కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ దేశంలోని అన్ని టెలికాం కంపెనీలకు కరోనా వైరస్ గురించి జాగ్రత్తలు చెబుతూ కొన్ని నెలలుగా కరోనా కాలర్ ట్యూన్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే రోజురోజుకీ విపరీతంగా కేసులు పెరుగుతున్నా కనీసం తాజా జాగ్రత్తలు ఏమి చెప్పకుండా
అప్పుడెప్పుడో రికార్డ్ చేసినది మళ్లీమళ్లీ వినిపించడం వినియోగదారులకు చిరాకు తెప్పిస్తోంది.
ఈ కరోనా కాలర్ ట్యూన్ కారణంగా....
అర్జెంటుగా ఏమైనా phone calls చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఒక ఐదారు సెకన్స్ అంటే ఓపిక పట్టొచ్చు, ఏకంగా 25 seconds పాటు విన్పించడం వల్ల ప్రజలకు సంబంధించిన విలువైన పని గంటలు వృధా అవుతున్నాయి.
అంతేకాదు, కొన్ని ముఖ్యమైన కాల్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఆర్థికపరమైన నష్టాలూ, ప్రాణ నష్టం కూడా వాటిల్లుతోంది.
దీన్ని ఎలా డిజేబుల్ చేయాలో కనీసం కాలర్ ట్యూన్ విన్పించే ముందు ఒక ఆప్షన్ కల్పించడం టెలికం కంపెనీల బాధ్యత.
“ఈ బటన్ ప్రెస్ చేసి నేరుగా కాల్‌లోకి వెళ్లండి” అని కాల్ సమయంలోనే అది సూచించాలి.
కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి షార్ట్ కట్స్ వినియోగదారులే నెట్ లో వెతికి పట్టుకోవాల్సిన దౌర్భాగ్యం.
ఒకవేళ మీ ఫోన్లో కరోనా వైరస్ కాలర్ ట్యూన్ డిజేబుల్ కావాలి అంటే ఇక్కడ చెప్పిన విధంగా చేయండి.
Airtel వినియోగించేవారు తమ ఫోన్ యాప్ ఓపెన్ చేసి
*646*224# అని
అని డయల్ చేయండి.
ఆ తర్వాత స్క్రీన్‌పై వచ్చే మెనూలో 1 అనేది ప్రెస్ చేయండి.
ఇకమీదట అది డీఆక్టివేట్ చేయబడుతుంది.
Jio వాడే వినియోగదారులు STP అని మెసేజ్ టైప్ చేసి, 155223కి పంపించాలి.
Vodafone & Idea వినియోగదారులు CANCT అనే ఈ మెసేజ్ ని 144 నెంబర్కి పంపాలి.
BSNL వినియోగదారులు UNSUB అని మెసేజ్ టైప్ చేసి, 56700 లేదా 56799 కి పంపించాలి.
◆ ◆ ◆