ఆనాటి వాణిజ్య ప్రకటనలు తెలుగులో వచ్చినవి వెలుగులోకి తెస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచనకు కార్యరూపమే ఇది. 
కారణాలు అనేకం కావచ్చు ఈ రోజుల్లో తెలుగు సంచికలలో ప్రకటనలు ఆంగ్లంలో వస్తున్నాయి. 
ఈ మధ్యవరకూ దుకాణాల పేర్లు చక్కటి తెలుగులో ఉండేవి, 
ఇప్పుడు తాటి కాయంత ఆంగ్లాక్షరాలతో రాస్తూ ఓ మూలగా తప్పదన్నట్లుగా ఆవగింజంత ఆంధ్రాక్షరాలతో రాస్తునారూ.
అదిగూడా ఉచ్ఛారణా దోషాలతో. ఈ కింది ప్రకటనలలోనివి కొన్ని ఎనభైఏళ్ల కిందటివి. 
ఆ ప్రకటనలలోని వస్తువులను కొన్నిటిని ఈనాటికి మనం వాడుతున్నాము. 
వీటిని పోస్ట్ చెయ్యటంలో ఉద్దేశం ఆనాడు ప్రకటనలు ఎలా ఉండేవి, 
అందునా తెలుగులో ఎలా ప్రకటించేవారు, 
వాటి భాషా సౌందర్యము, 
తీరుతెన్నులు, 
ఆనాటి వస్తువుల ధరలు,
ఇతరత్రా వివరాలు తెలుసుకోటానికి తప్ప 
వాటిని మీరు కొనాలనీ కాదు, 
కొంటారనీ కాదు. 
“సినీతారల సౌందర్య రహస్యం” ఏమిటంటే తడుముకోకుండా “లక్స్” అంటాము. 
మరి అరుదైన ఆ ప్రకటనలు కొన్ని చూడవచ్చు. 
అమృతాంజనానికి శ్రీ గరిమెళ్ళ సత్యన్నారాయణ గారు ఆంగ్లంలో రాసిన పద్యాలు చూడవచ్చు.
అలాగే
వెండితెర మీద తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పాటుచేసుకున్న జ్యోతిలక్ష్మి గారు ఒక హేర్ ఆయిల్ కోసం ఇచ్చిన ఒక అరుదైన ప్రకటన చూడండి..
ఇలాంటి 100 కు పైగా అరుదైన ప్రకటనలను మీ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగినది.
ఇంకెందుకు ఆలస్యం వీక్షించండి...
 































































































