తెలుగు 💁🏻♀️ కోడలా మజాకా
🧓🏻 అత్త : ఇదిగో కోడలు పిల్లా! ఓ సారిలా రా!
💁🏻♀️ కోడలు: వస్తున్నా నత్తయ్యా!
🧓🏻 అత్త : అత్తయ్యా అని అనలేవూ? నత్తయ్యా, గిత్తయ్యా అని అనకపోతే
💁🏻♀️ కోడలు : నేను నత్తయ్యా అన్నానా? మడిగట్టుకుని గూడ వున్నారు, అబద్ధమాడ కత్తయ్యా! మైల పడిపోతారు.
🧓🏻 అత్త: ఇప్పుడే మన్నావ్! కత్తయ్యా అనలేదటే! పరమ సాత్వికురాలిని నన్నే కత్తయ్యా అంటావా!
💁🏻♀️ కోడలు: అయ్యో! నా ఖర్మకొద్దీ దొరికా రత్తయ్యా మీరు!
🧓🏻 అత్త: మళ్ళీ ఇంకో కొత్త కూత! ఇప్పుడు రత్తయ్యా అని అన్నావా లేదా?
💁🏻♀️ కోడలు: అయ్యో! నా రాత! అది సంధి.
మీరు తెలుగు సరిగ చదువుకోలేదత్తయ్యా!
🧓🏻 అత్త: మరో మాయదారి కూత. దత్తయ్యా అట! వాడెవడు? అయ్యో! అయ్యో! నేను నీలాగ చదువుకోలేదని నన్ను *నత్తయ్యా, కత్తయ్యా , రత్తయ్యా, దత్తయ్యా* అంటూ వెధవ పేర్లతో పిలుస్తావటే! అబ్బాయిని ఇంటికి రానీ! చెబుతా నీ సంగతి!!!
💁🏻♀️ కోడలు: అలా ఉడికి పోయి ఆయాసం తెచ్చు కోకండి. బిపి పెరుగుతుంది. మీరనుకున్న వన్నీ ‘ఉకారసంధి’ వలన ఏర్పడిన పదాలత్తయ్యా!
🧓🏻 అత్త : ఓరి దేవుడో! నన్ను మళ్ళీ లత్తయ్యంటోంది నాయనో!
💁🏻♀️ ఇదే తెలు'గత్తయ్యా' 🧓🏻
తేనెలొలుకు తెలుగుకు పూర్వ వైభవం తీసుకొద్దాం.
- స్వస్తీ...