జీవిత సత్యం



తుమ్మెద  పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి
అందులో జీవనం కొనసాగిస్తుంది...

చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది...

కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు
ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి...

అయ్యో...

నన్ను ఏదో  బంధించేసింది అని చెప్పేసి ఆ తామర
రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది...

అయితే !

మహా మహా వృక్షాలకు రంద్రం చేయగలిగిన దాని సామర్థ్యం
ఆ తామర రేెకులను తొలచలేదా...

ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా...

గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి...

కానీ అది దాని సామర్థ్యం మర్చిపోవడం, 

మకరందం గ్రోలే మత్తులోనో...

లేక 

నన్నేదో బంధించింది అన్న భావన దాని శక్తిని బలహీన పర్చింది...

ఆ భావనను నమ్మడమే దాని బలహీనత...

నేను రంద్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న
దాన్ని నమ్మింది...

అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది...

మన జీవితంలో సమస్యలూ అంతే,
సమస్య బలమైంది కాదు...

మనశక్తిని
మనం మర్చిపోవడమే దాని బలం...

మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే,
గుర్తించడమే, నమ్మడమే దాని బలం...

"మాయ" అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు...

దాని బలం తామర రేకు అంత...

నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంత...

తెలుసుకో ...


అదే..జీవిత సత్యం

🍁🍁🍁🍁


ఇలాంటి అద్భుతమైన మరెన్నో విషయాలను నేరుగా...
మీ వాట్సాప్ లో పొందాలి అనుకుంటే...


ఈ పై సంఖ్య మీద నొక్కి జ్ఞాన కేంద్ర అని సేవ్ చేసుకొని,
మీ యొక్క వాట్సాప్ నుండి...
మీ యొక్క పేరు, ఊరు మరియు వృత్తి ని తెలియజేయండి...



- స్వస్తీ...