తిరుమల చేరుకోవడానికి ఎన్ని నడకదారులు ఉండేవో తెలుసా ?
కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం మనం చాలా సౌకర్యవంతంగా వెళ్ళ గలుగుతున్నాము.
ఎటువంటి సౌకర్యాలు లేని కాలంలో భక్తులు ఎలా వచ్చేవాళ్లు ?
తిరుమల చేరుకోవడానికి ఎన్ని మార్గాలు ఉండేవి ?
సాధారణంగా మనకు తెలిసినంత వరకు అలిపిరి మెట్ల మార్గం ఒకటి శ్రీవారి మెట్టు మార్గం.
ఈ రెండు మాత్రమే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి.
ఇవి కాకుండా తిరుమల చేరుకోవడానికి రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి.
అప్పుడప్పుడు కడప జిల్లా వాసులు గుంపులు గుంపులుగా మామండూరు ప్రాంతం నుంచి నడక మార్గం తిరుమలకు చేరుకుంటూ ఉంటారు.
అసలు తిరుమలకు ఎన్ని మార్గాలు ఉండేవి ఆ మార్గాలేవి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
శ్రీవారి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి.
1. అలిపిరి
అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటానికి గంటన్న సమయం పడుతుంది.
దూరం 11- 12 కి.మీ. లు ఉంటుంది.
ప్రస్తుతం పెద్ద ఎత్తున జనం వినియోగిస్తున్న దారి ఇదే.
2. రెండవ దారి
తిరుపతి కి 10 కి.మీ ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది.
అక్కడికి 5 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది.
ఈ దారి గుండా మూడు కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు.
పట్టే సమయం గంట.
చంద్రగిరి కోట నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చింది.
చంద్రగిరికి 8 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది.
చంద్రగిరి రాజులు ఈ దారి గుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవారు.
నేటికీ అందుబాటులో ఉంది.
శ్రీకృష్ణదేవరాయలు ఇదే మార్గం మార్గం గుండా ప్రయాణం చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అని చరిత్ర చెబుతోంది.
3. మూడవ దారి
మూడవ దారి మామండూరు.
ఇది తిరుమల కొండకు ఈశాన్యాన కలదు.
కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుండి వచ్చే భక్తులు ఈ దారి గుండా శ్రీవారి ఆలయం చేరుకుంటారు.
ఇప్పటికీ అప్పుడప్పుడు రాజంపేట ప్రాంతవాసులు ఈ దారిలో తిరుమల చేరుకుంటారు.
4. నాల్గవ దారి
తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాం …
దానికి ఆనుకొని శ్యామలకోన అనే దారి ఉంది.
రంగంపేట, భీమవరం వచ్చే భక్తులు ఈ దారిగుండా వెళుతారు.
5. ఐదవ దారి
డ్యాం వద్ద నుండి దారి గుండా 3 కిలోమీటర్లు ముందుకు వెళితే ఒక మలుపు వస్తుంది.
అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది.
డ్యాం నుండి తిరుమల మధ్య దూరం : 15కి.మీ.
6. ఆరవ దారి
తిరుపతి నుంచి కడప జిల్లా వెళ్లే మార్గంలో వద్ద కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది.
అక్కడి నుండి తుంబురుతీర్థం మీదుగా పాపవినాశనం, తిరుమల చేరుకోవచ్చు.
తుంబురుతీర్థం, పాపవినాశనం మధ్య దూరం 12 కి.మీ.
7. ఏడవ దారి
అవ్వాచారి కొండ/ అవ్వాచారికోన దారి గుండా వెళితే కూడా తిరుమల కొండ చేరుకోవచ్చు.
రేణిగుంట సమీపంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉన్నది.
ఇక్కడి నుండి లోయలో ఉన్న అవ్వాచారికోన దారి గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది.
అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.
8. ఏనుగుల దారి
ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి.
పూర్వం చంద్రగిరి శ్రీవారి మెట్టు నుండి అవ్వాచారికోన వరకు దారి ఉండేది.
తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గానే చేరవేసేవారు.
9. తలకోన
తలకోన నుండి కూడా తిరుమలకు దారి కలదు.
జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండాపేటు దారిలోకి వస్తే, మీరు తిరుమలకు చేరుకున్నట్లే.
నడక మార్గం 20 కిలోమీటర్లు.
మీరు తిలకించండి...
మీ మిత్రులకు పంపండి...
- రాంకర్రి
8096339900
స్వస్తీ...