అబ్బా ఎండాకాలం ఈలాంటి ఇంట్లో  ఉంటే ..ఆహ..
ఇప్పుడు పాత ఇల్లు లు ఇప్పేసి అందరూ డాబాలు  అపార్ట్మెంట్ లు..

కానీ పాతరోజులు గుర్తు వస్తే .ఆనందం వేరు..
ఆ తలుపులు తీయాలన్నా..వేయాలన్నా బలే సరదా..ఇనుప గెడలు..బలే ఉండేవి..

తాతయ్య పడక కుర్చీ...చుట్టవాసన.😄
అరుగులమీద ..అష్టాచెమ్మా..
నేలాబండా..ఆటలు...
నాలుగు.. స్తంభాలాట..

దాగుడుమూతలు...మండువాలో.😍
కిందపడిన మామిడాకులు పెట్టడానికి..నానాఅవస్తలు😃😃

ఇలోగా..ఆకలి వేస్తే కొత్త ఆవకాయ వెన్నపూస..😋😋
మామిడిపళ్ళు...పనసపళ్ళు..
పైన వేలాడదీసిన..అరటి గెల
తొక్కలన్నీ గెలకి...పళ్ళన్నీ మా బొజ్జలో..😆

మధ్య లో పుల్ల ఐసు..తిన్నాకా..నాలికలు చూసుకోవడం..ఫింక్ ఆరెంజ్ కలర్ ..చూసుకుని మురిసిపోవడం..

పాత ఫ్యాన్లు వాటి సవుండ్ లు..
సాయంత్రం వాకిట్లో మంచాలు...చుక్కలు లెక్క పెట్టడం...

చందమామతో కబుర్లు... నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది చందమామ అంటూ మురిసిపోవడం..

వెన్నేల బంతి ఆటలు...ఆహ...
చివరగా...పెద్ద గిన్నేలో నీళ్ళు అందులో వేసిన మామిడి  పళ్లు తినేసి బజ్జోవడం

ఎంతైనా ఆ రోజులు రావు మళ్ళీ తిరిగి రావు కదా ...!



ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలను నేరుగా రాంకర్రి జ్ఞాన కేంద్ర యాప్ ద్వారా మీ ఫోన్ లో వీక్షించండి...




- స్వస్తీ...