ధ్యానం అందరికీ అవసరం

 
🔸ధ్యానం చేయాలంటే సర్వసంగ పరిత్యాగం చేయాలన్నది అపోహ. 

సాధారణ జీవితాన్ని గడుపుతూనే ధ్యాన సాధన చేయ వచ్చు.


🔸నాకు ధ్యానం చేయవలసిన అవశ్యకతలేదు అన్నది అపోహ. 

ప్రతి ఒక్కరికి ఇది అత్యంత ఆవశ్యకం.

ధ్యానం ఆత్మకు ఆహారం.


🔸“ధ్యానం అన్నది ప్రతి ఒక్కరికీ అవసరం! డాక్టర్లకూ, ఉద్యోగస్థులకూ, వ్యాపార వేత్తలకూ, గృహిణులకూ, విద్యార్థులకూ మరి యువతకూ.. 

ఇలా సమాజంలో ప్రతి ఒక్కరికీ ధ్యానం ఎంతో, ఎంతెంతో అవసరం.


🔸‘నేను మనిషిని’ అనుకున్న ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తమ జీవితంలో భాగం చేసుకుని తీరాలి.


🔸“ఒక వైపు ధ్యానం చేస్తూ .. చక్కటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటూ .. 

ఇంకోవైపు హాయిగా సంసారాన్ని కూడా నిర్వహించుకోవాలి.

సంసారంలోనే నిర్వాణం చెందుతూ వైభోగంగా జీవించాలి!


🔸ఒకవైపు సంగీతాన్ని ఆస్వాదిస్తూ మరి ప్రకృతి అందాలకు... పరవశించిపోతూ.. ఇంకోవైపు హాయిగా ఉద్యోగ విధులు నిర్వహించుకోవాలి. 


🔸ధ్యానానికి కఠినమైన క్రమ శిక్షణ అవసరం అన్నది అపోహ.  

ధ్యానం తీవ్రమైన, కఠినమైన, కష్టతరమైన, క్రమశిక్షణా వ్యవహారం కాదు. 

నిజాయితీతో కూడిన ఆచరణ ఉంటే చాలు. 


🔸ధ్యానం అంతః కరణ శుద్ధికి అత్యుత్తమ సాధనం.  

రోజూ కొద్దిసేపు ధ్యానం...

ఒత్తిడి లేని  మెరుగైన జీవనానికి సోపానం...