ చేస్తారు.



10. మాదిగ :

వీరు కూడ హరిజనులే.

 కాని వీరి జన సంఖ్య తక్కువే. 

వీరు చెప్పులు కుట్టడం, తోలు తోచేసిన కపిలి బానలను కుట్టడం అవకాశం వున్నప్పుడు రైతు పొలంలో కూలికి వెళ్లడం చేసే వారు. 

వీరికి కూడ రైతుల నుండి మేర వరి మోపు లభిస్తుంది. 

రైతు లందరూ వీరి వద్దనే చెప్పులు కుట్టించు కునేవారు. 

కరెంటు మోటార్లు వచ్చాక వీరి వృత్తి మరుగున పడిపోయింది.



11. బెస్త వారు :

బెస్త వారి కులంలో అనేక ఉప కులాలున్నాయి.

 గంగ పుత్ర, వన్నెకుల క్షత్రియ, పలికాపు, అనే కులాలు ఇందులోనె ఉన్నాయి.

 బెస్త వారి వృత్తి చేపలు పట్టడము.

 ఈ కులం వారు కృష్ణా, గోదావరి, తుంగ భద్రా నదీ ప్రాంతాలు, మరియు సముద్ధ తీర ప్రాంతాలలోనె ఎక్కువ ఉన్నారు. 

మిగతా ప్రాంతాలలో వీరి జన సంఖ్య చాల తక్కువ. 

వీరు చేపలు పట్టడం తప్ప మరే పని చేయలేరు. 

తీర ప్రాంతాలలో వుండే బెస్తలకు దిన దిన గండం నూరేళ్ల వయస్సుగా బ్రతుకీడుస్తున్నారు. 

వారి వృత్తి ప్రాణాలతో తెలగాటమే. 

వీరు ఆర్థికంగా చాల వెనుక బడిన కులంవారు. 

చేపలు పట్టే పడవలు, బోట్లు లక్షలాది రూపాయల విలువ చేస్తాయి. 

వాటిని వీరు కొనలేరు. 

పెద్ద ఆసాములు పడవలను కొని బెస్త వారికి అద్దెకిస్తుంటారు. 

వీరి అద్దె విధానము వైవిధ్యంగా వుంటుంది. 

పడవకు రోజుకింత అని గాని, లేదా నెలకింత అనిగాని అద్దె వుండదు. 

ఒక సారికి ఇన్ని చేపలు ఇవ్వాలి అని నిబందన వుంటుంది. అదే ఆ పడవకు అద్దె. 

వారికి ఎన్ని చేపలు దొరికినా అద్దె చేపలు పోగా మిగిలిన చేపలు బెస్త వారికి చెందు తాయి. 

చాల సార్లు అద్దెకు ఇవ్వాల్సిన చేపలు కూడా దొరకవు. 

ఇలా ఎక్కువ సార్లు వారికి తగిన ఫలితము దొరకదు. 

కొందరు చిన్న చిన్న పడవలలో చేపల వేటకు వెళ్లతారు. 

అవి చాల దూరం ప్రయాణించలేవు. 

కనుక అధికంగా చేపలు దొరకవు అంత దూరం పెద్ద పడవలే వెళ్లగలవు. 

అదృష్త వశాత్తు ఎప్పుడైనా పెద్ద చేపలు ఎక్కువగా దొరికితే బెస్త వారి పంట పండినట్టు కాదు. 

మధ్యలో దళారులుంటరు. 

చేపలను వారికి అమ్మాల్సిందే. 

పట్టిన చేపలను దాచుకొని నిదానంగా అమ్ముకుందామంటే కుదరదు. 

ఏ రోజుకారోజు వాటిని అమ్మేయాల్సిందే. 

దీన్ని అవకాశంగా తీసుకున్న దళారులు ఎంతో కొంత ధనం ముట్ట జెప్పి ఆ చేపలను తమ స్వంతం చేసుకొని తగు రీతులో వాటిని ఎగుమతి చేసి అధిక మొత్తంలో ధన సంపాదన చేస్తున్నారు. 

బడుగు జీవులైన ఈ బెస్త వారు తమ వృత్తిని వదులుకోలేక వేరె పని చేయలేక అలాగె బ్రతుకీడుస్తున్నారు.

జూలై, ఆగస్టు నెలల్లో చెరువుల్లో చేప పిల్లన్ని వదిలి మార్చి నుంచి మే వరకు చేపలను పడతారు. 

దళారీలు చెరువులను గుత్తకు మాట్లాడుకొని ఆదాయాన్ని గడించటంవల్ల మత్స్యకారులు నష్టపోతున్నారు. 

చెరువులో విత్తనాలు చల్లే సదరు కాంట్రాక్టర్‌ చేపలు పట్టే సమయానికి మత్స్యకారుల వద్ద కొనుగోలు చేస్తాడు.

 వాటిని ఆ వ్యక్తి మార్కెట్‌లో ఎక్కువ రేటుకు విక్రయించి సొమ్ము చేసుకుంటాడు. 

దళారి వ్యవస్థ లేనిపక్షంలో మత్స్యకారులు నేరుగా చేపలను మార్కెట్‌కు తరలించి విక్రయించి లాభాలను గడించే అవకాశం ఉంటుంది. 

ప్రభుత్వం సొసైటీలకు విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందజేస్తోంది. 

ఫలితంగా వృత్తిదారులు స్వయంగా విత్తనాలు వేసి చేపలు పట్టుకొని మార్కెట్‌కు తరలించి విక్రయించడం ద్వారా లాభాన్ని గడించే అవకాశం లభించింది. 

వాగులలో ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసింది. 

105 రూపాయల ఫీజు చెల్లిస్తే ఏడాది పాటు చేపలు పట్టుకొనే వీలు కల్పించింది.

 కట్ల, రౌ, బంగారు తీగ చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. 

చేపల మార్కెటింగ్‌కు గాను ఈ మధ్య మహిళలకు సబ్సిడీపై బైక్‌లను అందించారు. 

మత్స్యకారుల పిల్లల కోసం రాష్ట్రంలో చిత్తూరు, పశ్చిమ గోదావరి మెదక్‌ జిల్లా ల్లోగురుకుల పాఠశాలలున్నాయి.

వృత్తిదారులు చనిపోతే రెండు లక్షలు భీమా ఇస్తున్నారు. 

మహిళా మత్స్యకారులు కూడా మత్స్య మిత్ర గ్రూపుల నుంచి రుణాలు, నైలాన్‌ వలలు, ఐస్‌ బాక్స్ లు తదితర పరికరాల కోసం రుణాలు పొందారు.మహిళా మత్స్య ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి వారికి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇస్తే బాగుంటుందని వారు ఆశిస్తున్నారు.

 తక్కువ నీటిలో ఎక్కువ చేపలను ఉత్పత్తి చేసే మెళకువలు నేర్పించాలని, కేరళలో చేపడుతున్నట్లుగా ఇక్కడ కూడా చేపల పచ్చళ్లు, ఫ్రై తదితర వెరైటీ వంటకాలు తయారు చేసి విక్రయించేలా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఎవరికైనా చేపలు అవసరమైతే డోర్‌ డెలివరీ చేసే స్థాయికి ఎదగాలని వృత్తి దారులు భావిస్తున్నారు.



12. సాలె వారు :

సాలె వరి వృత్తి మగ్గం పై బట్టలు నేయడము. 

పూర్వం పత్తి మొక్కల స్థానంలో చెట్లు ఉండేవి. 

ఇప్పటికీ మనం అక్కడక్కడ దేవాలయాల్లో ఎర్రటి పత్తికాయలతో కనిపించే చెట్టును చూడొచ్చు. 

ఆ చెట్టు నుంచి పత్తి దిగుబడి బాగానే వచ్చేది. 

ఈ చెట్ల నుంచి సేకరించిన పత్తి ద్వారానే మన చేనేత కార్మికులు అప్పట్లో వస్త్రాలను తయారు చేసేవారు.


తర్వాత దేశీయ పత్తిలో ఉన్నంత మన్నిక హైబ్రీడ్‌ పత్తిలో ఉండకపోయినా అనివార్యంగా మన వారు హైబ్రీడ్‌ను ఎంచుకోవాల్సి వచ్చింది. 

సాలె కులానికి చెందిన కార్మికుల వృత్తి దెబ్బతింది. 

టెండర్లు పిలిచే విధానానికి స్వస్తి పలికి వస్త్రాలను వీరి నుంచి కొనుగోలుచేస్తే వారి మనుగడ సాగుతుంది. 

గుడ్డ బ్యానర్ల స్థానంలో ఫెక్సీలు రావటంతో వీరు ఆదాయాన్ని నష్టపోతున్నారు. 

               నేడు మారుమూల గ్రామాలలో సైతం ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.

ప్రస్తుతం వీరి పరిస్థితి కూడా చాల అద్వాన్నంగా ఉంది. (వివరాలు సేకరించ వలసి వున్నది)



13. దొమ్మరి :

దొమ్మరి ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, ఒడిషా, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాలలో కనిపించే ఒక సంచార జాతి. 

వీరిలో కొందరు వీధిలో సర్కస్ ప్రదర్శనలు ఇచ్చి సంపాదించేవారు.

 ఒకనాడు పడుపు వృత్తే వీరి జీవనాధారం. 

వారికి సంబదించిన సామెత. " చెప్పేది సారంగ నీతులు, దూరేది దొమ్మరి గుడిసెలు" వెళ్ళటం లేదు. 

కనిగిరి పట్టణ శివారు ప్రాంతంలో దాదాపు వంద కుటుంబాల దొమ్మరులు నివసిస్తున్నారు. 

ఆడవారు ఇళ్ళల్లో పాచి పనులు, మగవారు చెక్క దువ్వెనలు, ఈరిబానులు అమ్ముకోవడం, గేదెల కొమ్ములు కోయడం, పండ్ల బండ్లు వేసుకొని కాయలు అమ్ముకుంటున్నారు. 

అడవి ప్రాంతంలో తెచ్చుకున్న కరల్రతో చెక్క దువ్వెనలు, ఈరిబానులు తయారు చేసుకొని వాటిని ఊరూర తిరిగి అమ్ముకొని జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. 

దువ్వెనల తయారీ పందుల పెంపకం వీరి కుటీర పరిశ్రమలు. 

వారు ఒళ్లు గగుర్పొడిచే విద్యలు ప్రదర్శిస్తారు. 

సన్నటి తాడుపై నడచి అబ్బు రపరుస్తారు. 

బిందె మీద బిందెలు పెట్టి వాటిపైన సాహసాలు చేస్తారు. 

గడ ఎక్కి ఊరికి శుభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. 

ఈనాటి జిమ్నాజియానికి తీసిపోని విన్యాసాలు చేస్తారు దొమ్మరులు. 

దారిన వెళ్లేవారు కూడా కాసేపు నిలబడి వీరి ప్రదర్శన చూసి సంతోషంగా తమకు తోచినంత ఇచ్చి వెళ్లేవారు. 

దొమ్మర కులస్థులు నిత్యసంచారులు. 

చివరికి వారుండే గుడిసెలను కూడా గాడిదలపై వేనుకుని ఊరూరా తిరుగుతారు. 

వీరు ఇంట్లో వస్తువులతో పాటు మేకలు, కుక్కలను కూడా తమ వెంట తీసుకెళ్లి ముందుగా ఊరి చివర దిగుతారు. 

తర్వాత ఊరి పెద్ద వద్దకు పోయి ఆ గ్రామంలో ప్రదర్శన ఇస్తామని చెబుతారు. 

దొమ్మరులు గ్రామంలో అడుగుపెడితే శుభసూచకమనే భావన ఉండేది. 

ఎవ్వరూ అడ్డు చెప్పేవారు కాదు. 

పదేళ్లువచ్చేసరికి వీరు తమ పిల్లలకు శిక్షణ ఇస్తారు. 

గడ ఎక్కడం, దూకటం, పల్టీలు కొట్టటం, బిందెల మీద బిందెలు పెట్టి దానిమీద మనిషిని నిల బెట్టటం వంటివి సాధన చేయిస్తారు. 

విన్యాసాలు ప్రదర్శించే ఒక బృందం తయారు కావాలంటే కనీసం ఎనిమిది మంది ఉండాలి. 

వీరంతా గ్రామ కూడలిలోనో, చావిడి దగ్గరో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. 

దొమ్మరులు గ్రామానికి వస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం కనుక వర్షాలు కురవకపోయినా, పంటలు పండక పోయినా దొమ్మరవాళ్లను ఆ గ్రామానికి ప్రత్యేకంగా పిలిపించుకుంటారు. 

దొమ్మర ఆడపడుచుతో వ్యవసాయ భూముల్లో ప్రదర్శన ఏర్పాటు చేయిస్తారు. 

వేపాకు, పసుపు, బియ్యం కలిపిన మూటను నడుముకు కట్టుకున్న దొమ్మర మహిళ గడ ఎక్కుతుంది. 

దాదాపు 40 అడుగుల ఎత్తున్న ఈ గడపై ఆమె విన్యాసాలు చేస్తూ వడిలో ఉన్న బియ్యాన్ని వ్యవసాయ భూములపై విసురుతుంది. 

బావుల దగ్గర కూడా ఆమె ఓడు బియ్యాన్ని చల్లుతుంది.

 ఈ తంతు ముగిశాక వర్షాలు కురిసి గ్రామం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. 

విన్యాసాలు చేసే సమయంలో ప్రమాదవశాత్తు జారిపడితే వెంట తెచ్చుకున్న చెట్ల పసర్లతో వైద్యం చేసుకునేవారు.



14. ఇతర ఆశ్రిత జాతులు :

పల్లె వాసుల పై ఆధారపడిన యాచక వృత్తి వారు అనేకం. 

అందులో ముఖ్యమైనది బుడబుక్కల వారు. 

వీరి వేష ధారణ చాల గంబీరంగా వుంటుంది. 

నొసటన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని కోటు వేసుకొని, మెడపై అటు ఇటు కింది వరకు వేలాడుతున్న చీరలను ధరించి, కుడి చేతిలో చిన్న డమరుక / బుడబుక్కను ధరించి 'డబ డబ' వాయిస్తూ అంబ పలుకు జగదంబా పలుకు కంచి లోని కామాక్షి పలుకు, కాసీలోని విశాలాక్షి పలుకు అంటూ ఆయా గృహసుని కష్టాలను ఏకరువు పెడ్తాడు. 

ఇదిగో అంబ పలుకుతున్నది అంటూ తన బుడబుక్కను వాయిస్తూ ఆకాశం వైపు చూస్తూ ఎవేవో మాయ మాటలు చెప్పి వాటిని 'అంబ' పలుకుతున్నదని నమ్మిస్తాడు. 

వాటి నివారణకు మంత్ర తంత్రాలను కడతానంటాడు. 

వాడి మాటలకు లొంగి పోయిన పల్లెవాసులకు కొన్ని కష్ట నివారణ మార్గాలను చూసిస్తూ యంత్రాలను, తంత్రాలను ఇచ్చి ఇంటిలో వెన్ను గోడులో గాని, గడప పై గాని కట్టమని ఇస్తాడు. 

ప్రతి ఫలంగా కొంత దాన్యాన్ని పొందు తారు. 

వీరి ప్రస్తావన ఈ కాలంలో చాల అరుదుగా ఉంది. 

ఇంకా పూర్తిగా మాసి పోలేదు .



15. కొండ రాజులు :

కుర్రు తొకన్నలు. వీరు కూడా గంబీరమైన ఆహార్యముతో వుంటారు. 

భుజాన జోలితో, ఎర్రటి వస్త్రాలు ధరించి, నెత్తిన తలపాగతొ, అందులో నెమలి పించం పెట్టి రాజసం ఉట్టిపడేలా వస్తారు. 

కుర్రో కుర్రు.... కొండ దేవరా పలుకు, ..... అంటూ పల్లె వాసులకు కల్ల బొల్లి కబుర్లు చెప్పి వారిని తమ మాయ మాటలతో వశీకరణ చేసుకొని, వారి కష్టాలకు నివారణోపాయాలు చెప్పి కొంత ధాన్యం ప్రతి ఫలంగా పొందు తారు.



16. మొండోళ్లు :

వారు ఏ రైతు ఇంటి ముందు వాలినా వారు బిచ్చం వేసినంత వరకు వెళ్లరు. 

అందుకె వాళ్లను మొండోళ్లు అని అన్నారు. 

వారి నుండి పుట్టినదె ఈ సామెత మొండోడు రాజు కన్న బలవంతుడు. 

వారు రైతు ఇంటి ముందు భయాన దృశ్యాలను ప్రదర్సిస్తాడు. 

రక్త సిక్తమైన పసి పిల్లవాన్ని చేటలో పెట్టి దాన్ని ఇంటి ముందు పెట్టి పెద్ద కొరడాతో తనను తాను కొట్టు కుంటూ నానా భీబచ్చం చేస్తారు. 

అతని భార్య తన మెడకు వేలాడు తున్న ఒక వాయిద్యంతో వింత వింత శబ్ధాలు చేస్తూ పాటలు పాడుతుంది. 

ఈ ఘోర కృత్యాలను భరించ లేక గృహస్తు రాలు ఎంతో కొంత వడ్లు గాని బియ్యం గాని బిచ్చం వేస్తుంది. 

వారు అక్కడి నుండి ప్రక్క ఇంటి కెళుతారు.

వాయిద్య సహకారంతో పాటలు పాడి యాచించె రైతుల పైన, వారి పొలాల పైన ఆధార పడి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బ్రతికే అనేక ఆశ్రిత జాతుల వారి ఆరోజుల్లో చాల సంతోషంగానె కాలం గడెపేవారు. 

వర్షాభావ పరిస్థితుల్లో ఇటు రైతులు అటు రైతులపై ఆధార పడి బ్రతికే ఆశ్రిత జాతులు రైతులకు పరాయి వారుగానె మిగిలిపోయారు. 

స్వంత ప్రాంతంలో వున్న దళితులకు రైతులకు ఆనాడు వున్న అవినాబావ సంబంధం ఇప్పుడు ఎంత మాత్రము లేదు. 

ఇది సాంఘిక పురోగమనమో, తిరో గమనమో.



17. చిలక జోస్యం :

చిలక ఒక కార్డు తీస్తున్నది.

వీరు ఒక పంజరంలో చిలకను పెట్టుకొని పల్లెల్లో తిరుగుతూ జోస్యం చెపు తుంటారు.

 వీరు మంచి మాట కారులు. 

వీరిని ఎవరైన తమ ఇంటికి పిలిస్తే వెళ్లి కూర్చొని చిలక పంజరాన్ని కింద పెట్టి సుమారు ఒక ఇరవై కవర్లను వరుసగా పేర్చి పెట్టటాడు. 

ప్రతి కార్డులో ఒక దేవతా బొమ్మ మరొక కార్డుపై జ్యోతిషానికి సంబంధించిన కొన్ని మాటలు వ్రాసి వుంటాయి. 

జ్యోస్యం చెప్పించు కో దలచిన వాని పేరు అడిగి పేరును బట్టి అతన నామ నక్షత్రము చెప్పి దానికి సంబంధించిన కొన్ని మాటలు చెప్పుతాడు. 

ఆ తర్వాత పంజరం తలుపు తీసి చిలకను బయటకు పిలుస్తాడు. 

ఆ చిలక వచ్చి కొంచెం అటు ఇటు తిరిగి అక్కడ పరిచిన ఇరవై కవర్లలోనుండి ఒక కవరును తన ముక్కుతో తీసి బయట పడేస్తుంది. 

దానిని జ్యోతిష్కుడు తీసి అందులోని దేవతా బొమ్మని చూపి జరిగినవి, జరగబోయే విసేషాలను ఏకరువు పెడతాడు. 

తర్వాత మరొ కార్డులోనివిషయాన్ని చదివి కొన్ని లెక్కలు వేసుకొని సమస్యకు కొన్ని పరిష్కారా మార్గాలను సూచిస్తాడు.



18. యాచక వృత్తి వారు :

చాల కాలం క్రితం జాన పద కళారీతులకు బాగా ఆదరణ వున్న రోజుల్లో ఆయా కళాకారుకలు ప్రజల్లో మంచి గౌరవం వుండేది. 

అటు వంటి వారిని పల్లె ప్రజలు పిలిపించుకొని వారి కళా రూపాన్ని ప్రదర్శింప చేసుకొని ఆనందించి వారికి కొంత సంభావన ఇచ్చే వారు. 

ఆవిధంగా వారి జీవనం గౌరప ప్రదంగా సాగేది. 

అలాంటి వాటిలో ముఖ్యం చెప్పుకో దగ్గది.... బుర్ర కథ, ఒగ్గు కథ మొదలైనవి. 

కాల క్రమంలో వీరి కళకు ఆదరణ తగ్గి అంతరించి పోయే దశలో మిగిలిన ఆ కళాకారులు లేదా వారి వంశం వారు బ్రతుకు తెరువుకు వేరు మార్గము చేత గాక..... తమ వృత్తికి ఆధణ లేక, వారే తమ కళను పల్లెల్లో ఇళ్లముందు ప్రదర్శించి యాచించి తమ జీవనమును జరుపుకుంటున్నారు. 

బుర్ర కథలోని మాధుర్యాన్ని రుచి యేరిగిన పల్లె పద్దలు.... 

ఆ కళాకారుల చేత మరికొంత సేపు బుర్ర కథను చెప్పించుకొని ఎక్కువ సంభావన ఇస్తున్నారు.

 ఆ తరం మారితే వారికి అంత మాత్రము కూడా ఆదరణ కూడా దొరకదనిపిస్తుంది.

కొన్ని జాతుల వారు కేవలము యాచనే వృత్తిగా స్వీకరించి అదే ఆధారంగా జీవించె వారున్నారు. 

ఇలాంటి వారిలో ఆ కుటుంబంలో అందరు ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తుంటారు. 

ఇటువంటి వారిలో కొందరు స్త్రీలు రామారి పాటలు పాడి యాచిస్తుంటారు. 

వారు ఎటువంటి ఆగడాలు చేయరు. 

గృహస్తు రాలు వారికి ఎంతో కొంత బిచ్చం వేసి పంపు తుంది. ఇంకొంత మంది వుంటారు..... 

వారు.. దొమ్మరి వారు వీధిలో గారిడి విద్యలు ప్రదర్శించి ఇంటింకి వెళ్లి యాచిస్తుంటారు. 

ఈ దొమ్మరి వారు, సంచార జాతులు. 

వీరు పల్లెలకు దూరంగా డేరాలు వేసుకొని తాత్కాలికంగా నివాసం వుంటారు. 

వీరు రెండు కర్రల మధ్య ఒక దారం కట్టి చిన్న పిల్లల చేత దాని మీద నడిపించడం, వారి చేతనే వింతైన కుప్పి గంతులు వేయించడం, ఇలా కొన్ని ప్రదర్శనలిచ్చి ఇటింటికి వెళ్లి యాచించడం వారి ప్రధాన వృత్తి. 

వీరి ఉప వృత్తి ''వ్వబిచారం'' వీరి నుండి పుట్టినదే ఈ సామెత '' చెప్పేవి సారంగ నీతులు.,.. దూరేది దొమ్మరి గుడిసెలు''. 

ప్రస్తుతం వీరి సంఖ్య పల్లెల్లో చాల వరకు తగ్గినా పూర్తిగా మాసి పోలేదు. 

ప్రస్తుతం వీరి సంఖ్య పల్లెల్లో కన్నా జన సంఖ్య ఎక్కువగా వున్న వారంతపు సంతలలో ఎక్కువ. 

ఆ తర్వాత చెప్పుకో దగ్గ యాచకులు.



19. పాముల వాళ్ళు :

వీరు రైతు ఇంటి ముందు.... తమ బుట్టలో వున్న పాములను బయటకు తీసి పాముల బుర్ర వూదుతూ నాగు పాములను ఆడిస్తుంటారు. 

ఈలాంటి వారికి బిచ్చం తప్పని సరిగా వుంటుంది. 

ఈ పాముల వాళ్ళు... చెవిలో చీము కారుతున్న చిన్న పిల్లలకు పాము తోకను చెవిలో తిప్పితే చీము కారడం పోతుందని చెప్పి అలా చేసి కొంత ధాన్యాన్ని ఫలితంగా పొందు తారు. 

ఇంకా కొంత మంది ఎలాంటి విద్యలు ప్రదర్సించ కుండా కేవళం తమ కష్టాలను చెప్పుకొని యాచించె వారు కొందరుంటారు. 

అలాంటి వారికి తప్పని సరిగా బిచ్చం లభిస్తుంది.

 ఇలా రైతుల మీద ఆధార పడిన యాచకుల సంఖ్య చాల ఎక్కువే. 

ఆ రోజుల్లో రైతులు సుభిక్షంగా వున్నందున ఇలాంటి వారి జీవనానికి డోకా వుండేది కాదు. 

ఆ రోజుల్లో యాచకులు ఎవరైనా ఇంటి ముంకు వస్తే ఎంతో కొంత బిచ్చం లభించేది. 

ఇది యాచకుల వృత్తి నైపుణ్యం కాదు. 

రైతుల, రైతు మహిళలు ఔదార్యమే ముఖ్య కారణం. 

ప్రస్తుతం ఇలాంటి వారి సంఖ్య పల్లెల్లో చాల వరకు తగ్గింది. 

రైతులే దీనావస్థలో వుంటే వీరి సంగతి పట్టించుకునే వారెవరు? 

ఇలాంటి వారు రైతుల పరిస్థితి గ్రహించి నగరాల పై బడ్డారు. 

గతంలో ఇలాంటి వారి ఆటలు పట్టణాలలో కొంత కాలం సాగింది. 

ప్పుడు పట్టణాలలో కూడా వీరిని ఆదరించే వారె కరువయ్యారు. 

పట్టణాలలో యాచలకు అన్నం పెడితే తీసుకోరు. 

వారికి డబ్బులు మాత్రమే కావాలి. 

చాలమందికి ఇది వృత్తి మారింది. 

ఈ యాచకులకు ఒక వ్వవస్త ఉంది. 

వీరి వెనుక కొంత మంది వుండి వారిని ప్రతి నిత్యం రద్దీగా వుండే స్థలానికి చేర్చి.... సాయంకాలం తిరిగి తీసుకెళ్లుతారు. 

వారి అన్న వస్త్రాలు ఆ నాయకులే చూసు కుంటారు. 

ప్రతిఫలంగా వారు యాచనలో సంపాదించిన దానిలో కొంత తీసుకొని మిగతా వారికి ఇస్తారు. 

ఈ వ్యవహారము పెద్ద పెద్ద పట్టణాలలోనె జరుగు తుంది. 

ఈ వ్వవస్థను ప్రభుత్వం ఏనాడో నిషేధించి యాచకులకు పునరావాసము కల్పించినా వారు అక్కడ వుండక నాయకుల అండలోనే జీవనం సాగిస్తున్నారు.



20. బుడ బుక్కల వారు :

బుడబుక్క కళాకారుల వృత్తి భిక్షాటనమే అయినా వారి పట్ల జానపదుల్లో గౌరవాదరాలుండేవి. 

వారు గ్రామాల్లో పదాలు చెప్పుకొంటూ సంచరిస్తే తమకు శుభం జరుగుతుందని ఆనాటి గ్రామస్తుల నమ్మకం. 

అందుకే వాళ్ళను కసురుకోకుండా దానధర్మాలు చేసేవారు. 

బుడబుక్కల వారు గ్రామంలో తెల్లవారు జాము నుంచి ప్రతి ఇంటి దగ్గర ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు’, అని పాడుతూ ‘డబుక్‌డక్‌’ అని డమరుకం వాయించుకొంటూ ‘నీ కుటుంబం సల్లంగుండ ఒక పాతగుడ్డ పారెయ్యర సామి!’ అని అడుగుతూ ధన ధాన్యాలతో పాటు పాత బట్టలు అడుక్కొని వెళ్ళేవారు.



21. వీది గారడీవారు :

వీరు ఎక్కువగా దొమ్మరి వారై వుంటారు. 

వీరు కుటుంబంతో సహా పల్లెల్లో తిరుగుతు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. 

వీరు చేసె విన్యాసాలలో ముఖ్యంగ చెప్పుకో దగ్గవి..... అటు ఇటు కర్రలు పాతి వాటిమధ్యన ఒక దారాన్ని కట్టి ఆ దారంపై చిన పిల్లలను నడిపించడము., 

ఒకడు తన నడుంకు కట్టుకున్న గుడ్డ ఆధారంగా పొడవాటి కర్రను ఆనించి దానిపై చిన పిల్లలను ఎకించి విన్యాసాలు చేయించడము., 

ఇనుప రింగులలో తలను కాళ్ళను ఒకేసారి దూర్చి బయటకు రావడము, పిల్లలుచే శారీరిక విన్యాసాలు చేయించడము ఇలా అనేక విన్యాసాలు చేసి చివరకు ప్రదర్శన మధ్యలో గుడ్డ పరిచి, లేదా ప్రేక్షకుల వద్దకు వెళ్ళి యాచిస్తుంటారు. 

ఇలాంటివి ఎక్కువగా సంతలు, జాతరలు, ఇతర వుత్సవాలు జరిగే చోట ప్రదర్శిస్తుంటారు.



22. బుర్రకథ కళాకారులు :

బుర్రకథ  పల్లెపదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకొంటూ సరదా సరదాగా సాగిపోయే ఒక జానపద కళారూపం. 

పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జన సామాన్యానికి చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవది. 

హరికథలో కొంత సంప్రదాయముద్ర ఉండి బుర్రకథ పూర్తిగా జానపద కళారూపం.

తెలుగునాట జానపద వినోదగాన ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్ర కథ.

 కథకుని చేతిలో (ఫక్) బుర్ర ఆకారంలో ఉన్న వాయిద్యం వల్ల దీనికి బుర్రకథ అనే పేరు వచ్చినది. 

యక్షగాన పుత్రికలయిన జంగం కథ, శారద కథలకు రూపాంతరమే బుర్రకథ. 

అది సంగీతం, నృత్యం, నాటకం. 

ఈ మూడింటి మేలుకలయిక. బుర్రకథలో నవరసాలూ పలుకుతాయి. 

ముఖ్యంగా వీర, కరుణరసాలను బాగా ఒప్పించే ప్రక్రియ ఇది. 

ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీర గాథలు, త్యాగమూర్తుల కథలు బుర్ర కథల ఇతివృత్తాలుగా బాగా పేరు కొన్నాయి.

ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తోంది. 

కుటంబ నియంత్రణ, రాజకీయ ప్రచారము, ప్రజలను విజ్ఙానవంతులను చేయడము వంటి కార్యక్రమాలలో ఇది బాగా వాడబడింది.

1.     జంగంకథ

2.     పంబలకథ

3.     జముకులకథ

4.     పిచ్చుకుంట్ల కథ

తరువాతవచ్చింది. డాలు, కత్తి తో పాడే ప్రధాన కథకుడికి పిచ్చిగుంట్ల కథలో ఇద్దరు వంతలున్నట్లే బుర్రకథలోకూడా ఉంటారు. 

ఈ విధంగా బుర్రకథ కళాకారుల జీవన విధానం ఉంటుంది.




- స్వస్తీ...


ఇలాంటి అద్భుతమైన విషయాలను ప్రతీ రోజూ నేరుగా మీ వాట్సాప్ లో పొందడానికి ఇక్కడ నొక్కి మీ వివరాలను పంపండీ... 

మరియు 8096339900 ని మీ ఫోన్ లో భద్రపరచుకోండి...





.