🚩 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్  గురించి తెలుసుకుందాం 🚩
👉 RSS అంటే ఇదేదో బీజేపీ పార్టీకి సంబంధించినది అనే  కోణంలో ( అపోహ లో ) చూడకుండా.....
ఇది మానవ విలువలు, హిందుత్వ ( భారతీయ ) విలువలు, సంస్కారం మరియు దేశభక్తిని నేర్పే  ఒక అద్భుతమైన శాఖ.
ఇవన్నీ ఉచితంగానే నేర్పిస్తారు. 
కాబట్టి RSS గురుంచి తెలుసుకోవాలనుకునే వారి కోసం ఈ కథనం.
👉 శాఖాపరిచయం :
⛳ అనేది కేవలం గంట కార్యక్రమం.
⛳ కేవలం ఈ గంటలోనే ఒక మనిషి పరిపూర్ణత  సాధించడానికి అవసరమైన సుగుణాలు& సుసంస్కారాలు క్రింది పద్దతిలో అందించబడుతుంది 
👉 1. శారీరక కార్యక్రమాలు :
దండ (కర్ర సాము), 
నియుద్ధ (కరాటే), 
యోగ, 
ఆటలు, 
సమత (పరేడ్)
👉 2. బౌద్ధిక ( Intellectual )  కార్యక్రమాలు :
నీతి కథలు సుభాషితాలు, 
పద్యాలు, 
వార్త సమాచారం, 
సద్గ్రంథ పఠనం,
 బృంద చర్చలు, 
దేశభక్తి గీతాలు మొదలైనవి
అదే విధంగా,
👉 3. కళాత్మక కార్యక్రమాలు :
సంగీత పరికరాలను శాస్త్రీయంగా స్వరాలతో వాయించడం నేర్పుగా మాట్లాడడం ఓర్పుతో వ్యవహరించడం.
👉  4. సామాజిక కార్యక్రమాలు :
సామాజిక సేవా కార్యక్రమాలు విద్య ( బాలసంస్కార, సంచి గ్రంథాలయం, ఉచిత బోధన తరగతులు) 
ఆరోగ్యం ( మందు బిళ్ళల సేకరణ ఉచిత యోగా శిక్షణ ఉచిత వైద్య శిబిరాలు, )
సామాజిక ( భజన, కిషోరివికాస్, మాతృ మండలి )
స్వావలంబన ( ఉచిత కంప్యూటర్ శిక్షణ, కుట్లు అల్లికల కేంద్రాలు )
👉 5. ఆధ్యాత్మిక కార్యక్రమాలు :
నిత్య ప్రార్ధనా, 
ధ్యాన శ్లోకాలు,
 ఆధ్యాత్మిక చింతన,
 బోధనలు...
ఇలాంటివి ఎన్నో అంశాల పట్ల శాఖలో స్వయం సేవకులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
👉 సంఘ శాఖను దూరం నుంచి చూసేవారికి ఇది కేవలం ఏదో కొంత మంది సమూహం ఉదయం చేసుకునే వ్యాయామం లాంటి కేంద్రం అని అనుకుంటారు కానీ ఇది ఒక అపోహ మాత్రమే.
👉 శాఖ లో ఎవరైనా రావచ్చు అన్ని వయసుల వారికి ఇందులో ప్రవేశం ఉంటుంది.
👉 రోజూ శాఖకు రమ్మంటూనే సమయానికి రమ్మంటారు సమయపాలన నేర్పుతారు.
👉 సంఘ శాఖలలో పిల్లల నుండి పెద్దవారి వరకు అందరినీ చేర్చుకుంటారు.
👉 రోజూ నిశ్చిత సమయంలో..... విలువలతో కూడిన శిక్షణ కోసం శాఖకు రమ్మంటారు.
రోజూ పని అలవాటు అవుతుంది. 
👉 సంఘస్థాన్ చివరలో చెప్పులు వరుసలో వదులుతారు.
👉 సంఘం లో గురువు - భగవాధ్వజానికి నమస్కారం చేయించి, శాఖలోకి అనుమతిస్తారు.
మనలోని అహంకారం నుండి వయంకారం నకు ఇది గొప్ప మార్గం.
👉 గంట శిక్షణలో.... 40 నిమిషాలు శరీరం పులిసేట్టు వ్యాయామం & ఆటలు ఆడుతాడు. 
👉ఈ ఆటలు ఆడడం వలన  
సమయపాలన
క్రమశిక్షణ,
జట్టు భావన ,
పరస్ఫర సహకార భావన 
ఇలాంటివి మనలో పెరుగుతాయి.
👉 మండలలో ( round ) నేల పై కూర్చో పెట్టి మంచి దేశభక్తి గీతం నేర్పిస్తారు. 
సంస్కృత సుభాషితం వల్లె వేయిస్తారు.
పెద్దల సూక్తి పలికిస్తారు. 
అర్థం చెబుతారు.
పాటలు, సుభాషితం, సూక్తి కంఠస్తం రాగయుక్తంగా రావాలి. 
జీవితం అంతా ఉపయోగపడాలి. 
మనం చక్కగా అర్థవంతంగా నేర్చుకొని ఇతరులకు నేర్పగలిగే స్థాయి రావాలి.
👉  ఈ విధంగా నెలలో ఒక రోజు దేశభక్తుని జీవిత కథ,
 ఒక ముఖ్య అంశంపై చర్చ, 
ఓ విషయంపై పెద్దల ఉపన్యాసం,
ఒక వార్త విశ్లేషణ ఉంటుంది 
మనకు తెలియకుండానే అనియతంగా మనకు బౌద్దిక శిక్షణ(intellectuality) పెరుగుతుంది.
👉 శాఖ చివర్లో గురువు భగవాధ్వజం ముందు వరుసల్లో నిలబడి హృదయం వద్ద చేతినుంచి దేశమంతా గొప్పగా ఉండాలని సంస్కృత భాషలో ప్రార్థన, 
మరియు 
భారత మాతాకీ జయ్! 
అంటూ భారతమాతకు జయము కలగాలని చెప్తారు.
ఈ విధంగా మనం అనుకునే
All round personality development నకు సంబంధించిన 
Physical (శారీరక),
Intellectual (బౌద్ధిక),
Spiritual (ఆధ్యాత్మిక),
Artistic (కళాత్మక),
Social (సాంఘిక) నైపుణ్యాలు
 శాఖ ద్వారా వారికి తెలియకుండానే ఎవరో నేర్పుతున్నారు అనే భావనతో కాకుండా తమకు తాముగా నేర్చుకుంటారు.
స్వయమేవ మృగేంద్రత
👆 పై వాక్యమును ప్రాచీన గ్రంథాలలో పేర్కొనబడింది.
మృగరాజు అని సింహాన్ని ఎందుకు పిలుస్తారు అంటే దానిలో పౌరుషం, స్వాభిమానం, పోరాటం పుట్టుకతో ఉంటుంది. 
ఈ లక్షణాలు లేని కారణంగానే ఇన్ని రోజులు మన దేశం బానిసత్వం లోకి వెళ్ళింది.
ఈ రుగ్మతలు అన్నిటికీ పరిష్కారం శాఖ...,
ఈ విధంగా భారత దేశం లో వ్యక్తిగత, 
సామాజిక విలువల నిర్మాణం కోసం నిరంతర పరిశ్రమ జరుపుతున్న అతి పెద్ద సంస్థలు 
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్& రాష్ట్ర సేవిక సమితి (మహిళల కోసం).
⛳ RSS అంటే...
దేశభక్తితో రగిలిపోయే నిజాయితీగల భారతీయుల, హిందువుల హోమగుండం!అక్కడ ప్రతీ స్వయం సేవకుడూ మాతృభూమి మీద ప్రేమనే ఆజ్యంతో భగ్గున పైకి లేచే మహోజ్వల జ్వాలే!
అందుకు, ఉదాహరణే… 
ఈ కింది ఆరెస్సెస్ అధి నాయకుల పేర్లు, వారి విద్యార్హతలు! 
ఆ విద్యార్హతలు వున్న వారు వేరే ఎవరైనా అయితే… 
హాయిగా నాలుగు రాళ్లు వెనకేసుకుని కంచం నిండా తిని, 
మంచం నిండా నిద్రపోతారు! 
కాని, ఆరెస్సెస్ రథ సారథులు జాతిని ముందుకు నడిపారు! 
అందు కోసం తమకు తాముగా దేశ మాత చరణాల ముందు తమ సర్వస్వాన్ని అర్పించుకున్నారు.
1. డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవర్ – RSS వ్యవస్థాపకులు – 1914 బ్యాచ్ ఎంబీబీఎస్ డాక్టర్!
2. ఎం.ఎస్. గోల్వాల్కర్ – ఎంఎస్సీ ( జువాలజీ ) గొల్డ్ మెడలిస్ట్! ( బనారస్ హిందూ విశ్వవిద్యాలయం )
3. బాలా సాహెబ్ దేవరస్   - బీఏ, ఎల్ ఎల్ బీ ( 1935 – నాగ్ పూర్ యూనివర్సిటీ )
4.  ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్  - ఎంఎస్సీ ( ఫిజిక్స్ ) గోల్డ్ మెడలిస్ట్ ( అలహాబాద్ యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ హెడ్! )
5. కే ఎస్ సుదర్శన్ – బీటెక్ ( టెలికమ్యూనికేషన్స్ ) గోల్డ్ మెడలిస్ట్!
6.  ప్రస్తుత సర్ సంఘ్ చాలక్ : డాక్టర్. మోహన్ భాగవత్  - వెటర్నరీ సర్జన్ ( నాగ్ పూర్ యూనివర్సిటీ )
 ⛳ భారత్ మాతాకీ జై
- రామ్ కర్రి
8096339900
- స్వస్తీ...
__ ____ ____ ___ __ ___ ___ ___ ___ ___ __ __ ___ ___
ఓం
మీ యొక్క విరాళం ధర్మ కార్యానికి శ్రీకారంమీ యొక్క అమూల్యమైన విరాళాలను Google Pay, Phone Pay, Amazon, Paytm ద్వారా 8096339900 కి పంపించండీ.
 మీ యొక్క అమూల్య మైన విరాళాన్ని అందించడం ద్వారా ఈ ధర్మ కార్యం మధ్యలో ఆగకుండా చూడండీ...
విరాళం అందించాలనే సమయంలో ఏవయినా సమస్యలు తలెత్తితే ఈ నెంబర్ 8096339900 పైన నొక్కి వాట్సాప్ కి సందేశం పంపండీ...
__ ____ ____ ___ __ ___ ___ ___ ___ ___ __ __ ___ ___ 
 
