చెప్పులు ఇంటి బయటే వదిలేయడానికి కారణం క్రిములు.
బయటకు వెళ్ళొస్తే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కారణం క్రిములు.
మంగళి దగ్గరకు., చావుకు వెళ్ళొస్తే ఏదీ తాకకుండా స్నానం చేశాకే ఇంట్లో కి వస్తాం. కారణం క్రిములు.
బాత్రూమ్ లు., లెట్రిన్ లు ఇంట్లో కాకుండా ఆరుబయట ఉండేవి. కారణం క్రిములు.
పుడితే "పురుడు"., చస్తే "మైలు" అని అందరికీ దూరంగా ఉండటానికి కారణం క్రిములు.
చనిపోయిన వారింట్లో వంట చేయరు. కారణం క్రిములు.
వంటా వార్పులు చేయడానికి ముందు మహిళలు స్నానం చేస్తేనే అనుమతిచ్చేవారు. కారణం క్రిములు.
స్నానం చేయకుండా వండితే క్రిములు చేరతాయని.
వండిన వెంటనే వేడివేడిగా తినుమని చెప్పేవారు. కారణం చల్లారిన పదార్థాలపైన క్రిములు ఉంటాయని.
మట్టి., ఇత్తడి., రాగి పాత్రలు ఉపయోగించడం., మరే ఇతర పాత్రలు వాడకపోవడానికి కారణం క్రిములు.
క్రిములు. క్రిములు.. క్రిములు...
అర్థమైందా? ఇప్పుడు.
మన పెద్దలు ఎలాంటి వారో ?
వాళ్ళకు సదువు రాకపోవచ్చు. కానీ శాస్త్రజ్ఞులు.
వాళ్ళు చెప్పింది చాదస్తం కాదు. శాస్త్రం.
అర్థం కాలేదా? అదే సైన్స్.
పెద్దల మాట సద్ది మూట...
ఆచరిస్తావా ? ఆరోగ్యం నీదే...
ధిక్కరిస్తావా ? అనుభవిస్తావ్...