పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అన్న సామెత విన్నార ఎప్పుడైనా...

అలా ఎందుకు అన్నారు అసలు... దాని వెనుక కధ ఏంటి ఈ రోజు చూద్దాం అండి

పులస చేప  -  మన గోదావరి జిల్లాలో మాత్రమే లభిస్తుందండి, 

దీని ఖరీదు కేజీ సుమారు 3 వేల నుండి 5 వేల వరకు ఉంటుందండి ఆయ్.. 

ఒక్కోసారి డిమాండ్ బట్టి 8 వేల రూపాయలు కూడా ఉంటాదండోయ్. 

దీనిని అమ్మెటప్పుడు పాట ( bidding ) వేస్తారండి 

ఒక్కొకరు ఒక్కో ధర పెట్టి పాడుకుంటారు. 

ఈ చేప గొప్పతనం ఏమిటంటే ఎక్కడో ఆస్ట్రేలియా లో పుట్టి, 

న్యూజిలాండ్ వస్తుందండి 

అక్కడ నుండి టాంజినీయా దేశం

 తర్వాత హిందూ మహా సముద్రంలో కలిసి అక్కడ నుండి బంగాళాఖాతం లోకి వస్తుంది. 

ఎప్పుడైతే ఎగువన వర్షాలకు గోదావరి లోకి ఎర్ర నీరు వస్తుందో 

ఆ శ్రేష్టమైన మంచి నీటిని త్రాగడానికి గోదావరి సముద్రం కలిసే అంతర్వేదిలో 

ఇవి ఎదురీది గోదావరిలోకి వస్తాయండి.

 ఏటి నేనెమన్నా ఎర్రోడిలా కనిపిస్తున్నాన ఆస్ట్రేలియా నుంచి వస్తాది అంటున్నావ్. 

ఇలా అనుకుంటారేమో అనుకోకండే అనుకుంటే మాత్రం ఎర్రోల్లే అండి...

ఆనట్టు ఈ పులసలు ఇక్కడ కొన్ని గుడ్లు కూడా పెడతాయండి

 ఆ తర్వాత మళ్ళీ సముద్రంలోకి అక్టోబర్ ఆ టైం లో వెళ్లిపోతాయండి

అలా గోదావరి లోకి ఎదురిదుతూ వచ్చి తిరిగి సముద్రంలో కలిసే మధ్యలో మన జాలర్లు వీటిని పట్టుకుంటారండి

ప్రవాహానికి ఎదురు ఈదుతుంది ఈ చేప .., 

మాములుగా అలా ఎదురు ఈదే చేపలు చాలా వరకు చచ్చిపోతాయండి 

కానీ దీనికి ముల్లులు ఎక్కువగా ఉండటం వలన అలా ఎదురు ఈదగలుగుతుంది. 

కాని ఒక్కసారి ఒలలో పడగానే చనిపోతుందండి ఆయ్. 

ఆనట్టు సముద్రంలో ఉన్నపుడు దీనిని #ఇలస అని అంటారండి. 

ఎప్పుడైతే గోదావరిలో కలుస్తుందో అప్పుడు దీనిని #పులస అంటారు. 

ఇలస గా ఉన్నప్పుడూ దీని ధర కేవలం 70 నుండి 120 రూపాయలు మాత్రమే ఉంటుందండి. 

పులస గా మారిన తర్వాత దీని రేటు అమాంతం పెరిగిపోతుంది. 

పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అని ఊరికే అనలేదు దీని రుచి అలాంటిదండి ఒక్కసారి పులస చేప కూర తింటే ఇంకా మిగతావి అన్నీ దీని ముందు తక్కువగానే అనిపిస్తాయి ( ధర గురించి కాదు - రుచి పరంగా )... 

ఎందుకు అంత స్పెషల్ అంటే మంచినీటి కోసం ఎదురీదే ప్రక్రియ వలన దీని రుచి మారిపోతుందండి.

అనట్టు ఒరిస్సా నుండి సేమ్ ఇలానే ఉండే చేపలు ఇక్కడకు తెచ్చి బురిడీ కొట్టించి అమ్మేస్తారండి

 వీటి డిమాండ్ ను క్యాష్ చేసుకోవడం కోసం వీటిని గుర్తించడం చాలా తక్కువ మందికే తెలుస్తుంది 

అందులో పెద్ద వారు అయితే బాగా గుర్తిస్తారు. 

ఆవేశంగా మీరెల్లి కొనేసుకొద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళు అల్లిన బుట్టలో పడిపోతారు మరి.

 మరి వీటిని గుర్తించడం ఎలా అంటే ఇవి వెండి రంగులో మెరుస్తాయి నోటి దగ్గర పసుపు రంగు పోలి ఉంటాయండి.. 

ఈ పులసలో మళ్ళీ రెండు రకాలండోయ్ ఒకటి పోతు పులస మరోటి సెన పులస ... 

దీనిలో ఆడ పులస అంటే సెన పులసి కి మరింత డిమాండ్ ఎక్కువ ఇది కొనాలంటే అయిబాబోయ్ అనేస్తారు మరి ...


పులస తెచ్చేస్తే సరిపోదు అండి అది వండే విధానం కూడా తెలియాలి ... 

ఇంత చెప్పినోడిని ఆ మాత్రం చెప్పలేనండి 

ఆ మా ఊరి వంటకం కూడా పెట్టేస్తున్నాను ఇక్కడే చదివెయ్యండి మరి ..


పులస పులుసును మట్టి ముంతలో వండితేనే దీనికి అసలైన రుచి వస్తాదండి ( వీలైనంత వరకు మట్టి ముంతలో వండటమే బెటర్ ). 

పులస ముక్కలకు మసాలా అద్ది పులుసు పెడితే రుచే కాదు.

వండేటప్పుడు వెదజల్లే సువాసనే అమోఘంగా  ఉంటుంది.. 

గానుగ నూనె లేదా ఆవకాయలో తేరుకుపోయిన నూనెతో 
పులుసు పెడితే దీని రుచి జిమ్మంటేత్తాదండి. 

బెండకాయలు, పచ్చిమిర్చి పెద్దవి, ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిగడ్డ, వెన్నపూస, చింతపండు, కారం, కల్లుప్పు ( సాల్ట్ కంటే కల్లు ఉప్పు బెటర్ ) ఇవన్నీ తగినంత వేసి వండితే అద్భుతం అండి.

ఈ కూరలో అల్లం, కొత్తిమీర వేసుకోకూడదండి ఎందుకు అంటారా ఇవి కూర రుచిని పొగొట్టేస్తాయి కాబట్టి వీటిని దూరంగానే ఉంచాలి.

అసలు విషయం ఎంటంటే వండిన వెంటనే తింటే చి చి ఇదా పులస అనుకుంటారు. 

కానీ వండిన రోజు వదిలేసి ఆ తర్వాత రోజు తింటే జన్మలో మర్చిపోరు.

ఏంటి కూర కి అంత బిల్డప్ అవసరమా అనుకుంటారేమో ..

దాని రుచి అలాంటిది కాబట్టి ఇంతలా చెప్తున్నానండి ... 

ఓ పాలి మీరు కూడా తినండి నిజంగా చాలా బాగుంది అంటారు. 

అన్నట్టు ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారు ఇదంతా అనుకుంటారేమో...

పులస సంవత్సరంలో దొరికేది మూడు నెలలు మాత్రమేనండి...

అది కూడా  ఈ జూలై నెల, ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలలో మాత్రమే...

వీటి కోసం మన గంగపుత్రులు ప్రాణాలను సైతం పలంగా పెట్టి పట్టుకుంటారండి గోదారిలో ఆయ్ ...

ఆగష్టు లో మాత్రమే దొరుకుతుంది...




- రామ్ కర్రి
8096339900



- స్వస్తీ...