తోటకూర ; పాలకూర ; చుక్క కూర ; మెంతి కూర, పుదినా , కొత్తిమీర ; కరివేపాకు , ఉల్లి కాడలు , గోంగూర , కాబేజీ , బచ్చలి, చింత చిగురు .
ఇవి కాక మరెన్నో ఆకులను కూడా తిన వచ్చును అవి అంతగా వాడుక లో లేవు.
వాటిని సంప్రదాయేతర ఆకు కూరలు లేదా కలుపు మెుక్కలు అంటారు.
అవి ఆరోగ్య ప్రదాయినీయులు.
వాటి గురించి మీ అమ్మమ్మ లేదా బామ్మ లను అడిగితే చెప్తారు.
వాటిని పరిచయం చేయాలని అనిపించి... మీ ముందుకు ఇలా...
✍🏻 తినగలిగే తినవలసిన కలుపు మొక్కలు వీటి ప్రత్యేకత ఏమిటంటే వీటిని పెంచక్కర్లేదు.
కలుపు మొక్కల్లాగా విరివిగా పెరుగుతాయి.
వందల యేళ్ళుగా ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడ్డాయి కాబట్టి పురుగు పట్టడం లాంటి సమస్య ఉండదు.
పోషక విలువలూ తక్కువేమీ కాదు అయినా వీటిని నిర్లక్ష్యం చేస్తున్నాం.
ఇప్పటివరకు “Eat local”.
అంటే లోకల్‌గా పండించే పదార్థాలు కాదు లోకల్‌గా పండేవి అంటే ఆయా ప్రాంతాల్లో పెరిగే నేటివ్ మొక్కలు.
వాటివల్ల పర్యావరణ సమతుల్యత (Eco-system balance) దెబ్బతినడం ఉండదు.
మనం పండించే వాటికన్నా వైల్డ్‌గా పెరిగే మొక్కల్లోనే పోషకాలు ఎక్కువ గా ఉంటాయి.
✍🏻 గతంలో మన పెద్దలు కూర గాయలు పండించ లేని సమయంలో పొలాల్లోకి వెళ్లి గట్ల వెంబడి అనేక రకాలైన ఆకుకూరలు సేకరించుకుని కమ్మని, రుచికరమైన కూరలు చేసేవారు.
ఆకుకూరలు చాలా వరకు పొలాల్లో గట్ల వెంబడి, బీడు భూముల్లో కలుపు మొక్కలుగా పెరిగేవే.
మరియు చెట్ల నుండి సేకరించే ఆకులే.
సాధారణంగా సాగుచేసే ఆకు కూరలైన తోటకూర, చిరికూర, మెంతి కూర, పాలకూర, పుదీనా, గోంగూర, కొత్తిమిరి మొదలైనవే కాకుండా గ్రామీణ మహిళలు ఆయా ప్రాంతాలను బట్టి అనేక రకాలైన ఆకు కూరలు ఉపయోగించే వారు
✍🏻 ఉదాహరణకు
గురుగు ఆకు పప్పాకు,
ఎర్రబద్దాకు,
పొనగంటాకు,
బచ్చలాకు,
చెంచల్లాకు,
అవిసాకు,
కాంచి ఆకు,
అటుకు మామిడి ఆకు,
నారదాకు,
గురిగింద ఆకు,
చింతాకు, మొదలైనవి ఆకు కూరలుగా ఉపయోగిస్తారు.
వీటితో తయారుచేసిన వంటలు అధిక పోషకాలు కలిగి మంచి వాసన, రుచి కలిగి ఎలాంటి ఖర్చులేని అనేక ఔషధ గుణాలు కలిగి ఆరోగ్యాన్ని సమకూర్చేవి...
✍🏻 కానీ తరాలు మారుతుండడం..
గత తరాల వారు కాలం చేస్తుడడంతో ఇలాంటి విలువైన ఆకుకూరలు మరుగున పడుతున్నాయి.
మరిచి పోతున్నాం ఆరోగ్యానికి అవసరమైన కూరగాయల ధరలకు రెక్కలొస్తున్నాయి.
ఈ తరుణంలో గ్రామీణులు అనాదిగా, సంప్రదాయకంగా ఉపయోగిస్తున్న ఆకుకూరలను పెద్దల ద్వారా తెలుసుకుని వాటిని ముందు తరాలవారికి నేర్పాల్సిన అవసరమెంతైనా ఉంది.
✍🏻 ఇవి ప్రకృతి మనకిచ్చిన వరసంపద.
వీటిని పరిరక్షించు కోవాల్సిన బాధ్యత మనమీద ఉంది.
ఇంత విలువైన సంప్రదాయ ఆకుకూరల విలువను ప్రజలకు తెలియ జెప్పి వీటి పరిరక్షణకు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు కృషిచేయాలి
ఇలా ప్రకృతిలో తినగలిగేవి ఖచ్చితంగా తినవల్సిన కలుపు మొక్క లు ఈ ప్రకృతి లో పుష్కలం గా ఉన్నాయి మరి !
వాటిలో మీ కోసం ఈ కొన్ని రకాలు....
తెల్ల గలిజేరు :
➖➖➖➖
పూర్వకాలంలో తెల్ల గలిజేరు ఆకు కూరని ఎక్కువగా వాడేవారు, తెల్లగలిజేరు ఆకుకూరలో కిడ్నీ సమస్యలని తగ్గిచే ఔషధాలు పుష్కలంగా ఉన్నాయి, అందుకే ఈ ఆకుకూరని ఆయుర్వేదం వైద్యంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు , ఈ తెల్ల గలిజేరు ఆకుకూరని తరుచుగా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
అటుక మామిడి :
➖➖➖➖➖
అటుక మామిడి' లేక 'అటిక మామిడి' లేక 'గుడ్ల మల్లి' అనే మొక్క మన ప్రాంతం అంతటా ఏడాది పొడవునా లభించే ఓక రకమైన కలుపు మొక్క దీనిని ఆయుర్వేదం లో బాధా నివారిణిగా ఉపయోగిస్తారు భారతదేశం అంతా దీనిని ఆకుకూరగా ఉపయోగిస్తారు ఇవి కంటి చూపును బాగు చేస్తుందని మరియు మధుమేహం వ్యాధి గ్రస్తుల రక్తంలోని గ్లూకోజ్ ను తగ్గిస్తుందని నమ్మకం.
గురుగు ఆకు :
➖➖➖➖➖
గురుగు మొక్క కూడా ఎన్నో ఔషధ విలువలు గల ఒక కలుపు మొక్క. దీని ఆకులు కూరలలో వాడుతారు. గురుగు ఆకులు లో విటమిన్ ఏ,విటమిన్ సి లతో పాటు మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి. వీటిని వేరుశనగ విత్తనాలతో పచ్చడి లేదా పప్పుకూరగా చేస్కోవటం మంచిది మరియు ఆరోగ్యకరమైన ఆహారం. దీని పూలు బతుకమ్మలను తీర్చడానికి ఉపయోగిస్తారు.
చెంచలాకు :
➖➖➖➖
చెంచలాకు మంచి ఔషధ గుణాలు కల్గిన ఓక కలుపు మొక్క పూర్వం ఏ కూరలు దొరక నప్పుడు ఈ చెంచలి కూర దొరుకేది ఈ ఆకు కూరను ఎక్కువగా ఉపయోగిస్తారు చుక్రి కాంచంఅనేది సంస్కృత నామం. చెంచలి కూర, నీరు చెంచలి అని రెండు రకాలు ఉన్నాయి. సాధారణంగా చెంచలి కూరనే వంటకానికి వాడతారు. ఇది చలువ చేస్తుంది. మలాన్ని గట్టి పరుస్తుంది.త్రిదోషాలని పోగొడుతుంది. ఇది సర్వ ఔషది.
చిలుక కూరాకు :
➖➖➖➖➖
దీనిని "జలబ్రహ్మి" అని అంటారు నదుల గట్టులు , చెరువు గట్టులు మొదలయిన తేమగల ప్రదేశాలలో ఈ కూరాకు కలుపుగా పెరుగును ఇది సరస్వతి మొక్కని పోలి ఉంటుంది. మరియు నీరుగల ప్రదేశాలలో ఉండటం చేత జల బ్రహ్మి అని పేరు వచ్చింది.
దీనిలో రెండురకాల జాతులు ఉంటాయి ఒకరకాన్ని పెద్ద చిలకూరాకు రెండో రకాన్ని తెల్ల చిలకూరాకు అని పిలుస్తారు .
పెద్ద చిలకూరాకు :
➖➖➖➖➖
ఇది రుచిగా ఉండి బుద్దికి బలాన్ని ఇస్తుంది. శరీరంలో జఠరాగ్ని పెంచును రక్తదోషం త్రిదోషాలు శరీర అంతర్భాగం లో గల క్రిములను హరించును
తెల్ల చిలుకకూర :
➖➖➖➖➖
తెల్ల చిలుకకూర తియ్యగా ఉంటుంది. ఇది పిత్తాన్ని హరించును . జ్వరంతో పాటు వచ్చే దోషాలని , త్రిదోషాలని హరించును ఇది రుచికి చేదుగా ఉంటుంది. ఇది మంచి విరేచనకారి కడుపులో నులిపురుగులని హరిస్తుంది. కుష్టురోగాన్ని తగ్గించే గుణంకూడా దీనిలో కలదు శరీరానికి పుష్టి ఇచ్చే కూరల్లో ఇది చాలా గొప్పది.
కోడిజుట్టు ఆకు :
➖➖➖➖➖
దీని పూత కోడిజుట్టులాగా మెరుస్తూ ఉండటము చేత దీనిని కోడిజుట్టు ఆకు అని అంటారు ఈ మెక్క చిన్న వయస్సు లో చూడడానికి అచ్చం తోటకూరలానే ఉంటుంది.దీనిని పిచ్చి తోటకూర అని కూడా పిలిసే కలుపు మొక్క ఇది.దీన్ని ఆయుర్వేదం లో విరివి గా ఉపయోగిస్తారు
కామంచి ఆకు కూర :
➖➖➖➖➖➖
దీనిని కాచాకు అని కూడా అంటారు. కాసార,కాసార కూసర , గాజు అని కూడా పిలుస్తారు. దీని ఆకులు నూరిన ముద్ద కీళ్ళ నొప్పుల్లకు పట్టుగా ఉపయోగిస్తారు. ఈ ముద్దతో నలుగు పెట్టుకుంటే చర్మ రోగాలు నిర్మూలిస్తాయి.
కామంచి ఆకు కుర బాగా ఆకలి కలిగిస్తుంది. మేహతత్త్వం వారికి మేలు చేసే తల్లి. త్రిదోషాలను హరిస్తుంది. కుష్టు రోగాన్ని పోగొడుతుంది. ఈ కూర కారంగా, చేదుగా ఉంటుంది. దీనిని అరవవారు విశేషంగా ఉపయోగిస్తారు.
- స్వస్తీ...