మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా...
కుక్కగొడుగు మొక్కలా.. 
చెదలు పట్టేసిన చెక్కముక్కలా.. 
కుక్కపీకేసిన పిచ్చిమొక్కలా..  
బిక్కమొహం వేసుకుని 
వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ, డెక్కుతూ, 
చుక్కలు లెక్కపెడుతూ, 
ఇక్కడే ఈ ఉక్కలో గుక్కపెట్టి ఏడుస్తూ, 
ఈ చుక్కల చొక్కా వేసుకుని 
డొక్కు వెదవలా గోళ్ళు చెక్కుకుంటూ 
నక్కపనుగులా చక్కిలాలు తింటూ, 
అరటి తొక్కలా, 
ముంగిట్లో తుక్కులా, 
చిక్కుజుట్టు వేసుకుని 
ముక్కు పొడి పీలుస్తూ, 
కోపం కక్కుతూ, 
పెళ్లాన్ని రక్కుతూ, 
పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ 
రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కినక్కి 
ఈ చెక్కబల్లమీద బక్కచిక్కి 
ఇలా పడుకోకపోతే 
ఏ పక్కకో ఓ పక్కకు వెళ్ళి 
పిక్క బలం కొద్ది తిరిగి, 
నీడొక్క శుద్దితో వాళ్ళని ఢక్కాముక్కీలు తినిపించి 
నీ లక్కు పరీక్షించుకుని 
ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకొని, 
ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కు చెదరకుండా 
పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా 
తిక్క సన్నాసి..... 
☺️☺️☺️
శ్రీ జంధ్యాల వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని 
మననం చేసుకుంటూ...
- స్వస్తీ...
 
