🌴  వృక్షాలు పెంచితే అవి మనకు ఊపిరి పోసి  పర్యావరణం కలుషితం కాకుండా చేస్తాయని తెలిసినా మనం చెట్లు నాటము కాబట్టి మన అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు..


🌳  గొడ్డలి కి కర్రను ఇస్తూ తెగ అనందపడిపోతాయి వృక్షాలు  పాపం ఆ గొడ్డలితో  నే మనం వాటి ఊపిరి తీసేస్తామని తెలియక.,
అంత గొప్ప పని చేస్తాం కాబట్టి మన అందరికీ  పర్యావరణ దినోత్సవశుభాకాంక్షలు.


🍶  ప్లాస్టిక్ వాడితే పర్యావరణం పాడవుతుంది అని మనకు తెలుసు కానీ పట్టించుకోము కాబట్టి మన అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.


📱 చరవా ణి  ఎక్కువ వాడితే ఆ  రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతే రాబోయే తరాల వారు పిచ్చుక  🐦 అంటే ఏంటి  అని అడిగితే ఆ చరవాణి లోనే ఫోటో చూపించే పరిస్థితి వస్తుందని తెలిసినా పట్టించుకోం కాబట్టి మన అందరికీ పర్యావరణ దినోత్సవశుభాకాంక్షలు.


🐘  ఆకలితో మనుషుల దగ్గరకి వచ్చిన ఒక జంతువు ప్రాణాన్ని కనికరం లేకుండా చంపినప్పుడు ఆ అడవిలోని క్రూర మృగాలు మనకంటే మనుషులే ప్రమాదకరం అని భయపడుతూ వుంటే  గొప్ప పని చేశాం అని సంబరిపడిపోతున్న మానవత్వం లేని  కొందరి మొఖాలు  మధ్య జీవిస్తున్నాం కాబట్టి మనఅందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.


🥛 ఉచితంగా స్వచ్ఛమైన నీరు తాగడం నుంచి కలుషితమైన అనారోగ్యకరమైన నీటిని డబ్బులిచ్చి కొనుక్కొని మరి తాగుతున్నాo కాబట్టి మన అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.


🛵 వాహనాలు ఎక్కువ నడవడం వల్ల గాలి కలుషితం అవుతుందని తెలుసు కానీ  ఊరి పొలిమేర నుండి ఇంటి దగ్గరకి వెళ్ళడానికి కూడా వాహనాలు వాడెంత భద్దకంగా తయారయ్యాం కాబట్టి మన అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు..


🦋 ప్రకృతి అనేది మనకు ఒకటే కాదు ఈ అనంతమైన విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణికి  దేవుడు ఇచ్చిన వరం అలా అని  ప్రకృతిని పాడు చేసే అధికారం మనకు లేదు...


 ప్రతి ఒక్క ప్రాణి దేవుడు ఇచ్చిన వరాన్ని సక్రమంగా వాడుతున్నాయి ఒక్క మనిషి తప్ప., 

కాబట్టి మన
 👨‍👩‍👧‍👦మనుషులు అందరికీ మరోసారి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.🙏